👉 పోక్సో కేసులో “కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప” కు సమన్లు…👉అన్నమయ్య జిల్లా మదనపల్లె, సిటిఎం క్రాస్ రోడ్డులో మహిళ హత్య…!!!👉నవోదయ విద్యార్థిని ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి!: PAAP డిమాండ్…* నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్,భాష పై సోషల్ మీడియాలో ట్రోల్ …👉మిర్యాలగూడ సబ్ జైలులో *కీచక* కానిస్టేబుల్!_* తెలంగాణ*…👉ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్..!!..👉 గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం..👉 దళిత యువకుడి లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులను శిక్షించాలంటూ నిరసన…👉ఆగని పైరసీ.. కొత్తగా ఐబొమ్మ వన్…**మావోయిస్టులకు 14 రోజుల రిమాండ్‌👉హైదరాబాద్ ‘పిస్తా హౌస్’ యజమానింట్లో కోట్ల కొలదీ నగదు గుర్తింపు..👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా* ..👉రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి…

👉 పోక్సో కేసులో “కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప”  కు సమన్లు… డిసెంబర్ 2న విచారణకు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశం…మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన కేసు…యడియూరప్పతో పాటు మరో ముగ్గురికి కూడా నోటీసులు జారీ… కేసు కొట్టివేయాలన్న యడ్డీ పిటిషన్‌ను ఇటీవల తోసిపుచ్చిన హైకోర్టు..

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు పోక్సో కేసులో ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 2వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సహాయం కోరేందుకు తన నివాసానికి వచ్చిన ఓ బాలికను యడియూరప్ప లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. 2024 ఫిబ్రవరి 2న ఈ ఘటన జరగ్గా, బాధితురాలి తల్లి సదాశివనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో యడియూరప్పతో పాటు అరుణ, ఎం. రుద్రేశ్‌, మరిస్వామి అనే మరో ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చారు. వారికి సైతం కోర్టు సమన్లు పంపింది. మంగళవారం జరిగిన విచారణలో ఫిర్యాదిదారుల తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ అశోక్‌ ఎస్‌. నాయక్‌ వాదనలు వినిపించారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సుజాత, 30 రోజుల్లోగా సాక్షుల విచారణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశిస్తూ ఈ సమన్లు జారీ చేశారు.కాగా, తనపై నమోదైన పోక్సో కేసును, సమన్లను రద్దు చేయాలని కోరుతూ యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

👉నవోదయ విద్యార్థిని ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి!..  జిల్లా లో వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థుల భద్రత పై స్పందించని ప్రభుత్వం – అధికారుల నిర్లక్ష్యంపై ‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ తీవ్ర ఆగ్రహం

నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయం (JNV) లో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దుర్ఘటనకు కారణమైన వ్యక్తులు, ఉపాధ్యాయులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

😢 వేధింపులు, మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య – తల్లిదండ్రుల ఆవేదనకు మద్దతు..

విద్యార్థిని తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆవేదనను PAAP పూర్తిగా సమర్థిస్తోంది. పాఠశాలలో కొంతమంది టీచర్లు విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని మానసికంగా హింసిస్తున్నారని, తరచుగా హేళనగా మాట్లాడటం ద్వారా మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపించారు. ***అసభ్య వ్యాఖ్యలు ఖండన: బాలికలు నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన, అగౌరవమైన వ్యాఖ్యలు చేస్తూ వారిని వేధించడం అత్యంత హేయమైన చర్య. ఈ టీచర్ల వేధింపులే విద్యార్థి ఆత్మహత్యకు దారితీశాయని PAAP తీవ్రంగా ఖండిస్తోంది..* అధికారుల వైఖరిని ఖండిస్తున్నాం – ** భద్రతపై భరోసా ఏదీ?

జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నప్పటికీ, ఈ ఘటనలను అడ్డుకోవడానికి ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు స్పందించకపోవడం, తగు చర్యలు తీసుకోకపోవడం అత్యంత శోచనీయం. భయాందోళనలతో ఉన్న విద్యార్థి తల్లిదండ్రులకు భద్రతపై భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం మరియు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని PAAP మండిపడింది.సమగ్ర విచారణ జరిపివిద్యార్థిని మృతిపై తక్షణమే సమగ్రమైన, నిష్పక్షపాత విచారణ జరిపించాలి.కఠిన చట్టపరమైన చర్యలు: బాలిక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించి, వేధింపులకు పాల్పడిన టీచర్లపై తక్షణమే కేసులు నమోదు చేసి, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థినుల భద్రత, మానసిక ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల/కళాశాల యాజమాన్యాలు, విద్యా శాఖ అధికారులు బాధ్యత వహించాలి.తల్లిదండ్రుల మరియు విద్యార్థుల భద్రత కోసం తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని PAAP ఈ సందర్భంగా హెచ్చరించింది.

**ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించిన పోలీసులు…ఏపీలో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ …నేడు మావోయిస్టుల అరెస్ట్‌లపై పోలీసుల ప్రెస్‌మీట్‌…  కృష్ణాజిల్లా పెనమలూరులో 28 మంది అరెస్ట్…  కాకినాడలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్…ఏలూరులో 15, విజయవాడలో నలుగురు అరెస్ట్…అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు అరెస్ట్

👉అన్నమయ్య జిల్లా మదనపల్లె, సిటిఎం క్రాస్ రోడ్డులో మహిళ హత్య…!!!

అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, సిటిఎం క్రాస్ రోడ్డు సచివాలయం వెనకకు బహిర్భూమికి వెళ్లిన మహిళను ఆగంతకులు హత్య చేశారు.

💥సీటీఎం క్రాస్ రోడ్డులోని పాకాలవీధికి చెందిన భూమల గడ్డోళ్ల లేట్ అంజి భార్య సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ (40) గా గుర్తించారు. రాత్రి 9.30కి బహిర్భూమికి వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. మదనపల్లి తాలూకా పోలీసులు సంఘనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉కోటి రూపాయల కట్నం … ఏసీబీ వలలో …!!*

విద్యుత్ శాఖ ఏఈ బాగోతం బట్టబయలు

ఇటీవలే కోటి రూపాయల కట్నం తో నిర్చితార్థం

జోరుగా అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

మహబూబ్ నగర్ జిల్లా ; తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో నిత్యం ఏదో ఒక చోట ప్రభుత్వాధికారులు అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau-ACB)కి పట్టుబడుతున్నారు. లంచం (Bribe) డిమాండ్ చేసి అందులో ఎంతో కొంత తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌(Red Handed)గా దొరికిపోతున్నారు. ఈ ఘటనలను బట్టి చూస్తుంటే ప్రభుత్వ విభాగాల్లో ప్రజలకు పనులు కావాలంటే కచ్చితంగా లంచం ఇవ్వాల్సిందేనా అనే అభిప్రాయం నెలకొంటోంది. తాజాగా వనపర్తి జిల్లా గోపాలపేట మండలం విద్యుత్ శాఖ అధికారి (AE) ఎన్.హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ (Current Transformer) విషయంలో రూ.40 వేలు లంచం డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకుంటూ బుక్ అయ్యాడు. ఇటీవలే విద్యుత్ శాఖలోనే పనిచేస్తున్న మరో అధికారి సోదరీమణితో కోటి రూపాయల కట్నంతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ ని బుధవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వెల్ల‌డించారు. ఏసీబీ డీఎస్పీ బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఇన్ స్పెక్ట‌ర్ లింగ‌స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. వ‌న‌ప‌ర్తి డీఈ, ఏడీ గోపాల్ పేట విద్యుత్ కార్యాల‌యానికి వ‌చ్చారు. వారి ద్వారా డీఎస్పీ బాల‌కృష్ణ వాంగ్మూలం తీసుకున్నారు.

👉 దళిత యువకుడి లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులను శిక్షించాలంటూ నిరసనకు దిగిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు..కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్(30) అనే యువకుడు లాకప్ డెత్..!!!

తనకు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వేరే అతను తీసుకున్నాడని ఫిర్యాదు చేసిన కర్ల రాజేష్‌నే కస్టడీలోకి తీసుకుని, 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు..

దీంతో తీవ్ర శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతూ మృతి చెందిన రాజేష్…

రాజేష్ చావుకు కారణమైన పోలీసులను శిక్షించాలని, కలెక్టర్ వచ్చి న్యాయం చేసి హామీ ఇవ్వాలని నిరసనకు దిగిన అతని కుటుంబసభ్యులు, గ్రామస్థులు

👉 గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం..

మా పిల్లలు ఎక్కడా అని అడిగితే జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నాము అని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన..

వికారాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నుండి అదృశ్యమైన హర్షవర్ధన్(9వ తరగతి), వినయ్(8వ తరగతి) అనే ఇద్దరు విద్యార్థులు..తమ పిల్లలు కనిపించడంలేదని పాఠశాల ముందు కంటతడి పెట్టుకుంటున్న తల్లిదండ్రులు..అదృశ్యమైన తమ పిల్లల గురించి అడిగితే జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నామని, పాఠశాల లోపలికి అనుమతి ఇవ్వడంలేదని కుటుంబసభ్యుల ఆరోపణ..అధికారులు వెంటనే స్పందించి, తమ పిల్లల ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు

👉TS..రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి…తండ్రి లాంటి వాడిని బిడ్డ కొట్టవద్దు అంటూ ప్రాధేయపడ్డ ఆర్టిసి డ్రైవర్.. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో సిరిసిల్ల ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన కారు డ్రైవర్..ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో బస్ కు ఎదురుగా కారు ఆపి బస్ లోకి ప్రవేశించి డ్రైవర్ను చితకబాదిన వైనం..తండ్రి లాంటి వాడిని నన్ను కొడుతవ అని ప్రాధేయపడ్డ ఆర్టీసీ డ్రైవర్.. పోలీసులను ఆశ్రయించిన ఆర్టీసీ డ్రైవర్…

👉 ATM వాహనంలో రూ.7కోట్లు చోరీ

బెంగళూరులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ATMలో నగదు నింపే CMS వాహనాన్ని రోడ్డుపై ఆపి ట్యాక్స్ ఆఫీసర్లమంటూ రూ.7కోట్లు ఎత్తుకెళ్లినట్లు NDTV పేర్కొంది. JPనగర్ HDFC బ్యాంక్ బ్రాంచ్ నుంచి నగదు తీసుకెళ్తుండగా అశోకా పిల్లర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దోపిడీగా అనుమానిస్తున్నారు.

👉 డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించడంతో.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఒక కేసు…బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడని రాజమౌళిపై మరో కేసు నమోదైనట్లు సమాచారం…ఇప్పటికే వారణాసి ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన సంఘం…

👉ఏలూరు గ్రీన్‌ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు రిమాండ్‌.._*మావోయిస్టులకు 14 రోజుల రిమాండ్‌ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.._*మావోయిస్టులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశం.._*విజయవాడలో పట్టుబడిన 24 మంది మావోయిస్టులకు రిమాండ్‌.._*24 మంది మావోయిస్టులను రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశం.._*మరో నలుగురు మావోయిస్టులకు వయోపరిమితి నిర్ధారించాలని కోర్టు ఆదేశం.._

👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*

*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామం నందు మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం   ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.*

👉NH–44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం…

యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు… దట్టంగా వ్యాపించిన పొగలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బస్సు దిగిన ప్రయాణికులు …మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ సంస్థకు చెందిన ప్రైవేటు బస్సు…ట్యాంకర్ల కెమికల్స్ ఉండడంతో దట్టంగా పొగలు వ్యాపించగా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు దిగి ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులు..ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్లోని హైడ్రో ఫ్లోరిక్ యాసిడ్‌ను ఖాళీ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

👉మిర్యాలగూడ సబ్ జైలులో *కీచక* కానిస్టేబుల్!_* తెలంగాణ*

హుజూర్నగర్ కు చెందిన ఓ మహిళను మాయ మాటలతో పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన మిర్యాలగూడ వెలుగులో… పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని గర్భవతిని చేసి, మిత్రులతో కలిసి టార్చర్ పెట్టి అబార్షన్ టాబ్లెట్ లా ద్వారా గర్భాన్ని తొలగించాడని యువతి ఆరోపణ…  రోజూ శారీరక–మానసిక వేధింపులకు గురైనట్లు నిన్న జిల్లా ఎస్పీ కు సదరు మహిళ ఫిర్యాదు…ఫిర్యాదుతో తన డొంక కదులుతుందని భావించి యువతి కుటుంబ సభ్యులకు బెదిరింపులు చేయిస్తున్న కీచకుడు… రాజకీయ నేతల ప్రభావంతో పిటిషన్ వెనక్కి తీసుకోవాలనే తీవ్ర ఒత్తిడి…గతంలో కూడా పలుమార్లు పాల్కురి నాగరాజు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసిన జైళ్ళ శాఖ…మహిళా రక్షణ చట్టాల పట్ల నిర్లక్ష్యం చూపిన ఈ ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించాలని మహిళా సంఘాల డిమాండ్..పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అత్యవసరంగా జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్… Lఆ మహిళకు తక్షణ భద్రత కల్పించి, స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రజాసంస్థలు, మహిళ సంఘాలు కోరుతున్నాయి…

👉ఆగని పైరసీ.. కొత్తగా ఐబొమ్మ వన్

ఆన్లైన్లో ‘ఐబొమ్మ వన్’ అనే కొత్త పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్లో కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

👉బాపట్ల జిల్లా:* నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్,భాష పై సోషల్ మీడియాలో ట్రోల్ … ప్రిన్సిపాల్ గా ఉంటు ఇలాంటి మాటలు మాట్లాడడం ఫై విపరీతంగా వైరల్. *▪️నారాయణ స్కూల్స్ ఫై ఎన్నో సార్లు పిర్యాదులు వచ్చిన చర్యలు తీసుకోవాలి అంటే గజ గజ వణికిపోతున్న విద్యా శాఖ అధికారులు.*తమ కూతురుని ఎందుకు కొట్టారు అని అడగడానికి వచ్చిన ఒక విద్యార్థిని తల్లిదండ్రులతో అనుచితంగా మాట్లాడిన నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ బస్తీ మే సవాల్.

▪️బాపట్ల లోని నారాయణ స్కూల్ హెచ్ఎం అనుచితంగా మాట్లాడిన ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్.▪️తల్లిదండ్రులను తన రూములోకి రావద్దనడంతో పాటు బాధితురాలు అయిన విద్యార్థినిని హెచ్ఎం తిట్టడం,గట్టిగా కేకలు వెయ్యడం జరిగింది.  ▪️హెచ్ఎం వైఖరి పై విద్యార్థి పట్ల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

👉ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్..!!

అవినీతి, అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు.. రిజిస్ట్రార్లు, ఇతర అధికారులపై అవినీతి ఫిర్యాదులు చూసి, శాఖను భ్రష్టు పట్టిస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఐజీ(రిజిస్ట్రేషన్)..

హైదరాబాద్ – వనస్థలిపురంలో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కడంతో, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన సీనియర్ అసిస్టెంట్ శివశంకర్.. బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే, సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కును ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సదరు అధికారి..స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకుని, శివశంకర్‌పై వేటు వేసిన ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు.. ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేసేందుకు రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేసిన సరూర్‌నగర్‌ సబ్ రిజిస్ట్రార్ శ్రీలత.. దీంతో బాధితుడి పిటిషన్ పట్ల విచారణ జరిపి, సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు, అక్రమ దందాలు, లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారుల జాబితా ఎక్కువ అవుతున్నా, సంబంధిత మంత్రి నుండి ఎలాంటి చర్యలు లేవని ఆరోపిస్తున్న బాధితులు.. తీవ్ర విమర్శల మధ్య ఉన్నతాధికారులతో సమావేశమై, ఇక నుండి చిన్న ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు..!!

👉హైదరాబాద్ ‘పిస్తా హౌస్’ యజమానింట్లో కోట్ల కొలదీ నగదు గుర్తింపు..

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఐటీ దాడులు.. పన్నుల ఎగవేత ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు.. పిస్తాహౌస్‌ యజమాని నివాసంలో రూ.5 కోట్ల నగదు గుర్తింపు.. కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న అధికారులు…హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పిస్తాహౌస్, మెహ్‌ఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పిస్తాహౌస్ యజమాని నివాసంలో రూ.5 కోట్ల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.నిన్న ఉదయం నుంచి దాదాపు 35 బృందాలు నగరంలోని 30కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించాయి. హోటళ్లలో జరిపిన తనిఖీల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు, పెద్ద సంఖ్యలో హార్డ్‌డిస్క్‌లను అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా వచ్చే ఆర్డర్లకు, సంస్థ చూపిస్తున్న లెక్కలకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు…. ఈ మూడు హోటళ్లలోనూ ఆన్‌లైన్ ఆర్డర్లకు సంబంధించిన సరైన వివరాలు లేకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్కులలోని సమాచారం ఈ కేసు దర్యాప్తులో కీలకం కానుందని, పూర్తి విశ్లేషణ తర్వాత పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగిందనే దానిపై స్పష్టత వస్తుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!