👉 బీహార్ పోరు: అసలు క‌థ నేటి నుంచే..!🤟..👉ఇన్ చార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్షా మండలి సమావేశం(డిఆర్సీ)👉ప్రకాశం జిల్లాలో ఘనంగా వందేమాతరం గీతం 150 ఏళ్లు వేడుకలు … ఒంగోలులో “స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ”విజన్..👉రేపు పాఠశాలకు సెలవు లేదు: డిఈవో*👉కిమ్స్ హాస్పిటల్ను సీజ్ చేసి యజమాన్యం పై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆవాజ్ కమిటీ డిమాండ్*..

👉బీహార్ పోరు: అసలు క‌థ నేటి నుంచే..!🤟🤘🤘

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఘ‌ట్టంలో అస‌లు స్టోరీ శుక్ర‌వారం నుంచే ప్రారంభం కానుందా?.. అంటే ఔననే అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు. వాస్త‌వానికి రెండు ద‌శ‌ల్లో ఇక్క‌డ 243 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీనిలో తొలి భాగం 121 స్థానాల‌కు గురువారం ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసింది. రెండో భాగానికి ఈ నెల 11న ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. దీనిలోనే అస‌లు క‌థంతా ఉంద‌ని పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి…   అన్ని పార్టీల‌కు కీల‌క‌మైన పూర్వాంచ‌ల్ ప్రాంతంలో(4 జిల్లాలు) 57 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిని సాధ్య‌మైనం త వ‌ర‌కు త‌మ‌వైపు తిప్పుకోగ‌లిగితే.. అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన మేజిక్ ఫిగ‌ర్ సొంతం అవుతుంద‌న్న వాద‌న ఉంది. రెండో ద‌శ‌లో 122 స్థానాల‌కు ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ స్తానాల్లోని మెజారిటీ సెగ్మెంట్లు.. మైనారిటీ స‌హా యాదవ సామాజిక వ‌ర్గం డామినేష‌న్‌లో ఉన్నాయ‌ని రాజ‌కీయ నేత‌లు చెబుతున్నారు. దీనికితోడు.. భిన్న‌మైన పార్టీల ప్ర‌బావం కూడా ఇక్క‌డే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌కు తోడు.. తొలిదశ ఎన్నిక‌ల పోలింగ్‌లో 67 శాతం ఓటింగ్ న‌మోదు కావ‌డంతో అధికార పార్టీ బీజేపీ నేతృత్వంలోని జేడీయూల కూట‌మికి ఒకింత ఇబ్బందిగానే ఉంద‌న్న చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌జ‌లు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌ల‌కు త‌ర‌లి రావ‌డం.. ఓటు వేయ‌డం వంటివి.. ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇచ్చేవిగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మిగిలిన రెండో ద‌శ‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి.

*మూడు రోజులే గ‌డువు!.. తుదిద‌శ ఎన్నిక‌ల పోలింగ్ కు మూడు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నెల 11న రెండో ద‌శ ఎన్నిక ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అంటే.. 9వ తేదీ సాయంత్రమే ప్ర‌చారం ఆపేయాలి. సో.. దీనిని గ‌మ‌నించిన పార్టీలు.. ఈ మూడు రోజుల ప్ర‌చారాన్ని మరింత ముమ్మ‌రం చేస్తున్నారు. బీజేపీ కూట‌మి త‌ర‌ఫున ప్ర‌ధాని మోడీ.. ఈ మూడు రోజులు ప్ర‌చారంలోపాల్గొంటారు. ఇక‌, కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక‌, రాహుల్ గాంధీలు.. బీహార్‌లోనే తిష్ఠ‌వేశారు. మొత్తంగా.. ఈ మూడు రోజుల్లో చేసే ప్ర‌చారం.. పార్టీల‌కు కీల‌కంగా మార‌నుంది. దీంతో ఇప్ప‌టి నుంచే అస‌లు క‌థ స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు.

👉ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో తాగునీటి వనరులు, జాతీయ రహదారులకు భారీగా నష్టం వాటిల్లిందని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఇన్ చార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్షా మండలి సమావేశం(డిఆర్సీ) నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, సమావేశంలో ప్రధానంగా తుఫాను వల్ల నీటి వనరులకు జరిగిన నష్టం తీసుకున్న చర్యల గురించి చర్చించడం జరిగిందన్నారు అలాగే,జిల్లా పరిధిలో జాతీయ రహదారులు కూడా బాగా దెబ్బతిన్నాయని వీటి గురించి చర్చించామన్నారు. ప్రభుత్వ వైద్య శాల గురించి కూడా చర్చించామని తెలిపారు. సమావేశంలో అటవీ భూముల అంశం కూడా చర్చించామని, అభివృద్ది పనులకు అటవీ భూములు అవసరమైతే తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మంత్రి వర్గ ఉపసంఘం చర్చిస్తోందని తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్ రైతుల పరామర్శకు వెళ్లి ప్రభుత్వంపై నిందలువేస్తున్నారన్నారు.

👉 ఒంగోలు కలక్టర్ రేట్ వద్ద వందేమాతరం” గీతాన్ని రచించి 150 సం.లు పూర్తి అయిన సందర్భంగా వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమం పాల్గొన్న ఇంచార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి , జిల్లా కలెక్టర్ రాజ బాబు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య , జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత మరియు పలువురు అధికారులు.

👉ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డు నందు “స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ”విజిన్ లో భాగంగా ” (Green Ongole) గా చేసే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఇంచార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజ బాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, నగర మేయర్ గంగాడ సుజాత, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు మరియు స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పలువురు అధికారులు.

👉దేశభక్తి గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది జిల్లా ఎస్పీ ..*ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో వందే మాతరం గీతానికి 150 ఏళ్లు వేడుకను ఘనంగా నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది:జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.. ప్రకాశం జిల్లాలోని అన్ని   మండలాలలో  వందేమాతరం గీతానికి 150 ఏళ్లు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి

ఈ సందర్భంగా, ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  హాజరై, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు.అనంతరం విద్యార్థులకు  ఎస్పీ హర్షవర్ధన్ రాజు చాకెట్లు పంపిణీ చేశారు.అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లో పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐ లు వై.నాగరాజు, యం.శ్రీనివాసరావు, టి.విజయకృష్ణ, ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, సురేష్, ఎస్సైలు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
👉రేపు పాఠశాలకు సెలవు లేదు: డిఈవో*
ప్రకాశం జిల్లాలో మొంతా తుఫాను కారణంగా గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 2 వ శనివారం రేపు అనగా 8వ తేదీన జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.2025 మార్చి మాసం వరకు ప్రతి రెండవ శనివారం పాఠశాలలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

👉కిమ్స్ హాస్పిటల్ను సీజ్ చేసి యజమాన్యం పై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: ఆవాజ్ కమిటీ డిమాండ్*

కిమ్స్ హాస్పిటల్ యజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కిమ్స్ హాస్పిటల్ ను తక్షణమే సీజ్ చేయాలని ఆవాజ్ నగర కమిటీ అధ్యక్ష ,కార్యదర్శులు పి ఇక్బాల్ హుస్సేన్ ,ఎస్ ఎం డి షరీఫ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం , పాలకుల, ఉన్నతాధికారుల చేతగాని తనం వల్లనే, ప్రైవేట్ ఆస్పత్రుల వారు ప్రజల ప్రాణాలతో చెలగటం ఆ డుతున్న రని వారు ఘాటుగా విమర్శించారు. కిమ్స్ ఆసుపత్రి యజమాన్యం పై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు (సూపర్డెంట్ ఆఫ్ పోలీస్) ఎస్ పి గారిని డిమాండ్ చేశారు. కనీసం మానవత్వం లేని ఇంత కఠినమైన హృదయం ఎలా ఉందో అని వారు ప్రశ్నించారు. చిన్నపిల్లవాడు అనే స్పృహ కోల్పోయి డబ్బే పరమావధిగా భావించి న కిమ్స్ హాస్పిటల్ ను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్ల చిన్న పిల్లవాడి నిండు ప్రాణం బలి తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ లో లక్షలకు లక్షలు ఫీజుల పేరుతో ప్రజల యొక్క రక్త, మాంసాలను బక్షించడానికి హాస్పిటల్ ల పేరుతో ఈరోజు దోపిడీ చేస్తా ఉన్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం , ఉన్నత అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ఘటనలు పునారవృతం అవుతున్నాయని వారు విమర్శించారు. పాలకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారని, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాల వారి అడుగులకు మడుగులు అధికారులు వేస్తా ఉన్నారని వారు తప్పు బట్టారు. వారిపైనిప్పులు చెరిగారు .కర్నూలు నగరంలో ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నప్పటికీ ఉన్నత అధికారులు, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని వారు భావించారు. ప్రభుత్వం, పాలకులు, అధికారులు హాస్పటల్ యజమాన్యాలతో కుమ్మక్కైనట్టు కనిపిస్తా ఉందని వారు ఆరోపించారు. తక్షణమే కిమ్స్ హాస్పిటల్ ను సీజ్ చేయాలని, ఇటువంటి సంఘటనలు పునవరావృతం కాకుండా ,రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, ఎస్పీలు తీవ్రమైన కఠినమైన చట్టాలతో శిక్షించాలని అవసరమైతే హాస్పిటల్ యజమాన్యంపై అటెం టు మర్డర్ క్రిమినల్ కేసులు బనాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమి కరించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!