👉చంద్రబాబు మైనారిటీల పక్షపాతి… మంత్రి ఫరూక్ .. 👉 కర్నూలు బస్సు యాక్సిడెంట్ షాకింగ్ వీడియో..👉ఢిల్లీ ఘటన నేపథ్యంలో హై అలెర్ట్… 👉డీజీపీకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం డిమాండ్…👉 కాకినాడ జిల్లా 213 కేజీల గంజాయి పట్టివేత..ఆర్‌టీసీ బస్టాండ్‌లలో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు*.. 🏆 రాష్ట్ర, జాతీయస్థాయిలో సంతనూతలపాడు గురుకుల విద్యార్థుల క్రీడా ప్రతిభ వెలుగులు 🏆

👉చంద్రబాబు మైనారిటీల పక్షపాతి… *మైనార్టీల సంక్షేమానికి ఆధ్యులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. *భారతరత్న అబుల్ కలాం ఆజాద్ సేవలు అనిర్వచనీయం…*విద్యారంగానికి ఆయన చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తి… *మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట…*-రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్. డీ ఫరూక్*

*విజయవాడ.. *రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు తన దూర దృష్టితో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, మైనారిటీల పక్షపాతి చంద్రబాబు అని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని మంగళవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భారత రత్న అబుల్ కలాం ఆజాద్ విద్యా రంగం మరియు మైనార్టీ సంక్షేమానికి చేసిన విశేష కృషికి

👉హైదరాబాద్ హై అలెర్ట్ శంషాబాద్  ఎయిర్‌పోర్ట్‌ పేల్చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆఫీస్‌కి బెదిరింపు మెయిల్… దేశవ్యాప్తంగా ఆరు ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం, గోవా ఎయిర్ పోర్టులు పేల్చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు మెయిల్స్ పంపిన దుండగులు

👉ఢిల్లీ ఘటన నేపథ్యంలో హై అలెర్ట్… హైదరాబాద్ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్టాండ్‌లలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు..
👉 కర్నూలు బస్సు యాక్సిడెంట్ షాకింగ్ వీడియో..

గత నెలలో కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పల్సర్ బైక్ యాక్సిడెంట్ తర్వాత రోడ్డుకు ఓవైపు శివ డెడ్ బాడీ, మరోవైపు బైక్ పడి ఉండటం ఓ బస్సు డాష్్క్యమ్లో రికార్డైంది. 3 బస్సులు అదే మార్గంలో వెళ్లినా ఏ ఒక్కరూ ఆ బైకును తీసే ప్రయత్నం చేయలేదు. దీంతో వేమూరి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 19 మంది చనిపోయారు

👉డీజీపీకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం డిమాండ్… డీజీపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న పోలీసు అధికారుల సంఘం..  పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పని చేస్తోందని వెల్లడి.. సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని సూచన

తెలంగాణ రాష్ట్ర డీజీపీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండించింది. డీజీపీ శివధర్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సంఘం పేర్కొంది. గతంలో ఎన్నడూ లేనంత అప్రమత్తతతో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని తెలిపింది. రాష్ట్ర పోలీసు విభాగం చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేసింది. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తోందని సంఘం పేర్కొంది.కేటీఆర్ ప్రస్తావించిన అన్ని ఘటనల్లో చట్ట ప్రకారం, నిష్పక్షపాతంగానే కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారుల సంఘం తెలిపింది. డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకుని, పత్రికా ముఖంగా క్షమాపణ కోరాలని డిమాండ్ చేసింది. సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేస్తున్నట్లు పేర్కొంది.పోలీసు శాఖకు పింక్, రెడ్ బుక్ అంటూ ఏమీ లేవని, తమకు ఉన్నదల్లా పోలీసు బుక్ మాత్రమేనని, చట్ట ప్రకారం నడుచుకోవడమే తమ విధి అని డీజీపీ శివధర్ రెడ్డి ఇటీవల అన్నారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ, కేటీఆర్ ఉపయోగించిన భాషపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

*వెలిగొండ ప్రాజెక్ట్ ను 2026 నాటికి పూర్తి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం*…రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు…ప్రకాశం జిల్లా దోర్నాల మండలం.. 👉వెలిగొండ ప్రాజెక్ట్ ను 2026 నాటికి పూర్తి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని అందుకు అనుగుణంగా పనులను యుద్దప్రాతిపదికన చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే రెండవ పర్యాయం బుధవారం మంత్రి వెలిగొండ ప్రాజెక్ట్ ను, గండి పడిన ఫీడర్ కెనాల్ ను సందర్శించారు. ఈ సందర్బంగా గండి పూడిక పనులు, డీ వాటరింగ్ పనులు పూర్తి కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేస్తున్న ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన అధికారులు,ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రకాశం జిల్లా వాసులకు తాగు,సాగు నీరు ఇవ్వాలన్న కృత నిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు. ఏజెన్సీలు, అధికారులు గత ప్రభుత్వ హయాంలో లాగా పనిచేస్తే కుదరదని స్పష్టం చేశారు. రెండ సొరంగంలో ఇంకా పని పెండింగ్ లో ఉందని దీనిని ప్రణాళికా బద్దంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఫీడర్ కెనాల్ పనుల కోసం 480 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచామని, పనులు ఈ నెలలో ప్రారంభిస్తామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం 900 కోట్ల రూపాయలు అవసరమన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తానని ఆయన తెలిపారు.

🏆 రాష్ట్ర, జాతీయస్థాయిలో సంతనూతలపాడు గురుకుల విద్యార్థుల క్రీడా ప్రతిభ వెలుగులు 🏆

69వ ఇండియన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ మరియు క్రీడా పోటీలలో అండర్–14, అండర్–17 బాలుర విభాగాల్లో మా గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల్లో ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా A.P.R.E.I. Societyకి గర్వకారణంగా నిలిచిందిఈ పోటీలలో గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, అనేక విభాగాల్లో విజయాలను సాధించారు.

👉 రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల్లో ఎంపికైన ముఖ్య విద్యార్థులు:• వి. అనిల్ (10వ తరగతి) – వాలీబాల్ (State Level Selection) • ఎం. గోపిచంద్ (9వ తరగతి) – షాట్‌పుట్ (National Level Selection)• డి. వెంకట శివ (10వ తరగతి) – 100 మీటర్ల, 200 మీటర్ల రన్నింగ్ & కబడ్డీ • వి. దివేష్ (10వ తరగతి) – 800 మీటర్ల రన్నింగ్ ..• జి. లోకేష్ (10వ తరగతి) – 3 కిమీ రన్నింగ్….• ఎస్.బి. రవి (10వ తరగతి) – డిస్క్ త్రో, షాట్‌పుట్… • ఎం. రోహిత్ (10వ తరగతి) – షటిల్ ….• ఎస్. వినయ్ (10వ తరగతి) – హై జంప్… • కె. హేమంత్ (10వ తరగతి) – హై జంప్… • వై. దేవేంద్ర (10వ తరగతి) – లాంగ్ జంప్, జావెలిన్ త్రో..   ఈ సందర్భంలో ప్రిన్సిపాల్  కోడెల అనంతయ్య  మాట్లాడుతూ “విద్యతో పాటు క్రీడల్లో కూడా మా గురుకుల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చూపడం ఎంతో గర్వకారణం. ఇది మా గురుకుల పాఠశాల ప్రత్యేకత. ఈ విజయాలు విద్యార్థుల కృషి, PETల నిబద్ధత, ఉపాధ్యాయుల మార్గదర్శకత, మరియు APREI Society అందిస్తున్న సహకారం ఫలితం. విద్యార్థులు ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో PET sri D Issac మరియు ఉపాధ్యాయ బృందం సమన్వయంతో ముందుండి సహకరించారు.పాఠశాల తరఫున విజేత విద్యార్థులకు  అభినందనలు తెలిపారు.

👉 కాకినాడ జిల్లా 213 కేజీల గంజాయి.. ♦విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న‌ ఇద్దరు వ్య‌క్తులు… జగ్గంపేట మం. రామవరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 213 కేజీల గంజాయి గుర్తింపు ..ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మొహమ్మద్ షాహిద్, రోహిత్ శర్మ లను అరెస్ట్ చేసిన పోలీసులు  ..రూ. 16.70 లక్షలు విలువైన గంజాయి ఒక సెల్ ఫోన్, గంజాయి రవాణాకు వినియోగించిన వ్యాన్ సీజ్

👉గుంటూరులో వైసీపీ ప్రజాపోరులో ఉద్రిక్తత..ర్యాలీకి బయల్దేరిన అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు.. అనుమతి లేదంటూ కంకరగుంట ఫ్లైఓవర్ వద్ద అడ్డ‌గింత‌. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి ..అంబ‌టి రాంబాబు – పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం

*ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు ..


*వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా
*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా కొనకనమిట్ల మండలం గోట్లగట్టు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు  పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం*
*ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.*

👉హై అలర్ట్ నేపథ్యంలో ఆర్‌టీసీ బస్టాండ్‌లలో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు*

ఒంగోలు.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించబడింది. జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ అధికారులు అన్ని ముఖ్య ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, జిల్లా బాంబ్ డిస్పోజల్ టీమ్, జీఆర్‌పీ మరియు ఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి ఒంగోలు ఆర్‌టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.పార్సిల్ ఆఫీసులు, లగేజ్ కౌంటర్లు, మరియు రెండు చక్రాల పార్కింగ్ ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలను పరిశీలించారు.బస్టాండ్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.“ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజల సహకారంతోనే నేరాలను నిరోధించవచ్చు” అని తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!