👉ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం*…👉 ఫేక్ విద్యా సర్టిఫికేట్ల తయారీ ముఠా గుట్టురట్టు.. 😱 👉శ్రీశైలంలో ఏపీ టూరిజం హోటల్ పేరిట నకిలీ వెబ్ సైట్ తో మోసం..👉విశాఖ స్టీల్ ప్లాంట్ పై పొలిటికల్ హీట్.. సడన్ గా ఏం జరిగింది?…👉జనాలు ఎక్కువ డబ్బులెందుకు పెట్టాలి.. నేను పైరసీనే చూస్తా: ఆర్జీవీ…👉సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు…👉పాలమూరు ముఠా భారీ మోసం..ఆన్‌లైన్ లోన్ల పేరుతో రూ.3 కోట్లు వసూలు*…🌟ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీగా బి. ఉమామహేశ్వర్…🌟BSNL బంపరాఫర్.. రూ.485కే 72 రోజుల ప్లాన్

👉ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం*ఆంధ్ర… కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మంత్రులతో ఆయన సమావేశమవుతారు.ఈ సమావేశంలో మార్కాపురం, మదనపల్లె వంటి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు…ఇప్పటికే ప్రజల అభ్యంతరాలను సేకరించిన మంత్రుల కమిటీ ప్రతిపాదనపై నేడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు.

👉 ఫేక్ విద్యా సర్టిఫికేట్ల తయారీ ముఠా గుట్టురట్టు..😱 హైదరాబాద్: నార్సింగిలో ఫేక్ విద్యా సర్టిఫికేట్ల తయారీ ముఠా గుట్టురట్టు.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ నకిలీ సర్టిఫికేట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.. ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు.. భారీగా ఫేక్ సర్టిఫికేట్లతో పాటు బోనాఫైడ్‌ సర్టిఫికేట్లు స్వాధీనం.. రూ.50 వేల‌కు టెన్త్‌, రూ.75 వేల‌కు ఇంటర్‌, రూ.1.20 లక్షలకు డిగ్రీ సర్టిఫికేట్‌కు విక్రయిస్తున్న ముఠా

👉ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలంలో ఏపీ టూరిజం హోటల్ పేరిట నకిలీ వెబ్ సైట్ తో మోసం.. శ్రీశైలం హరిత హోటల్ పేరిట నకిలీ వెబ్‌సైట్ గుర్తింపు…

ఆన్‌లైన్‌లో రూ.15,950 చెల్లించి మోసపోయిన బెంగళూరు పర్యాటకుడు…ఏడాది కాలంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ మోసం..ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు…అధికారిక వెబ్‌సైట్‌లోనే బుకింగ్స్ చేసుకోవాలని అధికారుల సూచన

🌟వీళ్ల కలెక్షన్‌ల కోసం జనాలు ఎక్కువ డబ్బులెందుకు పెట్టాలి.. నేను పైరసీనే చూస్తా: ఆర్జీవీ…!!!.. భలే చెప్పావు గురు…
రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. నాకు ఆసక్తి ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్లో చూస్తా లేకపోతే పైరసీలో చూస్తా” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో పెద్ద చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్న వర్మ ఇలా చెప్పడం సరైంది కాదని పలువురు అభిమానులు విమర్శిస్తుండగా, కొందరు మాత్రం వర్మ స్టైల్‌కు అనుగుణంగానే స్పందించారని అంటున్నారు. పైరసీతో నిర్మాతలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సినిమా ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు రామ్‌గోపాల్ వర్మ . ఒకప్పుడు తన మార్క్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణని సొంతం చేసుకున్న వర్మ ఇటీవలి కాలంలో మాత్రం తన సినిమాల కంటే ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, పబ్లిక్ స్టేట్‌మెంట్స్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. వర్మ ఏదైనా మాట మాట్లాడినా, ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే పెద్ద ఎత్తున వివాదం మొదలవడం కొత్తేం కాదు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో పైరసీపై భారీస్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను కూడా పైరసీ సినిమాలు చూస్తానంటూ రామ్‌గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నేను కూడా పైరసీ సినిమాలు చూస్తా – రామ్‌గోపాల్ వర్మ
‘నాకు ఆసక్తి ఉంటేనే సినిమాలో థియేటర్‌కి వెళ్తా. ఆసక్తి లేకపోతే పైరసీలోనే చూస్తా. ఆడియన్స్ వాళ్లకు ఏది తక్కువలో దొరుకుతుందో అనే చూస్తారు. వాళ్ల మెంటాలిటీ అలాగే ఉంటుంది. అందుకే ఆ టెక్నాలజీ ఉన్నప్పుడు పైరసీ వాళ్లను ఎవరూ ఆపలేరు. సినిమా వాళ్లేమో పైరసీ చూడొద్దు. ఇండస్ట్రీని చంపేయొద్దు అని చెబుతుంటారు. పైరసీని ఆపితే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే కాస్త ఎక్కువ వస్తాయి అంతే తప్ప భారీ నష్టమేమీ ఉండదు. నీకు రూ.30 కోట్ల వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కావాలంటే ఆడియన్స్ వాళ్ల జేబుల నుంచి ఎందుకు ఖర్చు పెడతారు . మీరు రెమ్యునరేషన్లు పెంచేసుకుని ఆ డబ్బుల్ని ప్రేక్షకుల నుంచి రాబడదామంటే ఎలా కుదురుతుంది’ అని వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
👉విశాఖ స్టీల్ ప్లాంట్ పై పొలిటికల్ హీట్.. సడన్ గా ఏం జరిగింది?
ఏపీ రాజకీయాల్లో తాజాగా రేగిన విశాఖ స్టీల్ ప్లాంటుపై రాజకీయ దుమారం తీవ్రరూపం దాల్చుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై పొలిటికల్ హీట్.. సడన్ గా ఏం జరిగింది?…ఏపీ రాజకీయాల్లో తాజాగా రేగిన విశాఖ స్టీల్ ప్లాంటుపై రాజకీయ దుమారం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలతో దుమ్ము రేపుతున్నారు. ఇక ఇరుపార్టీలకు మద్దతుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు యూటూబ్ చానళ్లలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. దీంతో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం పెను తుఫాను మాదరిగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోందని అంటున్నారు. ఇరుపక్షాల వాదనలతో కార్మికులు తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. ప్లాంటును పరిరక్షించాల్సిన నేతలు ఇలా దుమ్మెత్తుపోసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని జుట్టు పీక్కుంటున్నారు.
ఇటీవల నిర్వహించిన సీఐఐ సమ్మిట్ లో స్టీల్ ప్లాంటు ఉద్యోగుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. స్టీల్ ప్లాంటును వైట్ ఎలిఫెంటుగా మార్చేశారంటూ సీఎం చేసిన కామెంట్స్ ను అవకాశంగా తీసుకున్న వైసీపీ.. ప్లాంటును ప్రైవేటీకరణకు దారులు వేస్తున్నారని మండిపడుతూ విమర్శలు చేస్తోంది. అంతేకాకుండా తన వాదనను నిజమని నిరూపించుకునేలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో కొందరు యూట్యూబర్లు స్టీల్ ఇష్యూపై ప్రత్యేకంగా వీడియోలు చేస్తూ దుమారం రేపుతున్నారు.
**మరోవైపు సీఎం వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కార్మికులు కష్టపడి పనిచేయకపోతే, ఎంత పెద్ద సంస్థ అయినా తెల్ల ఏనుగులా మారిపోతుందన్న ఆలోచనతోనే సీఎం ఉదహరించారని అంటున్నారు. సీఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ప్లాంట్ రక్షణ కోసం దాదాపు రూ.15 వేల కోట్లు సమకూర్చారని అంటున్నారు. అంతేకాకుండా ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే తటస్థ జర్నలిస్టులుగా గుర్తింపు పొందిన కొందరు ఈ విషయంలో సీఎం చంద్రబాబును తప్పుపట్టేలా వీడియోలు చేయడంతో వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోందంటు న్నారు…అయితే చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత టీడీపీ ఈ విషయంలో కాస్త డిఫెన్సులో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాంటును రక్షించాలంటూ కార్మికులు సుమారు 900 రోజులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తిరుగులేని అధికారం చెలాయించినా ప్లాంటు కోసం ఏమీ చేయలేకపోయిందనే విమర్శలు వినిపించేవని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు తన నిరసనలను ఉపసంహరించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడంతో ప్లాంటు రెండో ఫర్నీసు కూడా పనిచేయడం ప్రారంభమైంది.
ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడంలో వెనకబడిన అధికార కూటమి.. వైసీపీ విమర్శల తర్వాత ఎక్కువగా ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు. దీంతో నష్టనివారణ చేయడంపై ఫోకస్ చేసిన కూటమి పెద్దలు వైసీపీని ఎదుర్కోవడంపై మల్లగుల్లాలు పడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ద్వారా వైసీపీ చాన్స్ దొరికితే ఎలా వెంటాడుతుందనేది అధికార కూటమి అర్థం చేసుకోవాలని ఆ పార్టీ సానుభూతిపరులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఈ వివాదం హెచ్చరిస్తోందని అంటున్నారు.
👉సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు…వాట్సప్ గ్రూపుల్లో వచ్చే లింక్‌లను క్లిక్ చేయొద్దు.అనుమానాస్పద యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయొద్దు …గూగుల్ ప్లే స్టోర్ నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి …యాప్ లకు అప్ డేట్ చేస్తూ ఉండాలి …ఫోన్లో మాల్ వేర్ జరగకుండా బలమైన ఫైర్ వాల్ అవసరం …ఫోన్లో టు స్టెప్ వెరిఫికేషన్ లో ఏర్పాటు చేయడం ఉత్తమం ..వాట్సప్ లో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ వాడే విషయంలో జాగ్రత్త…సైబర్ మోసాలు ఈ విధంగా వ్యాప్తి చెందుతాయి- ముందు జాగ్రత్తలు తెలుసుకోండి. –
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్..
👉పాలమూరు ముఠా భారీ మోసం..ఆన్‌లైన్ లోన్ల పేరుతో రూ.3 కోట్లు వసూలు*…ఆన్‌లైన్ లోన్ల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఏడుగురి అరెస్ట్
కూలి పనులకు కోల్‌కతా వెళ్లి సైబర్ నేరాల్లో శిక్షణ…
ఏడాదిలో వెయ్యి మంది నుంచి రూ.3 కోట్లు కొల్లగొట్టిన ముఠా…ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమాయకులకు వల…బాధితుడి ఫిర్యాదుతో ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..ఉపాధి కోసం కూలి పనులకు వెళ్లిన కొందరు యువకులు, సైబర్ నేరాల్లో ఆరితేరి తిరిగివచ్చి భారీ మోసాలకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది. ఆన్‌లైన్ లోన్ల పేరుతో ఏడాది కాలంలో సుమారు వెయ్యి మందిని మోసం చేసి, వారి నుంచి రూ.3 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ జానకి శనివారం మీడియాకు వెల్లడించారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం తువ్వగడ్డ తండాకు చెందిన ఏడుగురు యువకులు 2023లో ఉపాధి కోసం కోల్‌కతా వెళ్లారు. అక్కడ వారికి ఒక సైబర్ క్రైమ్ ముఠాతో పరిచయం ఏర్పడింది. వారి వద్ద ఆన్‌లైన్ మోసాలపై శిక్షణ తీసుకుని, కొంతకాలం కమీషన్ పద్ధతిపై పనిచేశారు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, స్వయంగా పెద్ద మొత్తంలో సంపాదించాలనే దురాశతో 2024 చివర్లో సొంత ఊళ్లకు తిరిగొచ్చారు.
ఇక్కడికి వచ్చాక ‘ధన’, ‘ఇండియా బుల్స్’ పేరుతో నకిలీ ఆన్‌లైన్ లోన్ కాల్ సెంటర్లు ప్రారంభించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి అమాయకులను ఆకట్టుకున్నారు. లోన్ కోసం సంప్రదించిన వారి నుంచి ఆధార్, పాన్ కార్డు వివరాలు తీసుకుని, వారికి నకిలీ లోన్ మంజూరు పత్రం పంపేవారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్సూరెన్స్, తొలి ఈఎంఐ అంటూ విడతలవారీగా డబ్బులు వసూలు చేసి, ఆపై వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేవారు.
ఈ నెల 19న మహబూబ్‌నగర్‌కు చెందిన హన్మంతు అనే వ్యక్తి నుంచి రూ.76,655 కాజేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద లభించిన సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు చూసి పోలీసులు నివ్వెరపోయారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, ఒక ఆటో, బైక్, ల్యాప్‌టాప్, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించి, కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు.
🌟ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీగా బి. ఉమామహేశ్వర్ *

బాపట్ల జిల్లా ఎస్పీ  బి. ఉమామహేశ్వర్  ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీగా నియమించబడ్డారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న వి. హర్ష వర్ధన్ రాజు ఐపీఎస్ డిసెంబర్ 2 వరకు సెలవులో ఉంటున్నారు. ఆ సమయంలో, బాపట్ల జిల్లా ఎస్పీ గా ఉన్న బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ప్రకాశం జిల్లాకు ఇన్‌చార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
👉 ORS పేరుతో విక్రయిస్తున్న పండ్ల ఆధారిత పానీయాలు మరియు ఇతర డ్రింకులను మార్కెట్ నుండి తొలగించాలని రాష్ట్రాలకు FSSAI ఆదేశించింది.
🌟BSNL బంపరాఫర్.. రూ.485కే 72 రోజుల ప్లాన్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 వరకు ఉన్నాయి~£
[👉 హైదరాబాద్: నార్సింగిలో ఫేక్ విద్యా సర్టిఫికేట్ల తయారీ ముఠా గుట్టురట్టు.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ నకిలీ సర్టిఫికేట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.. ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు.. భారీగా ఫేక్ సర్టిఫికేట్లతో పాటు బోనాఫైడ్‌ సర్టిఫికేట్లు స్వాధీనం.. రూ.50 వేల‌కు టెన్త్‌, రూ.75 వేల‌కు ఇంటర్‌, రూ.1.20 లక్షలకు డిగ్రీ సర్టిఫికేట్‌కు విక్రయిస్తున్న ముఠా
👉 మీ WhatsApp గ్రూపులపై సైబర్ దాడి జరిగిందా?.. వెంటనే ఇలా చేయండి!
మీ వాట్సాప్‌ గ్రూపు హ్యాకింగ్‌కి గురైనా, ఏపీకే ఫైల్‌ను పొరపాటున ఇన్‌స్టాల్ చేసినా వెంటనే ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసి, సెట్టింగ్స్‌ > యాప్స్‌లోకి వెళ్లి ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. యాంటీవైరస్‌తో ఫోన్‌ను ఫుల్ స్కాన్ చేసి, బ్యాంకింగ్‌, సోషల్ మీడియా, ఈ-మెయిల్‌ పాస్‌వర్డులు మార్చేయాలి. మెసేజ్‌లు, కాల్‌లాగ్, బ్యాంకు లావాదేవీల్లో అనుమానాస్పద చర్యలు ఉన్నాయా అని పరిశీలించాలి. అన్‌ఇన్‌స్టాల్ కాకపోతే ఫోన్‌ను సేఫ్‌మోడ్‌లో రీస్టార్ట్ చేసి తొలగించాలి. సమస్య కొనసాగితే డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అలాగే 1930కు ఫిర్యాదు చేయాలి.

👉నరసరావుపేటలో యువకుడు దారుణ హత్య!!!…పల్నాడు జిల్లా…
కొండల్ రావుపేటకి చెందిన బాజి 34ని పొడిచి చంపిన గుర్తు తెలియని దుండగులు…
SRKT వద్ద హోటల్ లో ఉన్న బాజి 34పై కత్తులతో దుండగులు దాడి…నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాజి మృతి…ప్రత్యర్ధులే తన భర్తని చంపారని మృతుని భార్య జబీనా ఆరోపణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!