👉బీహార్‌లో 65 లక్షల ఓటర్లను తొలగించారు… హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లను అదనంగా జోడించారు… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మహిళ స్వేచ్ఛగా ఆయనను ప్రశ్నించింది : ప్రియాంక గాంధీ…మీరు కుళాయి ఏర్పాటు చేయిస్తానని హామీ నెరవేర్చలేదని మహిళ నిలదీసిందని గుర్తు చేసుకున్న ప్రియాంక.. దేశ ప్రధానితో ఒక గ్రామ మహిళ అలా నిలదీయ గలిగింది …ఈరోజు అలాంటి పరిస్థితి … ప్రతి ఒక్కరు భయపడాల్సి వస్తుంది… ప్రియాంక గాంధీ
తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేవారని, ఆయనను నేరుగా ప్రశ్నించే స్వేచ్ఛ ఉండేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, తనకు పది, పన్నెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు అమేథిలో ఒక మహిళ తన తండ్రిని నిలదీసిందని గుర్తు చేసుకున్నారు…. ప్రధానమంత్రి అయ్యాక తమకు కుళాయి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని, మీరు ఇంకా దానిని అమలు చేయలేదని, కాబట్టి మీకు ఓటు వేయబోమని ఒక మహిళ నిలదీసిందని తెలిపారు. ఒక దేశ ప్రధానమంత్రితో ఒక గ్రామ మహిళ అలా మాట్లాడారని అన్నారు. రాజీవ్ గాంధీతో అలా మాట్లాడుతున్నందుకు ఆమె ఏమాత్రం భయపడలేదని అన్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు భయపడాల్సి వస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ప్రజలు హక్కుల గురించి మాట్లాడితే పోలీసులు కొట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అవసరమైతే అధికారులు మీ నోరు కూడా మూయిస్తారని, కానీ ఆ రోజుల్లో అలా లేదని పేర్కొన్నారు. మన దేశ రాజకీయాలకు మహాత్మాగాంధీ పునాది వేశారని, అందులో ప్రజలే సుప్రీం అని వెల్లడించారు.బీహార్ ఎన్నికలు ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగితే ఎన్డీయే అధికారాన్ని కోల్పోతుందని జోస్యం చెప్పారు. బీహార్‌లో 65 లక్షల ఓటర్లను తొలగించారని ఆరోపించారు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లను అదనంగా జోడించారని విమర్శించారు.
👉లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన ఆసిఫాబాద్ పౌర సరఫరాల అధికారులు*
ఆసిఫాబాద్: ఫిర్యాదుదారునికి చెందిన లారీలలో లోడ్ చేయబడిన పిడిఎస్ బియ్యాన్ని అతని గోదాం నుండి ఆసిఫాబాద్‌లోని పౌర సరఫరాల గోదాముకు రవాణా చేసేందుకు రూ. 75,000/- లంచం స్వీకరిస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారి బృందాలకు పట్టుబడ్డారు.లంచం తీసుకున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల కార్యాలయ మేనేజర్ గురుబెల్లి వెంకట్ నర్సింహారావు, అలాగే సాంకేతిక సహాయకుడు (పొరుగు సేవలు) కొత్తగొల్ల మణికాంత్.. ఫిర్యాదుదారుని ఫిర్యాదుతో ఏర్పాటైన ఉచ్చు ఆపరేషన్‌లో, లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న వేళ ఈ ఇద్దరినీ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🌟ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తెలిపారు
“ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే, వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు డయల్ చేయవచ్చు. అదేవిధంగా వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), అలాగే వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు,” అని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.
👉అపార్ట్‌మెంట్లో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు.. ఫుల్లుగా డ్రగ్స్ తీసుకుని .. ఆ తర్వాత..!!*
మత్తు ప్రాణాలు తీస్తుంది.. దాని జోలికి వెళ్తుద్దు.. మీతో పాటు.. మీ కుటుంబాన్ని కూడా బజారున పడేస్తుంది.. బంగారం లాంటి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు.. అంటూ ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు పెడచెవిన పెడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇంకా మరికొందరైతే.. ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా.. ఓ యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందడం కలకలం రేపింది.. మరో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కలకలం రేపింది.. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
*పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..*
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 805 లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ అతని స్నేహితుడు.. మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గతరాత్రి అహ్మద్ అలీ (28) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు… పోలీసుల సంఘటన స్థలానికి చేరుకునే వరకు అహ్మద్ అలీ మృతి చెంది ఉన్నాడు.. మరో యువతి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా గత రాత్రి అహ్మద్ అలీతోపాటు మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అహ్మద్ అలీ మొబైల్ టెక్నీషిషన్ పనిచేస్తున్నాడు. అపార్టెంట్‌మెంట్‌లో డ్రగ్స్ సేవించిన అలీ, మరో యువతి.. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపింది. పోలీసులు, ఎక్సైజ్ శాఖ రౌండ్ ది క్లాక్ నిఘా పెట్టి పెడ్లర్ల భరతం పడుతున్నారు. అంతేకాకుండా.. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని కూడా గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.. ఈ క్రమంలో… యువకుడు మృతిచెందడం కలకలం రేపింది..!!
👉సికింద్రాబాద్ – మహంకాళి ఏసీపీ సైదయ్య పై బదిలీ వేటు*.. అవినీతి ఆరోపణల రావడంతో సైదయ్య పై శాఖాపరమైన చర్యలు తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు…సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…గోపాలపురం ఏసీపీకి మహాంకాళి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగింత…
👉జనగామ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం… జనగామ మండలం ఓబుల్ కేశవపురం గ్రామంలో ఘటన…వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ కి పిర్యాదు చేసిన బాధితులు…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉హైదరాబాద్‌లో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం ..రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం ..స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉సంచలనమైన మాగంటి సునీత లేఖ
మాగంటి గోపినాథ్ తల్లి సంచలన ఆరోపణల వరుసలో మరో లేఖ కలకలం రేపుతోంది. మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తల్లితో పాటు సోదరుడు సహా కుటుంబ సభ్యులెవరినీ ఆయనను చూసేందుకు లోపలికి అనుమతివ్వొద్దు అంటూ.. మాగంటి సునీత సెక్యూరిటీకి లేఖ రాసినట్లు.. ఒక లేఖ బయటకు వచ్చింది. ఎన్నికల ప్రచారం ముమ్మరం కావటంతో ఈ లెటర్ ఇప్పుడు హాట్ టాపికైంది. ఇప్పటికే మాగంటి సునీత- గోపీనాథ్ పెండ్లి చెల్లదని మాగంటి కొడుకు ఆరోపణలు చేశారు.

