👉 జోగి ఎఫెక్ట్: అర్ధరాత్రి విజయవాడలో ఉద్రికత్త.. పోలీసులపై జులుం!
రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే జోగి కుటుంబం అక్కడకు చేరుకుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, జోగి అభిమానులు వందల సంఖ్యలో విజయవాడలో గత అర్ధరాత్రి తీవ్ర హంగామా సృష్టించారు. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్, ఆయన సోదరుడు రామును అరెస్టు చేసిన పోలీసులు.. సుదీర్ఘంగా 12 గంటల పాటు విచారించారు. అనేక ప్రశ్నలు సంధించారు. అనంతరం.. వైద్య పరీక్షల కోసం.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే జోగి కుటుంబం అక్కడకు చేరుకుంది. వీరితోపాటు.. వారి అనుచరులు కూడా వచ్చారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. ఆసుపత్రి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన.. పోలీసులపై దౌర్జన్యానికి దిగినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా జోగి కుమారుడు రాజీవ్ ప్రోద్బలంతోనే కార్యకర్తలు, అనుచరులు పోలీసు అధికారులపై దూషణలకు దిగి.. వారిని అడ్డుకోబోయినట్టు చెప్పారు. సుమారు 70 మందిపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పోలీసులను తిట్టడం, వారిపై దూషణలకు పాల్పడడం, విధులకు ఆటంకం కలిగించడం.. ఓ ఎస్సైపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడం వంటి నేరాలపై వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇదిలావుంటే.. ఆసుపత్రి లో చోటు చేసుకున్న హంగామాతో అప్పుడే అత్యవసర చికిత్స నిమిత్తంవచ్చిన ఓ కుటుంబం తీవ్రస్థాయిలో ఇబ్బంది పడింది. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా కూడా మరో కేసు నమోదు చేశారు. జోగిపై ప్రశ్నల వర్షం.. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు జోగి, ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ సహా ప్రత్యేక దర్యాప్తు బృందం(ప్రభుత్వం నియమించింది) అధికారులు అనేక కోణాల్లో ప్రశ్నించారు. వీటిలో ప్రధానంగా నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్ధన్‌రావుతో ఉన్న సంబంధాలు, ఆయన చెప్పిన వాంగ్మూలం ఎదురు గా ఉంచి కూపీ లాగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనంతరం వారి వద్ద ఉన్న ఆధారాలతో సరిచూసుకుని.. రిమాండ్ రిపోర్టును రూపొందించాయి.
👉బాలయ్య ఇలాకాలో భలే మార్పు..ఇక ‘లోటు’ లేదు.. ! అంతేకాదు.. తాను స్థానికంగా లేకపోయినప్పటికీ నియోజకవర్గంలో పనులు వడివడిగా ముందుకు జరిగేలా ఇటీవల కొత్తగా ఒక కమిటీని నియమించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పనులు వడివడిగా సాగనున్నాయా? మా ఎమ్మెల్యే మాకు దూరం అయ్యారన్న వాదన ఇక, వినిపించడం మానేస్తుందా? పనులు.. ప్రాధాన్యాలు ఆధారంగా ఇక, ప్రజలకు అన్నీచేరువ కానున్నాయా? ఇకపై లోటు లేకుండా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలుకూడా సాకారం కానున్నాయా? అంటే..ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ స్థానికంగా ఉండరు అన్న వాదన అయితే బలంగా ఉంది. అయితే.. ఇది ఒకప్పటి మాట. తర్వాత.. బాలయ్య తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంతేకాదు.. తాను స్థానికంగా లేకపోయినప్పటికీ నియోజకవర్గంలో పనులు వడివడిగా ముందుకు జరిగేలా ఇటీవల కొత్తగా ఒక కమిటీని నియమించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీ త్వరలోనే పనులు ప్రారంభిస్తుందని కూడా అంటున్నారు. గతంలో 2014-19 మధ్య తన పీఏలను ఇద్దరిని నియోజకవర్గంలో ఉంచి పనులు జరిగేలా బాలకృష్ణ చర్యలు తీసుకున్నారు. అయితే వారిపై వివాదాలు, విమర్శలు రావడంతో పక్కనపెట్టారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకున్న బాలకృష్ణ నియోజకవర్గంలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు కొత్తగా కమిటీని ఏర్పాటు చేసి పనులు ముందుకు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మండలాల్లో రహదారుల నిర్మాణం అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు నిర్మించాలని బాలయ్య ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి కొంతమంది ఎన్నారైల నుంచి కూడా ఆయన నిధులు సేకరించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి పంచాయతీ శాఖ నుంచి కూడా నిధులు సమీకరించినట్టు స్వయంగా ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ నెల రెండో వారంలో స్వయంగా ఆయా పనులు ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి పనులు ఆగకుండా ఒక కమిటీని నియమించి దాని ద్వారా పనుల పర్యవేక్షణ చేపట్టేందుకు ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పనులను అంచనా వేసే బాధ్యతలను కూడా కమిటీకి అప్పగిస్తారు. తద్వారా నియోజకవర్గంలో బాలయ్య లేరన్న ఆవేదన ఇకనుంచి ఉండదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అలాగే.. ప్రజలను -ప్రభుత్వాన్ని సమన్వయం చేసేందుకు కూడా ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
👉 మద్దిపాడు పోలీస్‌స్టేషన్ సమీక్షా సమావేశం *ఒంగోలు రూరల్ …
ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. శ్రీకాంత్ బాబు మద్దిపాడు పోలీస్‌స్టేషన్ సిబ్బంది మరియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో NBWs (Non-Bailable Warrants) అమలు, PGRS (Public Grievance Redressal System) పిటిషన్ల పరిష్కారం, కోర్ట్ సెషన్ కేసుల పురోగతి, ప్రాపర్టీ నేరాల విచారణ స్థితి, ESM (Ex-Servicemen) మరియు హైవే మొబైల్ సిబ్బంది పనితీరుపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడంలో ప్రతి పోలీసు సిబ్బంది సమయపాలనతో, బాధ్యతతో పనిచేయాలని సూచించారు.పెండింగ్ NBWs అమలులో జాప్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, కోర్టు కేసుల్లో హాజరు మరియు సాక్ష్యాల సమర్పణపై దృష్టి సారించాలని ఆదేశించారు.అలాగే పీ.జి.ఆర్.ఎస్. పిటిషన్లను సమయానికి పరిష్కరించి ప్రజల్లో నమ్మకం పెంపొందించాలనీ, ప్రాపర్టీ నేరాల విచారణలో నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. హైవే మొబైల్ సిబ్బంది రాత్రిపూట పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండి నేరాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు.సమావేశం అనంతరం స్టేషన్ రికార్డులను కూడా పరిశీలించి, అవసరమైన మార్గదర్శకాలు అందించారు.
*కార్తీకమాసం సందర్భంగా సముద్రతీర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు *
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పాకాల, కొత్తపట్నం, మడనూరు,ఈతముక్కల సముద్రతీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ప్రతి 50 మీటర్ల దూరాన్ని ఒక సెక్టార్‌గా విభజించి, రోప్స్ మరియు లైఫ్ జాకెట్లు ధరించిన పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, బోట్లలో పర్యవేక్షణ అధికారులు వంటి బలమైన భద్రతా చర్యలు చేపట్టారు.సముద్రపు నిర్దిష్ట లోతును గుర్తించి, ఆ పరిమితికి మించి ఎవరూ వెళ్లకుండా పోలీస్ సిబ్బంది ప్రజలను హ్యాండ్ మైక్‌ల ద్వారా హెచ్చరిస్తూ, ప్రమాద సూచిక బోర్డులు, సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.అలాగే పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజలు భక్తి భావంతో సురక్షితంగా పుణ్యస్నానం చేయడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుంటారు.

