👉ప్రస్తుతం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం.. మిగిలిన ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం…– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం
మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తాం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
👉ఎమ్మార్వో కార్యాలయం 20వేలకు అమ్మబడును..?*
ఓఎల్‌ఎక్స్‌లో ఇప్పుడు ఒక పోస్టు వైరల్‌గా మారింది. ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మేందుకు ఉపయోగించే ఈ ఓఎల్‌ఎక్స్‌లో ఒక వ్యక్తి ఒక భవనాన్ని అమ్మకానికి పెట్టాడు.బిల్డింగ్ అమ్మకానికి పెడితే అంత ట్రెండింగ్ ఎందుకు అవుతుందని అనుమానం వస్తుందా.. దానికి కారణం ఉంది.. అదేంటంటే.. అది సదరు వ్యక్తికి చెందిన ఇల్లు కాదు.. ప్రభుత్వ భవనం. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఎమ్మార్వో ఆఫీసు!గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ ఆకతాయి ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. అది కూడా కేవలం రూ.20వేలకే. ఈ పోస్టు చాలామందికి చేరడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చివరకు ఈ విషయం గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి వెళ్లింది. అది తెలిసి కంగుతిన్న ఎమ్మార్వో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీసును అమ్మకానికి పెట్టిన ఆకతాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
1,ఓఎల్ఎక్స్ లో గిద్దలూరు ఎమ్మార్వో ఆఫీసు అమ్మకానికి పెట్టడానికి కారణం ఏమిటి..?
2,ఎమ్మార్వో ఆఫీసును అమ్మకానికి పెట్టిన వ్యక్తిని పోలీసులు ఎలా గుర్తిస్తారు..?
3,ఓఎల్ఎక్స్ లో ఎమ్మార్వో ఆఫీసు అమ్మకం ప్రకటనపై ఎమ్మార్వో స్పందన ఏమిటి..?
ఓఎల్ఎక్స్ లో ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయా, వాటి ఫలితాలు ఏమిటి..?
👉రోజు రోజు కి పెరుగుతున్న బస్సు ప్రమాదాలు…. నందిగామ వద్ద లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు*ఆంధ్ర…ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ముందుండే లారీని ఢీకొట్టగా, బస్సులో ఉన్న 20 మందిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
👉24గంటల్లో ముఖ్యమంత్రి స్పందించాలి*
*షాద్ నగర్ కుల దురహంకార హత్యపై స్పందించకుంటే కార్యాచరణ… *షాద్ నగర్ న్యాయవాది దానక్క సంగమేశ్వర్ అల్టిమేటం…*దళిత బాధిత కుటుంబానికి అండగా నిలబడతాం*
🌟కుల వివక్షతో దళితుల మీద చెయ్యి వేయాలంటే దడ పుట్టించేలా చేయడానికి సిద్ధంగా ఉన్నామని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యాయవాది, రాజకీయ యువ నాయకులు దానక్క సంగమేశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరుకుంటూ ఎల్లంపల్లి గ్రామ దళితుడు ఎర్ర రాజశేఖర్ కుల దురహంకార హత్యకు బలైన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గంలో
ఒక దళితుడినీ సభ్య సమాజం తలోదించుకునేలా అగ్రకులస్తులు కొందరు హత్య చేసి శవాన్ని దహనం చేస్తే ప్రభుత్వం బాధ్యతాయుతంగా పరిటాల జారీ చేయకపోవడం స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు మాట్లాడకపోవడం విచారకరమని సంగమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. షాద్ నగర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటల్లోగా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణను రూపొందిస్తామని ఇక దళితులపై చూడడానికి కూడా దడ పుట్టే విధంగా చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని సంగమేశ్వర్ ప్రశ్నిస్తున్నారు. సంఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటన రాకపోవడం పట్ల దళితులపై ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో అర్థం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా వెంటనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని రాజశేఖర్ హత్యతో సంబంధం ఉన్న కొంతమంది పోలీస్ శాఖలో వహించిన నిర్లక్ష్యం పట్ల చర్యలు వెంటనే చేపట్టాలని లేకపోతే దళిత సంఘాలు దళిత ప్రజా మేధావులు అన్ని వర్గాలు కలిసి అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటాలు మలిచేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాజశేఖర్ హత్య విషయంలో పోలీస్ శాఖలు కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని వారిపై కూడా చర్య తీసుకునే దాకా తాను పోరాటం విరమించబోనని సంగమేశ్వర్ తెలిపారు. 24 గంటల్లోగా ముఖ్యమంత్రి స్పందించాలని లేకపోతే రేపు తమ కార్యచరణ ప్రారంభం కాబోతుందని రేపు మీడియా సమావేశం పెద్ద ఎత్తున దళిత సంఘాలతో కలిసి ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు..
👉 పోలీసుల నిర్లక్ష్యం.. సర్కారు వైఫల్యం..!
రాజశేఖర్ హత్యకు కారణాలు ఇవే..*బాధిత కుటుంబాన్నే పోలీసులు వేధించారు..*హత్య జరుగుతుందని తెలిసీ విచారణలో జాప్యం*కుల దురహంకారమే హత్యకు కారణం..*కులాంతర వివాహ రక్షణ చట్టం తేవాల్సిందే..*బాధిత కుటుంబానికి 50 లక్షలు పరిహారం ఇవ్వాలి..**సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్..ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన సీపీఎం నేతలు..*
కులోన్మాదులుగా వ్యవహరించిన కొందరు వ్యక్తులు అత్యంత అమానవీయంగా ఒక దళితుడిని హత్య చేయడం వెనుక ప్రభుత్వ వైఫల్యం.. పోలీసుల నిర్లక్ష్యం ప్రధాన పాత్ర పోషించాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఎర్ర రాజశేఖర్ అనే దళితుడిని హత్య చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ ను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడి అత్యంత దారుణంగా దహనం చేయడం ఘోరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితమే ఈ కేసు వ్యవహారం పోలీసులు దృష్టిలో ఉందని కానీ బాధితుడు కుటుంబాన్నే టార్గెట్ చేసిన పోలీసులు వారిని బెదిరించడం, పెళ్లికి నిరాకరించడం జరిగిందని అన్నారు. వెంకటేష్ మృతుడి ఇంటికి వెళ్లి రాజశేఖర్ ను బయటికి తీసుకు వెళ్లినప్పుడే అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అయినప్పటికీ విచారణలో నిర్లక్ష్యం చేయడం వల్ల రాజశేఖర్ మరణించాడని పేర్కొన్నారు. తమ్ముడు ప్రేమకు సంబంధించి అన్నను ఒకవైపు పోలీసులు వేధించడం, మరోవైపు యువతి తండ్రి హత్యకు పాల్పడడం అత్యంత దారుణం అన్నారు.రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆసిఫాబాద్లో శ్రావణి హత్య కూడా జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 142 కుల దురహంకార హత్యలు జరిగాయని అన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గాని ఈ వ్యవహారంపై స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇకనైనా దీనిపై శాసనసభలో చర్చించి కులాంతర వివాహాల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించకపోతే పోలీసు కార్యాలయాలను ముట్టడించడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. రాజశేఖర్ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని అన్నారు. అదేవిధంగా వారి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇకనైనా దళితులకు రక్షణ కల్పించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాన్ వెస్లీ వెంట రాష్ట్ర నాయకులు తీగల సాగర్, స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య నరసింహ స్థానిక డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు పార్టీ నాయకులు సీను నాయక్ వీసా సాయిబాబు కొంగరి నర్సింలు శ్రీకాంత్ ఈశ్వర్ నాయక్ బేరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు..
👉ములుగు జిల్లాలో యువకుడి దారుణ హత్య?
ములుగు జిల్లా: ములుగుజిల్లా మండలం లాలాయగూడెంలోజాడి సమ్మయ్య,అనే యువకుడు దారుణహత్యకు గురయ్యా రు. అతనిని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది…. వివరా ల్లోకి వెళితే.. ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన జాడి సమ్మయ్య (40) మండల కేంద్రంలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు.
అతనికి వివాహం కాగా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది కాలంగా లాలాయగూడెం కు చెందిన మైనర్ బాలిక(16)తో వివాహేతర సంబంధం పెట్టుకుని మద్యానికి బానిస అయ్యారని సమాచారం.గత కొద్ది రోజుల క్రితం సమ్మయ్య తండ్రి సైతం ఇంట్లో గొడవలు అవుతున్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ క్రమంలో సమ్మయ్య ఆదివారం సాయంకాలం టీఎస్ 25 ఏ 7666 నెంబర్ గల హోండా ద్విచక్ర వాహనంపై లాలాయి గూడెం గ్రామానికి రాగా ఆగ్రహంతో ఉన్న మైనర్ బాలిక తల్లిదండ్రులు సమ్మయ్యను గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉మృతులంతా హైదరాబాదీలే : TG హజ్ కమిటీ
సౌదీ బస్సు ప్రమాద మృతులంతా హైదరాబాదు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్ ఘాట్, ఆసిఫ్ నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.
*ఒకే కుటుంబంలో 18 మంది మృతి…
సౌదీలో ఘోర బస్సు ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు వెల్లడించారు.
👉కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం…అదనపు కట్నం వేదింపులు భరించలేక 7 నెలల గర్భిణి ఆత్మహత్య…!!!
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే యువతికి, భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో వివాహం చేసిన కుటుంబ సభ్యులు… అదనపు కట్నం కోసం ప్రశాంత్ పెట్టే టార్చర్ భరించలేక, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఏడు నెలల గర్భిణిగా ఉన్న మౌనిక
తన కూతురు చావుకు కారణమైన ప్రశాంత్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మౌనిక తల్లి
మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉ఒంగోలు…*ప్రకాశం… భేష్ !!*… వాటర్ షెడ్ పనుల్లో ఉత్తమ పని తీరు…జాతీయస్థాయిలో రెండో స్థానం…కేంద్ర జలశక్తిశాఖ మంత్రి పాటిల్ చేతుల మీదగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు..

వాన నీటిని ఒడిసిపట్టడములో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి ఆశవాహస్థితికి తీసుకురావడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చి… ప్రశంసా పత్రం ఇచ్చి… శభాష్ అంటూ వెన్నుతట్టి అభినందించింది. ఔను… వాటర్ షెడ్ పనులలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు కేంద్ర జలశక్తి శాఖ మురిసిపోయింది. జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా ‘ రెండవ జాతీయ ఉత్తమ నీటి పురస్కారం ‘ అవార్డును ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్.పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఈ అవార్డు అందుకున్నారు. ఆరవ జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు కనిగిరి నియోజకవర్గం , పెదచెర్లోపల్లి మండలం, మురుగమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది.
**ఇదీ నేపథ్యం..! 2022 – 23 సంవత్సరంలో జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో వాటర్ షెడ్ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులను చేపట్టారు. వాటర్ షెడ్ నిధులు, ఇతర డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించారు. ఇందులో భాగంగా ‘ రిడ్జ్ – టు – వ్యాలీ ‘ విధానంలో వివిధ రకాలైన సహజ వనరుల యాజమాన్యపు పనులు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో మరియు భూగర్భ జలమట్టాలను పెంపొందించడంలో ఉత్తమ పద్ధతులను పాటించారు. ఖండిత కందకాల పనులు, చిన్న ఊట కుంటలు, పెద్ద ఊట కుంటలు, డగవుట్ పాండ్స్, అమృత్ సరోవర్లు, పూడికతీత పనులు చేయడం ద్వారా దాదాపు 8.21 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిలువ చేశారు. ఇందుకుగాను 51 పనులకు దాదాపుగా రూ. 97 లక్షల నిధులు ఖర్చు చేశారు. ఈ పనులలో సాధించిన పురోగతిని తెలియజేసేలా డాక్యుమెంటేషన్ చేయించి గత ఏడాది అక్టోబర్లో కేంద్రానికి నామినేషన్ పంపించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నెలలో కేంద్ర బృందం వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించింది. భౌగోళికంగా భిన్న పరిస్థితులు ఉన్న ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నీటి సంరక్షణ పనులలో సాధించిన పురోగతిని అభినందిస్తూ జిల్లాకు జాతీయస్థాయిలో రెండో ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లా కలెక్టరుకు ఒక ట్రోఫీ, ప్రశంసాపత్రం, రూ.1.5 లక్షల నగదును అందించింది. ఈ పథకం అమలులో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా పనులను పర్యవేక్షించిన డ్వామా పీ.డీ. జోసెఫ్ కుమార్ ను కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందించారు.
👉 పొదిలిలో ఘనంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పుట్టినరోజుకు వేడుకలు.
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు పండుగ రోజు అయిన ఈరోజు పొదిలి పట్టణంలోని తెలుగుదేశం నాయకులు మరియు వారి అభిమానులు వివిధ ప్రదేశాల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు..మొదటిగా కొత్తూరు లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం నాయకులు ఏర్పాటుచేసిన కేక్ కట్ చేశారు.అనంతరం పొదిలి పెద్ద బస్టాండ్ లోని తెలుగుదేశం నాయకులు ఏర్పాటుచేసిన కేకులు కట్ చేసి అందరికి పంచిపెట్టారు.అనంతరం తెలుగుదేశం నాయకులు గునుపూడి భాస్కర్ ఇంటి వద్ద ఏర్పాటుచేసిన కేక ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాటూరు వారి పాలెం లో తెలుగుదేశం నాయకులు ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, మండల తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకల లో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కుమార్తె డాక్టర్ భవ్య నందిని మార్కాపురం జనరల్ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్లకు పండ్లు మరియు బ్రేడ్స్ పంపిణీ చేశారు. స్వయంగా డాక్టర్ అయిన కందుల భవ్య నందిని జనరల్ హాస్పిటల్ లో ప్రతి వార్డులో పర్యటిస్తూ రోగుల బాగోగులు కనుక్కొని వారిని ఆప్యాయంగా పలకరించారు.
👉 తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఆసుపత్రి నందు స్టాప్ తో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి బయట మూత్రశాలలు కట్టిస్తామని తెలిపారు.అనంతరం డాక్టర్లు, సిబ్బందితో కలిసి డిజిటల్ ఎక్సరే యూనిట్, ICU మానిటల్ యూనిట్ ని ప్రారంభించారు.

