👉🏻 వందేమాతరం పాడము.. వ్యతిరేకించిన ముస్లిం ఎమ్మెల్యే… దేశభక్తి గీతమైన ‘వందేమాతరం’ మరోసారి రాజకీయ, మతపరమైన వివాదానికి కేంద్రబిందువైంది. దేశభక్తి గీతమైన ‘వందేమాతరం’ మరోసారి రాజకీయ, మతపరమైన వివాదానికి కేంద్రబిందువైంది. ముంబైలో సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే అబూ ఆసిం ఆజ్మీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ గీతం పాడలేమని, ఇస్లాం మత విశ్వాసాలకు అది విరుద్ధమని ఆయన స్పష్టం చేయడంతో బీజేపీ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది…. * అసలు వివాదం ఏమిటి? ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబై బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అమిత్ సాటమ్ ఒక గాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అబూ ఆజ్మీని బహిరంగంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి ప్రతిస్పందనగా ఆజ్మీ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలం. ఆజ్మీ మాట్లాడుతూ “ముస్లింలు ఎవరూ వందేమాతరం పాడలేరు, ఎవరూ నన్ను బలవంతం చేయలేరు. ఇస్లాంలో భూమిని, సూర్యుడిని లేదా ఏ ఇతర దైవ రూపాన్ని పూజించడం ఉండదు. అల్లాహ్ తప్ప మరెవరినీ ఆరాధించం” అని తన వైఖరిని గట్టిగా వినిపించారు. * ఆజ్మీ న్యాయపరమైన వాదన ఆజ్మీ తన ప్రకటనకు న్యాయపరమైన కోణాన్ని జోడించారు. జాతీయ గీతం ‘జనగణమన’ వలె ‘వందేమాతరం’కు చట్టపరమైన హోదా లేదని, ఈ గీతాన్ని పాడాలని ఎవరినీ బలవంతం చేయలేరని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. బలవంతం చేయడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు, మత స్వాతంత్ర్యానికి విరుద్ధమని ఆయన నొక్కి చెప్పారు. బీజేపీ నేతల తీవ్ర ప్రతిస్పందన అబూ ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా, బీజేపీ నగర అధ్యక్షుడు అమిత్ సాటమ్‌లతో సహా పలువురు నేతలు ఆజ్మీ ఇంటి ఎదుటే వేదిక ఏర్పాటు చేసి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా “దేశాన్ని మించేది ఏ మతం కాదు” అంటూ దేశభక్తి నినాదాలు చేశారు.. రాముడి పేరుతో మోసగిస్తూన్న పెద్దలు ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని లౌకిక వాదులు ఆరోపిస్తున్నారు.. ఈ చర్య మతం వర్సెస్ దేశభక్తి అనే పాత వివాదాన్ని మరింత రాజేసింది. * మతం వర్సెస్ దేశభక్తి: పాత చర్చ మళ్లీ ‘వందేమాతరం’పై చర్చలు కొత్తేమీ కాదు. ఈ గీతంలోని “మాతృభూమిని దేవతగా పూజించడం” అనే భావన తమ ఏకదైవారాధన సిద్ధాంతానికి విరుద్ధమని గతంలో కూడా పలు మతపరమైన వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముస్లింలు ముహమ్మద్ ప్రవక్త సమాధినీ ,ముస్లిం మత గురువు ల సమాధులను కూడ పూజించరు..అయితే, జాతీయవాదులు మాత్రం ఈ గీతాన్ని భారతీయ ఏకత్వానికి, జాతీయ స్ఫూర్తికి ప్రతీకగా భావిస్తారు. * చర్చనీయాంశంగా మారిన భావోద్వేగాలు దేశభక్తి గీతం మరోసారి రాజకీయ, మతపరమైన ఘర్షణలకు దారితీయడం విచారకరం.* ఇది కేవలం హిందూ,ముస్లిం మతస్తుల మనోభావాలను రెచ్చ గొట్టి పబ్బం గడువుకునే దురాలోచన గా ప్రజా తంత్ర వాదులు ఆరోపిస్తున్నారు*. ఒకవైపు మత స్వేచ్ఛను, వ్యక్తిగత నమ్మకాలను గౌరవించాలనే వాదన బలంగా ఉంది. మరోవైపు, దేశభక్తిని కేవలం రాజకీయ ఆయుధంగా మార్చకుండా, అందరినీ ఏకతాటిపైకి తెచ్చే సాధనంగా చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తిని చాటుకోవడానికి ఒక పౌరుడికి తన వ్యక్తిగత విశ్వాసాలు అడ్డుగా ఉండకూడదనే కోణంలో ఈ వివాదం కొనసాగుతోంది.
👉55 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ.107 కోట్లు రికవరీ*
హైదరాబాద్, నవంబర్ 7: సైబర్ నేరగాళ్ల వలలో అనేక మంది చిక్కుతున్నారు. మాయ మాటలతో అమాయకులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. రోజుకో రకంగా కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తూ నగదును దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్‌లు, మెసేజ్ లింక్‌ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువవడంతో పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్‌లో సైబర్ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదు అయ్యాయి. వీటిని ఛాలెంజ్‌గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. వివిధ రాష్ట్రాల్లో గాలించి మరీ సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.సైబర్ నేరాలకు పాల్పడుతున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 107 కోట్లను రికవరీ చేశారు. అక్టోబర్ నెలలో సైబర్ నేరాలకు సంబంధించి 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి నగదు కోల్పోయిన బాధితులకు వారి సొమ్మును తిరిగి అప్పజెప్పారు. దాదాపు 66 లక్షల రూపాయలను బాధితులకు అందజేశారు.అరెస్ట్ అయిన 55 నిందితులపై దేశవ్యాప్తంగా 136 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు 8 రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారని సైబర్ పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..
👉విద్యార్థులపై దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి*
ఆంధ్ర.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం దగ్గర హైవేపై కారు బీభత్సం సృష్టించింది. బస్టాప్‌లో వేచివున్న విద్యార్థులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఫ్రంట్ టైరు పేలడంతో కారు అదుపుతప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లింది.
👉గుంటూరు లో ఒక ఎమ్మెల్యే ఇంట్లో చోరీపై కేసు నమోదు*ఆంధ్ర.. గుంటూరు..నగరంపాలెం పోలీసులు శుక్రవారం ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన బంగారు వస్తువుల చోరీపై కేసు నమోదు చేశారు.
కన్నావారితోటలోని ఎమ్మెల్యే ఇంట్లో కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో, నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. ఆమె దొంగిలించిన బంగారు వస్తువులను అప్పగించింది. అయితే, ఫిర్యాదులో మరికొన్ని బంగారు నగలు కూడా చోరీకి గురైనట్లు పేర్కొనడంతో, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
👉నల్గొండ జిల్లా చండూరులో పోలీసుల పై దాడి చేసిన మందు బాబులు…బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులు… మందలించిన పోలీసులపై మద్యం మత్తులో దాడి చేయగా దాడిలో పోలీసులకు గాయాలు.. బాధిత పోలీసుల ఫిర్యాదుతో మందుబాబుల పై కేసు నమోదు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
👉లెస్బియన్ ఎఫైర్(ఒక మహిళ మరో మహిళ తో వివాహేత్తర సంబంధం)తో….తన 6 నెలల బిడ్డను చంపిన తల్లి? తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహిత మరో మహిళతో ఎఫైర్ పెట్టుకుని…తమ ప్రైవసీకి అడ్డుగా ఉందని భావించి తన 6 నెలల బిడ్డను చంపేసింది..బిడ్డ మరణించినప్పుడు అనారోగ్యం అనుకుని పోస్టుమార్టం లేకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భర్త, తన భార్య ఫోన్‌లో లెస్బియన్ చాటింగ్‌ను గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో శుక్రవారం పోలీసులు బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం.
👉మొబైల్ వ్యసనం.. 2050 నాటికి మనుషులు ‘సామ్’లా మారతారా?… ప్రస్తుతం ప్రపంచాన్ని కమ్మేస్తున్న మొబైల్ ఫోన్ వ్యసనం …
భవిష్యత్తులో మానవ ఆరోగ్యం, శారీరక ఆకృతిపై తీవ్రమైన ప్రభావం చూపబోతోందని ఫ్రెంచ్ యాప్ WeWard నిర్వహించిన ఒక సంచలన పరిశోధన హెచ్చరించింది. ఈ వ్యసనం కొనసాగితే, 2050 నాటికి మనుషులు తమ సహజమైన రూపాలను కోల్పోతారని…, వంగిపోయిన వెన్నెముక, తీవ్రమైన జుట్టు రాలడం, డార్క్ సర్కిల్స్, ముందే వృద్ధాప్యం, ఊబకాయం వంటి మార్పులతో ‘సామ్’ అనే ఊహాత్మక మోడల్ లాగా మారతారని అధ్యయనం వెల్లడించింది.
👉ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తకెళ్ళపాడు గ్రామంలో వింత.. ముత్యాల రజిత రమేశ్ మిరపతోట లో “మిరపచెట్టు కు వంకాయలు, టమాటాలు” కాసినవి.. గ్రామం లోని ప్రజలు చూట్టు ప్రక్కల గ్రామాల వారు తండోప తండాలు గా వచ్చి వారు ఈ వింత విషయాన్ని తెలుసుకొని వచ్చి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు*
👉కంభం పట్టణంలో తెలుగుదేశం నాయకులు బిజ్జాల కిషోర్ కుమారుడు చి. నాగ వెంకట సాయి ప్రణీత్ మరియు వెంకట రంగ పూర్ణ శ్రీ ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు ముఖ్య అతిధులుగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గోన్నారు..

