👉ఏపీలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు*… సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది.
▪️మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాల ఏర్పాటు.
▪️రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు….*అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయించారు.*కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం.▪️ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు సీఎం ఓకే చెప్పారు.*ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఈ సాయంత్రం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.*
👉*కాంగ్రెస్‌లో వర్గ పోరు.. ఇరు వర్గాల మధ్య తోపులాట .. తెలంగాణ : మెదక్ జిల్లా శివంపేటలో మంగళవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని నవీన్ గుప్తా, సుదర్శన్ గౌడ్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. బగళాముఖి ఆలయంలోకి మహేష్‌ను ఎవరు తీసుకెళ్లాలనే విషయంలో రెండు వర్గాలు పోటీపడటంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సంఘటన టీపీసీసీ చీఫ్ పర్యటనకు ముందు పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది.
👉ప్రజలని దోచుకునేదంతా ఆంధ్రా సినీ నిర్మాతలే : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మా తెలంగాణ వాళ్లు అలా దోచుకోరు.. వచ్చిన ఆదాయంలో సీఎం రేవంత్ చెప్పినట్లు సినీ కార్మికులకు 20% శాతం ఇవ్వాలి ..సినిమా యాక్టర్లను పక్కన పెట్టుకుని కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జనాలు తప్పుబడుతున్నారు ..ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజలు అధికారులను తిట్టరు, ప్రభుత్వాన్ని తిడతారు..ఐ-బొమ్మ రవి విషయంలో న్యాయస్థానాలు చూసుకుంటాయి – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
👉వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను: జగ్గారెడ్డి
తెలంగాణ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను అని స్పష్టం చేశారు. ఆయన భార్య నిర్మలను బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా తన నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
👉గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలి హైకోర్టులో వేసిన పిల్ రేపు విచారణకు రానున్నదని హైకోర్టు న్యాయవాది ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్ఎస్ఎస్ బిజెపి పవన్ కళ్యాణ్ ముస్లింలు గోవులను వధిస్తున్నారని గో మాంసాన్ని తింటున్నారని నిరాహార ఆరోపణలు చేశారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ బిజెపి పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించి వెంటనే గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటింపచేయాలని లేనిపక్షంలో తమకు గో సంరక్షణ పై ఎటువంటి ఆసక్తి లేదని, కేవలం రాజకీయ అంశం గానే వాడుకున్నామని అంగీకరిస్తూ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పిటీషనర్, ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలి డిమాండ్ చేశారు.
👉బీజేపీ, ఎంఐఎం.. భాయీ. భాయీ.. అస్సలు ఊహించలేదు కదా?
పరస్పర భిన్న ధృవాలుగా ఇన్నాళ్లు రాజకీయాలు చేస్తున్న బీజేపీ, ఎంఐఎం ఒక్కటి కానున్నాయా? బీజేపీవి హిందుత్వ రాజకీయాలు అంటూ దుమ్మెత్తిపోసిన మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ మాటల్లో మార్పు ఎందుకొచ్చింది? బిహార్ రాజకీయాలు.. భవిష్యత్తులో పెను మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయా? అనే చర్చ జరుగుతోంది. బిహార్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒవైసీ.. ఇన్నాళ్లు బీజేపీపై ఒంటికాలిపై లేచేవారు. అలాంటిది ఆయన గొంతు సవరించుకుని బీజేపీకి దగ్గరయ్యేలా సంకేతాలివ్వడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.
బిహారులోని అమౌర్ లో జరిగిన ఓ ర్యాలీలో ఒవైసీ ప్రసంగిస్తూ ఎన్డీఏకు షరతులతో మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిజానికి ఎంఐఎం మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం లేకపోయినా, మజ్లిస్ నేత ఇలా ఓపెన్ గా తన మద్దతు ఉంటుందని ప్రకటించడం కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపుతుందా? అంటున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు అంటే ఒవైసీ పరోక్షంగా బీజేపీతో చెలిమి కోరుకుంటున్నట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, మజ్లిస్ చేతులు కలిపితే తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో సరికొత్త రాజకీయం అవిష్కృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.
బిహారులో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతమైన సీమాంచల్ అభివృద్ధి చేయాలని ఒవైసీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లు ఉంటే ఎన్డీఏ 14 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించి తన పట్టునిలుపుకుంది. ఎప్పుడు వరదలు, వలసలు, అవినీతి వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సీమాంచల్ వాసులను అభివృద్ధి దరికి చేర్చాలని ఒవైసీ కోరుతున్నారు. ఈ కారణంతోనే ఆయన ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే ముస్లిం మైనార్టీ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఐఎం అధినేత ఇలా ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇప్పటికిప్పుడు ఈ ప్రతిపాదనను బీజేపీ పట్టించుకోకపోయినా, అవసరమైన సమయంలో తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా హిందుత్వ ముద్ర వేస్తూ మైనార్టీలను దూరం చేస్తున్న ఎంఐఎం పార్టీనే స్వయంగా మితృత్వానికి దారులు వేస్తుండటం.. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇన్నాళ్లు ఎంఐఎం యాంటీ బీజేపీ రాజకీయాలనే చేసింది. ఇప్పుడు షరతులతో స్నేహం అంటోంది. బీజేపీ నుంచి కూడా సానుకూల స్పందన వస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు తెలంగాణలోని స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. నిజానికి ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన పెరుగుతుందని విశ్లేషించారు. కానీ, ఒవైసీ బిహార్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో రాజకీయం పూర్తిగా తలకిందులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు..
👉బీహార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఏడుగురు నాయకులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (బీపీసీసీ)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణం అయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏడుగురిని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన బీపీసీసీ..కాంగ్రెస్ సేవాదళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, బీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలూర్ రెహమాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ రాజన్, బీసీ శాఖ మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కాంచన కుమారి, నలంద జిల్లా నుండి రవి గోల్డెన్ లను సస్పెండ్ చేసిన అధిష్టానంఎన్నికల ఓటమికి సీనియర్ నాయకులను బాధ్యత నుండి కాపాడటానికి వీరిని సస్పెండ్ చేశారని అసమ్మతిని వ్యక్తం చేసిన మరో వర్గం
⭐**సోషల్ మీడియాలో ఒకటే చర్చ..ఐబొమ్మ రవి అరెస్ట్: చట్టం వర్సెస్ ప్రజాభిప్రాయం మధ్య సంఘర్షణ*
సినిమా పైరసీ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో చట్టం, ప్రజాభిప్రాయం మధ్య విస్తృత చర్చ జరుగుతోంది.రవికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు ట్రెండింగ్గా మారాయి.సినిమా పరిశ్రమపై, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టికెట్, థియేటర్లలో ఫుడ్ రేట్లు సామాన్యులకు అందుబాటులో లేవని, కుటుంబంతో కలిసి సినిమా చూడటం భారంగా మారిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చట్టం మాత్రం పైరసీ చేస్తే శిక్ష తప్పదని చెబుతోంది. మొత్తానికి ఐబొమ్మ రవి కేసుపై ప్రజలకు ఆసక్తి నెలకొంది.
👉ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగడంతో గమనించి, బస్సు ఆపి ప్రయాణికులను సురక్షితంగా రక్షించిన కానిస్టేబుల్ ను అభినందించిన జిల్లా యస్.పి.*
నెల్లూరు జిల్లాసంగం గ్రామం సమీపంలో కానిస్టేబుల్ నాగార్జున విజబుల్ పోలీసింగ్ చేస్తుండగా, అత్మకూరు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న బస్సు యొక్క ముందు భాగంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు పుట్టడం జరిగింది. సంఘటన జరిగిన ప్రదేశంలోనే పనిచేస్తున్న సంగం కాంస్టేబుల్ శ్రీ నాగార్జున్ గారు మంటలను తక్షణం గమనించి, బస్సును వెంటనే ఆపించారు.బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 45 మంది ప్రయాణికులను త్వరగా, సురక్షితంగా బయటకు దింపారు.ప్రయాణికులను మరొక బస్సు ద్వారా నెల్లూరుకు పంపించడం జరిగింది.కాంస్టేబుల్ నాగార్జున్ చురుకుదనం, ధైర్యం మరియు తెగువైన చర్యల వల్ల ఒక పెద్ద ప్రమాదం నుండి ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడ్డాయి.జిల్లా ఎస్పీ చేజర్ల కానిస్టేబుల్ నాగార్జునను అభినందించి రివార్డు అందజేశారు.
👉వరంగల్ జిల్లాలో నిత్య పెళ్లికూతురు ఘరానా మోసం.*
*పెళ్లయి కూతురు ఉన్నా, మాట్రిమోని ద్వారా ఇంకో పెళ్లి* *విషయం బయటపడడంతో 8.5 తులాల బంగారంతో పరారైన మహిళ*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిరా(30) అనే మహిళను మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి దేవేందర్ రావు(31) అనే వ్యక్తి …రూ.4 లక్షలతో ఘనంగా వివాహ వేడుకలు జరిపించి, మహిళకు 8.5 తులాల బంగారం కానుకగా పెట్టిన వరుడు…పెళ్లయిన రెండు రోజులకే మహిళ ప్రవర్తనలో తేడా గమనించి, ఆమె ఫోన్ చెక్ చేసిన దేవేందర్ రావు …దీంతో ఆమెకు ముందే పెళ్లయిందని, ఒక కూతురు కూడా ఉందని గుర్తించి, మహిళను నిలదీయగా, పెళ్లయిన మాట వాస్తవమే కానీ విడాకులు తీసుకున్నాని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ఇందిరా…ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా, ఉదయం లేచే సరికి బంగారం, నగదుతో పారిపోయిన కిలాడి లేడీ…మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, మహిళ, ఆమె తల్లిపై కేసు నమోదు చేసిన బాధితుడు..ఇందిరా గతంలో కూడా ఇద్దరు, ముగ్గురు యువకులను ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు.
👉10 వేల సంవత్సరాల్లో తొలిసారి పేలిన అగ్నిపర్వతం…
ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10 వేల సంవత్సరాల తరువాత తొలిసారి పేలింది. భారీ విస్ఫోటంతో బూడిద, పొగ వేల మీటర్ల ఎత్తుకు చేరి విమాన రాకపోకలను ప్రభావితం చేసింది. కన్నూర్–అబూదాబీ విమానాన్ని ముందు జాగ్రత్త చర్యగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. బూడిద ఉత్తర భారతానికి విస్తరించే అవకాశం ఉండటంతో విమానయాన సంస్థలు అలర్ట్‌లో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించాయి. బూడిద ఎర్ర సముద్రం దాటుకుని ఒమన్, యెమెన్ వరకు చేరడంతో ఆ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.

