👉వివేకా కేసులో బిగ్ ట్విస్టు.. జగన్ వాట్ నెక్ట్స్? వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్టు చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్టు చోటుచేసుకుంది.
ఈ కేసు విచారణ ముగిసిందంటూ గతంలో కోర్టుకు నివేదించిన దర్యాప్తు సంస్థ సీబీఐ, హతుడి కుమార్తె వైఎస్ సునీత వినతి మేరకు దర్యాప్తు కొనసాగించేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రధాన కోర్టులో మెమో దాఖలు చేసింది. సునీత అభ్యర్థనను తాము వ్యతిరేకించడం లేదని, కోర్టు అనుమతిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే సునీత అభ్యర్థనను వ్యతిరేకిస్తూ ఏ3 నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన నిందితులు తమ వాదన వినిపించకపోవడంతో కౌంటర్లు దాఖలుచేయాలని న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 2019 మార్చిలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి తన సొంత ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును తొలుత పులివెందుల పోలీసులు దర్యాప్తు చేయగా, అనంతరం సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత హతుడి కుమార్తె వైఎస్ సునీత కోర్టుకు వెళ్లడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసు బదిలీ అయింది. కోర్టు సూచనల మేరకు మాజీ మంత్రి వివేకా హత్య కేసును విచారించిన సీబీఐ.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి, వైసీపీ కడప జిల్లా నేత శివశంకర్ రెడ్డిని నిందితులుగా చేర్చింది. భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడైన ఉమా శంకర్ రెడ్డిని అరెస్టు చేసింది. అదేవిధంగా వివేకా పీఏ గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి (అప్రూవర్)తోపాటు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసింది. అదేవిధంగా కోర్టులో రెండు అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ సమయంలో దర్యాప్తు ముగిసినట్లు ప్రకటించింది. అయితే సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏమిటీ అసలు గుట్టు! తన తండ్రి హత్య వెనుక బలమైన కుట్ర ఉందని, తన కుటుంబానికే చెందిన కొందరు ముఖ్యులకు హత్య విషయం ఆ రోజు వేకువజామునే తెలిసిందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి మాజీ సీఎస్ అజేయ్ కల్లం వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు. అయితే సీబీఐ ఈ విషయంపై దర్యాప్తు చేయలేదని అంటున్నారు. అంతేకాకుండా హత్యతో మరికొందరికి సంబంధం ఉందని, సీబీఐ వారిపై దృష్టిపెట్టలేదని సునీత వాదిస్తున్నారు. తండ్రి హత్య కేసులో న్యాయం కోసం గత ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేసిన వైఎస్ సునీతకు.. ప్రస్తుత ప్రభుత్వంలో మంచి సహకారం లభిస్తోందని అంటున్నారు. అందుకే కేసు పునర్విచారణకు సీబీఐ సమ్మతించిందనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ కేసులో నిందితులైన ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు మిగిలిన వారు కౌంటర్లు దాఖలు చేయనందున కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ సునీతకు అనుకూలంగా నిర్ణయం వెలువరితే వైసీపీ పార్టీలో మరికొందరికి ఇబ్బందులు తప్పవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తన చిన్నాన్న హత్య కేసుపై మాజీ సీఎం జగన్ తీసుకోబోయే నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.
👉 ముంపు ప్రాంతాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. ఈరోజు ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ … నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి నష్ట తీవ్రతను రైతుల నుండి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ల నుండి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని, నష్ట తీవ్రతపై ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ బాలాజీ, మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ పాల్గొని తుపాను తీవ్రత కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు.
🌟వేములవాడలో మహిళకు అసభ్యకరమైన సైగలు చేసిన వ్యక్తి.. రిమాండ్‌కు తరలించిన పోలీసులు..!!😱
వేములవాడ దేవస్థానం సమీపంలో ఓ మహిళకు అసభ్యకరమైన సైగలు చేస్తున్నాడనే ఫిర్యాదుతో, వెల్దండి సదానందం అనే వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన టౌన్ సీఐ.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపిన సీఐ..!!
👉ఏసీబీ కి చిక్కిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉద్యోగి రామారావు ఇంట్లో కొనసాగుతున్న ఏసీపీ సోదాలు
*ఎల్బినగర్ లోని శివ గంగ కాలనీలోని రామ రావు ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్స్ ,డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు*
రామారావు కుటుంబ సభ్యులను విచారిస్తున్న ఏసీబి అధికారులు.. కొనసాగుతున్న సోదాలు..
👉సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన పోలీస్..!!*
అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలకు పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు.. ఎన్ని వ్యూహాలు రచిస్తారో, ఎన్ని రకాలుగా విచారణ చేసి.. అరెస్టు చేస్తారో మనకు తెలుసు.. కానీ విజయవాడలో మాత్రం ఒక ట్రాఫిక్ ASI కు సైబర్ నేరస్తులు టోకరా వేశారు. వీడియో కాల్ చేసి మరి నమ్మించి నిండా ముంచారు. దీంతో సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేసిన పాపానికి పాపం ASI బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అయింది. దీనితో లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సదరు ASI..
*వివరాల ప్రకారం..*
విజయవాడలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్న అధికారికి సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు అప్రూవ్ అయిందని 9666688738 అనే నంబర్ నుంచి ఫోన్ చేశారు. ఇక ఇది నిజమేనని నమ్మిన సదరు ASI తన మొబైల్ ఫోన్ వాట్సప్‌లో 9038715125 నంబర్ నుంచి HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ లింక్ పేరుతో నుంచి వచ్చిన లింక్ క్లిక్ చేశారు.. అలా క్లిక్ చేసిన కాసేపటికే.. అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యింది. లక్షల్లో డబ్బు పొగొట్టుకున్నట్లు చెబుతున్నారు.
దీనితో మోసపోయానని గ్రహించిన ట్రాఫిక్ ఏఎస్ఐ.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. అయితే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు.. దొంగల చేతిలో పోలీసు అధికారి మోసపోవడం కలకలం రేపింది.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కొద్దని ఒకవైపు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తుంటే.. పోలీసులే సైబర్ క్రైమ్ బాధితులుగా మారడం స్థానికంగా సంచలనంగా మారింది.. ప్రస్తుతం ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉అమరావతి :*ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా*
రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధిస్తామన్న కమిషన్. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజలు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇవి విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి సంస్థలకు జరిమానా, గుర్తింపు రద్దుచేసేందుకు విశ్వవిద్యాలయానికి సిఫార్సు చేస్తామన్న కమిషన్.రూల్స్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను విద్యాసంస్థలు తీసుకోకూడదు..విద్యార్థులకు సమస్యలు ఉంటే # 87126 27318,
08645 -274445# లకు ఫిర్యాదు చేయవచ్చు.
టోల్ ఫ్రీ నెంబర్ 1100🙏 100🙏N.1915🙏అలాగే జిల్లా కన్జ్యూమర్ కోర్టు& జిల్లా కలెక్టర్లకు &ఎస్పీ కి ఫిర్యాదులు రాష్ట్ర ప్రజలు, తల్లిదండ్రులు చేయవచ్చు.

