👉 ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి వీడే నట..!… 👉పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డి అరెస్ట్…👉జూబ్లీహిల్స్: ప్రచారం ఫుల్.. పోలింగ్ నిల్..!… 👉కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు..👉 బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థుల ఆందోళన.. 👉చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతల ర్యాలీ.. 👉కృష్ణా జిల్లా పెడనలో ముగ్గురు బాలికలు మిస్సింగ్..మెడికల్ కాలేజీ ల ప్రవేటీకరణ వ్యతిరేకంగా దర్శి లో జరుగు ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ…

👉 ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి వీడే నట..!

ఫరీదాబాద్ ఉగ్రమూలాల కేసులో ప్రధాన సూత్రధారి ఇటీవల జమ్మూలో అరెస్టైన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మదేనని తేలింది. జైషే మహ్మద్ నుంచి ప్రేరణ పొందిన అతడు ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేశాడు. వారిని పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా తరచూ జైషే వీడియోలు చూపించాడు. ఢిల్లీ పేలుడులో అనుమానితుడు డా.ఉమర్, ఇప్పటికే అరెస్టైన డా.ముజమ్మిల్, డా.షాహిన్ ఇతడి కంట్రోల్లోనే ఉన్నట్లు సమాచారం.

👉పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డి అరెస్ట్… హైద్రాబాద్ లోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డిని SFIO అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్లో ప్రమోటర్లకు తెలియకుండా నకిలీ డాక్యుమెంట్ల, సంతకాలతో సంస్థకు చెందిన 100 ఎకరాల భూమి (విలువ రూ.300 కోట్లు)ను విక్రయించినట్లు ఆరోపించారు. కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్పై చర్య తీసుకున్న అధికారులు రమేశ్ను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.

👉జూబ్లీహిల్స్: ప్రచారం ఫుల్.. పోలింగ్ నిల్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు వారాల పాటు ప్రధాన పార్టీలు ఫుల్ జోష్ గా ప్రచారం చేశాయి. సీఎం సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల కీలక నేతల రోడ్ షోలు, ర్యాలీలు, డైలాగ్లు,మాటల తూటాలు, ఆరోపణలతో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ వేడెక్కాయి. అయితే ఇంత చేసినా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో అటు పార్టీలతోపాటు ఇటు ఎన్నికల అధికారులు వెనకబడ్డారు. 48.49% పోలింగ్ జరిగింది.

👉కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు..వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వెళ్లిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని బోనస్ ఏది అంటూ నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు.. వానకాలం కొనుగోళ్లు ప్రారంభమైన యాసంగి బోనస్ పడలేదని నిలదీత

👉 బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థుల ఆందోళన.. ఏపీ మోడల్ కాలేజీ ఎదుట బైఠాయించిన విద్యార్థులు.. అధిక ఫీజులు డిమాండ్ చేస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణ.. ఫీజులు కట్టకపోతే వెనక్కి పంపుతున్నారంటున్న విద్యార్థులు.

👉కృష్ణా జిల్లా పెడనలో ముగ్గురు బాలికలు మిస్సింగ్.. పెడనలోని ఉర్దూ మదర్‌సా నుంచి బాలికలు అదృశ్యం.. బాలికల మిస్సింగ్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు బాలికలు కాకినాడలో ఉన్నట్లు గుర్తింపు

👉చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతల ర్యాలీ..  మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన.. ర్యాలీకి అనుమతి లేదంటూ..వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు..ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ భరత్.

👉దర్శి పార్టీ ఆఫీస్ లో 12 వ తేదిన జరుగు మెడికల్ కాలేజీ ల ప్రవేటీకరణ వ్యతిరేకంగా దర్శి లో జరుగు ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న దర్శి MLA ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ

*కొండపి మండలం నెన్నూరుపాడులో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటు శుభ పరిణామం*

*యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు..*మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*ప్రకాశం జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడులో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటు శుభ పరిణామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…..రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కనిగిరి పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఎం.ఎస్. ఎం. ఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడులో రూ.7 కోట్ల పెట్టుబడులతో ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎం.ఎస్.ఈ పార్క్ ద్వారా కొండపి నియోజకవర్గంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ఎం. ఎస్. ఎం. ఈ పార్క్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి కొండపి నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

👉జూట్ బ్యాగుల శిక్షణా తరగతులు ప్రారంభం*..ప్రకాశం జిల్లా పొదిలి..ఎంఎస్ఎంఇ -సిఐటీడీ వారి ఆధ్వర్యంలో 20 రోజుల ఇఎస్ డిపి -ఆర్ ఎ ఎం పి శిక్షణా కార్యక్రమం స్టెచ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్,విశ్వనాధపురం, పొదిలి నందు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాల నుండి 50సంవత్సరాల వయస్సు గల 60 మంది యువతి యువకులకు జ్యూట్ బ్యాగ్ తయారీ పై శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యూట్ బ్యాగ్ తయారీ పై శిక్షణతో పాటు వ్యాపార అభివృద్ధి మరియు వ్యవస్థాపన పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమం ఎం ఎస్ ఎం ఇ -సిఐటీడీ ప్రిన్సిపల్ డైరెక్టర్ విజయ్ క్రిష్ణ కాంత్ ఆదేశాలతో శిక్షణ నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి సీఐటీడీ కన్సల్టెంట్ సయ్యద్ హంజాల్ హుస్సేన్ ఏపీజీబీ ఫీల్డ్ అసిస్టెంట్ అర్షద్, మాస్టర్ ట్రైనర్ రవీంద్ర మరియు స్టెచ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ జి సుమలత హాజరయ్యారు.శిక్షణ తీసుకోవడానికి మహిళలు ఆసక్తి గా హాజరయ్యారు.
👉 *వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యేలు అన్నా,జంకే*

*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలం నాగులవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు గారు మరియు మార్కాపురం మాజి ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమంఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.*
👉 మేము ఏసీబీ డిపార్ట్మెంట్ అని కాల్స్ వస్తున్నాయా..? ఏపీ ఉద్యోగులకు సర్కార్ క్లారిటీ..!*

ఏపీలో తాజాగా అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పనులు చేయకుండా ప్రజల్ని ఆఫీసులకు తిప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. పలు చోట్ల ఆపరేషన్స్ నిర్వహిస్తూ రెడ్ హ్యండెడ్ గా అవినీతి చేపల్ని, తిమింగలాల్ని పట్టుకుంటోంది. అదే సమయంలో ఉద్యోగులకు నేరుగా ఏసీబీ నుంచి కాల్స్ వస్తున్నాయి.ఏసీబీ అధికారుల పేరుతో రాష్ట్రంలో పలువురు ఉద్యోగులకు కాల్స్ రావడం, మీరు అవినీతి చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి, డబ్బులివ్వకపోతే మీపై రైడ్స్ చేసి కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పలు చోట్ల ఇలా కాల్స్ రాగానే అధికారులు బెంబేలెత్తిపోయి వారికి డబ్బులు సమర్పించుకున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నిన్న స్పందించింది.ఉద్యోగులకు తమ అధికారుల నుంచి కాల్స్ చేస్తున్నట్లు, డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ నేరుగా స్పందించింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలకు, అధికారులకు ఫోన్ చేసి, తాము ఏసీబీ అధికారులుగా నటిస్తూ, ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, తమపై అనేక ఫిర్యాదులు వచ్చాయని బెదిరిస్తున్నట్లు ఏసీబీ ప్రధాన కార్యాలయం దృష్టికి వచ్చిందని తెలిపింది. ఏసీబీ దాడి జరుగుతుందని, దాడిని ఆపడానికి, డబ్బు డిమాండ్ చేస్తున్నారని, దానిని ఒక నిర్దిష్ట మొబైల్ నంబర్‌కు పంపాలని లేదా దానిని తీసుకోవడానికి వచ్చే వ్యక్తికి నగదుగా ఇవ్వాలని వారు కోరుతున్నట్లు తెలిపిందిమరికొన్ని సందర్భాల్లో, ఈ వ్యక్తులు తమపై ఏసీబీ కేసు నమోదు అయిందని, అరెస్టును నివారించడానికి, వారు అడిగిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొంది. అవినీతి నిరోధక బ్యూరోలోని ఏ అధికారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఫోన్ కాల్స్ చేయరని లేదా డబ్బు డిమాండ్ చేయరని ఏసీబీ ప్రధాన కార్యాలయం తెలిపింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు లేదా మోసపూరిత కాల్స్ వస్తే, వారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా ఏసీబీ టోల్-ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది
👉ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. మహిళ మృతి…అన్నమయ్యజిల్లా…మదనపల్లి కేంద్రంగా కిడ్నీ రాకెట్.*

యమున అనే ఓ మహిళను వైజాగ్ నుండి తిరుపతి మీదుగా మదనపల్లి తీసుకొచ్చిన బ్రోకర్లు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్.యమున అనే మహిళ మిస్సింగ్ కేసు పై విచారణ చేపట్టడంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు.యమున భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్ ను ట్రాక్ చేసిన పోలీసులు. గ్లోబల్ హాస్పిటల్ లో యమున కిడ్నీలను తొలగించిన డాక్టర్లు.తీవ్ర అనారోగ్యంతో యమున మృతి.మృతి చెందిన యమున మృతదేహాన్ని కూడా చూపకపోవడంతో డయల్ 112 కు ఫిర్యాదు చేసిన భర్త. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
👉షోషల్ మీడియా లలో చూసి… హింసాత్మక ఘటనలు జరిగిన న్యూస్ చదివాము..చూసాము..ఇప్పుడు ..నయా దొంగతనం…*ఈ మధ్య హింసాత్మక ఘటనలు అన్ని షోషల్ మీడియా వేదిక అయ్యింది….మొన్న భార్య ని ముక్కలు ముక్కలు గా నరికిన వైనం.. నిన్న అత్త ను కోడలు దొంగా- పోలీస్ అనే ఆట తో పెట్రోలు పోసి చంపిన వైనం….ఇప్పుడు ..
దొంగలు.. నయా టెక్నాలజీని వాడి ఇంట్లో బంగారం డబ్బు దొంగ తనం చేసిన వైనం….ప్రతి కేసు కూడా పోలీసులకు కొత్త ఆలోచ నలు..సరికొత్త దర్యాప్తు కి ప్రేరణ కలుగుతుంది అనే మాటకు తిరుగులేదు…ఏది ఎలా ఉన్నా వారి కోణం లో ప్రతి కేసును చాక చక్యం గా చేదిస్తున్నారు పోలీసులు

గుంటూరు జిల్లా..కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో మంగళవారం అర్థరాత్రి దుండగులు నూతన పద్ధతిలో చోరీకి పాల్పడ్డారు.సోషల్ మీడియాలో చూసిన వీడియోల ప్రేరణతో, సిరంజిలో పెట్రోల్ నింపి ఇంటి తాళంలోకి పంపించి మంటపెట్టి తాళం విరగ్గొట్టి లోపలికి ప్రవేశించినట్లు స్థానికులు భావిస్తున్నారు.

ఇంట్లో ఉన్న బంగారం, నగదు దోచుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
👉అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్యనారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.*
పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్‌బుక్ ఇవ్వడానికి రూ.20,000/-ల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.లంచం డిమాండ్ చేసిన అధికారి పై ఫిర్యాదు అందుకున్న విశాఖపట్నం ఎ.సి.బి. అధికారులు కేసు నమోదు చేసి, ఈ రోజు లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన సూర్యనారాయణను రేపు విశాఖపట్నంలోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.

*ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా అవినీతి జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే ఎ.సి.బి. టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది.
👉రహదారి ప్రమాదాల నివారణ కోసం “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం.. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ వి హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి రోడ్డు ప్రమాదాలను నివారించే ప్రయత్నంలో “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై రాత్రి 1 గంట నుండి ఉదయం 4:30 గంటల వరకు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.
హైవేలపై వాహనాలను ఆపి, డ్రైవర్లను ముఖం కడుక్కోవాలని, అవసరమైతే టీ తాగి మళ్లీ ప్రయాణం కొనసాగించాలని పోలీసులు సూచించారు. దీని ద్వారా డ్రైవర్లకు నిద్ర మత్తు తగ్గి, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.డ్రైవింగ్ చేసే సమయంలో తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ, జాగ్రత్తగా నడపాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, అలసటగా ఉన్నప్పుడు వాహనం ఆపి విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు సూచించారు.ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు కొనసాగుతున్నాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!