👉వాణిజ్య యుద్ధం : రూపాయి పతనం.. 90 దాటే ప్రమాదం.. !!!..👉 కార్మిక చట్టాలను 4లేబర్ కోడ్ గా మార్చి నందుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన …👉 సింగరాయకొండ లో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఆటల పోటీలు ప్రారంభం..👉జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు …👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే అన్నా*…

👉వాణిజ్య యుద్ధం : రూపాయి పతనం.. 90 దాటే ప్రమాదం.. !!!  ….   భారతీయ రూపాయి మరోసారి చరిత్రాత్మక కనిష్ఠాన్ని తాకింది, ఇది భారత ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

*వాణిజ్య యుద్ధం : రూపాయి పతనం.. 90 దాటే ప్రమాదం… భారతీయ రూపాయి మరోసారి చరిత్రాత్మక కనిష్ఠాన్ని తాకింది, ఇది భారత ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి విలువ ₹89.66 వద్ద నిలిచింది. ఒకానొక దశలో ₹89.71 వరకు జారిపోవడం మార్కెట్లలో భయాన్ని సృష్టించింది. గురువారంతో పోలిస్తే ఒక్క రోజులో ₹1.03 పతనం నమోదు కావడం పెట్టుబడిదారులను కుదిపేసింది. రూపాయి 90 స్థాయిని దాటే ప్రమాదం అంచున నిలబడడం దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేస్తోంది.

*అమెరికా–ఇండియా వాణిజ్య చర్చల్లో నిలకడ లేకపోవడంతో తీవ్ర ప్రభావం.. రూపాయి విలువ ఇంతలా పడిపోవడానికి అమెరికా–భారత్ వాణిజ్య చర్చల్లో స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆగస్టులో అమెరికా విధించిన భారీ టారిఫ్‌లు ఇప్పటికీ భారత ఎగుమతులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. వాణిజ్య అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వార్తల ప్రకారం ఇప్పటివరకు $16.5 బిలియన్ కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి బయటకు తీసినట్లు సమాచారం. ఇది రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచింది.

*డాలర్ బలపడటం – ఆర్బీఐ మౌనం…ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలోపేతం కావడం కూడా రూపాయి పతనానికి దోహదపడింది. అమెరికాలో ఉద్యోగాల సంఖ్య బలంగా రావడంతో డాలర్ మరింత బలపడింది. దీనితో పాటు, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల కోసం అమెరికా వైపు మొగ్గుచూపారు. మరోవైపు, గతంలో రూపాయిని పతనం కాకుండా అడ్డుకునేందుకు జోక్యం చేసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈసారి మౌనం పాటించడం మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు పంపింది. రూపాయికి మద్దతుగా ఆర్బీఐ రంగంలోకి దిగకపోవడంపై విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*మార్కెట్లలో ప్రతికూలత – సాధారణ ప్రజలపై ప్రభావం*… రూపాయి పతనం ప్రభావం వెంటనే భారత స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. సెన్సెక్స్ ఒక రోజులోనే 400 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ సైతం 124 పాయింట్లు పడిపోయింది. బలహీన రూపాయి సాధారణ భారతీయుడిపై నేరుగా ప్రభావం చూపుతుంది. భారతదేశం అధికంగా దిగుమతులపై ఆధారపడిన నేపథ్యంలో దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ఖరీదవుతుంది. చమురు, పెట్రోల్ ధరలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి, దిగుమతి అయ్యే నిత్యావసర వస్తువులు.. వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పెరుగుతుంది. ఎగుమతిదారులకు తాత్కాలిక లాభాలున్నప్పటికీ, వినియోగదారులకు, దిగుమతిదారులకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.

*ముందు పరిస్థితి మరింత కఠినమా? … మున్ముందు పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇండియా ట్రేడ్ టాక్స్‌లో తక్షణ పురోగతి లేకపోతే రూపాయి త్వరలోనే 90 స్థాయిని దాటే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. ఫారెక్స్ రిజర్వుల పరిమిత ప్రభావం: భారతదేశం వద్ద పెద్ద మొత్తంలో ఫారెక్స్ రిజర్వులు ఉన్నప్పటికీ, ప్రస్తుత వాణిజ్య ఉద్రిక్తతలు మరియు ప్రపంచ డాలర్ బలాన్ని తట్టుకునేందుకు వాటి ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.వాణిజ్య సమస్య త్వరగా పరిష్కార దిశలోకి రాకపోతే, భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాలర్ బలపడటం, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్బీఐ నిర్లక్ష్యం ఈ మూడు శక్తులు కలిసి రూపాయిని కొత్త ప్రమాద స్థాయికి తీసుకెళ్తున్నాయి

👉 శ్రీ సత్యసాయి బాబా  శత జయంతి సందర్భంగా ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ నందు శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని, హాస్పిటల్ లోని పేషెంట్లకు దుప్పట్లు పంపిణీ చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యం, ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి కమిటీ సభ్యులు.

👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ బ్లాక్ నందు మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం    ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.*

👉 కార్మిక చట్టాలను 4లేబర్ కోడ్ గా మార్చి నందుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం పిసిపల్లి బ్యాంక్ సెంటర్లో నిరసన చేశారు.

👉 శిoగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఆటల పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయ వాలంటీర్ల వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభోత్సవం చేశారు .

👉జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెక్కుముకి సైన్సు సంబరాలలో భాగంగా దర్శి లోని ఝాన్సీ విద్యాసంస్థలలో ఆదివారం జరిగిన బహుమతుల ప్రధాన ఉత్సవంలో ముఖ్యఅతిథిగా దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ పాల్గొని గెలుపొంది రాష్ట్రస్థాయికి వెళ్లే విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మండల స్థాయి నాయకులు ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!