👉34 లక్షల మంది మృతి.. బెంగాల్ లో వెలుగులోకి తెచ్చిన సర్.. సీఎం మమతా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆధార్ అధికారులు ఎన్నికల సంఘానికి సంచలన నివేదిక ఇచ్చారు. దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR) రెండో విడత మొదలైంది. బిహార్ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో సర్ నిర్వహించిన ఎన్నికల సంఘం తాజాగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బెంగాల్, తమిళనాడుతోసహా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 321 జిల్లాలు, 1843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం పరిశీలించనుంది. ఈ ప్రక్రియను నిరసిస్తూ ఇప్పటికే బెంగాల్ లో నిరసనలకు అధికార పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు బెంగాల్ లో మరణించిన 34 లక్షల మందికి ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయని అంటున్నారు. సర్ వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రజలను వేధిస్తోందని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు హడావుడిగా ఈ కార్యక్రమం చేపట్టడంపై మమతా బెనర్జీ మండిపడుతున్నారు. సర్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున బీజేపీ ప్రభుత్వం తనను జైలుకు పంపుతుందని లేదంటే గొంగతు కోస్తుందని మండిపడ్డారు. తనను ఎంతలా వేధించినా ప్రజల ఓటు హక్కును కాలరాయొద్దని వేడుకుంటున్నట్లు తెలిపారు.
సీఎం మమతా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆధార్ అధికారులు ఎన్నికల సంఘానికి సంచలన నివేదిక ఇచ్చారు. బెంగాల్ లో ఆధార్ వ్యవస్థ ప్రవేశపెట్టిన నుంచి ఇప్పటివరకు దాదాపు 34 లక్షల మంది మరణించారని తమ నివేదికలో ఎన్నికల సంఘానికి తెలియజేశారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తో యూఐడీఏఐ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాను ధ్రువీకరించుకోడానికి, అందులో వ్యత్యాసాలను గుర్తించడానికి ఆధార్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఈవోలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మరణించిన ఓటర్లు, జాబితాలో నకిలీ పేర్లకు సంబంధించి ఈసీకి భారీగా ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు uidai తమకు సహకరిస్తుందని ఇ సి ముందుకు వెళ్తుంది.. ఇక ఈసీ నిర్ణయంతో బెంగాల్ అంతటా మరణించిన ఓటర్లు, నకిలీ పేర్లను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారని, 2025 ఎన్నికల జాబితా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారమ్స్ పంపిణీ చేస్తూ ధ్రువీకరణ ప్రక్రియ చేపడుతున్నారని ఈసీ తెలిపింది. అలా బీఎల్వోలు సేకరించిన డేటాను 2002 ఎన్నికల జాబితాలతో పోల్చి వచ్చిన సమాచారాన్ని నిర్ధారిస్తున్నామని వెల్లడించారు. డ్రాఫ్ట్ రోల్‌లో చనిపోయిన లేదా నకిలీ ఓటర్లు ఉన్నట్లు తెలితే అందుకు సంబంధిత బీఎల్‌ఓలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ పరిస్థితుల్లో బెంగాల్ లో సర్ ప్రక్రియ మంటలు పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళుతోంది. దీంతో బెంగాల్ లో సర్ ప్రక్రియకు ఎలా ముగింపు పలుకుతారనేది ఉత్కంఠ రేపుతోంది.
👉జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం…
922 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచిన నోటా..కాంగ్రెస్, BRS, BJP తర్వాత నోటాకే అధిక ఓట్లు…జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్ధులు…
👉 రేడియాలజిస్టు రాక్షసత్వం.. మహిళ ప్రైవేట్ పార్టులను తాకుతూ.. బెంగళూరులో జయకుమార్ అనే రేడియాలజిస్ట్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్కానింగ్ కోసం వచ్చిన ఆమె ప్రైవేట్ పార్టులను తాకాడు. మహిళ ప్రశ్నించగా చంపేస్తానని బెదిరించాడు. అయితే ఆమె తెలివిగా మొబైల్లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేయకపోగా కాల్ చేసి సరిపెట్టినట్లు సమాచారం. ఇది వైరలవ్వడంతో న్యాయం చేసే వారే చూసి చూడనట్లు వదిలేస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఇంకా చెత్త పనులు చేస్తూనే ఉంటారు….
👉గాడిదలతో ఊరేగింపుగా షోరూమ్కు థార్!
కొన్నప్పటి నుంచీ తన మహీంద్రా థార్కు పదేపదే రిపేర్లు వస్తుండటంతో ఓ వ్యక్తి విసిగిపోయాడు. గాడిదలతో ఊరేగింపుగా వాహనాన్ని షోరూమ్కు తీసుకెళ్లి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. పుణే (MH)కి చెందిన సంగ్దే కొన్ని నెలల క్రితం థార్ కొన్నారు. ఇంజిన్ నుంచి పెద్దగా సౌండ్ రావడం, బాడీ పెయింట్ తుప్పు పట్టడం, తక్కువ మైలేజీ, తదితర సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. షోరూమ్ వాళ్లు పట్టించుకోకపోవడంతోనే ఇలా చేశారు.
👉జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు* నౌగావ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు.. 8 మంది మృతి 20 మందికి తీవ్రగాయాలు..పేలుడు ధాటికి ధ్వంసమైన పోలీస్ స్టేషన్..ఉగ్రవాదుల నుండి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను తనిఖీ చేస్తుండగా జరిగిన పేలుడు.. భయాందోళనలో స్థానికులు..* ఇస్లాం మతం పరువు తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లిం సోదరులు పెద్దలు*
👉ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్!
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య వృత్తిని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు ఈ నలుగురు డాక్టర్ల పేర్లను ఇండియన్, నేషనల్ మెడికల్ రిజిస్టర్ల నుంచి తొలగించాయి.
👉 రిటైర్డ్ ఉద్యోగులు, వృద్దులే టార్గెట్.. మనీ ల్యాండరింగ్ కేసంటూ భయపెట్టి లక్షల్లో డబ్బులు గుంజే అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. యువకుల డబ్బులు ఎర చూపి వారి అకౌంట్స్ ని కరెంట్ అకౌంట్స్ గా మార్చి సొమ్ము చేసుకుంటున్న ముఠా..ముఠాలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకి చెందిన 12మంది ముద్దాయిలు..వారి వద్ద నుంచి 12లక్షల 58వేలు నగదు, 17సెల్ ఫోన్లు, 13బ్యాంకు ఖాతాలు, 6చెక్ బుక్స్, 52ఎటిఎం కార్డులు, 16సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు స్వాధీనం..సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలు స్టూడెంట్స్ వద్ద నుంచి డబ్బులు ఎరగా చూపి తీసుకున్న ముఠా..ఫేక్ ఎఫ్ఐఆర్ వృద్దులు, రిటైర్డ్ ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా పంపి నమ్మించే ప్రయత్నం..
ఢిల్లీలో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించగా మీ పేర్లు చెప్పారని మీ మీద కేసు నమోదు అయ్యిందని బెదిరించే ప్రయత్నం..ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లి రూమ్ కు గడియ పెట్టి వాట్సాప్ వీడియో కాల్ లో విచారణకు హాజరు కావాలని లేకపోతే అరెస్ట్ తప్పదని భయపెట్టే ప్రయత్నం..డిజిటల్ అరెస్ట్ లో ఉన్నందున 5సంవత్సరాల జైలు శిక్ష తప్పదని బెదిరింపులు.. ఫేక్ సుప్రీమ్ కోర్టు కాపీలను వాట్సాప్ ద్వారా పంపి మరింత భయపెట్టే ప్రయత్నం..ఢిల్లీలో అరెస్ట్ చేసిన వ్యక్తికి సంబందించిన ఫేక్ కాపీలను వాట్సాప్ ద్వారా షేర్..24గంటల్లో అరెస్ట్ చేసి విచారించమని కోర్టు ఆదేశాలు ఉన్నాయని భయబ్రాంతులకు గురి చేసే యత్నం..
సీబీఐ అధికారులమంటూ యూనిఫామ్ వేసుకొని భయపెట్టి ఢిల్లీ రావాలని బెదిరింపులు..భయపడి అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం వారి అడిగిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయించుకుంటున్న ముఠా..విచారణలో నిర్ధోషి అవునో కాదో తేలే వరకు ఫిక్సడ్ డిపాజిట్ చెయ్యాలని మరి కొంత మొత్తం..ఇలా లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ముఠా..ఈ ముఠా భారీన పడి మోసపోయిన పులివెందుల రిటైర్డ్ డీఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు..కేసు నమోదు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేసు ఛేదించిన పులివెందుల పోలీసులు..30లక్షల్లో 12లక్షల 5వేలు రికవరీ చేసిన పోలీసులు..నిందితులను పోలీస్ పెన్నార్ హల్ లో మీడియా ముందు హాజరుపరచి వివరాలు వెల్లడించిన ఎస్పీ షెల్కి నచికేత్ విశ్వనాధ్..ఈ గ్యాంగ్ లో విదేశాల్లో కూడా సభ్యులు ఉన్నట్లు విచారణ లో వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించిన ఎస్పీ..విదేశాల్లో ఉన్న వారితో నగదు లావాదేవీలు జరగడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి..త్వరలో అసలైన సూత్రదారులను పాత్రదారులను కూడా అరెస్ట్ చేయబోతున్నాం..ఎంత విద్యావంతులైన ప్రోఫిషినల్ నేరగాళ్ల ముందు తప్పించుకోవడం అసాధ్యమే..బిగ్ స్కాం బట్టబయలు చెయ్యడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ..
👉సంతనూతలపాడు మండలం, మద్దులూరు గ్రామంలో జరిగిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిిత అధికారులు పాల్గొన్నారు. .
👉పొదిలిలో దొంగతనం. పొలీసులు కేసు నమోదు…ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్..
పొదిలి విశ్వనాదపురం కరెంట్ ఆఫిసు వద్ద కొనకనమిట్ల మాజీ ఎంపీపీ ఉడుముల రామ నారాయణ రెడ్డి గృహంలో దొంగతనం జరిగింది. గృహ యజమాని ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. గత రెండురొజుల క్రితం దొంగతనం జరగా యజమాని అందుబాటులో లేకపోవడంతో ఆలస్యంగా గుర్తించారు.పొలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టిం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.ఎంత సొత్తు అపహరణ జరిగిందో తెలియాల్సి ఉంది.

