👉ఏజెన్సీ బడుల్లో బిడ్డల వరస మరణాలు తీవ్ర ఆందోళనకరం.. టిడిపి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ సి సి చీఫ్..వైఎస్ షర్మిలా రెడ్డి
ఏజెన్సీ బడుల్లో బిడ్డల వరస మరణాలు తీవ్ర ఆందోళనకరం.. ఇది మన్యంలో జరుగుతున్న మరణ మృదంగమే.. కురుపాం ఘటన తర్వాతైనా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం సిగ్గుచేటు..
– ముక్కు పచ్చలారని బిడ్డలను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు..మన్యం జిల్లా హడ్డుబంగి పాఠశాల విద్యార్థిని మృతి కూటమి ప్రభుత్వం చేసిన వరుస హత్యనే.. బిడ్డ బంగారు భవిష్యత్ ను చిదిమేశారు.
– గురుకులాల్లో పిల్లల జీవితాలను గాల్లో దీపాలుగా మార్చారు.. ఏజెన్సీ ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకొనే దిక్కులేదు.
*చంద్రబాబు 16 నెలల పాలనలో 21 మంది బిడ్డలు చనిపోయారంటే ..వారి మృతదేహాలపై పాలన సాగుతున్నట్లు లెక్క… వరుస మరణాలు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం..గిరిజన సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది.
– వసతి గృహాల్లో గిరిశిఖర బిడ్డలకు ఏది పెట్టినా అడగరని ప్రభుత్వానికి అలుసు.
– ఒక్క రూంలో 100 మందిని కుక్కినా నోరు మెదపరని ధీమా..కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకం. పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. రాష్ట్రంలో ఉన్న 840 సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు సమస్యలకు లోగిళ్ళు.
– తాగేందుకు గుక్కెడు నీళ్ళు కరువు. RO ప్లాంట్లు పనిచేసిన దాఖలాలు లేవు.
– పారిశుద్ధ్యం మీద పట్టింపు లేదు. అసలు బిడ్డలు ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో చూసే వ్యవస్థే శూన్యం.
– ఎస్సీ హాస్టళ్లలో 228 మంది ఆడబిడ్డలకు ఒకటే బాత్ రూమ్ ఉందని కోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు .
– గిరిజన విద్యార్థుల వరుస మరణాలపై కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.
– ఇప్పటిదాకా 21 మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నందుకు ఆ కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలి.
– స్వర్ణాంధ్ర 2047 కాదు…స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం..ఆ దిశగా ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలు పెట్టకపోవడం శోచనీయం.. మరోసారి చంద్రబాబు కు విజ్ఞప్తి చేస్తున్నాం..వెంటనే స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 మిషన్ కు శ్రీకారం చుట్టండి.. సంక్షేమ బడుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టండి.. మీ నిర్లక్ష్యంతో బిడ్డలను చంపి ఆ పాపాన్ని మూటకట్టుకోకండి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
👉మానవులు ఇకపై ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు… మరో బాంబ్ పేల్చిన ఎలన్ మస్క్ టెక్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి అయిన ఎలాన్ మస్క్, తరచుగా తన అసాధారణమైన అంచనాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోలు రాబోయే కాలంలో అన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని టెస్లా సీఈఓ, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది మానవాళికి వినాశనం కాదని, బదులుగా మనుషులు స్వేచ్ఛగా జీవించడానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి అయిన ఎలాన్ మస్క్, తరచుగా తన అసాధారణమైన అంచనాలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా AI, ఆటోమేషన్ పెరుగుతున్న ప్రభావంపై స్పందిస్తూ, “మానవులు ఇకపై ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు… కేవలం కూరగాయలు పండించుకునే స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. * AI, రోబోలే ఇక మన ఉద్యోగులు ఇటీవల ‘ఎక్స్’ లో ఒక పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ ప్రకటన చేశారు. అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు సైతం రాబోయే కొద్ది సంవత్సరాల్లో లక్షలాది మంది ఉద్యోగుల స్థానంలో AI , రోబోట్లను వినియోగించాలని ప్రణాళికలు వేస్తున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. “AI , రోబోలు అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాయి,” అని ఆయన స్పష్టంగా చెప్పారు. * పని చేయడం ఒక ఎంపిక మాత్రమే “ఉద్యోగాలు లేకుండా మనుషులు ఎలా బ్రతుకుతారు?” అనే ఆందోళన వ్యక్తం చేసిన వారికి సమాధానంగా మస్క్ ఒక ఆసక్తికరమైన పరిష్కారాన్ని సూచించారు. “ఇది భయపడాల్సిన విషయం కాదు. భవిష్యత్తులో మనుషులు ఉద్యోగాల బంధనాల నుంచి విముక్తి పొందుతారు. పని చేయడం ఒక ఎంపికగా మారుతుంది. దుకాణంలో కూరగాయలు కొనడం బదులుగా, మనమే పండించుకోవడం లాంటిది అవుతుంది.” అంటే, జీవనోపాధి కోసం పని చేయాల్సిన అవసరం ఉండదని, వ్యక్తిగత ఆసక్తి.. సంతృప్తి కోసం మాత్రమే పని చేసే స్వేచ్ఛ మనుషులకు లభిస్తుందని ఆయన ఉద్దేశం. యూనివర్సల్ హై ఇన్‌కమ్ సిస్టమ్ మస్క్ అంచనా ప్రకారం, ఈ AI శకం మానవాళికి ఒక యుటోపియా లాంటి కల్పిత ప్రపంచాన్ని తీసుకురావొచ్చు. ఈ వ్యవస్థలో AI శ్రమతో కూడిన, పునరావృతమయ్యే అన్ని పనులను చేస్తుంది. మానవులు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి వీలుగా ప్రతి ఒక్కరికీ “యూనివర్సల్ హై ఇన్‌కమ్” (సార్వత్రిక ఉన్నత ఆదాయం) లభిస్తుంది. ఎవరికీ ప్రతిరోజు ఆఫీసులకు వెళ్లాల్సిన లేదా జీవించడానికి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు.
వాస్తవ సవాళ్లు – ఆర్థిక వ్యవస్థ మార్పు మస్క్ కల నెరవేరడం ఎంత త్వరగా జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుతం కూడా బ్యాంకింగ్, ఐటీ, మీడియా, తయారీ వంటి అనేక రంగాల్లో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నవారు ఉన్నారు. మస్క్ చెప్పినట్టు “అందరికీ హై ఇన్‌కమ్” అనే వ్యవస్థ రావాలంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పునర్నిర్వచించబడాలి. ప్రభుత్వాలు, కంపెనీలు, టెక్నాలజీ వ్యవస్థలు సరికొత్త సమన్వయంతో పనిచేయాలి. ఈ పరివర్తన సమయంలో సామాజిక భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం కల్పించగల విధానాలను రూపొందించాలి. మస్క్ ఆలోచనలు భవిష్యత్తుపై కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోతాయనే భయం కన్నా, మానవులు కొత్త జీవన విధానాలను ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన సూచిస్తున్నారు. మానవాళి పురోగతిలో AI ఒక కీలక మలుపు అని, దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే ‘పని ఒత్తిడి’ అనే భావన మన జీవితాల నుంచి పూర్తిగా తొలగిపోతుందని ఆయన పేర్కొన్నారు.
👉మొంధా తుఫాను కారణంగా భైరవకొన కు వచ్చే పర్యాటకులకు మరియు భక్తులకి పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమా నాయక్ విజ్ఞప్తి.
ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పర్యాటకేంద్రమైన సిఎస్పురం మండలంలోని భైరవకోన కు తుఫాను కారణంగా భైరవకోనకు భక్తులు పర్యాటకులు రావద్దని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమా నాయక్ సూచించారు . వాతావరణ శాఖ జారీ చేసిన మొంధా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకి కూడా తుఫాను ప్రభావం ఉండటంతో కార్తీకమాస పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు రేపు అనగా 27.10.2025 కార్తీక మాసం వచ్చే పర్యాటకులు భక్తులు అంతేకాక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బైరవకోనని జలపాతం మరియు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన అక్కడ కూడా స్నానం కొరకు దిగవద్దని మరియు భైరవకోన వచ్చే దారిలో కల్వర్టు వద్ద నీరు అధికంగా ప్రవహిస్తుందని భక్తులకు విజ్ఞప్తి. కావున భక్తులందరూ పోలీసు వారి విజ్ఞప్తిని గమనించి రేపు కార్తీక సోమవారం భైరవకోనకు రావద్దని కోరారు.
👉 *తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*బెస్తవారిపేట, రాచర్ల మండలాల్లో తుఫాన్ దాటికి తెగిపోయిన చెరువులను పరిశీలించి తెగిపోయిన చెరువులకు వెంటనే మరమ్మత్తులు నిర్వహించాలని పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
*గిద్దలూరు నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు & గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటించారు. మొదటగా బెస్తవారిపేట మండలంలోని గలీజేరుగుళ్ళ గ్రామంలో తెగిపోయిన చెరువును పరిలించారు. చెరువు నుండి వచ్చిన వరద ఉదృతి వలన జరిగిన పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అదే విధంగా పిట్టకాయగుళ్ళ చెరువులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం రాచర్ల మండలం, సోమిదేవిపల్లె గ్రామంలో తెగిపోయిన చెరువును పరిశీలించారు. వెంటనే చెరువు మరమ్మత్తులకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావం వలన జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు..*ఈ పర్యటనలో SDC వెంకట శివరామిరెడ్డి, తహసీల్దార్ లు జితేంద్ర, వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు రంగనాయకులు, వెంకటరామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సొరెడ్డి మోహన్ రెడ్డి, కటికే యోగానంద్, మార్కెట్ యార్డ్ చైర్మన్లు పూనూరు భూపాల్ రెడ్డి, బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు గుంటక నరసింహా, భవనం పుల్లారెడ్డి, టీడీపీ నాయకులు మరియు స్థానిక నాయకులు పాల్గోన్నారు..
👉వేములపాటి వారి వివాహ మహోత్సవం లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుముల*
*ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయం లో వేములపాటి చిన్న వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బమ్మ కుమారుని వివాహం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి పాల్గొని వధూవరులు అయిన చి ” శ్రీనివాసులు & వైష్ణవి లను ఆశీర్వదించారు వీరితోపాటు మద్దుటూరి రామకోటయ్య , లక్ష్మణ్, మహేష్, జోగి సుబ్బారావు , వెంకటేశ్వర్లు , ఆది నారాయణ గ్రామ నాయకులు తదితరులు పాల్గొని ఆశీర్వదించారు*
👉ప్రేమ, సేవ ద్వారానే సత్యసాయి ప్రేమను పొందగలం.. శ్రీ సత్యసాయి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తుముల*
ప్రేమ, సేవ ద్వారానే సత్యసాయి ప్రేమను పొందగలమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.. కంభం పట్టణంలోని శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో ఆదివారం నిర్వహించిన సత్య సాయి 100వ జయంతి వేడుకల్లో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు & గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్య సాయిబాబాకు నిర్వహించిన ప్రత్యేక అలంకరణ కార్యక్రమంలో పాల్గోని హారతి ఇచ్చారు.. ఈ సందర్బంగా సత్య సాయి జయంతి వేడుకల సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన చిన్నారులకు ప్రసంశ పత్రాలను అందచేశారు.. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, కంభం పట్టణ నాయకులు తదితరులు పాల్గోన్నారు..
👉పొదిలి టౌన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*పొదిలి నగర పంచాయతీ పరిధిలోని 16వ వార్డ్ నందు డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజిలు ప్రైవేటికరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు, కంభం మాజి శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

