👉👉ఏపీలో హైఅలర్ట్..విజయవాడలో మావోలు.. భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం…: 👉లక్షద్వీప్ లో గృహ-పట్టణ పధకాలపై చర్చలు జరిపిన మాగుంట …👉  ప్రభుత్వ వైద్యాశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని ఆరోగ్య శాఖ మంత్రిని కోరిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*… .👉మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్…👉 మిర్యాలగూడ సబ్ జైలులో *కీచక* కానిస్టేబుల్!_

👉చంద్రబాబుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలెంజ్…!!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తెలంగాణాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకుడు అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్ అయ్యారు.

ఒక యూట్యూబ్ చానల్ డిబేట్ లో ఆయన తాజాగా మాట్లాడుతూ బాబుని ఆయన అవకాశవాద రాజకీయ నేతగా పేర్కొన్నారు. ప్రతీ సారి ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం బాబుకు అలవాటు అని కూడా ఆయన చెప్పారు. ఇక 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది అన్న బాబు తాను మాత్రం సూపర్ సిక్స్ హామీలు అంటూ ఎన్నికల హామీలు ఇచ్చి వాటిలో కొన్ని అమలు చేస్తున్నారని నాగేశ్వర్ గుర్తు చేశారు.

*తెల్ల ఏనుగు అని చెబుతూ : విశాఖ స్టీల్ ప్లాంట్ ని తెల్ల ఏనుగుతో పోలుస్తూ ఈ రోజు విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఈ సంగతి తెలిసి తెలిసి ఎందుకు ప్లాంట్ ని కాపాడుతామని ఎన్నికల ముందు కార్మికులకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అంతే కాదు కేంద్రం నుంచి 11 వేల కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం ఇప్పించామని చెబుతున్న బాబు అవన్నీ పన్నులు కట్టే వారి ఆదాయం అని ఆనాడు తెలియలేదా అని నిగ్గదీశారు.

*ఓపెన్ చాలెంజ్ అంటూ :…స్టీల్ ప్లాంట్ తెల్ల ఏనుగు అని ఎలా చెబుతారు బాబూ అని ఆయన ప్రశ్నించారు. తెల్ల ఏనుగు ఎలా అయిందో చెప్పాలని ఆయన ఓపెన్ చాలెంజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఎన్ని నిధులు ఇప్పటిదాకా ఇచ్చిందో ఇదే విషయం మీద తాను బాబుని సూటిగా అడుగుతున్నాను అని ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల పన్నులతో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు అంటే విశాఖలో నెలకొల్పుతున్న గూగుల్ అదానీ సెంటర్ కి ఎన్ని వేల కోట్లు రాయితీలు ఇచ్చారో చెప్పాలని అన్నారు. 22 వేల కోట్ల దాకా ప్రజల పన్నుల నుంచి ఎలా ఇవ్వగలిగారు అని ఆయన ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఎన్ని రాయితీలు ఇస్తున్నారో కూడా చెప్పాలని కోరారు.

*కేంద్రం ఇచ్చింది ఎంత : ఇక స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్లు ఆస్తులు పెంచిందో చెప్పాలని ఆయన కోరారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విమర్శలు చేస్తున్నారని ఇది మోసపూరితమైన వాదన కాదా అని ఆయన అన్నారు కార్మికులు పనిచేయడం లేదని అనడం తప్పు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అని అన్నారు.. కార్మికుల మీద యుద్ధం చేస్తూ వస్తున్న బాబు గతంలో ఓట్లేయండి అని కోరింది మీరే కదా అని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ రెండు లక్షల కోట్ల ఆస్తులు కార్మికుల కష్టార్జితమే అని ఆయన అన్నారు పనిచేయకపోతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని అన్నారు.

*స్టీల్ ప్లాంట్ మూసివేత కోసమే : విశాఖ స్టీల్ ప్లాంట్ ని మూసేసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని ప్రోత్సహించడం కోసమే బాబు ఈ రకంగా ప్లాంట్ మీద కార్మికుల మీద విమర్శలు చేస్తున్నారు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్ అయ్యారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీలు కోరుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులు ఇప్పించాలని ఆయన బాబుని డిమాండ్ చేశారు. అపుడు ప్రైవేట్ కంపెనీల కంటే ఎక్కువ లాభాలు స్టీల్ ప్లాంట్ కి వస్తాయని అది తాను చేసి చూపిస్తానని ఓపెన్ చాలెంజ్ చేశారు.

*మోడీ మీద పోరాడలేరు : కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. దానిని ఆపే శక్తి టీడీపీ కూటమి ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. అయితే ప్రైవేటీకరణ చేస్తారు, లేకపోతే మిట్టల్ సంస్థ కోసం నిర్వీర్యం అయినా చేస్తారు అని ఆయన ఆరోపించారు స్టీల్ ప్లాంట్ మీద దాడి తెలుగు వారి మీద దాడి అని వారి ఆత్మ గౌరవం మీద దాడి అన్నారు ఇది ప్రజల పన్నులతో నడిచే ప్లాంట్ అని రుజువు చేస్తే కనుక మూసేయండి అని ఆయన సవాల్ చేశారు. కేంద్రం అయిదు వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు. మొత్తం స్టీల్ ప్లాంట్ డేటా ఇప్పటిదాకా తీస్తే తెల్ల ఏనుగు అవునో కాదో తేలిపోతుంది కదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కేంద్రం ఇచ్చిన నిధులు వీటితో పాటు స్టీల్ ప్లాంట్ కట్టిన పన్నులు ఆస్తులు అన్నీ డేటా తీసి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు, మీరు కనుక రుజువు చేస్తే తాను ఎపుడూ స్టీల్ ప్లాంట్ విషయం మీద చర్చించనని ఆయన ఓపెన్ చాలెంజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని వాటిని తెగ నమ్మడానికే పాలకులు చూస్తున్నారు అని ఆయన నిప్పులు చెరిగారు.

👉అమరావతి : “పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.**సతీష్‌కుమార్‌ మృతి కేసులో నిందితుడు రవికుమార్‌, ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం…*సీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సీఐడీ డీజీ మెమో దాఖలు.. అందుకు అంగీకరించిన న్యాయస్థానం.**తదుపరి విచారణ డిసెంబర్‌ 2కి వాయిదా.**సతీష్‌కుమార్‌ అసహజ మరణ వార్తతో షాక్‌ అయ్యాం : ఏపీ హైకోర్టు*

👉శంషాబాద్‌లో తీవ్ర విషాదం…8 నెలల గర్భిణీ మహిళ కడుపులో కవల పిల్లలు మృతి, చికిత్స పొందుతూ మహిళ మృతి.. భార్య పిల్లల మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త

హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి సమీపంలోని సామ ఎన్‌క్లేవ్లో నివాసం ఉంటున్న కడప జిల్లాకు చెందిన విజయ్–శ్రావ్య దంపతులు.. పెళ్లి అయ్యి ఏడాది గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో, ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్న దంపతులు ..8 నెలల గర్భిణిగా ఉన్న శ్రావ్యకు ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో, తన తల్లితో కలిసి అత్తాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, కడుపులో ఉన్న కవల పిల్లలు చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు.. శ్రావ్యకు కూడా మెరుగైన చికిత్స చేయించాలని వైద్యులు సూచించడంతో, గుడిమల్కాపూర్ ప్రాంతంలోని మైత్రి అనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

👉మిర్యాలగూడ సబ్ జైలులో *కీచక* కానిస్టేబుల్!_

హుజూర్నగర్ కు చెందిన ఓ మహిళను మాయ మాటలతో పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన మిర్యాలగూడ వెలుగులో… పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని గర్భవతిని చేసి, మిత్రులతో కలిసి టార్చర్ పెట్టి అబార్షన్ టాబ్లెట్ లా ద్వారా గర్భాన్ని తొలగించాడని యువతి ఆరోపణ…  రోజూ శారీరక–మానసిక వేధింపులకు గురైనట్లు నిన్న జిల్లా ఎస్పీ కు సదరు మహిళ ఫిర్యాదు…ఫిర్యాదుతో తన డొంక కదులుతుందని భావించి యువతి కుటుంబ సభ్యులకు బెదిరింపులు చేయిస్తున్న కీచకుడు…రాజకీయ నేతల ప్రభావంతో పిటిషన్ వెనక్కి తీసుకోవాలనే తీవ్ర ఒత్తిడి…గతంలో కూడా పలుమార్లు పాల్కురి నాగరాజు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసిన జెళ్ళ శాఖ… మహిళా రక్షణ చట్టాల పట్ల నిర్లక్ష్యం చూపిన ఈ ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించాలని మహిళా సంఘాల డిమాండ్…పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అత్యవసరంగా జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్…ఆ మహిళకు తక్షణ భద్రత కల్పించి, స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రజాసంస్థలు,మహిళ సంఘాల కోరుతున్నాయి…

👉ఏపీలో హైఅలర్ట్.. రాష్ట్రంలో 60-70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం.. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో పట్టుబడ్డ 32 మంది మావోయిస్టులు.. ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్.. ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదిలికలు..

👉విజయవాడలో మావోలు.. భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం…: విజయవాడలో మావోల అరెస్టుపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూలీలుగా చెప్పుకుని వారు పెనమలూరులో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. దీన్ని షెల్టర్ జోన్గా మార్చుకుని కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆక్టోపస్ స్పెషల్ ఆపరేషన్లో పలు ప్రాంతాల్లో 31 మంది మావోలను అరెస్టు చేశారు. ఆటోనగర్ లో ఏర్పాటుచేసుకున్న డంప్లో ఏకే 47 సహా భారీగా డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.

👉31 మంది మావోలను అరెస్ట్ చేశాం: మహేశ్ చంద్ర

అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఎన్ కౌంటర్లో ఆరుగురు మావోలు చనిపోయినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర వెల్లడించారు. ఇవాళ 6.30-7AM మధ్య ఎన్ కౌంటర్ జరిగిందన్నారు. అలాగే పక్కా సమాచారంతో విజయవాడ, కాకినాడలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని చెప్పారు.

👉లక్షద్వీప్ లో గృహ-పట్టణ పధకాలపై చర్చలు జరిపిన మాగుంట   ఆధ్యయన సందర్శన కార్యక్రమంలో భాగంగా గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటు కమిటీ చైర్మన్ మరియు ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్ది ఈ రోజు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో కమిటీ సభ్యులతో కలసి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలకు సంబందించిన పలు కేంద్ర పధకాల అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.    ఈ సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంత లక్షద్వీప్ ప్రభుత్వం, రాష్ట్ర గృహ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్ధికశాఖ మంత్రిత్వ, కవరట్టి స్మార్ట్ సిటీ, హడ్కో, యన్.బి.సి.సి., కెనర బ్యాంకు, తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలకు సంబందించి స్వచ్చ్ భారత్ మిషన్ – అర్బన్, అమృత్, పి.యం.ఆవాస్. యోజన, పి.యం.ఎస్.వి.ఏ.నిధి పధకాలు మరియు కార్యక్రమాల పనితీరు – పురోగతి, కవరట్టి స్మార్ట్ సిటీలోని ఐ.సి.సి.సి.–ఎస్.పి.వి. నిర్వహణ మరియు హడ్కో – యన్.బి.సి.సి. పనితీరుపై చర్చలు జరిపారు.ఈ చర్చలలో ప్రతినిధులు కోరిన సదుపాయాలు మరియు చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వానికి శిఫార్సు చేస్తానని వారికి మాగుంట శ్రీనివాసులురెడ్ది తెలియజేశారు.

👉మార్కాపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన  .. ప్రకాశం జిల్లా  మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మార్కాపురం శాసనసభ్యులు  కందుల నారాయణరెడ్డి  నిర్వహించిన ప్రజా దర్బార్ కి విశేష స్పందన లభించింది.  ఈ ప్రజా దర్బార్ కు అన్ని శాఖల అధికారులు వఅన్ని శాఖల అధికారులు విచ్చేసారు. సందర్భంగా శాసనసభ్యుల వారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అప్పటికప్పుడుకే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించారు.  అనంతరం శాసనసభ్యులు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తీర్చడమేనని కొన్ని సమస్యలు ఇప్పటికిప్పుడే పరిష్కరించామని మరికొన్ని సమస్యలు వచ్చే పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని పరిష్కారం కాని సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు అర్జీదారులకు తెలియజేస్తామని అన్నారు.   వైసిపి నాయకులకు పని పాట లేక తమ ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని తమ నాయకుడు  నారా చంద్రబాబు నాయుడు  నారా లోకేష్ బాబు ,  పవన్ కళ్యాణ్  నిత్యం కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తున్నారని అది ఓర్వలేక కోటి సంతకాలు అంటూ వైసీపీ నాయకులు రోడ్డు మీద పడ్డారని ఇక మీ ప్రభుత్వం ఎప్పటికీ రాదని అది గుర్తుంచుకోవాలని అన్నారు.

👉తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం…తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ” ముత్తు ముల అశోక “రెడ్డి **బేస్తవారిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి**తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలగమని గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. బేస్తవారిపేట మండలం టౌన్ నందు బేస్తవారిపేట మండల టిడిపి అధ్యక్షుడు సోరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెదేపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించినారు.ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉండాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన పార్టీ కార్యాలయం గడప తొక్కేలాగా సేవలు అందించాలి. తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా నిలుస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తరంగా తీసుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట మండల అధ్యక్షుడు సో రెడ్డి మోహన్ రెడ్డి , కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి గుంతిక నరసింహ యాదవ్, బెస్తవారిపేట టౌన్ అధ్యక్షుడు సైదులు, బేస్తవారిపేట కస్టర్ ఇంచార్జి ముప్పురి రాము, బేస్తవారిపేట మండల అధ్యక్షురాలు సున్నం అనిత , మరియు కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, తదితులు పాల్గొన్నారు*

👉ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజాదర్బార్*

*బెస్తవారిపేటలో.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*

*ప్రజా సమస్యల ప్రజా వేదిక ప్రజాదర్బార్ అని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి  పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తుందని అందులో భాగంగానే ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వారి సమస్యల పరిష్కారానికి తామున్నామంటూ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న అర్జీ రూపంలో తమకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత పాలకుల నిర్వాకంతో రాష్ట్రం అధోగతి పాలయ్యిందన్నారు. ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందన్నారు..ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సొరెడ్డి మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటక నరసింహా యాదవ్, పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు మరియు మండల అధికారులు తదితరులు పాల్గోన్నారు..*

👉గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యాశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…*ఆరోగ్య శాఖమంత్రిని కోరిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*

*గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు  సత్య కుమార్ యాదవ్ ని గిద్దలూరు ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి  కోరారు.. గిద్దలూరు పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలను వంద పడకల ఆసుపత్రి గా అభివృద్ధి చేయుటకు, మరియు కొమరోలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, మరియు కంభం ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు అందించానని అందుకు తగిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యే తో పాటు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి  యర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్సన్ బాబు  మంత్రిని కలిశారు..*

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!