👉అమరావతి : పార్టీ నేతలపై టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఆగ్రహం.*
టీడీపీ ఆఫీస్‌లో గ్రీవెన్స్‌ని పట్టించుకోవడం లేదు.. పార్టీ ఆదేశాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే..ప్రజా దర్బార్ క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఒక్కరోజే 5 వేల మంది వస్తారా?…సొంత ఇమేజ్‌తో గెలిచామనుకునేవారు స్వతంత్రంగా పోటీ చేసి గెలవొచ్చు.పార్టీ లేకుండా ప్రజాప్రతినిధులు లేరు, అలాగే మంత్రి పదవులు లేవు.ఎంతటి వారికైనా పార్టీనే సుప్రీం.. సీనియర్లు సైతం అవసరమైనప్పుడు నోరు విప్పాలి..పార్టీలో పరిణామాలపై నేతలతో మంత్రి లోకేష్ సుదీర్ఘ చర్చ.
కే👉బినెట్ నుంచి ఆ ముగ్గురు మంత్రులు ఔట్!..😱😱తెలంగాణ : త్వరలో ముగ్గురు కాంగ్రెస్ మంత్రులకు సర్కార్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు మంత్రి పదవి నుండి ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. వీరి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి, బాలు నాయక్‌లకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్‌కు టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా అప్పగించనున్నారట.
👉అమ్మా, నాన్న..నేను మిమ్మల్ని మోసం చేసా…నాకు బతికే అర్హత లేదు’ అని లేఖ రాసి.. హీలియం గ్యాస్ పీల్చి విద్యార్థి ఆత్మహత్య*
ఆంధ్ర.. విశాఖకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ (29) ఇటీవల సీఏ పరీక్షల్లో ఫెయిలయ్యాడు.దాంతో తల్లిదండ్రులకు భావోద్వేగంతో లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నాకు బతికే అర్హత లేదు. మిమ్మల్ని మోసం చేశాను. క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. మంగళవారం రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని హీలియం గ్యాస్ పీల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాగా, అఖిల్ గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకున్నాడని తెలిసింది…ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు
👉కలకలం రేపుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు…. మొన్న సీతమ్స్ కాలేజి లో జరిగిన ఘటన మరువక ముందే…అదే కాలేజి లో జరిగిన ఘటన….బీటెక్ విద్యార్థి సూసైడ్ ఆలస్యంగా వెలుగులోకి…..షోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…😱😱😱
ఆంధ్ర చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రుద్ర, కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్థిని కూడా సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్ననానికి పాల్పడగా… వేలూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది.
కొన్ని నెలల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు కలకలం సృష్టించాయి…ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు…. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియా లో వైరల్ అవుతుంది
👉తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పోలకంపాడు, కొత్తూరు ఎస్టి కాలనీ నందు పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక దాడి.*
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈరోజు (04.11.2025) మధ్యాహ్నం సుమారు 02:45 గంటల సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలకంపాడు గ్రామం కొత్తూరు ఎస్టీ కాలనీ లోని రేకులు షెడ్డు ఇంటిలోపల పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన సమాచారాన్ని SB CI ద్వారా జిల్లా ఎస్పీ కి తెలియ పరిచి, SB CI శ్రీహరి సమక్షంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలసి రైడ్ చేసి పేకాట ఆడుతున్న 11 మంది(07 మగవారు, 04 ఆడవారు) వ్యక్తులు,11 సెల్ ఫోన్లు, 04 ద్విచక్ర వాహనాలు, రూ.69,200/- నగదు సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
👉తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణలో ‘అగ్నివీర్’రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ అగ్నివీర్ల నియామక ర్యాలీ ఈ నెల 10 నుంచి 22 వరకు హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనుంది.అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ తదితర పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.పదో తరగతి అర్హత ఉన్న వాళ్లు క్వాలిఫికేషన్ కు అర్హులు. సంబంధిత నోటిఫికేషన్ ఇప్పటికే మార్చి 12 విడుదలై www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు బోర్డు తెలిపింది.నియామక సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయాన్ని టెలిఫోన్ నంబర్లు 040-27740059, 27740205 లకు సంప్రదించవచ్చు.
👉”ఒక్కడిపై 12 మంది దాడి “. రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ విద్యార్థి పై హత్యాయత్నం . సంవత్సరం కిందట జరిగిన గొడవ , కక్ష సాధింపుగా దాడి చేసినట్లు సమాచారం . క్షతగాత్రుడు అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శాంతన్ రెడ్డి గా గుర్తింపు . తీవ్రంగా గాయపడటంతో 108 లో కడప రిమ్స్ కు తరలింపు. 12 మంది నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్షతగాత్రుని తల్లిదండ్రులు డిమాండ్ . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
*ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్ల ఢీ.. పలువురి మృతి*
బిలాస్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
👉మెుంథా తుఫాన్ ప్రభావంపై మాజీ సీఎం జగన్ స్పందన.. 15 లక్షల ఎకరాల్లో మెుంథా పంజా విసిరిందన్న జగన్…
ఎప్పుడూ ఊహించని విధమైన పంట నష్టం-జగన్.. ఒక్క వరి పంటే 11 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది..పత్తి తదితర పంటలు 4 లక్షల ఎకరాల్లో నష్టం.. ఈ 18 నెలలుగా 16 సార్లు రైతులు నష్టపోయారు.. కనీసం ఏ ఒక్క రైతుకైనా బీమా ఇచ్చారా?… పూర్తిగా రైతు వెన్ను విరిచేశారు… ఉచిత పంటల బీమా ద్వారా కూడా లబ్ధి చేకూరలేదు.. రైతులు ఎరువులు కూడా బ్లాక్ లో కొంటున్నారు -జగన్
👉మంత్రి అజారుద్దీన్ కు శాఖల కేటాయింపు…
మైనార్టీ వెల్ఫేర్ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ కేటాయింపు..ఇప్పటివరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ..సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ అజారుద్దీన్ కు కేటాయింపు…
👉 లాబీయింగ్ చేస్తేనే నేషనల్ అవార్డులు:ప్రకాశ్ రాజ్
లాబీయింగ్ చేసేవారికే నేషనల్ అవార్డులు వస్తున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి జాతీయస్థాయి గుర్తింపు రాకపోవడం విచారకరమన్నారు. లాబీయింగ్తో వచ్చే అవార్డులు ఆయనకు అవసరం లేదని చెప్పారు. కేరళ జ్యూరీలో ఛైర్మన్గా తనకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి తరువాత సభ్యులు జోక్యం చేసుకున్నారని అక్కడి ఫిలిం అవార్డుల ప్రదానం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
👉చేవెళ్ల ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ శివధర్ రెడ్డి*.. ప్రమాద స్థలంలో ఓ గుంత తప్ప రోడ్డు సమస్యలు ఉన్నట్లు గుర్తించలేదని తెలిపిన డీజీపీ ..గుంతను తప్పించే క్రమంలో టిప్పర్ డ్రైవర్ తన వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని వెల్లడి ఘటనలో టిప్పర్ డ్రైవర్‌దే ప్రాథమికంగా తప్పులా కనిపిస్తుందని.. విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని స్పష్టం.
👉 SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసనలకు దిగారు. ఇవాళ కోల్కతాలో వేలాది మంది TMC కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం నుంచి జొరాసంకో ఠాగూర్ బారి వరకు 3.8కి.మీ. మేర నడిచారు. SIRకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, UTల్లో రెండో దశ SIR మొదలైన విషయం తెలిసిందే~£
👉డ్రగ్స్ దందాలో డాక్టర్.. ఇంట్లోనే దుకాణం పెట్టిన హైదరాబాద్ వైద్యుడు.. సోదాల్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత..ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్న ముఠా…డాక్టర్ నివాసం అడ్డాగా మార్చుకుని అమ్మకాలు..
హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఓ డాక్టర్ డ్రగ్స్ దందా బయటపడింది. ఆయన నివాసంలో లక్షల విలువ చేసే డ్రగ్స్ దొరికాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ డాక్టర్ నివాసాన్ని ఓ ముఠా ఉపయోగించుకుంటోందని, డ్రగ్స్ దాచేందుకు, అమ్మకాలకు ఆయన నివాసాన్ని కేంద్రంగా వాడుకుంటోందని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జాన్ పాల్ అనే వైద్యుడు అందులో అద్దెకు ఉంటున్నాడని గుర్తించారు.
సోదాల్లో రూ.3 లక్షల విలువ చేసే ఓజీకుష్, ఎండీఎంఏ, కొకైన్, హాష్‌ఆయిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాన్‌పాల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ప్రమోద్, సందీప్, శరత్ ఓ ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారని బయటపడిందని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి గుట్టుగా అమ్ముతున్నారని, ఇందుకు జాన్ పాల్ సహకరిస్తున్నాడని పేర్కొన్నారు. డ్రగ్స్ ను అమ్మినందుకు జాన్ పాల్ కు కొంత ఉచితంగా ఇస్తున్నారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
👉దళిత మంత్రి అడ్లూరికి మరో అవమానం!
TG: దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మరోసారి అవమానం జరిగిందని కొందరు వాపోతున్నారు.తాజాగా మంత్రి అజారుద్దీనికి శాఖ కేటాయిస్తూ.. అడ్లూరి శాఖలకు కోత పెట్టారు. మంత్రి లక్ష్మణ్ వద్ద ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖను అజారుద్దీన్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అడ్లూరి వద్ద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయి
👉ఉద్యోగాల పేరుతో మోసం!. మాజీ మంత్రి విడదల రజినీకి చిక్కులు?😱
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి విడదల రజిని మరో వివాదంలో చిక్కుకున్నారు. అధికారంలో ఉండగా, పలువురు నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న రజినీ ఇప్పుడు ఉద్యోగాల కుంభకోణంలో చిక్కుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, ఆమె అనుచరులు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలువురి నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేశారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు సోమవారం పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుల కథనం ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విడదల రజిని పనిచేసిన సమయంలో ఆమె అనుచరులైన బత్తుల శ్రీగణేష్, ఆయన సోదరుడు కుమారస్వామి, మాజీ మంత్రి పీఏలు మానుకొండ శ్రీకాంత్, దొడ్డా రామకృష్ణా కలిసి ముఠాగా ఏర్పడి ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు చిలకలూరిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నతోపాటు పలువురు విద్యార్థులు, వైసీపీ నేతలు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుమారు 15 మంది నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా, తమను తిరిగి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.2022 మంత్రిగా పనిచేసిన విడదల రజిని హామీ మేరకే తాము ఆమె పీఏలు శ్రీకాంత్, రామకృష్ణ, అనుచరులు శ్రీగణేష్ కు డబ్బు ఇచ్చినట్లు ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బాధిత విద్యార్థి కృష్ణ మీడియాకు తెలిపాడు. ఉద్యోగాలిస్తామని రజని పీఏలు శ్రీకాంత్, రామకృష్ణ డబ్బు అడిగితే, మేడమ్ తో మాట్లాడించాలని ఆ తర్వాతే ఇస్తానని తాను చెప్పినట్లు బాధితుడు వెల్లడించాడు. ఆ తర్వాత పీఏలు అప్పటి మంత్రి రజిని వద్దకు తీసుకువెళ్లారని తాను ఉద్యోగం కోసం అడిగితే ఏదైనా ఉంటే పీఏలతో మాట్లాడుకోవాలని ఆమె సూచించినట్లు బాధితుడు వివరించాడు. తనకు రజిని పీఏలకు మధ్య శ్రీగణేష్ ఉన్నాడని స్పష్టం చేశాడు. డబ్బు వసూలు చేసిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదని, మూడేళ్లుగా తిప్పించుకుంటారని వాపోయారు. మాజీ మంత్రి రజినీపై వైసీపీ నేతలు కూడా ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చిలకలూరిపేటలో మాజీ మంత్రి రజిని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్టోన్ క్టషర్ వ్యాపారిని బెదిరించి డబ్బు వసూలు చేశారని ఇప్పటికే ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా ఉద్యోగాల పేరుతో మోసం వ్యవహారంలోనూ బాధితులు మాజీ మంత్రి పేరును ప్రస్తావిస్తుండటం హీట్ ఫుట్టిస్తోంది.
👉గృహ-పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మాగుంట..
ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంటు అనుబంధ భవనం మెయిన్ కమిటీ రూము బి- పి.హెచ్.ఏ. లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) చైర్మన్ గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డిగారు కమిటీ సభ్యులతో కలసి ఉదయం 11 గంటల నుండి జరిపిన సమావేశంలో “పట్టణ ప్రాంతాలలో త్రాగు నీరు” విషయానికి సంబంధించి పునరుద్ధరణ మరియు పట్టణ పరివర్తనపై (అమృత్ పథకం) గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిందారు. ఈ సమావేశంలో ప్రతినిధులు చేసిన చూచనలను మరియు కోరిన అంశాలను సంబందిత శాఖలకు సిఫార్సు చేసి, వాటిని అమలయ్యేటట్లుగా చూస్తానని వారితో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు.
👉వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలను అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు.,
ఒంగోలు ..విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవండి: జిల్లా ఎస్పీ ..పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన,డిబేట్ పోటీలలో విజేతలగా నిలిచిన వారికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నగదు బహుమతులను మరియు ప్రశంస పత్రాలను అందచేసినారు. పోలీస్ సిబ్బందికి “ప్రస్తుత కాలంలో పోలీసు వ్యవస్థలో సాంకేతికత పాత్ర”, విధ్యార్థులకు “లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర”అనే అంశాలపై వ్యాస రచన పోటీలను నిర్వహించారు. **ప్రథమ బహుమతికి రూ. 5 వేలు… ద్వితీయ బహుమతి రూ. 3 వేలు… తృతీయ బహుమతి రూ. 2 వేలు ప్రకారం నగదు బహుకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరులకు నివాళిగా వారి త్యాగాలను యువతకు పరిచయం చేయడానికి నిర్వహిస్తున్న ప్రేరణాత్మక కార్యక్రమాల్లో వ్యాసరచన పోటీలు ముఖ్యమైన భాగమని అన్నారు. ఈ వ్యాసరచన పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అద్భుతంగా రాసారని విజేతలను అభినందించారు. విద్యార్థులు మంచి అలవాట్లు, క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు క్రీడల్లో పాల్గొని సృజనాత్మక ప్రతిభను వెలికితీయాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, డి.సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

