👉విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలిగింపు..
తాజాగా 500 మంది తొలగించిన యాజమాన్యం.. ఇప్పటికే ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన 5 వేల మంది కార్మికులు..మరో వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపుకు సన్నాహాలు.. తీవ్రంగా మండిపడుతున్న కార్మిక సంఘాలు..
👉ఆసియాన్ సదస్సుకు మోదీ గైర్హాజరు.. భయమా? వ్యూహమా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియాన్ సదస్సుకు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం భారత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే మోదీ దూరంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. అయితే, విశ్లేషకులు దీనిని కేవలం భయంగా కాకుండా, అమెరికా అంతర్గత రాజకీయాల్లో ట్రంప్ లబ్ది పొందకుండా, భారత్ ప్రయోజనాలను కాపాడుకునే వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. వర్చువల్‌గా పాల్గొనడం ద్వారా సంబంధాలు దెబ్బతినకుండా, అనవసర రాజకీయ నాటకాన్ని తప్పించుకున్నారని అభిప్రాయపడుతున్నారు.
👉కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం..రాత్రి 3 గంటల సమయంలో మంటలు చెలరేగి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం..బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు..సజీవదహనమైన పలువురు ప్రయాణికులు..ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు..కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన..హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం..ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డ 12 మంది ప్రయాణికులు..
*కర్నూలు ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు..ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD 01 N 9490..ఘటనాస్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది..అగ్నిప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. ప్రమాదస్థలానికి FSL టీమ్ చేరుకుంది..పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారు..కొంత మంది బయటపడ్డా, మరికొంత మంది రాలేకపోయారు..మంటలతో బస్సు లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి-రెండో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం-ఎస్పీవిక్రాంత్ పాటిల్ తెలిపారు..ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు బయటపడ్డారు..డ్రైవర్, రెండో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు..క్షతగాత్రులను వాహనదారులు ఆస్పత్రికి తరలించారు.ప్రమాదం నుంచి బయటపడ్డ 12 మంది ప్రయాణికులు..ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డ ప్రయాణికులు..ప్రమాదం నుంచి బయటపడ్డ జయసూర్య, రామిరెడ్డి, అకీరా..వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ..ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్.. అఖిల్, జస్మిత, రమేష్, సుబ్రహ్మణ్యం కర్నూలు ఆస్పత్రిలో 11 మందికి చికిత్స.ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు..
👉కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు*
బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు.. సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం.. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశం.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన. …
🌟కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై పలువురు ప్రయాణికులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ప్రమాద ఘటనపై ప్రభుత్వం అన్ని రకాల సహయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను…. నారా లోకేష్ విద్య, ఐటీ శాఖల మంత్రి.
👉కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దిగ్భ్రాంతి..బస్సు ప్రమాదంలో పలువురు చనిపోవడం మనసును తీవ్రంగా కలిచివేసింది..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి..ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టింది..గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.
👉ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి.. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో..డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది- 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశాం-ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు.20 మంది క్షేమంగా బయటపడ్డారు-కలెక్టర్ సిరి.
👉బయటపడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకాలు😱
సీటింగ్ బస్సుకి రిజిస్ట్రేషన్ చేయించి..స్లీపర్‌గా మార్చి నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్.. వేమూరి కావేరి స్లీపర్ బస్సులో నిబంధనల ఉల్లంఘన.. 2018లో తెలంగాణలో బస్సుకి రిజిస్ట్రేషన్… 2023లో NOCతో డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్.. తర్వాత నేషనల్ పర్మిట్‌తో బస్సునడుపుతున్న ఆపరేటర్లు..ఒడిశాలోని రాయగడలో బస్సుకు ఆల్ట్రేషన్‌తో పాటు.. ఫిట్‌నెస్ చేయించిన వి.కావేరి యాజమాన్యం ..ఆల్ట్రేషన్ సీటింగ్‌కి పర్మిషన్ ఇచ్చిన రాయగడ RTA …43 సీట్లకు పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా మార్పు..ప్రతిచోటా అధికారులతో కుమ్మక్కై ఆల్ట్రేషన్.😱
👉‘ఎస్ ఐ రేప్ చేశాడు’.. వైద్యురాలి చేతిపై సూసైడ్ నోట్ ..మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రభుత్వ వైద్యు రాలి ఆత్మహత్య సంచలనంగా మారింది.
ఎస్త ఐ నను రేప్ చేశాడంటూ చేతిపై సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. ‘నా చావుకు ఎస్ ఐ పాల్ కారణం. గత 5 నెలల నుంచి నాలుగుసార్లు రేప్ చేశాడు. ఫిజికల్గా, మెంటల్గా నన్ను వేధిస్తున్నాడు’ అని పేర్కొన్నారు. గోపాల్తో పాటు మరో పోలీస్ వేధిస్తున్నాడని 3 నెలల క్రితమే DSPకి ఆమె లేఖ రాయడం గమనార్హం. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు~£
👉ప్రమాదం జరిగిన బస్సుపై భారీగా జరిమానాలు
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో దగ్ధమైన బస్సుపై 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయి. ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ సహా మొత్తం రూ.23 వేల వరకు ఫైన్లు ఉన్నాయి. వేమూరి కావేరి సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఈ ఫైన్లే నిదర్శనం. 2018లో కొనుగోలు చేసిన ఈ బస్సును డామన్ &డయ్యూలో రిజిస్ట్రేషన్ చేయించారు. 2025లో ఒడిశాలో రీ-రిజిస్ట్రేషన్ చేశారు. యజమాని వేమూరి వినోద్ కుమార్~£
👉కర్నూలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని తెలిపింది. అంతకుముందు, పీఎం రిలీఫ్ ఫండ్ కింద మృతులకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 20 మందికి పైగా చనిపోయారు
👉బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది
కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ..డ్రైవర్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ల మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలి – మంత్రి జూపల్లి కృష్ణారావు
👉విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ లో పేదలకు ఇవ్వాల్సిన మందులు జూనియర్ డాక్టర్లు బ్యాగులు కి నింపుకొని వెళ్లిపోవడం జరుగుతుంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. నిరుపేదలకు అందాల్సిన మందులు అవి .డాక్టర్ పేషెంట్లను చూసి ఈ మందులు వాడండి మీకు వచ్చిన జబ్బు తగ్గుతుంది అని పరీక్షించి షిఫ్ట్ ఇస్తే ఆ మందుల్లో ఏ మందులు లేవు అని రోగాలతో బాధపడుతున్న పేషెంట్లకు చెప్పి వచ్చిన పేషంట్లకి మందులు ఇవ్వట్లేదు వీళ్ళు .ఇక్కడున్న మందులన్నీ మీరు ఇలా పట్టుకెళ్ళిపోతే పేదల కోసం ఉంచిన మందులు ఎలా ఉంటాయి అక్కడ చెప్పండి.
👉భారత్ బంద్‌కు పిలుపు.. సరిహద్దుల్లో హై అలర్ట్!
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తెలంగాణా, ఆంధ్ర, ఛత్తీస్ గడ్ సరిహద్దులో హై అలెర్ట్ ప్రకటించి, పెద్ద ఎత్తున భద్రతా బలగాలు, పోలీసులు మోహరించారు. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులను మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది.
👉తునిలో బాలికపై అత్యాచార ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.*
వైసీపీ మాజీమంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అనుచరుడు వీరబాబు అరెస్ట్.. అత్యాచార ఘటన వ్యవహారంలో బాలిక ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాడిశెట్టి రాజా అనుచరుడు గణేశుల వీరబాబు. హోంమంత్రి అనిత అనుచరుడి కీచకపర్వం అంటూ నిందితుడి తనయుడి ఫోటో మార్ఫింగ్ చేసి వీరబాబు తప్పుడు ప్రచారం.

