👉స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎ పి: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టూరిజం అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ… గోవాలో రిస్ట్రిక్షన్స్ లేవన్నారు. విశాఖలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని, అందుకే ఇక్కడే టూరిజం డెవలప్ అవడం లేదని చెప్పుకొచ్చారు. ఎక్కడ నుంచో భార్యా భర్తలు బీచ్ కి వచ్చి టీ తాగుతారా? ప్రశ్నించారు. ‘భర్త రెండు పెగ్లు వేయాలి… భార్య ఐస్క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలి’ అంటూ నోరు జారారు. ఈ వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకం అని మండిపడుతున్నాయి..
👉ఢిల్లీ పేలుడు దర్యాప్తు J&K ‘లేడీ సింగం’ గురించి తెలుసా..*న్యూఢిల్లీ :
దేశ రాజధాని ఢిల్లీ పేలుడు దర్యాప్తులో భాగమైన J&K తొలి మహిళా IPS షహీదా పర్వీన్ గంగూలీ గురించి చర్చ జరుగుతోంది.NIAకు అసిస్ట్ చేసేందుకు రంగంలోకి దిగిన ఆమెకు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో ఎంతో అనుభవం ఉంది. ఆమె ఫోరెన్సిక్ అనాలసిస్ ఇక్కడ ఉపయోగపడనుంది. పూంఛ్ కు చెందిన షహీదా ఎన్నో అడ్డంకులను, కష్టాలను దాటుకుని 1997లో ఐపిఎస్ అయ్యారు.J&K ‘లేడీ సింగం’గా పేరు పొందిన ఆమె 300కు పైగా ఎన్ కౌంటర్ లను నిర్వహించారు.
👉మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు… దేశంలో నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన… అధ్యక్షురాలు రాజీనామా చేయాలని డిమాండ్… పెద్ద ఎత్తున పాల్గొన్న యువత.. పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ120 మందికి గాయాలు.
మెక్సికోసిటీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జెన్-జెడ్ నిరసనలు అక్కడి ప్రభుత్వాలను వణికిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆందోళనలు మెక్సికోకూ పాకాయి. దేశంలో పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా, చట్టరక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై జెన్-జెడ్ నిరసన గళం విప్పింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపింది. దేశంలో హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారు అధ్యక్ష భవనం నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ చర్యతో నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయని అక్కడి అధికారులు చెప్పారు. వీరిలో 40 మంది ఆస్పత్రి పాలయ్యారని వివరించారు.అలాగే మరో 20 మంది యువత గాయ పడ్డారనీ, 20 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
**నిరసనలు దేనికి? … ఈనెల 1న మెక్సికో పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్‌లోని ఉరుపాన్ నగర మేయర్.. కార్లోస్ మంజో దారుణ హత్యకు గురయ్యారు. నేరాలకు వ్యతిరేకంగా పోరాడిన ఈయన మరణం.. సంచలనంగా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. దీంతో కార్లోస్ మంజో దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో ఆగ్రహావేశాల్ని రేపింది. ప్రభుత్వాలు హింసను అరికట్టడంలో విఫలమయ్యాయని ఆందోళనలకు దిగారు. మెక్సికో సిటీతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళనల్లో భాగంగానే నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడికి ప్రయత్నించారు. కాగా షీన్‌బామ్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఆమెకు 70 శాతానికి పైగా అప్రూవల్‌రేటింగ్ ఉన్నది. అయినప్పటికీ పెరుగుతున్న నేరాలు, అవినీతి వంటి అంశాలు ఆమెకు ప్రతికూలంగా మారాయి. ఇందులో భాగంగా తాజా ఆందోళనలు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో అవినీతిపై భారీ పోరాటం…ప్రాజెక్టుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దద్దరిల్లింది. వేలాది మంది ఆందోళనాకారులు రోడ్డెక్కారు. ఈ భారీ అవినీతి విషయంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇగ్లీసియా ఎన్ఐ క్రిస్టో ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల ర్యాలీ శనివారం ప్రారంభమైంది. దాదాపు 27వేల మంది మనీలాలోని రిజాల్ పార్క్‌లో గుమిగూడారు. ఫ్లడ్ కంట్రోల్ పేరిట నకిలీ ప్రాజెక్టులు చేపట్టారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రమాణాలనూ పాటించలేదని ఆరోపించారు. ఈ నిరసనలో ప్రధానంగా ప్రభుత్య పర్యవేక్షణను కోరారు. వరద-నియంత్రణ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆందోళనాకారులు ఆరోపించారు. ప్రాజెక్టులను దక్కించుకోవడం కోసం రాజకీయ నాయకులు, అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కంపెనీలు ప్రయత్నించాయనీ, ఇందులో వందల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఈ మేరకు నిరసనకారులు ప్లకార్డులను చేతబూనీ, అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. ఈ కుంభకోణంలో ప్రధానంగా పలువురు ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, వ్యాపారవేత్తల పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్ మాట్లాడుతూ.. దోషులు క్రిస్మస్‌కు ముందే జైలులో ఉంటారని హెచ్చరించారు. అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ ఇప్పటికే 37 మందిపై అవినీతి కేసులు పెట్టగా.. 86 మంది కాంట్రాక్టర్లపై భారీ పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి..
👉సౌదీలో ఘోర బస్సు ప్రమాదం..*
డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు, 42 మంది మృతి.. మక్కా నుంచి మదీనాకు వెళ్లిన భారతీయ యాత్రికులు… బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు.. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.
👉మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క…*
తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త అందించారు. గ్రామీణ మహిళలు తయారుచేస్తున్న ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. శనివారం హైదరాబాద్ ప్రజాభవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి, గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాలు, ప్రచారం కోసం ప్రస్తుతం మాదాపూర్ శిల్పారామం తరహాలో హైదరాబాద్ లో మరిన్ని మహిళాశక్తి బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ వేదికల ద్వారా మధ్యవర్తుల సమస్యలు లేకుండా మహిళలకు లాభాలు దక్కుతాయని హామీ ఇచ్చారు.
👉విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు… విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచక బుద్ధి బయటపడింది. మహబూబాబాద్ పట్టణం కంకరబోర్డులో గల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సోషల్ టీచర్ గా పనిచేస్తున్న ఇనుగుర్తి రవి అనే ఉపాధ్యాయుడు గత పదిరోజులుగా విద్యార్థినీల తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని. ఇన్నాళ్లూ ఎవరికి చెప్పాలో తెలియక ఈ రోజు బాధితురాలి తల్లితో చెప్పగా పూర్తి వివరాలు తెలుసుకొగా ఇనుగుర్తి రవి అనే ఉపాధ్యాయుడు అనేకమంది విద్యార్థినీల పట్ల ఇలాగే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పగా బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఉపాధ్యాయుడైన ఇనుగుర్తి రవి పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.
👉 తెలంగాణలో మరో దళిత యువకుడి లాకప్ డెత్?
కోదాడ ప్రాంతానికి చెందిన దళిత యువకుడిని, చిత్రహింసలు పెట్టి, అతని చావుకు కారణమైన పోలీసులు… కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతంలో నివాసముంటూ, ఆరోగ్య సమస్యల నిమిత్తం ఆసుపత్రి ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు పెట్టుకున్న కర్ల నాగయ్య కుమారుడు కర్ల రాజేష్(30) అనే యువకుడు ఎన్ని రోజులు గడిచినా తనకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రావడం లేదని విచారించగా, తన పేరు మీద రూ.1 లక్ష విడుదల అయినట్టు, ఆ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనే వ్యక్తి కాజేసినట్టు గుర్తించిన రాజేష్ దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు చేసిన బాధితుడు రాజేష్‌ను కస్టడీలోకి తీసుకుని, 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ..గాయాలతో ఉన్న రాజేష్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండు నిమిత్తం హుజూర్‌నగర్ సబ్ జైలుకు తరలించిన పోలీసులు.. జైలుకు వెళ్ళినప్పటి నుండి రాజేష్ శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని, తిరిగి అతన్ని పోలీసులకు అప్పగించిన జైలు సిబ్బంది ..అస్వస్థతో బాధపడుతున్న రాజేష్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ తరలించాలని సూచించిన వైద్యులు..ఉన్నతాధికారుల సూచనల మేరకు హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందిన రాజేష్…తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన రాజేష్‌ను,కస్టడీలో చిత్రహింసలు పెట్టి, అతని చావుకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు … ఈ విషయం బయటికి రాకుండా కోదాడ డీఎస్పీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలు తన తమ్ముడు చావుకు న్యాయం చేయాలని కోరుతున్న రాజేష్ సోదరుడు ..
👉 కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలపై అనుమానిత ప్రాంతాలపై స్పెషల్ పార్టీలతో స్పెషల్ డ్రైవ్ తో దాడులు, అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘా…
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జల్లెడ పడుతున్న పోలీసులు..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక..
కడప …గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మరియు డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డి.ఎస్.పి ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కడప నగరం వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అనుమానిత ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, కడప సబ్ డివిజన్ స్పెషల్ పార్టీ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల తో పాటు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి జల్లెడ పడుతూ దాడులు చేయిస్తూ నిందితులను గుర్తించే కార్యక్రమం నిర్వహించారు.
👉 చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి..
నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తన తో జీవించాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీసులు….జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

