👉అమెజాన్‌లో భారీ ఉద్యోగ కోతలు: ఇంజినీర్లకే అతి పెద్ద దెబ్బ!
ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గిస్తూ టెక్ రంగానికి షాక్ థెరపీ ఇచ్చింది. గత నెలలో ప్రకటించిన 14,000 పైచిలుకు కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపుల్లో ఇంజినీరింగ్ విభాగమే అత్యధికంగా నష్టపోయినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది….*40% కోతలు ఇంజినీరింగ్ విభాగంలోనే.. అమెరికాలోని ముఖ్య రాష్ట్రాలైన న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ లలో అమెజాన్ సమర్పించిన WARN (వర్కర్ అడ్జస్ట్ మెంట్ మరియు రిట్రెయినింగ్ నోటిఫికేషన్) నోటీసుల ప్రకారం కీలకమైన వివరాలు తెలిశాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో నమోదైన మొత్తం 4,700 తొలగింపుల్లో దాదాపు 40 శాతం, అంటే ఏకంగా 1,800 మంది ఇంజినీర్లు ఉన్నారు.
ఇవి కేవలం కొన్ని రాష్ట్రాల డేటా మాత్రమే. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోని నోటీసులు వెల్లడైతే, మొత్తం ఇంజినీరింగ్ కోతల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
*ఇంజినీర్లపైనే ఎందుకు ఇంత ప్రభావం?
అమెజాన్ సంస్థ AWS, డివైసెస్, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ వంటి దాదాపు అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది. అయినప్పటికీ ఇంజినీర్లే అధిక సంఖ్యలో ప్రభావితం కావడానికి ప్రధాన కారణాలున్నాయి. టీమ్‌ల రీ-ఆర్గనైజేషన్ (పునర్వ్యవస్థీకరణ), మధ్య వరుస నిర్వహణ (మేనేజ్‌మెంట్) లేయర్ల తొలగింపు. సంస్థలు వేగంగా ఏఐ వైపు మళ్లుతున్నాయి. తక్కువ మానవ వనరులతో ఎక్కువ పనితీరును అందించే దిశగా అమెజాన్ అడుగులు వేస్తోంది.
*ఏఐ ప్రభావం – ఉద్యోగ మార్కెట్ రూపు మారుతోంది
అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ పలుమార్లు “ఇది AI శకం” అని స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో కోడింగ్, డెవలప్‌మెంట్ పనుల కోసం AI టూల్స్, ఆటోమేషన్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఓపెన్ ఏఐ, కర్ సర్, కాగ్నిషన్, వంటి సంస్థల “వైబ్ కోడింగ్ ” ప్లాట్‌ఫామ్స్ టెక్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి.అమెజాన్ కూడా తన సొంత ఏఐ కోడింగ్ టూల్ ‘కిరో’ను ఇటీవల ప్రవేశపెట్టింది. దీని కారణంగా సాంప్రదాయిక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలపై ఒత్తిడి అధికమైంది.
*టెక్ చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు
2022లో మొదలైన టెక్ లేఆఫ్ తరంగం ఇప్పటికీ కొనసాగుతోంది. కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తమ మానవ వనరులను పునర్నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది 230కిపైగా టెక్ కంపెనీలు మొత్తం 1.13 లక్షలకుపైగా ఉద్యోగాలను తగ్గించాయి. అమెజాన్ చేపట్టిన ఈ కోతలే ఈ జాబితాలో అత్యంత పెద్దవిగా ఉన్నాయి.CNBC నివేదికల ప్రకారం, అమెజాన్ రాబోయే జనవరిలో మరో విడత ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ఉద్యోగులలో తీవ్ర ఆందోళనను పెంచుతోంది.ఏఐ విప్లవం వేగం పుంజుకుంటున్న కొద్దీ టెక్ ఉద్యోగాల స్వరూపం మారుతోంది. కోడింగ్, డెవలప్‌మెంట్ ఉద్యోగాల కోసం పోటీ మరింత కఠినమవుతోంది. అమెజాన్ వంటి దిగ్గజాలు ఏఐ ఆధారిత వ్యవస్థల వైపు దూసుకుపోతుండడంతో, సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల భవిష్యత్తు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.
👉కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన లేబర్ కోడ్ ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో బైపాస్ సెంటర్లో నిరసన తెలిపారు. లేబర్ కోడ్ ఉత్తర్వులను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి ఎస్ డి హుస్సేన్ అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు కార్మిక సంఘాలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న వారి ఆందోళనను పరిగణలోకి తీసుకోకుండా నోటిఫై ఉత్తర్వులను ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు .చాలా సంవత్సరాల క్రితం సాధించుకున్న 29 చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్లుగా చేశారు. దీని వలన కార్మికులు వేతనాలు కోల్పోవడం సౌకర్యాలు తగ్గిపోవడం లేబర్ ఆఫీస్ జోక్యం లేకపోవడం వంటి చర్యలు జరుగుతాయి అంతిమంగా కార్మికులు నష్టపోతారు. కావున వెంటనే లేబర్ కోడ్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే తిరుపతయ్య వెంకటేశ్వర్లు సిహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు
👉ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజాసంబంధిత సమస్యలను నివేదించారు.
మొంతా తుఫాను ప్రభావంతో గిద్దలూరు నియోజకవర్గం లో దెబ్బతిన్న చెరువులు మరియు రోడ్ల మరమ్మతులకు అత్యవసర నిధులు మంజూరు చేయాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే రైతులకు జరిగిన పంట నష్టానికి తక్షణ పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు.అదేవిధంగా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరకు కొనుగోలు నిరంతరంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్వీకరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
*మాక్ అసెంబ్లీకి ఎన్నిక అయిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ని అభినందించిన ఎమ్మెల్యే ముత్తుముల*
*ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం , జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న పాములపల్లె గ్రామంలో ఉంటున్న నక్కా కాశయ్య కుమార్తె నక్కా రమ్య నవంబర్ 26 వ తేదీ జరిగిన మాక్ అసెంబ్లీ సమావేశాలకు గిద్దలూరు నియోజకవర్గ నుండి ఎంపిక అయిన సందర్భంగా పాఠశాల యాజమాన్యం ను మరియు విద్యార్థినిని “ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అభినందించారు వీరితోపాటు పిడతల రమేష్ రెడ్డి , జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎంఈఓ -2 పోలా నాగభూషణం రెడ్డి , ఇంచార్జ్ హెచ్ ఎం లంకపల్లి సగీర్ , విద్యా కమిటీ చైర్మన్ బాలు నాయక్ , పి డి శోభన్ బాబు , ఉపాధ్యాయులు నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు*
👉జిల్లాస్థాయి క్రీడల్లో సత్తా చాటిన కంభం విద్యార్థులు*
కంభం:ఈనెల 21న ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీల్లో కంభం గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్ 17 బాయ్స్ అథ్లెటిక్స్ లో దూదేకుల ఖాదర్ బాషా 3 Km రన్నింగ్ విభాగంలో మొదటి స్థానం,కంచి శివ నగేష్ హ్యామర్ త్రో విభాగంలో ద్వితీయ స్థానం,మ్యాండ్ర గుత్తి మనోజ్ కుమార్ లాంగ్ జంప్ విభాగంలో తృతీయ స్థానం సాధించారు. విజేతలు ఈనెల 24,25 న వినుకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటున్న సందర్భంగా ఎంఈవో అబ్దుల్ సత్తార్,ఉపాధ్యాయ సిబ్బంది,వ్యాయమ ఉపాధ్యాయులు సంపంగి. సుబ్రమణ్యం,కదిరిపోగు విజయ్ కుమార్ విజేతలను అభినందించారు.

