👉32 కార్లతో దేశవ్యాప్తంగా సీరియల్ దాడుల కుట్ర: ఎన్‌ఐఏ దర్యాప్తులో సంచలనం!😱😱😱
పేలుడు జరిగిన హ్యుందయ్ ఐ20 కారుతో పాటు, మారుతి బ్రీజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి వాహనాలను కూడా ఈ దాడుల్లో ఉపయోగించాలని కుట్ర పన్నారు… ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సంచలన విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వరుస బాంబు దాడులు జరపడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజున డిసెంబర్ 6న ఈ దాడులను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
* కుట్రకు 32 కార్లు సిద్ధం..ఉగ్రవాదులు ఈ భారీ ఆపరేషన్ కోసం మొత్తం 32 కార్లను సిద్ధం చేసినట్లు విచారణ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన హ్యుందయ్ ఐ20 కారుతో పాటు, మారుతి బ్రీజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి వాహనాలను కూడా ఈ దాడుల్లో ఉపయోగించాలని కుట్ర పన్నారు. ఈ కార్లు చాలా వరకు పాతవి కావడం, పలుమార్లు యాజమాన్యం మారడం వల్ల వాటి ప్రస్తుత యజమానులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
* అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్రచర్యలు?
ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీకి చెందిన కారు హర్యానాలోని ఫరీదాబాద్ – మేవాట్ ప్రాంతంలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో లభించింది. ఈ ప్రాంతమే ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారి ఉండవచ్చని ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పేలుడు పదార్థాలు దాచిపెట్టడంలో సాయపడిన మతబోధకుడు మౌల్వీ ఇష్తియాఖ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
* వైద్యుల ముసుగులో విధ్వంస ప్లాన్…అతివాద భావజాలానికి లోనైన పలువురు వైద్యులు, విద్యార్థులు ఈ కుట్రలో భాగమయ్యారని దర్యాప్తులో తేలింది. వీరు విద్యాసంస్థల పేరుతో కార్యకలాపాలు నడిపి, యువతను రాడికలైజ్ చేసిన పక్కా ఆధారాలు నిఘా సంస్థలకు లభించాయి.
* 200 ఐఈడీల తయారీ: భారీ విధ్వంస లక్ష్యం..ఉగ్ర మాడ్యూల్ సభ్యులు ఇప్పటికే 200కి పైగా శక్తివంతమైన ఐఈడీలు తయారీలో నిమగ్నమై ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీటిని ఉపయోగించి దేశంలోని కీలక ప్రదేశాల్లో భారీ విధ్వంసం సృష్టించాలని పన్నాగం పన్నారు.
*టార్గెట్ చేసిన ప్రదేశాలు… ఢిల్లీలోని: ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం… గురుగ్రామ్, ఫరీదాబాద్, దేశంలోని కీలక ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, పలు మాల్స్ ను వీరు టార్గెట్ చేశారు. ఘటనాస్థలంలో అమ్మోనియం నైట్రేట్‌తో పాటు కొత్త రకం రసాయనపు ఆనవాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమై, అనుమానాస్పదంగా ఉన్న 32 కార్లను గుర్తించడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో “కార్ల వేట” ముమ్మరం చేశాయి. ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమై ఉన్నాయి.
👉. కనిగిరి మండలం కోటేశ్వరపురంలో ఓవర్ హెడ్ తాగునీటి సరఫరా ట్యాంకుకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ . పి. రాజాబాబు, ఎమ్మెల్యే .ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి. ..*. రూ.13 లక్షల వ్యయంతో రెండేళ్లలో నిర్మించేలా ప్రణాళిక. …*. 20వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మాణం…. *. గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు, ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. *. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి.
👉 కనిగిరి మండలం కమ్మవారిపల్లె, దిరిశవంచ గ్రామాలకు కూడా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఫ్లోరైడ్ ప్రభావిత ఈ గ్రామాలలో స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి గురువారం ఆయన పర్యటించారు. ఫ్లోరోసిస్ వలన అనారోగ్యం పాలైన ప్రజలతో వారు మాట్లాడారు. ఆర్వో ప్లాంట్ ద్వారా వస్తున్న నీటిని త్రాగునీటిగా వినియోగించుకుంటున్నామని ప్రజలు చెప్పారు. అయితే అన్నం వండుకోవడానికి కూడా బోరు నీటినే వినియోగిస్తున్నట్లు తెలుసుకున్న కలెక్టర్… పూర్తిస్థాయిలో తాగునీటి అవసరాలు తీర్చేలా ట్యాంకర్లతో మంచినీళ్లు సరఫరా చేస్తామన్నారు. ఈ దిశగా తక్షణమే చర్యలు తీసుకొని, శుక్రవారం నుంచి ట్యాంకర్లు సరఫరా చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రామతీర్థం నుంచి కూడా మంచినీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు ఆయన చెప్పారు. ఫ్లోరైడ్ తీవ్రతపై త్వరగా తనకు నివేదిక ఇవ్వాలని డిఎంహెచ్వో వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. కాగా, ఈ గ్రామంలో మురుగునీటి నిర్వహణ కోసం మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
👉ఇది తాగునీరు కాదు.. ! అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. ఈ ప్రాంగణంలోని బోరు నీటినే విద్యార్థులు తాగుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ నీటిని విద్యార్థులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సమీపంలోని ఆర్ఓ ప్లాంట్ ద్వారా విద్యార్థులకు మంచి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలోని బోరు నీటిని భోజనం ప్లేట్స్ కడుక్కోవడానికి, ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ‘ ఇది తాగునీరు కాదు ‘ అని బోరు వద్ద బోర్డు పెట్టాలని ఆదేశించారు. ఫ్లోరైడ్ నీళ్లు తాగటం వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు స్వయంగా కలెక్టర్, ఎమ్మెల్యే వివరించారు. విద్యార్థులు తాగుతున్న నీరు ఎంత ప్రమాదకరమో ప్రత్యక్షంగా వారి ముందే, తరగతి గదిలోనే అధికారులు నీటి పరీక్ష చేసి చూపించారు. అవసరమైతే ఇంటి వద్ద నుంచే మంచినీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఈ ప్రాంగణంలోని బోరు వాటర్ విద్యార్థులు తాగుతున్నట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారి వెంట డిపిఓ వెంకటేశ్వరరావు, డీఈవో కిరణ్ కుమార్, ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, ఎంపీపీ దొంతలూరి ప్రకాశం, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు ఉన్నారు.
👉మార్కాపురం సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో సర్కిల్ క్రైమ్ మీటింగ్ – నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి*..ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ క్రైమ్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో మార్కాపురం సీఐ సుబ్బారావు పాల్గొని సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఐ పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులను సమీక్షించి, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, రాత్రి పహారా, విజిబుల్ పోలీసింగ్, చట్ట-శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటమే కాకుండా, పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెంచేందుకు ప్రతి పోలీస్ సిబ్బంది చురుకుగా వ్యవహరించాలని, ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాలని సూచించారు.అదనంగా, నేరాల నియంత్రణలో ఇంటెలిజెన్స్ సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి సంఘటనపై సత్వర స్పందన చూపాలని, చిన్న చిన్న వివాదాలు పెద్ద గొడవలుగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో ప్రజా భద్రత, నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం సర్కిల్ పోలీసులు తమ బాధ్యతలను కర్తవ్యనిష్ఠతో కొనసాగిస్తున్నారు.
👉పోదిలి పట్టణంలో బీడీ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించిన జిల్లా పోలీసులు*
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని, పోదిలి పట్టణంలో పోలీసులు బీడీ (Bomb Detection) మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, టోబాకో బోర్డ్ కార్యాలయం మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. తనిఖీల సమయంలో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు ఉన్నారేమో పరిశీలించి, ప్రతి మూలను సమగ్రంగా తనిఖీ చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, మరియు ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
👉ఏసీబీ వలలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్*[ *తెలంగాణ రంగారెడ్డి జిల్లా* *ఆదిభట్లలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.*రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు.*మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ మరియు అసిస్టెంట్ వంశీ కలిసి రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.*ఇల్లు నిర్మాణానికి పర్మిషన్ నిమిత్తం ఈ డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.*
👉రైలులో సుమారు 3 కిలోల గంజాయి స్వాధీనం పోలీస్ లు* ఒంగోలు పట్టణం… గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం–రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు… ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు.. రైలులో సుమారు 3 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీసులు.. గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ గారి ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP) సిబ్బంది, మరియు మాదకద్రవ్యాలను గుర్తించే డాగ్ స్క్వాడ్ తో కలిసి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ లో ప్రకాశం జిల్లా పోలీస్ లు తనిఖీలు చేపట్టగా ఒంగోలు నుండి కావలి మధ్యలో 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, ఎస్. గోవిందన్ (39 సం),శాంతి నగర్, అనకపుత్తూరు జిల్లా, కాంచీపురం, చెన్నై చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం జి ఆర్ పి పోలీసులకు అప్పగించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, ఎస్సైలు శివరామయ్య, సుదర్శన్,చెంచయ్య, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్ రావు, అధికారులు, ఈగిల్ టీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉ఏనుగుల దాడిలో రైతు మృతి..సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఘటన..మృతుడు కుర్మానిపల్లికి చెందిన రైతు కిట్టప్పగా గుర్తింపు..రాగి పంటకు కాపలా ఉన్న కిట్టప్ప పై ఏనుగులు దాడి చేసిన వైనం..ఏనుగులు దాడి చేయడంతో భయాందోళనకు గురవుతున్న పరిసరాల గ్రామస్తులు..
👉కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం*.. రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ర్యాలీని సబ్ ఇన్‌స్పెక్టర్ స్థానిక విద్యార్థులతో కలిసి నిర్వహించారు.
“ప్రతి డ్రైవర్ మరియు పాదచారి రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని తెలిపారు.ర్యాలీలో విద్యార్థులు రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

