👉 చంద్రబాబు పై నిప్పులు, అయ్యన్నపై సెటైర్లు… జగన్ సంచలన వ్యాఖ్యలు! … వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన ప్రస్థావించారు.
ఇందులో భాగంగా…* నకిలీ మద్యం వ్యవహారం, విశాఖ డాటా సెంటర్ పై జరుగుతున్న ప్రచారం.. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, రైతుల సమస్యలు మొదలైన విషయాలపై స్పందించారు. అవును… వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నకిలీ మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల వ్యవహారం, విశాఖ డాటా సెంటర్ తో పాటు పలు కీలక విషయాలపై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. *రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మాఫియా నడుస్తోంది!: రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మాఫియా నడుస్తోందని.. పోలీసుల భద్రత మధ్య గ్రామాల్లో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని చెప్పిన జగన్.. రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయని అన్నారు. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని.. వాటాల్లో తేడా రావడంతో ఈ నకిలీ వ్యవహరం బయటకు వచ్చిందని జగన్ అన్నారు. ఇదే క్రమంలో.. ములకల చెరువులోనే 20,208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయని.. 1,050 లీటర్ల స్పిరిట్ కూడా దొరికిందని.. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చని జగన్ తెలిపారు. ఇదే క్రమంలో.. ఇబ్రహీంపట్నంలోనూ, అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీల వ్యవహారం బయటకు వచ్చిందని అన్నారు. ఇదే సమయంలో… అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయని.. వీటిల్లో లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్ లకు ఈ నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని.. నేడు ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
*ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయడం చంద్రబాబుకు అలవాటే!:
రాష్ట్రంలో నకిలీ మద్యం ఈ స్థాయిలో విస్తరిస్తుంటే.. ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఓ వర్గం మీడియా సిద్ధంగా ఉండనే ఉందని మొదలుపెట్టిన జగన్… ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్ లకు అలవాటేనని అన్నారు. ఈ క్రమంలో… టాపిక్ డైవర్షన్ లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారని.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఇదే సమయంలో… నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే.. లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే.. అని ఆరోపించిన జగన్… సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయనే భయంతోనే బాబు ‘సిట్’ ముద్దు అంటున్నారని అన్నారు. వైసీపీ వేసిన బీజానికి కొనసాగింపే అన్నారు ..
*విశాఖ గూగుట్ డాటా సెంటర్!: ఈ సందర్భంగా… వైసీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషే విశాఖ గూగుల్ డాటా సెంటర్ అని చెప్పిన జగన్… 2023లోనే డాటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని ఈ సందర్భంగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు సంబంధం లేదు!: నేడు విశాఖకు గూగుల్ డాటా సెంటర్ రప్పించిన విషయంలో వైసీపీ క్రెడిట్ ని చోరీ చేస్తున్న చంద్రబాబు… గతంలో హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ ఇలాగే చేశారని అన్నారు. హైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని.. అయితే, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరని చెప్పిన జగన్… అసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్ తో సంబంధమే లేదని అన్నారు. 2004, 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆ తర్వాత పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నారు.. ఇలా 20 ఏళ్ల పాటు హైదరాబాద్ తో చంద్రబాబు ఏమీ సంబంధం లేకపోయినా.. ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారని అన్నారు. వాస్తవానికి 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే హైదరాబాద్ లో నిజమైన అభివృద్ధి మొదలైందని.. ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. అయ్యన్నపాత్రుడిపై జగన్ సెటైర్లు!: ఇలా సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్.. అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడి దగ్గరకు వచ్చేసరికి సెటైర్లు వేశారు. ఇందులో భాగంగా… అనకాపల్లి పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడి ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఆయన సన్నిహితుడు రుత్తలరాము అనే వ్యక్తి దీనిని నడిపిస్తున్నాడని అన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూపిస్తూ.. ‘చూడండి.. ఇద్దరు ఎంత బాగా నవ్వుతున్నారో.. స్మార్ట్ గా ఉన్నారు’ అంటూ జగన్ సెటైర్స్ వేశారు.
👉 జగన్ సెల్ ఫోన్ కేసులో బిగ్ ట్విస్ట్… సీబీఐకి అలా షాకిచ్చారా..? కోర్టు రికార్డుల ప్రకారం.. అవసరమైన అనుమతి పొందిన తర్వాత జగన్ అక్టోబర్ 11న యూరప్ కు బయలుదేరారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన విదేశీ పర్యటన సందర్భంగా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ నెలకొంది! అవును… జగన్ తన కుమార్తెలను చూడటానికి అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 30 మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవుతారని హామీ ఇచ్చారు. ఆ విధంగా కఠినమైన పర్యవేక్షణ నిబంధనలతో అనుమతి మంజూరు చేయబడింది. కోర్టు రికార్డుల ప్రకారం.. అవసరమైన అనుమతి పొందిన తర్వాత జగన్ అక్టోబర్ 11న యూరప్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి ఎటువంటి కోర్టు షరతును ఉల్లంఘించలేదని ఆయన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు! అయితే సీబీఐ వాదన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఈసారి లండన్ టూర్ కు వెళ్లే సమయంలో కోర్టు షరతుల మేరకు సీబీఐకి సమర్పించిన సెల్ ఫోన్ నంబర్ వివాదానికి కారణమైంది. ఇందులో భాగంగా… గతంలో ఇచ్చిన నంబర్ ఒకటి కాగా.. ఈసారి ఇచ్చిన నంబర్ మరొకటి అని చెబుతూ దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. ఆలోపే జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారని, తమకు అందుబాటులో ఉండేందుకు ఇచ్చిన ఫోన్ నంబర్ మార్చి ఇచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని వాదించింది! అయితే జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా… జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు సీబీఐ వాదించగా.. అసలు జగన్ సెల్ ఫోనే వాడటం లేదని ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు. సీబీఐకి అందుబాటులో ఉండేందుకు ఓ మొబైల్ నంబర్ ఇచ్చారని సీబీఐ కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు. దీంతో వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో ఈ నెల 28న తీర్పు ఇస్తామని వెల్లడించారు.
👉లాడ్జిలు, హోటల్స్ ను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు* … లాడ్జిలు, హోటల్స్ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్టపరమైన చర్యలు తప్పవనీ,శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఆదేశాలతో ఒంగోలు నగరంలోని స్ధానిక పోలీసు సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ సిబ్బందితో హోటల్స్, లాడ్జిలు తనిఖీలు నిర్వహించారు. ఒంగోలులోని లాడ్జిలను, హోటల్స్ రూమ్స్ ను పోలీసులు ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. లాడ్జిలలోని కంప్యూటర్ లో ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. లాడ్జిలలో బస చేసిన వ్యక్తుల యొక్క చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేసి నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. హోటల్ రూమ్స్, లాడ్జీలలో బస చేసే వ్యక్తుల ఐడి కార్డులను పరిశీలించి, సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. బస చేసే వ్యక్తుల రికార్డ్ మెయింటెనెన్స్ చేయని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు… చట్టవిరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
👉నేడు హనుమకొండలోని తేజశ్రీ స్కూల్లో సుజిత్ ప్రేమ్ అనే నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి, బ్రెయిన్ డెడ్ కావడంతో స్కూల్లోనే కుప్పకూలి చనిపోయాడు. నెలరోజులు న గడవక ముందే విద్యార్థుల వరస మరణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.. స్కూల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు..
👉 టోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయి
మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి.. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు..బీదర్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా 100 కిలోల గంజాయి పట్టివేత…పోలీసుల నుండి తప్పించే ప్రయత్నంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడిన కారు..పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు మహిళలు.

