👉👉బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష*
షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన ICT కోర్టు…ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటున్న షేక్ హసీనా..షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ-ICT కోర్టు…అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చారు-ICT..
👉సౌదీ విషాదం తర్వాత హజ్ హౌస్‌లో పరిస్థితిని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు”.సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు పాల్గొన్న విషాదకరమైన బస్సు ప్రమాదంపై మైనారిటీ మరియు ప్రజా సంక్షేమ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరితో మంత్రి అజారుద్దీన్ స్వయంగా మాట్లాడారు, గాయపడిన యాత్రికులకు సాధ్యమైనంత సహాయం అందించాలని మరియు సహాయక చర్యలను త్వరగా మరియు సమర్థవంతంగా సమన్వయం చేయాలని ఆయనను అభ్యర్థించారు. తక్షణ చర్య తీసుకుంటూ, మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌లో ఉన్నారు, అక్కడ ఆయన సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన కంట్రోల్ రూమ్ పనితీరును పర్యవేక్షిస్తున్నారు, నిరంతర కమ్యూనికేషన్, ఖచ్చితమైన నవీకరణలు మరియు బాధిత యాత్రికుల కుటుంబాలకు సకాలంలో మద్దతును అందిస్తారు.
👉స్పా ముసుగులో వ్యభిచారం.. విటుడు, ఇద్దరు మహిళలు అరెస్ట్*ప్రకాశం జిల్లా
ఒంగోలులో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారంపై పోలీసులు దాడులు నిర్వహించారు.బాలాజీరావుపేటలోని ఓ డాబాలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో,పోలీసులు తనిఖీలు చేసి ఒక విటుడుతో పాటు ఇద్దరు మహిళలను గుర్తించారు.వీరిని రిమాండ్ కు తరలిస్తామని, చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.
👉 గురుకుల పాఠశాలలో ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్.. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఉండే మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులు అదృశ్యం..నిన్నటి నుండి తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన..వాచ్మెన్ లేడని, సీసీ కెమెరాల లాంటి కనీస భద్రత లేదని మండిపడుతున్న విద్యార్థి సంఘం నాయకులు..
👉ఇమ్మడి రవి హార్డ్‌డిస్క్‌లో 21 వేల సినిమాలు పెట్టాడు..1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా ఉన్నాయి.. ఇమ్మడి రవి ఇప్పటి వరకు రూ.20 కోట్లు సంపాదించాడు అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం..50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్
🌟ఐబొమ్మ రవి అరెస్టులో వెలుగులోకి కీలక అంశాలు..
2022లో భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్న రవి.. 2022 నుంచి కరేబియన్ దీవుల్లో ఉంటున్న రవి.. భారత్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకోవడానికి మూడు రోజుల క్రితం భారత్‌లో అడుగుపెట్టిన రవి.. హైదరాబాద్, వైజాగ్‌లో ఉన్న ఆస్తులను అమ్మే యోచన.. ప్రైవేట్ రియల్ ఎస్టేట్‌సంస్థతో రవి ఒప్పందం..
🌟ఎంతోమంది కష్టాన్ని దోచుకోవడం కరెక్ట్ కాదు: చిరంజీవి
ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన HYD CP సజ్జనార్కు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్రాజు ధన్య వాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా పైరసీ భూతంతో పోరాడుతున్నాం. దీని వల్ల లక్షలాది మంది సినీ కార్మికులు నష్టపోతున్నారు. ఎంతోమంది కష్టాన్ని దోచుకోవడం కరెక్ట్ కాదు’ అని చిరంజీవి ప్రెస్మీట్లో పేర్కొన్నారు. తాము తలచుకుంటే నేరగాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు నిరూపించారన్న దిల్ రాజు అన్నారు..
🌟ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్..హీరో నాగార్జున… ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు..ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్‌సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి.. రూ.20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము.. వాళ్ళ సంపాదన వేల కోట్లల్లో ఉంటది – హీరో నాగార్జున..
👉పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల…
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తో కలిసి మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్న సంభవించిన మొంత తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాలకు పత్తి పంట దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఈ ప్రాంతంలో ఎంతో కొంత మిగిలి ఉన్న ప్రతి పంటను కొనుగోలు చేయడానికి ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని కానీ పత్తి పంట లో సాధారణంగా 8 నుండి 12% తేమ ఉన్న పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందని కానీ ఈ తుఫాను ప్రభావంతో దిగుబడి చెందిన ప్రతిలో అధిక శాతం తేమ ఉంటుందని అందువలన పత్తి తేమశాతం 18% నుండి 20% వరకు ఉన్న పత్తిని సైతం కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని గౌరవ జాయింట్ కలెక్టర్ కి విన్నవించారు. వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తారని అన్నారు. కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆర్డీవో , మార్క్ఫెడ్ ఎండి , స్థానిక ఎమ్మార్వో , స్థానిక మార్కెట్ యార్డ్ పాలకవర్గం,తెలుగుదేశం నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

