🌟భారత్ పరువు తీస్తున్నారు: వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు, యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం🌟..👉రీల్ కాదు రియల్ హీరో *డీసీపీ చైతన్యకుమార్* ..👉మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా….

🌟భారత్ పరువు తీస్తున్నారు: వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు, యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం🌟

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. తమ ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ 2025, నవంబర్ 3న అధికారులు సుప్రీంకోర్టు ముందు స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అధికారులు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. విధి కుక్కల నియంత్రణలో విఫలమై ప్రపంచదేశాల ముందు భారత్ పరువు తీస్తున్నారంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, వీధి కుక్కలకు సంబంధించి ‘ఇన్ ఎ సిటీ హండెడ్ బై స్ట్రేస్, కిడ్స్ పే ప్రైస్’ అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు 2025, ఆగస్టు 22న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో 2025, అక్టోబర్ 27న ఈ పిటిషన్‎పై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే.. వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి మెజార్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అఫిడవిట్లు సమర్పించలేదు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మాత్రమే అఫిడవిట్ దాఖలు చేశాయి.
దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని.. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెండు నెలలు గడిచినా స్పందన లేదని.. అంటే దీని అర్థం ఏంటని ప్రశ్నించింది.
తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయని, వీధి కుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా.. అవి అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి.. కుక్కల బెడద కూడా కారణమని వ్యాఖ్యానించింది.
అనంతరం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి విచారణ 2025, నవంబర్ 3న అధికారులు సుప్రీంకోర్టు ముందు స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అధికారులు హాజరుకాకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది….

👉రీల్ కాదు రియల్ హీరో డీసీపీ చైతన్యకుమార్ ..

ఒక డీసీపీ స్థాయి అధికారికి ఉండే పోలీసు బలగం అంతా ఇంతా కాదు. తన టీంను రంగంలోకి దించొచ్చు. రీల్ సీన్లకు భిన్నంగా రియల్ సీన్లు ఉంటాయి. ఆయా రంగాలకు సంబంధించిన సీన్లు కొన్ని సినిమాల్లో చూసినప్పుడు.. నిత్యం అందులో పని చేసే వారు చూసి నవ్వుకుంటూ ఉంటారు. సినిమాటిక్ స్వేచ్ఛతోనే సినిమాల్లో అవసరమైన ఎమోషన్ వస్తుందని చెబుతుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం రీల్ కు ఏ మాత్రం తగ్గని రియల్ లైఫ్ లోనూ హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లోని సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ అలాంటి రియల్ హీరోయిజాన్ని ప్రదర్శించారని చెప్పాలి. ఎందుకంటే.. ఒక డీసీపీ స్థాయిలో ఉండే వ్యక్తి.. ఒక నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రదర్శించిన రిస్కును చూసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. ఒక డీసీపీ స్థాయి అధికారికి ఉండే పోలీసు బలగం అంతా ఇంతా కాదు. తన టీంను రంగంలోకి దించొచ్చు. కానీ.. ఆయన మాత్రం తన కళ్ల ముందు జరుగుతున్న నేరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించటం.. ఈ క్రమంలో ఆయన స్వల్పంగా గాయపడటమే కాదు.. నేరస్తుడ్ని అడ్డుకున్న చాకచక్యాన్ని చూసినప్పుడు.. రీల్ సీన్ రియల్ సీన్ గా మారింది. కత్తి, తల్వార్ తో తిరుగుతూ సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడే నేరస్తుల్ని పట్టుకునేందుకు ఆయన తెగువను ప్రదర్శించారు. హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఉన్న సుల్తాన్ బజార్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో నిందితుడైన మహ్మద్ ఒమర్ అన్సారీ మీద 22 కేసులు ఉన్నాయి. అతడ్ని చోరీ చేసే సమయంలో అడ్డుకుంటే ఎంతకైనా తెగిస్తాడు. శనివారం మధ్యాహ్న వేళలో ఒమర్ అన్సారీ ఆటోలో మరో ఇద్దరితో కలిసి చాదర్ ఘాట్ ట్రాఫిక్ జంక్షన్ సమీపంలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న వేళ.. అదే దారిలో వాహనంలో వెళుతున్న డీసీపీ చైతన్యకుమార్ అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే… తన అధికారిక వాహనంలో తన ఆఫీస్ కు వెళుతున్న వేళలో ఆటోలోని ఒక వ్యక్తి నుంచి సెల్ ఫోన్ ను స్నాచింగ్ కు ప్రయత్నిస్తున్న విషయాన్ని కారు డ్రైవర్ గుర్తించి డీసీపీకి చెప్పారు. వెంటనే.. డీసీపీ గన్ మేన్ కిందకు దిగి ఒమర్ అన్సారీని పట్టుకున్నాడు. అతడికి సాయంగా డీసీపీ కూడా దిగి వెళ్లారు. అయితే.. ఒమర్అన్సారీ గన్ మేన్ ను నెట్టేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గన్ మేన్ వద్ద ఉన్న 9ఎంఎం పిస్టల్ కిందకు పడిపోయింది. దీంతో.. డీసీపీ దాన్ని తీసుకున్నారు. అన్సారీ దగ్గర్లోని బిల్డింగ్ పైకి చేరాడు. గన్ మేన్.. డీసీపీ అతడ్ని వెంబడించారు. ఈ క్రమంలో అన్సారీని పట్టుకునేందుకు గన్ మేన్ ప్రయత్నించగా.. అతడిపై కత్తితో దాడికి పాల్పడే ప్రయత్నం చేశాడు. దీంతో డీసీపీ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. నిందితుడు బిల్డింగ్ పై నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. విడిచి పెట్టకుండా ప్రయత్నించటం.. కాల్పుల అనంతరం కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వెంబడించి మరీ పట్టుకోవటం.. ఆయన్ను రియల్ పోలీస్ హీరోగా చేసింది. ఈ క్రమంలో స్వల్ప గాయాలకు గురైన డీసీపీ చైతన్యకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పోలీస్ బాస్ (డీజీపీ) శివధర్ రెడ్డితో పాటు హైదరాబాద్ సీపీ సజ్జన్నార్.. డీసీపీలు పరామర్శించారు. ఏమైనా.. రీల్ సీన్ ను రియల్ సీన్ గా మార్చటంతో పాటు పోలీస్ పవర్ ఏమిటన్నది అందరికి చూపించారు డీసీపీ చైతన్యకుమార్.

👉మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా…. ఏజెన్సీలోనూ మరొకటి.. *కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి*.. 10 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని కొత్త మండలాలకు ప్రతిపాదనలు…మంగళవారం సీఎం చంద్రబాబుతో చర్చించనున్న మంత్రివర్గ ఉపసంఘం.. అనంతరం తుది నివేదిక తయారు…. నవంబరు 7వ తేదీన మంత్రివర్గం ముందుకు నివేదిక*

అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై ప్రభుత్వం కసరత్తు కొలిక్కి వచ్చింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పులపై రాష్ట్రవ్యాప్తంగా అందిన అర్జీలపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నివేదిక రూపొందించనున్నారు.

నవంబరు 7వ తేదీన ఆమోదం :

నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జనగణన నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీ లోగానే మొత్తం ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది.

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండలాలు ఏర్పాటు, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పుపై ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు కాగా తొలి సమావేశం ఆగస్టు 13న సచివాలయంలో జరిగింది. తర్వాత జిల్లాల వారీగా వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి కలెక్టర్లు వినతులు స్వీకరించారు. వివిధ ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధుల నుంచి కూడా అర్జీలు వచ్చాయి. మొత్తంగా సుమారు 200 వరకు అర్జీలు ఉపసంఘానికి అందాయి. వీటన్నింటిపై మూడు రోజుల క్రితం జరిగిన భేటీలో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. జిల్లాల అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంది.

ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కి.మీ. దూరం ఉంది. దీంతో రంపచోడవరం, చింతూరు డివిజన్లతోపాటు 4 విలీన మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటును ప్రతిపాదించినట్లు తెలిసింది.

అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా :
పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలతో అమరావతి కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఈ నూతన జిల్లాలో సచివాలయం, అసెంబ్లీతో పాటు కొత్త భవనాల నిర్మాణమూ పూర్తి కావస్తోంది. రాష్ట్రస్థాయి కార్యక్రమాలకూ అమరావతి జిల్లా వేదిక అవుతుంది. శాంతిభద్రతల నిర్వహణ, ప్రొటోకాల్ విధులూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలో వివరించనున్నారు.

అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే.. పరిపాలనా సౌలభ్యం మేరకు ఒకే నియోజకవర్గ పరిధిలోకి తేవాలని యోచిస్తున్నారు.
ఆదోని మండలంలో 1.50 లక్షల జనాభా ఉన్న నేపథ్యంలో….ఈ మండలాన్ని విభజించాలనే వినతులు వచ్చాయి. మండపేట, కొత్తపేట, ఎస్.కోట సహా కొన్ని నియోజకవర్గాలను మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు అందాయి. కొన్ని చోట్ల అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. వాటిని కూడా సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా :
మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
ఈ జిల్లా ఏర్పాటు కోసం అనేక దశాబ్దాల నుంచి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 1972లో మార్కాపురం డివిజన్ ను కర్నూలు జిల్లా నుంచి విడదీసి ప్రకాశం జిల్లా పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి ఈ ప్రాంతం దూరంగా ఉండడం, అన్ని రంగాల్లో వెనుకబాటు కారణంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. .. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేలా చూడాలని ప్రజాప్రతినిధులూ ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా