👉 ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టార్లు హతం🌟 నిలువెత్తు నిజాయితీకి నిలువుటద్దం గుమ్మడి నరసయ్య🌟…🌟విశాఖ ఉక్కు క‌ర్మాగారం విష‌యంలో ష‌ర్మిల ఆమ‌ర‌ణ దీక్ష! .. 👉 విశాఖ ఆర్ డి ఓ శ్రీలేఖ బదిలీకి ప్రధాన కారణం ఏమిటి?? ఇందులో దాగున్న కుట్ర ఏమిటి???..🌟 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసంనవంబర్ 3 నుండి అన్ని ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్‌…👉 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్..👉కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు..👉ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ టంగుటూరు, కొత్తపట్నం ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్

🌟🌟 ఐదు సార్లు గెలిచిన ఎం ఎల్ ఎ..నిలువెత్తు నిజాయితీకి నిలువుటద్దం గుమ్మడి నరసయ్య…🌟🌟

ఖమ్మం జిల్లాకే వన్నె తెచ్చే నిజాయితీ గుమ్మం  గుమ్మడి నర్సయ్య ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ.. ప్రజా క్షేత్రంలో ఐదు సార్లు గెలిచిన ఎం ఎల్ ఎ..వార్డ్ నంబర్ పదవికే ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రిలా దోచుకున్న సొమ్ముతో ఇష్టానుసారంగా ఖరీదైన యర్రబుగ్గ కార్లలో తిరిగే రాజకీయ దోపిడీ దొంగల మద్యలో ఆయనో ఎత్తైన నిజాయితీ పర్వతం.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య  ఆయన ఎటు ప్రయాణించినా సైకిల్ లేదా ఆర్టీసీ బస్సులలోనే ఆయన ప్రయాణం..మనం ఇక్కడ దొంగలను రౌడీలను సైకోలను పాన్ ఇండియా పాన్ ఇండియా అంటు చొక్కాలు చింపుకుంటున్న సమయంలో మన పక్కనే ఉన్న తమిళ్ మలయాళం కన్నడ వాళ్లు దేశం గర్వపడే వ్యక్తుల నిజజీవిత చరిత్రను సినిమాలుగ చిత్రీకరిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారు.వాళ్లు మనకు అందరు అందుకునే ఉద్దేశం గానీ నీతి నిజాయితీగానీ మనకు లేవు మన వాళ్లు ఎంతటి నిక్రుష్టులో మనభక్తి ఎంత నకిలీదో మనబుద్ది ఎంత లేకిదో మన తెలుగు సినిమాలు చూస్తే తెలుస్తుంది.               అంతటి గొప్పవ్యక్తి జీవితం తెరపైకి ఎక్కించి దేశం గర్వపడేలా సినిమాలు తీస్తున్నందుకు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకూ హీరోలకు శతకోటి వందనాలు..

👉ష‌ర్మిల ఆమ‌ర‌ణ దీక్ష హెచ్చ‌రిక‌లు.. రీజ‌నేంటి?

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబుపై ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబుపై ఆమె ధ్వ‌జ‌మెత్తారు. `ఆమ‌ర‌ణ దీక్ష‌` చేస్తానంటూ హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలోనూ విశాఖ ఉక్కు క‌ర్మాగారం విష‌యంలో ష‌ర్మిల ఆమ‌ర‌ణ దీక్ష అంటూ హడావుడి చేశారు. అయితే.. కేవ‌లం 4 గంట‌ల్లోనే పోలీసులు జోక్యం చేసుకుని ఆమెతో దీక్ష‌ను విర‌మించారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ నాలుగు నెల‌ల‌కు తాజాగా ఆమ‌ర‌ణ దీక్ష హెచ్చ‌రిక చేయ‌డం విశేషం.👉విష‌యం ఏంటంటే.. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న `ఆరోగ్య శ్రీ` ప‌థ‌కానికి సంబంధించి కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు నిధులను విడు దల చేయ‌క‌పోవ‌డం గ‌త కొన్నాళ్లుగా వివాదంగా మారింది. కార్పొరేట్ సంస్థ‌ల యాజ‌మాన్యాలు ఇటీవ‌ల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్ర‌మంలో స‌ర్కారుఅనుమ‌తి కోర‌గా.. ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. మ‌రోవైపు ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను ఆయా ఆసుప‌త్రులు నిలిపివేశాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లోని ఆంధ్రరత్న భవన్ వద్ద వైఎస్ షర్మిల రెడ్డి నిరసన చేప‌ట్టారు. బుధ‌వారం రాత్రి 7-8 గంట‌ల మ‌ధ్య అనూహ్యంగా వర్షంలో తడుస్తూ స్టేచర్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. `ఆరోగ్య శ్రీ`ని అనారోగ్యశ్రీ గా మార్చారని ఆందోళన వ్య‌క్తం చేశారు. అవ‌స‌ర‌మైతే.. ఆరోగ్య శ్రీ పేరును మార్చుకుని అయినా.. పథకాన్ని కొనసాగించండని సీఎంకు సూచిం చారు. “నారావారి ఆరోగ్య సేవ“ అని పెట్టుకున్నా త‌మ‌కు అభ్యంతరం లేదన్న ష‌ర్మిల‌.. వెంటనే 2700 కోట్ల రూపాయ‌ల‌ను ఆసుప‌త్రుల‌కు విడుదల చేయాల‌ని పిలుపునిచ్చారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం 2 వేల కోట్ల రూపాయ‌లు బకాయిలు పెట్టింద‌న్న ఆమె.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కూడా అంతే స్థాయిలో బ‌కాయిలు పెట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. “ఆరోగ్య శ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతోంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని కోమాలో నెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇదెక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. ఆనాడు వైఎస్‌ హయంలో పథకం గొప్పగా సాగింది. పేద ప్రజల పట్ల వైఎస్‌ ప్రేమకు నిదర్శనం ఆరోగ్య శ్రీ పథకం. పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని పథకాన్ని రూపకల్పన చేశారు. వైద్యం కోసం ఆస్తులు అమ్మకూడదు..అప్పుల పాలు కాకూడదు అని ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించారు.“ అని పేర్కొన్నారు.ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఇదేనా మీరు కలిగించే బరోసా?. పేద ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?. ఆరోగ్య భద్రత ఇవ్వని మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉన్నారు?“ అని ష‌ర్మిల నిల‌దీశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని చంపుతాం అంటే ఊరుకోబోమ‌ని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోతే.. త్వ‌ర‌లోనే ఆమ‌ర‌ణ దీక్ష కు దిగ‌నున్న‌ట్టు ష‌ర్మిల హెచ్చ‌రించారు.

👉👉 విశాఖ ఆర్ డి ఓ శ్రీలేఖ బదిలీకి ప్రధాన కారణం ఏమిటి?? ఇందులో దాగున్న కుట్ర ఏమిటి???

విశాఖలో 350 కోట్ల విలువైన 60 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూమిని సొంతం చేసుకోవాలనుకున్న సీఎంవో లోని ప్రముఖ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర. ఆ భూమిని గతంలోనే కొనుగోలు చేసిన మాజీ సిఎస్ జవహర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో తనకు పని కాదని తెలిసి ముద్దాడ రవిచంద్ర తో బేరం కుదుర్చుకున్న జవహర్ రెడ్డి. తమ సమూప బంధువైన భవాని శంకరును విశాఖ డిఆర్ఓగా పంపిన ప్రస్తుత సీఎంఓ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర. జవహర్ రెడ్డికి చెందిన భూముల ఫ్రీ హోల్డ్ పనిని, ఆర్డిఓ ఒప్పుకోబోదని, ఎలాగైనా మహిళా ఆర్టీవో శ్రీలేఖను వేధించి అక్కడ లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్న డిఆర్ఓ.  గతంలో పనిచేసిన ప్రతిచోట అక్రమాలకు పాల్పడటంతో ఎక్కడా పోస్టింగ్ దక్కని భవాని శంకర్. గత ప్రభుత్వంలో సీఎంఓలో అక్కున చేర్చుకున్న గత ప్రభుత్వ సిఎస్ జవహర్ రెడ్డి. గురువుగారి రుణం తీర్చుకునేందుకు విశాఖ డిఆర్ఓ గా వచ్చిన భవాని శంకర్. ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డితో కుమ్మక్కైన ముద్దాడ రవిచంద్ర. కోట్లాది రూపాయలు కొట్టేసే స్కెచ్. 350 కోట్ల విలువైన సీఎంఓ అధికారి భూమి విషయాలు తెలియని సీఎం చంద్రబాబు లోకేష్ లు. కూటమి ప్రభుత్వాన్ని ముంచుతున్న సీఎంఓ లోని ఆ ఐఏఎస్. సీఎంఓలోని ఆ ఐఏఎస్ ని వదిలించుకొని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొంటుందా??? లేదా???

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ పట్నం ఆర్డిఓ శ్రీలేఖ బదిలీ అంశంలో భయంకరమైన కుట్రలు దాగి ఉన్నాయని తెలుస్తుంది.  విశాఖపట్నంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కొనుగోలు చేశారని భావిస్తున్న 350 కోట్ల రూపాయల విలువైన ఫ్రీ హోల్డ్ భూమిని సీఎంఓలో పనిచేస్తున్న ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర అప్పనంగా కొట్టేయాలని స్కెచ్ వేశారు. సదరు ఫ్రీ హో ల్డ్ పనిని విశాఖ ఆర్ డి ఓ శ్రీలేఖ ద్వారా చేయించుకోవడం సాధ్యం కాదని భావించారు.

కాగా తాను చెప్పిన పని ఆర్డీవో శ్రీలేఖ చేయదని భావించిన సీఎంఓలోని ఐఏఎస్ అధికారి, శ్రీలేఖను ఆర్డిఓ గా తప్పించాలని, ఆమె స్థానంలో తాము ముందుగానే విశాఖపట్నం ఆర్ డి వో గా నియమింప చేసుకున్న విశాఖపట్నం డిఆర్ఓ భవాని శంకరుకు విశాఖపట్నం ఆర్డీవోగా పూర్తి అదనపు బాధ్యతలతో పోస్టింగ్ తెచ్చుకోవాలని భావించారు. భవాని శంకర్ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పనిచేసే ఉండటం ఇక్కడ గమనార్హం.. ఆర్డిఓ పై ఏదో ఒక వివాదం సృష్టించి, వేటుపడేలా చేసి 350 కోట్ల విలువైన భూమికి ఆమె అడ్డు తొలగించుకోవాలన్నది సీఎంఓ ఉన్నతాధికారి మరియు ఆయన బంధువు జిల్లా ఉన్నతాధికారి యొక్క పన్నాగం. కాగా సదరు ఆర్డిఓ కు జరిగిన విషయం, కూటమి ప్రభుత్వంలో అక్రమాలకు ఒప్పుకోకుండా పనిచేయాలనుకునే మనస్తత్వం ఉన్న అధికారులకు ఒక గుణపాఠం కూడా. ఎందుకంటే సదరు సీఎంఓలోని ఐఏఎస్ అధికారి దేనిని *ముద్దాడ* లనుకుంటే అది ఆయన సొంతం అయ్యి తీరాల్సిందే. ముఖ్యమంత్రి గానీ మరెవరు గానీ ఆయన పవరును ఆపలేరు ఏమో అని ఈ విషయాలు తెలిసిన ప్రజలు గుసగుసలాడుకుంటు న్నారు.  ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని సీఎంవో ప్రక్షాళన చేయకుంటే నిజాయితీపరులైన అధికారులందరూ కూడా మిన్నకుండిపోతారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చిన ఏం చేసినా ఇలాంటి అధికారులను ఉన్నత స్థానాలలో ఉంచినంత వరకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి కూటమి ప్రభుత్వం నిజాయితీపరులైన అధికారులని కాపాడుకుంటుందో డ్రామా ప్లే మాస్టర్ లను నెత్తిన పెట్టుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది.

👉నవంబర్ 3 నుండి అన్ని ప్రైవేట్ కాలేజీలు బంద్!

తెలంగాణ : రాష్ట్రంలో నవంబర్ 3 నుండి అన్ని ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. పెండింగ్‌లో ఉన్న రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నవంబర్ 1 లోపు విడుదల చేయాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. బకాయిలు చెల్లించని యెడల వచ్చే నెల 3 నుంచి కాలేజీలు మూసివేస్తామని యాజమాన్యాలు హెచ్చరించాయి.

👉 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఎల్లుండి నుంచి విచారణ

తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చివరి దశ విచారణలు చేపట్టనున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తవగా, మిగిలిన ఆరు కేసులు ఈ వారంలో ముగియనున్నాయి. భారత రాజ్యాంగ పదో అనుసూచి ప్రకారం ఈ విచారణలు జరుగుతున్నాయని అసెంబ్లీ అధికారులు తెలిపారు.

👉భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టార్లు హతం

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టార్లు హతం అయ్యారు. మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్థుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.

🌟ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు సబ్-డివిజన్ అధికారులతో స్టేషన్ రికార్డులు, క్రైమ్ డేటా, మైగ్రేషన్ మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.*ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు జిల్లాలో పోలీస్ స్టేషన్ల రికార్డులు, ప్రొఫైల్/క్రైమ్ డేటా, మైగ్రేషన్ డేటా మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ సమగ్ర నిర్వహణ కోసం సబ్-డివిజన్ అధికారులు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో డేటా ఖచ్చితత్వం, సమయానుకూల అప్‌డేట్ మరియు ప్రజల భద్రతకు మరింత సమర్థమైన పోలీసింగ్ విధానాలుపై చర్చలు జరిపి, పోలీస్ శాఖ దృష్టి మరియు ప్రణాళికలను పునఃప్రతిపాదించారు.ఈ సమావేశం ద్వారా ప్రజల కోసం వేగవంతమైన, సమగ్ర మరియు సాంకేతిక ఆధారిత పోలీసింగ్ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యం.

👉కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసాం .. కాకినాడ జిల్లా డీఎస్పీ…

మైనర్ బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లడం హేయమైన చర్య..గతంలోనూ పలుమార్లు తీసుకెళ్లినట్లు సాక్ష్యాలు లభించాయి..ఫోక్సో, కిడ్నాప్ తో పాటు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశాం..బృందాలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం..బాలికకు తాతయ్య అవుతానని, ఇంజెక్షన్ వెయ్యాలని చెప్పి బాలికను బయటికి తీసుకెళ్లాడు..స్కూల్లో బాలిక కూడా మా తాతయ్య అని చెప్పడం, ఇంజెక్షన్ అనడంతో స్కూల్ టీచర్ తల్లిని అడగకుండా బయటికి పంపించారు.. ఎదురెదురు ఇల్లులు కావడంతో బాలిక నిందితుడిని తాతయ్య అని పిలిచేది..దీన్ని ఆసరాగా తీసుకుని నిందితుడు బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు.

💥 ప్లాష్ 💥 ప్లాష్ 💥

👉 భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ టంగుటూరు, కొత్తపట్నం ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు తేది.23.10.2025 న సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్  పి రాజాబాబు

👉 భారీ వర్షాల వలన ఎక్కువ వర్ష పాతం నమోదైన పామూరు , సి. ఎస్ పురం మండలాల్లో కూడా విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్.  జిల్లాలో ఎక్కడైతే ఎక్కువగా వాగులు పొంగిపొర్లు తున్నట్లయితే ఆయా మండలాల్లో సంబంధిత అధికారులు స్థానికంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించవచ్చునని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. . జిల్లా కలెక్టర్.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా