👉పెట్టుబడులకు అనువుగా 175 నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులు…*ఎంఎస్ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం… *సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల ఎంఓయూలు: సీఎం చంద్రబాబు.. 👉మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం*.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు…👉నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్‌*… కంభంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

👉పెట్టుబడులకు అనువుగా 175 నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులు…*ఎంఎస్ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం… *సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల ఎంఓయూలు…*కేంద్రం ఏ పాలసీ తెచ్చినా మొదట అమలు చేసేది ఏపీనే*

*2026 నాటికి వెలుగొండ పూర్తిచేసి ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తాం.. *కనిగిరి ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..*17 జిల్లాల్లో వర్చువల్‌గా పారిశ్రామిక పార్కుల ప్రారంభించిన సీఎం*

ప్రకాశం జిల్లా …పి సి పల్లి….నవంబర్ 11 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

*సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల ఎంఓయూలు*

పరిశ్రమలకు అనువైన వాతావరణం, పాలసీలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం తగిన చేయూత అందిస్తుందని సీఎం అన్నారు. ఈ అంశంపై మాట్లాడుతూ “నేడు 99 కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. వీటి ద్వారా రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 2 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. జనవరికి మరో 70 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తాం.175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి ప్రతీ కుటుంబంలోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారుచేస్తాం. భవిష్యత్ అంతా టెక్నాలజీదే. క్వాంటం కంప్యూటింగ్ జనవరికి అమరావతిలో ప్రారంభం అవుతుంది. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లను మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించేలా పరిస్థితి మారుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిని ఇంటి నుంచే తయారు చేసుకునేలా ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ బయో ఫ్యూయెల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం. డ్రోన్ సిటీని ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్నాం. సివిలియన్, డిఫెన్స్ అప్లికేషన్ల కోసం డ్రోన్లను ఇక్కడే తయారు చేస్తాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా త్వరలోనే ఏర్పాటు అవుతోంది. 14,15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఈ ఒప్పందాల ద్వారా 8 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

*గత ప్రభుత్వంలో పరిశ్రమలు మూతపడ్డాయి… గత పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని .. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశంపై సీఎం మాట్లాడుతూ”చెత్త నుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానం. కొత్తగా ఏర్పాటు అవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు దీనిని అందిపుచ్చుకోవటం సంతోషదాయకం. దీనిద్వారా రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారులు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వటం కాదు… పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్పి ఇప్పుడు దానిని నిరూపిస్తున్నాం. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో 17 నెలల క్రితం పాలనా పగ్గాలు చేపట్టాం. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నాం’ అని సీఎం వివరించారు. గత పాలకులు పీపీఏలు రద్దు చేశారు. కరెంటు వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించారు. ఆ నిధులు వృధా కాకుండా ఉండి ఉంటే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టుకునే వాళ్లం. అన్ని విధాలుగా గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ఛలోఛలో అని పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే… ఇప్పుడు భలేభలే అంటూ రాష్ట్రానికి వస్తున్నారు. విశాఖకు లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ వస్తోంది. ఇదీ కూటమి ప్రభుత్వంపై కంపెనీలకు ఉన్న విశ్వాసం. కేంద్రం ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని మొదట అమలు చేస్తోంది ఏపీనే. ప్రధాని మోదీ ఏది మొదలు పెట్టినా ఏపీలో తక్షణం అమలు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా మంత్రి లోకేష్ పనిచేస్తూ సాధించి తీసుకువస్తున్నారు. అని సీఎం స్పష్టం చేశారు.

*సంపద సృష్టిలో ప్రజల భాగస్వామ్యం… రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆలోచనలే ఇప్పుడు ఆస్తి, రైతులు ఎఫ్‌పీఓలు పెట్టుకుని పారిశ్రామికవేత్తలుగా మారండి. హార్టికల్చర్, ఆక్వా కల్చర్, సేవల రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుకు వెళ్లాలి. ఎంఎస్ఎంఈల ద్వారానే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునేలా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు తిరుపతి సహా మరికొన్ని ప్రాంతాలతో మరో రీజియన్‌గా అభివృద్ధి చేస్తాం. పోర్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేస్తాం. 15 శాతం వృద్ధి రేటు సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం గణనీయంగా పెంచేలా పనిచేస్తున్నాం. రామాయపట్నం పోర్టుకు దగ్గరే బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో సంపద సృష్టింస్తాం.. అందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

*వచ్చే ఏడాది వెలుగొండ ద్వారా నీళ్లు….రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టా. ఈ ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు విస్తరించాల్సి ఉంది. 2026లో వెలిగొండ పూర్తి చేసి నీళ్లిస్తాం. కనిగిరి ఇక కనకపట్నం అవుతుంది. కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కరవు అధికంగా ఉంటుంది. ఈ నియోజకవర్గాలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చాం.. దాన్ని త్వరలోనే నెరవేరుస్తాం. 2019లో అధికారంలోకి రాకపోవడం వల్ల ప్రాజెక్టు ఆలస్యమై పోయింది. శ్రీశైలం నుంచే కాదు గోదావరి నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తెస్తాం. వైకుంఠపాళి వల్లే ప్రజల కష్టాలు తీరకుండా అలాగే ఉండిపోయాయి. భవిష్యత్తులో ఇది జరక్కూడదు’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

👉మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం*… తెలంగాణ: రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకొని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది.

డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

నల్గొండలోని చిట్యాల వద్ద బస్సు దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఇటీవల కర్నూలులో వి.కావేరి బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్య మూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.
👉దెయ్యాలంటూ.. తల్లి, తమ్ముడిని చంపేశాడు ఓ యువకుడు..
ఆంధ్ర: ప.గో. జిల్లా భీమవరం సుంకర పద్దయ్య
వీధిలో దారుణం జరిగింది. తల్లి మహాలక్ష్మి(60), తమ్ముడు రవితేజ(33)లను శ్రీనివాస్ (37) హత్య చేశాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చాకుతో దారుణంగా పొడిచి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మానసిక పరిస్థితి సరిగా లేని శ్రీనివాస్ వారిని గంటల పాటు పొడిచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకంటే తమ్ముడికి అమ్మ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదని నిందితుడు విచారణలో చెప్పాడు.
👉నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్‌*… ఆంధ్ర… నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చింతారెడ్డి పాలెం సర్కిల్ వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారులపై దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

👉ప్రకాశం జిల్లా కంభం లో మన దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సయ్యద్ అబ్దుల్ ఖాసిం మొగల్ రసూల్ బేగ్, అప్సర్ పన్నీరు పాండురంగారావు, లయన్ మహబూబ్ బెగ్ గౌస్ ఖాన్ది తరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!