👉 పవన్ అపాయింట్మెంట్ ఇస్తే భీమవరం గుట్టు రట్టు చేస్తా ! ఇంతటితో గ్రంధి శ్రీనివాస్ ఊరుకోలేదు. మామూళ్ళు ఆగిపోయాయనే కొందరు పనిగట్టుకుని భీమవరం డీఎస్పీ మీద లేని పోనివి పవన్ కి చెప్పారు అని ఆయన అంటున్నారు. భీమవరం డీఎస్పీ ఇష్యూ గోదావరి జిల్లాలలో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఏ ముహూర్తాన ఆయన పైన సీరియస్ అయ్యారో తెలియదు కానీ అది రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీఎస్పీ మీద నివేదిక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కోరారు. ఆ మీదట హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ పవన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడంలో తప్పులేదని అన్నారు. ఇక భీమవరం డీఎస్పీ మంచి వారే అని ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు కూడా చెప్పారు.
ఇపుడు ఈ ఇష్యూలోకి భీమవరం నుంచి 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి పవన్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమవరం డీఎస్పీ విషయంలో రఘురామ చెప్పిందే నూరు శాతం నిజం అని చెప్పడం విశేషం అయితే భీమవరంలో చాలానే జరుగుతున్నాయని వాటి మీద మొత్తం గుట్టుమట్లు అన్నీ పవన్ ని స్వయంగా కలిసి అన్ని విషయాలు తానే స్వయంగా వివరిస్తారు అంటున్నారు. గుట్టు రట్టు చేస్తా : భీమవరంలో ఏమి జరుగుతోంది పేకాట జూదాల వెనక ఏమిటి అసలు మ్యాటర్ ఎవరేంటి ఈ దందా వెనక ఎవరున్నారన్న దాని మీద మొత్తం గుట్టుని తాను విప్పుతాను అని గ్రంధి శ్రీనివాస్ అంటున్నారు. ఇక డీఎస్పీ జయసూర్య మీద కూటమిలో కొందరు మద్దతుగా మాట్లాడుతూంటే మరికొందరు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం డీఎస్పీకే మద్దతుగా మాట్లాడడం విశేషంగా అంతా చూస్తున్నారు. అంతే కాదు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడచిన పదిహేడు నెలల కాలంలో పద్నాలుగు నెలల పాటు సాగిన పేకాట దందాలను ఉక్కు పాదంతో డీఎస్పీ అణచివేశారు అని చెప్పారు. అందుకే ఇపుడు ఆయన మీద పనిగట్టుకుని కొంతమంది పవన్ కి ఫిర్యాదు చేశారు అని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఇది ఒక్కసారిగా కూటమిలోనూ సీరియస్ చర్చకు తావిస్తోంది. తేజస్వి చెడుగుడు స్పందించడం అభినందనీయం : భీమవరంలో పేకాట జూదం వంటి విషయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ స్పందించడం అభినందనీయం అని అంటున్నారు. అయితే అసలు విషయాలు చాలానే ఉన్నాయని గ్రంధి శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. భీమవరంలో ఏమి జరుగుతోంది అన్నది పవన్ కి పూర్తిగా తెలియచేయాలన్నది తన ఉద్దేశ్యం అన్నారు. అందుకే తానే స్వయంగా పవన్ కి తొందరలో కలసి అసలు భీమవరంలో ఏమి జరుగుతోంది అన్నది పూర్తి స్థాయిలో వివరిస్తాను అని సంచలన ప్రకటన చేశారు. భీమవరంలో జూద శిబిరాల లోగుట్టు ఏంటో పవన్ కే అన్ని విషయాలు చెప్పి లోగుట్టు పూర్తిగా బట్టబయలు చేస్తాను అని గ్రంధి శ్రీనివాస్ అంటున్నారు. అయితే తనకు పవన్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. మామూళ్ళు ఆగిపోయాయనే : ఇంతటితో గ్రంధి శ్రీనివాస్ ఊరుకోలేదు. మామూళ్ళు ఆగిపోయాయనే కొందరు పనిగట్టుకుని భీమవరం డీఎస్పీ మీద లేని పోనివి పవన్ కి చెప్పారు అని ఆయన అంటున్నారు. క్లబ్ ల ద్వారా భారీగా అక్రమార్జన గత పద్నాలుగు నెలలుగా కొందరికి దక్కిందని గడచిన మూడు నెలలుగా అది ఆగిపోవడంతోనే వారు ఈ రకంగా చేస్తున్నారు అని అన్నారు. ఇంతకీ ఎవరు వారు అని మీడియా ప్రశ్నించగా ఎవరేమిటో భీమవరం ప్రజలు అందరికీ తెలుసు అన్నారు. ఒక్కసారి వారిని అడిగితే అంతా తెలుస్తుందని అన్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం తన దగ్గర ఉందని కూడా గ్రంధి చెప్పడం విశేషం. అసలు మ్యాటర్ ఏంటో : భీమవరం డీఎస్పీ విషయం, అలాగే జూద శిబిరాల వెనక దందాలు అసలు గుట్టు ఏమిటి అన్నది తనకు తెలుసు అని మాజీ ఎమ్మెల్యే చెప్పడం విశేషం. ఇవన్నీ కూడా పవన్ కే పూర్తి సమాచారం ఇస్తామని ఆయన చెప్పారు. అంతే కాదు ఆయన పవన్ ని కలిస్తే కేవలం భీమవరం పేకాట జూదం గురించే కాకుండా మొత్తం రాజకీయాల గురించి కూడా పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎవరేమిటి అన్నది కూడా ఆయన వివరిస్తారని అంటున్నారు. గ్రంధి రాజకీయమేంటి : ఇదిలా ఉంటే గ్రంధి శ్రీనివాస్ ఒకనాడు పవన్ ని ఘాటుగా విమర్శించారు. ఆయన వైసీపీలో అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నపుడు పవన్ మీద తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసేవారు. అయితే 2024లో ఓటమి పాలు అయ్యాక ఆయన నెమ్మదిగా వైసీపీకి దూరం అయ్యారు. ఆయన కుదిరితే టీడీపీ లేకపోతే జనసేనలో చేరాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇంతవరకూ ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఏ వైపు నుంచి రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో భీమవరంలో పేకాట జూదం ఇష్యూ హైలెట్ కావడంతో దానిని ముందు పెట్టుకుని పవన్ ని కలిసే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. భీమవరంలో అంగబలం అర్ధబలం కలిగిన నేతగా బలమైన నాయకుడిగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ కి పవన్ కనుక అపాయింట్మెంట్ ఇస్తే భీమవరం రాజకీయం మొత్తంగా మారుతుంది అని అంటున్నారు. అయితే తాను ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది అన్నది ఇపుడే ఏమీ అనుకోలేదని చెప్పడం విశేషం.
👉అదానీ కోసం ఎల్‌ఐసి బలి..
బీమా సంస్థపై మోడీ సర్కార్ ఒత్తిడి – మేలో 5 వేల కోట్ల షేర్ల కొనుగోలు – వాషింగ్టన్ పోస్ట్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశ ప్రజల కష్టార్జితంతో ఎదిగిన ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసిని అదానీ ప్రయోజనాల కోసం నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బలిపెడుతోందా? దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది పాలసీదారులను అదానీ వ్యాపారకాంక్షకు సమిధలుగా మార్చతోందా, సామాన్యుల చెమట చుక్కలే పెట్టుబడిగా ఎదిగిన ఎల్‌ఐసికి చెందిన వేల కోట్ల రూపాయల మొత్తాన్ని అదాని గ్రూపునకు గుట్టుచప్పుడు కాకుండా మళ్ళించేందుకు అత్యున్నత స్థాయిలో కుట్ర జరిగిందా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అన్నదే ‘వాషింగ్టన్ పోస్ట్’ సమాధానం! అమెరికా రాజధాని వాషింగ్టన్ నుండి వెలువడే ఈ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఈ మేరకు ప్రచురించిన కథనం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. అంతర్జాతీయంగా విత్తసంస్థలు అదానికి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 3.9 మిలియన్ డాలర్లు (33 వేల కోట్ల రూపాయలను) అదాని గ్రూపునకు మళ్లించడానికి సిద్ధమైందని ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఈ మేరకు అత్యున్నత అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ప్రణాళికను రూపొందించి, ముందుకు తీసుకెళ్లారనిపేర్కొంది. ‘అదానీపై లంచం, మోసం ఆరోపణలపై అమెరికా అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనేక అమెరికా, యూరోపియన్ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడాయి. కానీ.. భారత ప్రభుత్వం మాత్రం అదానీ కోసం ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రణాళికను రూపొందించింది’ అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్‌ఎస్), ఎల్‌ఐసి నుండి పొందిన అంతర్గత పత్రాలు సహా అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధుల మళ్లింపునకు ఏ విధంగా పాల్పడిందో గుర్తించామని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
అదాని పోర్టులకు 5వేల కోట్లు
దీనిలో భాగంగానే అదాని పోర్ట్స్ అనుబంధ సంస్థ రుణాల రీఫైనాన్స్ కోసం జారీ చేసిన 585 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,000 కోట్లు) బాండ్లను ఎల్‌ఐసి కొనుగోలు చేసిందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ‘అదాని పోర్ట్సు అప్పటికే తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం కోసం బాండ్లను జారీ చేయాలని నిర్ణయించుకున్న సమయంలోనే ఉన్నతస్థాయిలో ఎల్‌ఐసి నిధుల తరలింపునకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైంది. ఆ వెంటనే మే 30వ తేదిన ఒకేఒక పెట్టుబడిదారుడు అదాని పోర్ట్సు విడుదల చేసిన మొత్తం బాండ్లను కొనేశాడు. ఆ పెట్టుబడిదారుడు మరెవ్వరో కాదు…ఎల్‌ఐసి’నే అని ఆ కథనంలో పేర్కొన్నారు. ‘అత్యంత ధనవంతుడు. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వానికి బాగా అనుసంధానించబడిన బిలియనీర్‌కు చెందిన సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న పన్నుచెల్లింపుదారుల డబ్బును మళ్లించడానికి ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన అతిపెద్ద ప్రణాళికలో ఇది ఒక భాగం.’ అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది,’ అదానీకి ఈ ప్రభుత్వం ఎలాంటి హాని, నష్టాన్ని జరగనివ్వదు. అదానీ వ్యాపార సామాజ్య్రానికి అనుకూలంగా వ్యవహారిస్తోంది. అదానీ వ్యాపారాలను దేశ ఆర్థిక విజయాలుగా మోడీ సర్కార్ భావిస్తోంది.” అని కార్పొరేట్ ఫైనాన్స్ నిపుణుడు హేమీంద్ర హజారీ చేసిన వ్యాఖ్యను కూడా ఆ సంస్థ ప్రచురించింది.
అదానీ ఆర్థిక అక్రమాలు, అవినీతిపై 2023 జనవరిలో న్యూయార్క్ కేంద్రంగా పని చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వరుస రిపోర్టులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదానీ కృత్రిమంగా తన కంపెనీల షేర్లను పెంచుకుంటున్నారని.. డొల్ల కంపెనీలతో పన్నులు ఎగ్గొడుతున్నారని విశ్లేషించింది. అదానీ కంపెనీలు ప్రమాదకర అప్పుల్లో ఉన్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి తోడు తాజాగా వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ, అటు ఇన్వెస్టర్లు, కార్పొరేట్ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజా నిధుల వినియోగంలో జవాబుదారీతనం అవసరమని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు.
ఎవరి ఒత్తిళ్లు లేవు : ఎల్‌ఐసి
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి తమపై ఎవరి ఒత్తిడిలు లేవని ఎల్‌ఐసి పేర్కొంది. తమది స్వతంత్ర నిర్ణయమని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రభుత్వ అధికారుల నుంచి ప్రణాళిక మేరకే ఎల్‌ఐసి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందనే ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. బోర్డు ఆమోదించిన విధి విధానాల మేరకే తాము పెట్టుబడులు పెడతామని తెలిపింది.
పిఎసితో విచారణ జరపాలి : కాంగ్రెస్ డిమాండ్
అదానీ కంపెనీల్లో బలవంతంగా ఎల్‌ఐసితో పెట్టుబడులకు ఒత్తిడి చేయడాన్ని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. అదానీ గ్రూప్ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసి పాలసీదారుల పొదుపును వాడుకున్నారని ఆరోపించింది. సామాన్య ప్రజల జీవితకాల పొదుపులను ఒక ప్రయివేటు కంపెనీకి లబ్ధి చేకూర్చేలా దుర్వినియోగం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్‌లో రూ.33 వేల కోట్ల ఎల్‌ఐసి నిధులను పెట్టుబడి పెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వచ్చిన వ్యవహారంపై పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
👉 జగన్ అరెస్ట్ బీజేపీ లక్ష్యం…ఇదే ఖాయం ! ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ నుంచి మద్దతు తీసుకోవడం అన్నది కేవలం మర్యాద కోసమే అని అన్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని అరెస్ట్ చేయాలని ఎవరికి ఉంటుంది అంటే ఎక్కువ మంది చెప్పే మాట టీడీపీకే అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య హోరా హోరీ పోరు ఉంటుంది. అధికార మార్పిడి ఈ రెండు పార్టీల మధ్యనే జరుగుతుంది. బీజేపీకి ఏపీలో పెద్దగా బలం అయితే లేదు. ఇక కూటమి కట్టి కొన్ని సీట్లు ఏపీలో గెలుచుకుంది జాతీయ స్థాయిలో అయితే దీర్ఘకాలం బీజేపీ పాలించాలని చూస్తోంది. దానికోసం అన్ని పార్టీలతోనూ సఖ్యతను నెరుపుతోంది. ఏపీ విషయానికి వస్తే అన్నీ పార్టీలు ఎన్డీయే పార్టనర్స్ అనే బీజేపీ ప్రత్యర్ధులు అంటారు. వారు అనడమే కాదు, ఏపీలో కనిపిస్తున్న రాజకీయ దృశ్యం అలాగే ఉంది కూడా. ఆ మధ్యన జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేనతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీయే అభ్యర్ధికే ఓటేశాయి. కచ్చితంగా అరెస్ట్ : ఇదిలా ఉంటే ఏపీ కూటమిలో బీజేపీ తరఫున మంత్రిగా వ్యవహరిస్తున్న సత్య కుమార్ యాదవ్ తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ అరెస్ట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ని ఎపుడు అరెస్ట్ చేస్తారు అంటే తొందరలోనే ఏ మాత్రం తడుముకోకుండా సత్య కుమార్ యాదవ్ జవాబు ఇవ్వడం విశేషం. లిక్కర్ స్కాం సహా అనేక విషయాలలో గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు అన్ని విధాలుగా దోచేసి సొంత ఖజానా నింపుకున్నారని ఆయన ఆరోపించారు. అందుకే దీని మీద కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది అని ఆయన అన్నారు. * సూత్రధారి కూడా : లిక్కర్ స్కాం లో ఇప్పటిదాకా పాత్రధారులే అరెస్ట్ అయ్యారని సత్య కుమార్ యాదవ్ చెప్పారు. అయితే ఈ కేసుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అది పూర్తి అయినపుడు అన్ని ఆధారాలు లభ్యం అయినపుడు సూత్రధారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన జగన్ అరెస్టు గురించి హింట్ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. బీజేపీ ఏ రకమైన అవినీతిని సహించే ప్రసక్తి లేదని సత్య కుమార్ యాదవ్ గట్టిగా చెప్పారు.
*మద్దతు అన్నది మర్యాదకే : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ నుంచి మద్దతు తీసుకోవడం అన్నది కేవలం మర్యాద కోసమే అని అన్నారు. అది రాజ్యాంగబద్ధమైన పదవి అన్నది అంతా గుర్తు ఉంచుకోవాలని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని పదవి కోసం ఏకాభిప్రాయం కోసం బీజేపీ తన వంతుగా ప్రయత్నం చేసింది అన్నారు. ఈ విషయంలో కేవలం వైసీపీని మాత్రమే మద్దతు కోరలేదని మమతా బెనర్జీ వామపక్షాలు మజ్లిస్ పార్టీ ఇలా అందరికీ అడిగామని అన్నారు. రాజ్యాంగ పదవి విషయంలో పోటీ ఉండకూడదు అన్నది బీజేపీ విధానం అని ఆయన చెప్పారు. అంతమాత్రం చేత వైసీపీతో ఏదో తెర వెనక బంధం ఉందని ఎవరూ అనుకోవాల్సిన అవసరం అయితే లేదని ఆయన స్పష్టం చేశారు. : వైసీపీ మీద సత్య కుమార్ యాదవ్ టీడీపీ తరహాలోనే తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరచారని అయిదేళ్ళ పాలనలో అన్యాయం జరిగిందని అన్నారు. అందుకే వైసీపీ విషయంలో బీజేపీ కూడా ఏ విధమైన సాఫ్ట్ కార్నర్ చూపించేది ఉండదని అన్నారు. కూటమిలోని టీడీపీ సహా ఇతర మిత్రులతో పాటు బీజేపీ కూడా జగన్ అరెస్టుని నూరు శాతం కోరుకుంటోందని అయితే అన్ని ఆధారాలు లభించిన తరువాతనే ఏదైనా జరుగుతుందని ఆయన చెప్పడం విశేషం. ఒక విధంగా ఒక బీజేపీ కీలక నేత జగన్ కి ఫుల్ యాంటీగా ఆయన అరెస్టుని కోరుకుంటూ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒక సంచలనంగానే చెప్పాల్సి ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

