👉🏻సర్ (ఎస్ ఐ ఆర్) కి సలాం కొట్టలేం ! ..👉కార్మికులకు వాటా ఇస్తేనే సినిమా టిక్కెట్ల ధరల పెంపు ‘హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’: CM రేవంత్.. స్ధానిక ఎమ్మెల్యేతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించిన జిల్లా ఎస్పీ వి హర్ష వర్ధన్ రాజు..👉ముంపు ప్రాంతాలను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత : నెల్లూరు జిల్లా.. 🌟 కంభం చెరువు అలుగును సందర్శించిన అధికారులు

👉🏻సర్ (ఎస్ ఐ ఆర్) కి సలాం కొట్టలేం ! .. ఎక్కడైనా అమలు అయ్యే విధానం ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాను మరింతగా నవీకరణ చేయడం అని ఆయన గుర్తు చేస్తున్నారు చట్టాలు కూడా పూర్తి క్లారిటీగా అదే విషయం చెబుతున్నాయని ఆయన అంటున్నారు. సర్ అంటే దేశంలోని విపక్షానికి చిర్రెత్తుకుని వస్తోంది. సర్ అన్నది షార్ట్ కట్ పదం. ఇది మర్యాదపూర్వకంగా ఇంగ్లీష్ లో అనిపించినా సర్ కి అసలైన అర్ధం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ . కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ని అమలు చేయడానికి రెడీ అయిపోతోంది. ఆ వివరాలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో మీడియా ముందు వెల్లడించారు. ఇక ఈసీ రెండవ విడతలో భాగంగా సర్ ని అమలు చేయబోయే రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఉంది.

అదే విధంగా కేరళకు కూడా 2027లో ఎన్నికలు ఉన్నాయి దాంతో ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ కూటమి సర్ మీద కారాలూ మిరియాలూ నూరుతోంది… **దేశంలో రెండో విడతగా అమలు చేయబోతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ అన్నది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కేరళతో పాటు ఇతర రాష్ట్రాలలో దీనిని చేపడతామని ఈసీ ప్రకటించిన కొద్ది గంటలలోనే ఆయన నుంచి పూర్తి వ్యతిరేకతతో ప్రకటన విడుదల అయింది. ఈ విధంగా ఈసీ కనుక వ్యవహరించ దలచుకుంటే అది ఈసీ ఉనికి మీదనే సరికొత్త సందేహాలకు కారణం అవుతుందని కూడా ఆయన అంటున్నారు. అదే విధంగా దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద కూడా జనాలలో ఎన్నో అనుమానాలకు పూర్తి స్థాయిలో తావిస్తుందని కూడా పినరయి విజయన్ అంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని దీబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలని ఆయన ఘాటుగానే హెచ్చరించారు. ఈసీ చెబుతున్న దానిని బట్టి చూస్తే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం అలాగే 1960 నాటి ఓటర్ల జాబితా సవరణలకు వాటి నిబంధనలకు పూర్తి స్థాయిలో ఉల్లగించడమే అని కూడా విజయన్ అన్నారు. సర్ పేరుతో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాకు బదులుగా 2002 నుంచి 2004 వరకూ ఉన్న ఓటర్ల జబితాల ఆధారంగా సవరణ చేయడానికి ఈసీ సన్నాహాలు చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. దీనిని ఎవరూ అంగీకరించే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టం చేస్తున్నారు.

**అదే కరెక్ట్ విధానం : ఎక్కడైనా అమలు అయ్యే విధానం ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాను మరింతగా నవీకరణ చేయడం అని ఆయన గుర్తు చేస్తున్నారు చట్టాలు కూడా పూర్తి క్లారిటీగా అదే విషయం చెబుతున్నాయని ఆయన అంటున్నారు. ఆ విధంగానే ఈసీ వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక చూస్తే కేరళలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు ఆ సమయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ని అమలు చేయడం అన్నది అసాధ్యమని విజయన్ అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి ఇప్పటికే ఈసీకి తెలియచేశారని అయినా కూడా ఈసీ సర్ ని అమలు చేస్తామని చెప్పడం మీద ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఏకంగా ఈసీ వ్యవహరిస్తున్న తీరు మీదనే పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విజయన్ అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసీ దేశంలో రెండో విడతగా అమలు చేయాలనుకుంటున్న సర్ అంత సులువుగా కనిపించడం లేదని అంటున్నారు. మరి ఏ విధంగా ఈసీ అమలు చేస్తుందో చూడాలి ఉంది.

👉కార్మికులకు వాటా ఇస్తేనే సినిమా టిక్కెట్ల ధరల పెంపు: సీఎం రేవంత్ రెడ్డి  ..సినీ కార్మికులకు కలెక్షన్లలో వాటా ఇచ్చే పని అయితే టిక్కెట్ల రేట్ల పెంపుకు ఆమోదం తెలియచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినీ కార్మికులు అంతా కలసి సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్‌లో అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెంచే టికెట్ రేట్ లో 20% కార్మికులకు ఇస్తేనే ఇకపై జీవో ఇస్తామని ప్రకటించారు. టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతకు డబ్బులు వస్తాయి కానీ కార్మికులకు ఏమీ రాదు..అందుకే ఇకపై టికెట్ రేట్లు పెంచే జీవో ఇవ్వాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాలన్నారు. అధికారంతో తన కళ్లు మూసుకుపోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. సినీ కార్మికులకష్టాలు తెలుసన్నారు. మిమ్మల్ని పట్టించుకోనంత ఎత్తుకు తాను ఎదుగలేదని కార్మికులకు భరోసా ఇచ్చారు. మీ కష్టాలన్నీ తీరుస్తానని చెప్పలేను కానీ.. తన చేతుల్లో ఉన్నంత వరకూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నటుడు ప్రభాకర్ రెడ్డిని రేవంత్ గుర్తు చేసుకున్నారు. సినీ కార్మికుల ఆత్మబంధువు ప్రభాకర్ రెడ్డి అని..ఆయన కార్మికుల కోసం తన సొంత స్థలం పది ఎకరాలు ఇచ్చారన్నారు.సినీ కార్మికుల అభినందన సభలో.. టిక్కెట్ రేట్ల ప్రస్తావన తీసుకు రావడం.. కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలనడం సంచలనంగా మారింది.ఈ ప్రతిపాదన ఎలా కార్యరూపంలోకి వస్తుందో చెప్పడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కొన్ని సినిమాలకు.. రేట్లు పెంచుతూ జీవో ఇచ్చినా న్యాయస్థానాల్లో నిలబడలేదు. అయితే ఇలా కార్మికులకు ఇరవై శాతం వాటా ఇస్తే రేట్లు పెంచుకునే చాన్స్ ఇస్తామని చట్టం చేస్తే సమస్యలు ఉండవు.

👉 ‘హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’: ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలనేది తన సంకల్పమని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ.. ‘ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే. మీరు అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాదు తీసుకువస్తా. కార్మికుల కష్టాలు తెలియనంతగా నాకు కళ్లు మూసుకుపోలేదు. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నాం’ అని సీఎం అన్నారు.

👉రూ 30/ లు ఉన్న రిజిస్టర్ పోస్టు సేవలు నిలిపివేసి,

రూ 67/ లు ఉన్న స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంత అభివృద్ధో కదా!

👉 నెలకు రూ.50,000 జీతంతో ఉద్యోగాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL).. లికాం స్ట్రీమ్, ఫైనాన్స్ స్ట్రీమ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు ₹.24,900 – ₹.50,500 ఉంటుంది

👉ఒంగోలు నగరంలోని నీటి మునిగిన సుజాత నగర్, సమతా నగర్, పిటీసి ప్రాంతాలలో స్ధానిక ఎమ్మెల్యేతో కలిసి పర్యటించిన జిల్లా ఎస్పీ వి హర్ష వర్ధన్ రాజు..తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో పరిస్థితులు పరిశీలించిన జిల్లా అధికారులు..

తుఫాన్ కారణంగా ఒంగోలు నగరంలో పలు ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావంతో నీట మునిగిన నేపథ్యంలో ఒంగోలు సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా చేరి, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (PTC) ప్రాంగణంలో కూడా నీరు ప్రవహించిన పరిస్థితిని జిల్లా అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, PTC ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాధిక, , ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ , ఓడా చైర్మన్ షేక్ రియాజ్ , మేయర్ సుజాత , మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు ప్రత్యక్షంగా ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు.నీరు ఎలా బయటకు పంపించాలనే అంశంపై సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వాటర్ ఎక్కడకు అవుట్ ఫ్లాలో అవుతుందనే.. దానిపై ఎమ్మెల్యే తో చర్చించడం జరిగినది.అంతే కాకుండా పిటిసిలోకి కుడా వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రధాన డ్రైనేజి నుండి వాటర్ అవుట్ ఫ్లో పై మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుని చర్చించడం జరిగింది.

వేంటనే స్ధానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులందరూ సమన్వయంతో వర్మ హోటల్ సమీపంలో ఉన్న డివైడర్ ను బద్దలు కొట్టి వాటర్ ను పోతురాజు మేజర్‌ కాలువలోకి మళ్ళించడం జరిగినది.ఇలా చేయడం ద్వారా సుజాత, సమతా నగర్లలో నిలువ ఉన్న వాటర్ అవుట్ ప్లోను తొలగించడం జరిగిందన్నారు.జిల్లా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు తుఫాన్ సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మరియు పోలీస్ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను వెంటనే సమాచారం తెలియజేయాలని సూచించారు.

👉 ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు ఆర్టీసీ గ్యారేజ్ లో తుఫాను ప్రభావంతో చెట్టు విరిగి అక్కడే నిలిచిన ఉన్న కారు మీద పడింది కారులో కానీ చుట్టుపక్కల కానీ సిబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా అధికారులు..గిద్దలూరు ఆర్ టీ సి డిపో

👉ఒంగోలు పట్టణంలో మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఏర్పాట్లు, చర్యలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాత్రికేయుల సమావేశంలో వివరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి,జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు. ఈ పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. .

👉మోంతా తుఫాన్ నేపధ్యంలో జిల్లాలోని ముంపు ప్రాంతాలను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,నెల్లూరు జిల్లా

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి, పునరావాసం మరియు సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న జిల్లా యస్.పి. .ఇందుకూరుపేట పరిధిలోని ముదివర్తిపాలెంలోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఆహారం, వైద్య సేవలు, నీరు అందిస్తున్న ఇతర వసతులను స్వయంగా ఆరా తీసిన యస్.పి. .

తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పరిస్థితులను నేరుగా గమనించి, అధికారులకు తగు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.ముమ్మరంగా సహయక చర్యలలో నిమగ్నమై ఉన్న నెల్లూరు పోలీసులుజిల్లా వ్యాప్తంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు.జిల్లా వ్యాప్తంగా తుపాను పరిస్థితిని ఎస్పీ  స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రజలకు పునరావాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. రక్షణ సహాయక చర్యలకు పోలీస్ శాఖ తరఫున ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పోలీస్ వారు సిద్ధంగా ఉంటారని, ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు.

వర్షపు నీరు చేరే కాలనీల లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు వెంటనే చేయాలని ఆదేశాలు.24×7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, భారీ వర్షాలు, వరదల వలన ఏమైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితి వచ్చినా, సమస్యలకు గురైనా ప్రజలు, వెంటనే డయల్- 112 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్స్ 9392903413, 9440796383, 9440796370 లకు సమాచారం తెలపాలని సూచించారు.

👉భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా కంభం  మండలంలోని గుండ్లకమ్మ వాగు, కంభం చెరువు అలుగులను కంభం ఎస్సై బి నరసింహారావు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సందర్శించి ప్రజలకు తగు సలహాలు సూచనలను ఇచ్చారు.

7k network
Recent Posts

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*