👉పేదరికాన్ని జయించిన కేరళ రాష్ట్రం…దేశంలోనే కొత్త రికార్డు..👉రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణవాసి…👉కల్వకుంట్ల కవిత – ముఖ్యుల బినామీ భూ కుంభకోణంపై విచారణ చేయించండి :ఈటలకు స్థానికుల ఫిర్యాదు.. 👉ట్రావెల్ బస్సుల తనిఖీలు నిర్వహించిన ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు  ..👉వర్షాల నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలపై సూచనలు ఇచ్చిన  సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య ..👉అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయి : వి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి..👉కేశినేని శివనాధ్ (చిన్ని ) ని వేలెత్తి చూపించడానికి ఎవ్వరు అర్హులు కారు :ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మైనారిటీ నాయకులు  సయ్యద్ కరీముల్లాహ్ , ఇమ్రాన్..👉యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవార్డ్ అందుకున్న ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ ఖలీఫతుల్లా .

👉పేదరికాన్ని జయించిన కేరళ రాష్ట్రం…దేశంలోనే కొత్త రికార్డు 💐💐💐

పేదరికం అన్నది ఒక శాపం. ఒక దారిద్ర్యం. అయితే పేదరికాన్ని ఆసరాగా చేసుకుని హామీలు గుప్పించే పార్టీలే ఎక్కువగా కనిపిస్తూటాయి…*పేదరికాన్ని జయించిన రాష్ట్రం…దేశంలోనే కొత్త రికార్డు

పేదరికం అన్నది ఒక శాపం. ఒక దారిద్ర్యం. అయితే పేదరికాన్ని ఆసరాగా చేసుకుని హామీలు గుప్పించే పార్టీలే ఎక్కువగా కనిపిస్తూటాయి. వాటిని నిర్మూలించే విషయంలో మాత్రం పెద్దగా దృష్టి పెట్టవు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ రోజుకీ రేషన్ సరుకు తీసుకుంటున్న వారు ఈ దేశంలో 80 కోట్ల మంది దాకా ఉన్నారని చెబుతారు. ఈ నేపధ్యంలో పేదరికం మీద పూర్తి శ్రద్ధ పెట్టి దాని మూలాల్లోకి వెళ్ళి దానిని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా దేశంలో కేరళ నిలవబోతోంది. అయితే ఇక్కడ పేదరికం అంటే పూర్తిగా కాదు అత్యంత పేదరికం అని చెప్పాలి. అంటే కనీసం పూట గడించేందుకు కూడా లేని వారు అయితే ఇక మీదట కేరళలో కనిపించరు అన్న మాట. నిజంగా ఈ రకమైన అచీవ్మెంట్ ని సాధించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.

*లక్ష్యాన్ని సాధిస్తూ : ఇక కేరళలో అయితే లెఫ్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2021లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయితే తీవ్రమైన పేదరికం మీద దృష్టి పెట్టారు. అంతే కాదు ప్రత్యేకంగా సర్వేను రాష్ట్రమంతా చేయించారు. ఆ విధంగా చేయిస్తే ఈ సమగ్రమైన సర్వే చాలా సైంటిఫిక్ గా సాగింది. ప్రధానంగా ఆహారంతో పాటు వారి ఆరోగ్యం, జీవనానికి ఉపాధి, అలాగే గృహ నిర్మాణం వంటి అంశాల మీద సాగిన ఈ సర్వేలో చూస్తే ఏకంగా 64 వేల దాకా తీవ్రాతి తీవ్రమైన పేద కుటుంబాలు ఉన్నట్లుగా తేలింది. వీరందరికీ జీవితమే ఒక సవాల్ గా మారింది. అంతే కాదు దైనందిన జీవితమే కష్టమవుతఒంది. అందుకే వారిని అత్యంత పేదలుగా గురించిన రాష్ట్ర ప్రభుత్వం వీరిని తీవ్రమైన పేదరికం నుంచి బయటకు తీసుకుని రావడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

*సీఎం స్వీయ పర్యవేక్షణ : ఈ నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వీయ నేతృత్వంలోనే కార్యాచరణ మొదలైంది. వారిని అవసరం అయిన సాయం అందించడం అలాగే వారి జీవితాలు మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా కేరళ ప్రభుత్వం సమకూర్చి పెట్టింది. దాంతో అనూహ్యంగా కేవలం నాలుగేళ్ళ కాలంలోనే వీరంత తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది చాలా గొప్ప విషయంగా కేరళ ప్రభుత్వం భావిస్తోంది.

*ఘనమైన ప్రకటన :

కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన నవంబర్ 1న ఈ విషయాన్ని ఘనంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటిస్తారు అని అంటున్నారు. రాష్ట్రం అత్యంత పేదరికాన్ని జయించింది అని సీఎం ప్రకటించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా వేడుకగా నిర్వహించనున్నారు కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి కేరళ ప్రభుత్వంలోని మంత్రులు ప్రతిపక్ష నాయకులతో పాటు ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, ముమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారు హాజరవుతారు అని చెబుతున్నారు.

*జీవితాలలో పెను మార్పులు : ఇలా అత్యంత పేద కుటుంబాలు;అలో ప్రభుత్వం చేసిన సర్వేలో 4,421 కుటుంబాలు మరణించాయని చెబుతున్నారు. ఇక మరో 261 సంచార కుటుంబాల జాడ తెలియడం లేదని చెబుతున్నారు. లేదా వీరంతా ఇతర రాష్ట్రాలకు వలసపోయినట్లుగా భావిస్తున్నారు. ఇవన్నీ తీసివేయగా అత్యంత పేద కుటుంబాలుగా 59,277ని నిర్ణయించారు. వారి కోసమే గత నాలుగేళ్ళుగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడం ద్వారా వారి జీవితాలలో పెను మార్పులు తీసుకుని వచ్చారని చెబుతున్నారు. ఇది నిజంగా దేశానికే ఆదర్శంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే పేదలు సంక్షేమ పధకాలు ఏ ఏటికి ఆ ఏడు బడ్జెట్ లో పెరిగిపోతున్నారు కానీ ఆ రేటు తగ్గడం లేదు, అందువల్ల ప్రత్యేక పథకాలు ప్రత్యేక ఫోకస్ తో దీనిని నిర్మూలించ వచ్చని కేరళ ప్రభుత్వం ఆచరణాత్మకంగా నిరూపించింది.

👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట..

👉 ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిసిన రవిశంకర్ గ్రూప్స్ అధినేత మరియు జనసేన నాయకులు కంది రవిశంకర్ .

👉ఒంగోలు ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ రాజ బాబు ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి . ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు మరియు సమస్యల గురించి వారి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఎడతెరిపి లేకుండా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి అని వాటి పై తగు చర్యలు చేపట్టి, వారికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరినారు.

👉ప్రజల భద్రతే లక్ష్యం- ట్రావెల్ బస్సుల తనిఖీలు నిర్వహించిన ఒంగోలు డీఎస్పీ  రాయపాటి శ్రీనివాసరావు  మరియు అధికారులు*

ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు  ఆదేశాల మేరకు , ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు , ఒంగోలు తాలూకా సీఐ , ట్రాఫిక్ సీఐ , మరియు సింగరాయకొండ సీఐ  ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో బస్సుల్లో ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, గ్లాస్ బ్రేకర్లు, ఎమర్జెన్సీ డోర్లు, లగేజ్ కంపార్ట్‌మెంట్ భద్రత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

👉వర్షాల నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలపై సూచనలు ఇచ్చిన  సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య.

సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య  జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, వర్షాల కారణంగా సంభవించవచ్చే ప్రమాదాల నివారణకు సంబంధించి సిబ్బందికి తగిన సూచనలు అందించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా వర్షాల కారణంగా జారుడు రహదారులు, వాగులు, చెరువులు మరియు లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు సమయానుకూల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

👉ప్రమాదంపై ట్రావెల్స్ బస్సు ఓనర్ ఏమన్నారంటే?

బైకు ఢీకొట్టడమే తమ బస్సు ప్రమాదానికి కారణమని vkaveri ట్రావెల్స్ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు తెలిపారు. వర్షం పడుతున్న టైంలో బైకర్ స్కిడ్ అయి బస్సు కింద పడిపోయాడని, పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించాయన్నారు. డోర్ వద్ద మంటలు రావడంతో ప్రయాణికులు బయటికి రాలేకపోయినట్లు చెప్పారు. బాధితులకు తమ కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ అందుతుందన్నారు. బస్సుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు.

👉రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణవాసి

ఏజెంట్ని నమ్మి రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసి     మొహమ్మద్ అహ్మద్ ఉక్రెయిన్తో యుద్ధంలో ఇరుక్కున్నాడు. వెపన్స్ ట్రైనింగ్ ఇచ్చి రష్యా బోర్డర్లో యుద్ధం చేయమంటున్నట్లు వాపోయాడు. 25 మందికి ట్రైనింగ్ ఇవ్వగా 17 మంది మరణించారని, వారిలో ఓ ఇండియన్ కూడా ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తన భర్తను తిరిగి తీసుకురావాలని అహ్మద్ భార్య కేంద్రానికి లేఖ రాశారు. అతడి వివరాలు రష్యాకు అందజేసినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు.

👉*కల్వకుంట్ల కవిత – ముఖ్యుల బినామీ భుకుంభకోణంపై విచారణ చేయించండి .. మల్కాజ్ గిరి ఎంపీ ఈటలకు స్థానికుల ఫిర్యాదు ..!* హైదరాబాద్..

కల్వకుంట్ల కవిత , ఆమె భర్త అనిల్ కుమార్ లు సాగిస్తున్న భూ కబ్జా పై స్థానికులు కొందరు శుక్రవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి కవిత , ఆమె భర్త అనీల్ చెరలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు . నగర నడిబొడ్డున ఉన్న రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనీల్ పేరుతో కబ్జా చేసిందని స్థానికులు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు., కూకట్ పల్లి ఎమ్మార్వో కార్యాలయ పరిధిలోని బాలానగర్ సమీపంలో IDPL కు చెందిన సర్వే నంబర్ 2010/4 భూమి లో కవిత భర్త అనీల్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ ఏవిి రెడ్డి తో కలిసి కొట్టేశారని , ఓవర్ లాప్ భూ సర్వే నంబర్ల ఆధారంగా చేసుకొని తతంగం నడిపించారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు .ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని , ఫ్లాట్స్ కట్టి అమ్మకాలు మొదలు పెట్టారని చెప్పారు . కవిత భర్త అనిల్ కు ఇక్కడ భూమి ఎలా వచ్చింది అన్నదానికి సమాధానం లేదన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక భూబదిలీ జరిగిందని , దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్ , సీఎం బినామీ ఎ వి రెడ్డిి ప్ర త్యక్షంగా ఉన్నారని , సీఎం రేవంత్ రెడ్డి , జాగృతి అధ్యక్షురాలు , మాజీ సీఎం కెసిఆర్ కూతురు కవితలు పరోక్షంగా ఉన్నారని వివరించారు . రెండు కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కాపాడాలని , ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల , హాస్పిటల్ వంటి ప్రజోపయోగ నిర్మాణాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు .తాము అనేకసార్లు హైడ్రా కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని , సీఎం , కవితలు జోక్యం తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోవడం లేదన్నారు . కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదన్నారు . ED, CBI, Director revenue intelligence కు తాము ఫిర్యాదు చేస్తామని , కాంగ్రెస్ , BRS లు చేసిన భూదందా పై పార్లమెంట్ లో మాట్లాడాలని విజ్ఞప్తి చేసారు . ఈ అంశం పై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందిస్తూ .. సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ప్రభుత్వ భూమిని కాపాడుకుందామని వారికి హామీ ఇచ్చారు.

👉యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవార్డ్ అందుకున్న ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ ఖలీఫా తుల్లా బాషా.

యునైటెడ్ నేషన్స్ డే సెలబ్రేషన్స్ సందర్బంగా ఇంటర్నేషనల్ కమిషన్ కల్చర్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆర్గనైజేషన్ వారు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ఏర్పాటు చేసిన సేమినార్ లో దేశ భక్తి, సమాజాసేవ, లీడర్ షిప్ స్వభావం కలిగి మానవ హక్కుల కోసం కృషి చేస్తున్నందుకు అవార్డును ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధులుగా పాల్గొన్న హైడ్రా ఛైర్మన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎ వి రంగనాధ్, మేజర్  ఓబేరోయ్, ఆర్మీ కర్ణాల్, నిర్వాహకులు డాక్టర్ ఏలూరి శ్రీనివాసరావు  చేతుల మీదుగా ఇవ్వడంజరిగింది అవార్డు అందుకున్న పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా నిర్వాహకులు డాక్టర్ ఏలూరి శ్రీనివాసరావు వారి బృందం కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంకు హైదరాబాద్ సిటీ లోని ప్రముఖులు పాల్గొన్నారు.

🌟కేశినేని శివనాధ్ ని వేలెత్తి చూపించడానికి ఎవ్వరు అర్హులు కారు:ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ,మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి.. కరీముల్లాహ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ .ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ 53వ డివిజన్ ఇమ్రాన్…

🌟కేశినేని శివనాధ్ (చిన్ని ) ని వేలెత్తి చూపించడానికి ఎవ్వరు అర్హులు కారనీ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ,మైనారిటీ నాయకులు  సయ్యద్ కరీముల్లాహ్ , ఇమ్రాన్ అన్నారు.   తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో, కష్టకాలంలో జిల్లాలో అడుగు పెట్టి అన్న నందమూరి తారకరామారావు  ఆశయసాధన కోసం నారా చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి అవ్వాలని దృఢ సంకల్పంతో, పనీ చేసిన వ్యక్తి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు  కేశినేని శివనాధ్ (చిన్ని ) ని వేలెత్తి చూపించడానికి ఎవ్వరు అర్హులు కారు అయన ఒక నమ్మకం, బలం,అవసరానికి మించి పార్టీ కార్యకర్తకోసం పనిచేసే పెద్ద కార్యకర్త, ప్రజల కోసం పనీ చేసే ప్రజా నాయకుడు మహా మనిషి అయన గురించి తప్పుగా మాట్లాడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామనీ,ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు అయన కు ఎప్పడు కష్టం వచ్చినా నష్టం వచ్చిన అండగా ఉంటామన్నారు .బురదజల్లే ప్రతి ఒక్కరి నోటికి సమాధానం చెప్తామన్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా