👉హైదరాబాద్ పెట్టుబడులకు వేదికగా మారింది సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్: పెట్టుబడులకు హైదరాబాద్ వేదికగా మారిందని, తాము పక్క రాష్ట్రాలతో కాకుండా దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ వేదికగా 6 రోజుల పాటు రెండు విడతలుగా జరిగే తెలంగాణ నార్త్ ఈస్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్‌ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి హాజరయ్యారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. తెలంగాణతో పాటు పాటు 8 ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 600 మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో మొదటి దశ ఫెస్టివల్‌లో సినిమాలు, సాహిత్యం వంటి అంశాలపై సెమినార్లు, చర్చా గోష్టిలు, ప్రదర్శనలు ఉంటాయని, 25 నుంచి 27 వరకు సాగే 2వ విడతలో ఆరోగ్యం, సాంకేతికత వంటి అంశాలపై చర్చలు ఉంటాయని చెప్పారు. రోజూ 2వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, 40 మంది పౌర పురస్కార విజేతలు కూడా దీనికి హాజరవుతారని గవర్నర్ కార్యాలయ కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు.రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారసత్వం ఇచ్చి పుచ్చుకోవడానికే కాదు ఒకరి ఉత్పత్తులు మరొకరు అమ్మడానికి, కొనడానికి దోహదం చేస్తుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. సంస్కృతి, సహజ వనరుల పరంగా ఈశాన్య రాష్ట్రాలు ఎంతో గొప్పవని.. మన దేశం అతిథి దేవో భవ అంటే వారు అభివృద్ధి దేవో భవ అంటున్నారని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందరికీ చేరడమే అసలైన అభివృద్ధి అన్నారు. తొలి రోజు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులకు గవర్నర్ బహుమతులు అందజేశారు. మిజోరాం యువజన సర్వీసులు, క్రీడల మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
👉దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం..*లభించని పైలట్ ఆచూకీ… *విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ..*మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం**పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన తేజస్ యుద్ధ విమానం*
👉నెయ్యి తర్వాత జీడిపప్పు.. టీటీడీలో ఆగని అక్రమాలు!
నెయ్యి వివాదం తర్వాత టీటీడీలో జీడిపప్పు టెండర్ల కలకలం…నకిలీ వే బిల్లులు సమర్పించిన రెండు చెన్నై సంస్థలు…నిబంధనలకు విరుద్ధంగా రూ.56 లక్షల ఈఎండీ వాపసు…సంస్థలను బ్లాక్‍లిస్ట్ చేయకుండా మళ్లీ టెండర్లకు అనుమతి…శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో విమర్శలు ఎదుర్కొన్న టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా జీడిపప్పు కొనుగోలుకు సంబంధించి పిలిచిన టెండర్లలో నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలపై చర్యలు తీసుకోకపోగా, వారికి అధికారులు వత్తాసు పలకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. 1.20 లక్షల కిలోల జీడిపప్పు సరఫరా కోసం టీటీడీ సెప్టెంబరు 3న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్‌లో చెన్నైకి చెందిన క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్, ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్‌తో పాటు పలు సంస్థలు పాల్గొన్నాయి. నిబంధనల ప్రకారం, టెండర్‌లో పాల్గొనే సంస్థకు కనీసం 75 వేల కేజీల జీడిపప్పు సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అయితే చెన్నైకి చెందిన ఈ రెండు సంస్థలు సమర్పించిన వేబిల్లులను క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేయగా, అవి నకిలీవని తేలింది. దీంతో అధికారులు వాటిని టెండర్ల నుంచి డిస్‌క్వాలిఫై చేశారు.నిబంధనల ప్రకారం తప్పుడు పత్రాలతో టెండర్లలో పాల్గొన్న సంస్థల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)ను జప్తు చేయాలి. వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి. కానీ, టీటీడీ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా ఆ రెండు సంస్థలకు చెందిన రూ.56 లక్షల ఈఎండీని తిరిగి ఇచ్చేశారు. కనీసం ఆ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో కూడా చేర్చలేదు. పైగా, భవిష్యత్తులో జరిగే టెండర్లలో పాల్గొనేందుకు వీలు కల్పించారు. తాజాగా పిలిచిన యాలకుల టెండర్లోనూ ఈ సంస్థలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
👉ఫార్ములా ఈ కార్ రేసులో నన్ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేడు: మాజీ మంత్రి కేటీఆర్!*హైదరాబాద్:
ఫార్ములా-ఈ కార్ కేసులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి,కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేటీఆర్ స్పం దించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చేసుకోనివ్వండి. నేను తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా నేను రెడీ అయ్యా. ఇంతకు మించి చెప్పేదేం లేదు. అయినా, సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు.. నా అరెస్టు జరగదు. ఆ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవ హారంపై మాట్లాడుతూ.. దానం నాగేంద్రతో రాజీనామా చేయించి.. కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం జరుగుతుందని కేటీఆర్ అన్నారు.దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయాడు. అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని రాజీనామా చేపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
👉 👉 iBOMMA రవి తండ్రి కఠిన నిర్ణయం
పోలీసుల అదుపులో ఉన్న రవిని, ఉచితంగా వాదించి బయటికి తీసుకొస్తానని ముందుకు వచ్చిన సలీమ్ అనే న్యాయవాది…ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఉంటున్న రవి తండ్రిని కలిసి సంతకాలు చేయమని కోరిన న్యాయవాది…తన ఆరోగ్యం సహకరించడంలేదని, కోర్టుల చుట్టూ తిరగలేని, సంతకం చేసేందుకు నిరాకరించిన రవి తండ్రి అప్పారావు
👉గుంటూరు*నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో MDM మత్తు పదార్థాలు పట్టివేత*…సౌత్ డీఎస్పీ బాణోదయ కామెంట్స్… ఈగల్ టీం ఇచ్చిన సమాచారం మేరకు 11 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం…ఈ కేసు లో విశాల్ (22)బత్తుల శ్రీనివాస్ (23) లను అరెస్ట్ చేశారు…దర్యాప్తులో బెంగుళూరు కి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ మరియు శ్రీనివాస్ 11 గ్రాముల 30,000 రూ MDM మత్తు పదార్థాన్ని గుంటూరు కి చెందిన ఖాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు…ఈ సరఫరా కి గాను వీరికి ఖాజా 2000 రూ సుపారీ ఇస్తున్నాడు…ఖాజా మరియు విజయ్ సాగర్ పరారీలో ఉన్నారు వారిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని వివరాలు తెలుస్తాయి…

