👉భీమవరంలో పేకాట శిబిరాలు.. పవన్ సీరియస్.. మట్కా పై కూడా స్పందించండి సార్..!!!.. 👉శభాష్ లోకేష్ : ఆంధ్రా రొయ్య ఆస్ట్రేలియాకు !.. 👉దేశభక్తి మాటల్లో కాదు.. మన మార్కెట్‌లో కనిపించాలి: ప్రకాష్ రాజ్… 👉ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు…👉ఏసీబీకి చిక్కిన ‘లంచాల’ తహశీల్దార్ ..!!

👉👉భీమవరంలో పేకాట శిబిరాలు.. పవన్ సీరియస్.. మట్కా పై కూడా స్పందించండి సార్..!!! .. డీజీపీకి ఆదేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇటీవల పలు జిల్లాల నుంచి పేకాట శిబిరాల నిర్వహణపై విస్తృత ఫిర్యాదులు అందాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేర్లు వాడుతున్నారనే ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి చేరాయి. అంతేకాకుండా సివిల్‌ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటం క్షమించరానిదని ఆయన హెచ్చరించారు.

పోలీసులు చట్ట పరిధిలోనే ఉండి, సివిల్‌ వివాదాల్లో తలదూర్చరాదని, ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో, భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పేకాట శిబిరాలపై ఫిర్యాదులు : డీజీపీకి నివేదిక కోరిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇటీవల పలు జిల్లాల నుంచి పేకాట శిబిరాల నిర్వహణపై విస్తృత ఫిర్యాదులు అందాయి. కొందరు ప్రభావశీలులు జూద కేంద్రాలు నడుపుతూ నెలవారీ మామూల్లు పోలీసు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు లభించాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా ఈ వ్యవహారంపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా నడుస్తున్న జూద కేంద్రాలపై డీజీపీ నుండి పూర్తి నివేదిక కోరారు. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రూపంలో జూదం ఆడటం, నిర్వహించడం లేదా ప్రోత్సహించడం నేరమని చట్టం స్పష్టంగా పేర్కొంటుంది. అయినప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, పోలీసు శాఖలో ఎవరైనా ఈ అక్రమాలకు అండగా ఉంటే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సందేశం “ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ అండగా ఉండరాదు. చట్టం అందరికీ సమానమే.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూద శిబిరాలపై కఠిన చర్యలు చేపట్టాలని, పోలీసులు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఆయన సూచనలతో జిల్లాల పోలీసు శాఖల్లో చురుకుదనం పెరిగిందని సమాచారం. **పేకాట పై ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే అదే విధంగా దశాబ్దాల తరబడిగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మట్కా జూదం ఆయన దృష్టికి రాలేదా దీనివల్ల ఎన్నో సంసారాలు కూలిపోతున్నాయి అదేవిధంగా లక్షల రూపాయలు నష్టపోయిన వారు కూడా ఉన్నారు కాబట్టి కూడా ఆయన ఉక్కుపాదం మోపాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

👉శభాష్ లోకేష్ : ఆంధ్రా రొయ్య ఆస్ట్రేలియాకు !

ఇప్పటిదాకా ఆంధ్రా రొయ్యల రైతులు అమెరికా మీదనే ఆధారపడ్డారు. అక్కడికే సీ ఫుడ్స్ ని ఎగుమతి చేశారు. దాంతో ఒక విధంగా మోనోపలీ అయిపోయింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఆంధ్రా రొయ్యల రైతులకు ఎంతో ఊరట దక్కుతోంది. భారత్ నుంచి ఎతి పెద్ద ఎగుమతిదారుగా ఉన్న ఆంధ్రా రైతులు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఆంక్షలు అధిక సుంకాలతో దిగాలు పడ్డారు. ఆంధ్రా రొయ్య ఎక్కడికీ ఎగరలేని పరిస్థితి ఎదురైంది. ఒక విధంగా ఏపీలో ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిన ఆక్వా ఫీల్డ్ మొత్తం బోసిపోయింది. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆనాడే వారికి ఒక హామీని ఇచ్చింది. కొత్త మార్కెట్ క్రియేట్ చేస్తామని చెప్పింది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ దానిని నిలబెట్టుకున్నారు. * ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియా : భారత్ నుంచి రొయ్యలను దిగుమతి చేసుకోవడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే కాదు గతంలో వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఈ రొయ్యల విషయంలో ఉన్న ఆంక్షలు అడ్డంకులు కూడా దూరం అయ్యాయి. ఇక సీ ఫుడ్ ఇండస్ట్రీ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో అక్కడ భాగస్వామ్యం కోసం మంత్రి నారా లోకేష్ జరిపిన చర్చలు అన్నీ సఫలీకృతం అయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రా రొయ్యల రైతులకు భారీ రిలీఫ్ దక్కింది అని చెప్పాల్సి ఉంది. కొత్త మార్కెట్ తో : ఇప్పటిదాకా ఆంధ్రా రొయ్యల రైతులు అమెరికా మీదనే ఆధారపడ్డారు. అక్కడికే సీ ఫుడ్స్ ని ఎగుమతి చేశారు. దాంతో ఒక విధంగా మోనోపలీ అయిపోయింది. అదే అమెరికాకు కూడా అధిక సుంఖాలు బిగించేందుకు కారణం అయింది. ఈ నేపథ్యంలో కొత్త మార్కెట్ గా ఇపుడు ఆస్ట్రేలియా కనిపిస్తోంది. ఈ మేరకు నారా లోకేష్ చేసిన విశేష ప్రయత్నం సక్సెస్ అయింది. కేవలం ఒకే మార్కెట్ మీద ఆధారపడకుండా నూతన మార్కెట్లను అన్వేషించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ చెప్పడం విశేషం. అంతే కాదు భారత దేశం నుంచి రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా తొలిసారి ఆమోదం తెలిపింది అన్నారు. ఈ విషయమో భారత్ ఆస్ట్రేలియా ప్రభుత్వాలు రెండు కృషి చేశాయని వారికి ధన్యవాదాలు అన్నారు.. ఇక మూతి దారుల కష్టాలు గట్టెక్కినట్లే..

👉దేశభక్తి మాటల్లో కాదు.. మన మార్కెట్‌లో కనిపించాలి దీపావళి వేళ దేశవ్యాప్తంగా మార్కెట్లు వెలుగుల్తో మెరిసిపోతున్నా, ఆ వెలుగుల వెనుక “దేశభక్తి”కు సవాలు విసిరే ప్రశ్నను నటుడు ప్రకాష్ రాజ్ లేవనెత్తారు. దీపావళి వేళ దేశవ్యాప్తంగా మార్కెట్లు వెలుగుల్తో మెరిసిపోతున్నా, ఆ వెలుగుల వెనుక “దేశభక్తి”కు సవాలు విసిరే ప్రశ్నను నటుడు ప్రకాష్ రాజ్ లేవనెత్తారు. ఆయన తనదైన “జస్ట్ ఆస్కింగ్” శైలిలో ఈసారి ‘మేడిన్ ఇండియా’ నినాదం వెనుక ఉన్న విరోధభాసాన్ని ఎత్తిచూపారు. *దీపావళి మార్కెట్‌– స్వదేశీ నినాదం ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పంచుకున్న దీపావళి మార్కెట్ వీడియోలో “గోబీ ఉంటే గుమ్మడికాయ కూడా ఉంటుంది” అంటూ తన ప్రత్యేకమైన హాస్యంతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాడు.

ఆయన అభిప్రాయం ప్రకారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ప్రజలకు “విదేశీ వస్తువులను కొనవద్దు”, “స్వదేశీని ప్రోత్సహించండి” అని చెబుతూనే, మరోవైపు దేశీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తుల ఆధిపత్యం పెరుగుతుండడాన్ని చూసి మౌనం పాటిస్తోందని విమర్శించారు. చైనా ఉత్పత్తుల మోజు కొనసాగుతోందా? ప్రకాష్ రాజ్ ప్రకారం.. ఈ సంవత్సరం దీపావళి కూడా మినహాయింపుగా లేదు. టపాసులు, లైట్లు, దీపాలంకరణలు.. దాదాపు 70 శాతం వరకు ఇప్పటికీ చైనాలో తయారు అవుతున్నాయని ఆయన ఆరోపించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెబుతూనే ఇంతటి దిగుమతి అనుమతించడంలో చిత్తశుద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు. *ప్రభుత్వం నిజంగా స్వదేశీ భావనతో ఉందా? ప్రకాష్ రాజ్ అభిప్రాయం ప్రకారం మాటలకే గాక, ఆచరణలో కూడా “మేడిన్ ఇండియా”ను నిరూపించాల్సిన సమయం వచ్చింది. అందుకోసం ఆయన సూచించినవి.. చైనాలోనుంచి దిగుమతి అయ్యే దీపావళి ఉత్పత్తులపై నిషేధం విధించాలని కోరారు. దేశీయ తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, మద్దతు ఇవ్వాలని.. స్వదేశీ బ్రాండ్లను ప్రోత్సహించేందుకు మార్కెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలతోనే “మేడిన్ ఇండియా” నినాదం అర్థవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తయారీ శక్తి ఉన్న దేశం అయితే… “మన దేశం తన సాంకేతికతతో రాకెట్లు, క్షిపణులు, యుద్ధ నౌకలు, రైళ్లు తయారు చేయగలుగుతోంది. అయితే సాధారణ అగ్గిపెట్టెలు, దీపావళి టపాకాయలు మాత్రం ఎందుకు తయారు చేయలేకపోతోంది?” అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలో ఆయన వ్యంగ్యం మాత్రమే కాదు. దేశీయ తయారీ విధానాలపై లోతైన ఆలోచనకు ఆహ్వానం కూడా ఉంది.

*ప్రభుత్వం నిజంగా స్వదేశీ భావనతో ఉందా? .. ప్రకాష్ రాజ్ అభిప్రాయం ప్రకారం మాటలకే గాక, ఆచరణలో కూడా “మేడిన్ ఇండియా”ను నిరూపించాల్సిన సమయం వచ్చింది. అందుకోసం ఆయన సూచించినవి.. చైనాలోనుంచి దిగుమతి అయ్యే దీపావళి ఉత్పత్తులపై నిషేధం విధించాలని కోరారు. దేశీయ తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, మద్దతు ఇవ్వాలని.. స్వదేశీ బ్రాండ్లను ప్రోత్సహించేందుకు మార్కెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలతోనే “మేడిన్ ఇండియా” నినాదం అర్థవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తయారీ శక్తి ఉన్న దేశం అయితే… “మన దేశం తన సాంకేతికతతో రాకెట్లు, క్షిపణులు, యుద్ధ నౌకలు, రైళ్లు తయారు చేయగలుగుతోంది. అయితే సాధారణ అగ్గిపెట్టెలు, దీపావళి టపాకాయలు మాత్రం ఎందుకు తయారు చేయలేకపోతోంది?” అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలో ఆయన వ్యంగ్యం మాత్రమే కాదు. దేశీయ తయారీ విధానాలపై లోతైన ఆలోచనకు ఆహ్వానం కూడా ఉంది. నిజమైన స్వయం సమృద్ధి అవసరం స్వదేశీ నినాదం కేవలం రాజకీయ ప్రచార నినాదంగా కాకుండా, ఆర్థిక స్వయం సమృద్ధి సాధనానికి దారితీయాలని ప్రకాష్ రాజ్ ఈ సెటైర్ ద్వారా చెప్పిన పాఠం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన “జస్ట్ ఆస్కింగ్” ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఒక చిట్టి హెచ్చరికనిచ్చారు. దేశభక్తి మాటల్లో కాదు, మన మార్కెట్‌లో కనిపించాలి.

👉ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డులలో అందుబాటులో ఉంచడం, తదితర అంశాలను గనుల  శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. ఇసుక స్టాక్ యార్డుల నిర్వహకులతోనూ, రవాణాదారులతోనూ ఈ సందర్భంగా ఆయన  నిర్వహణ, రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులు పై ఆరా తీశారు.

 స్థానికంగా ఉన్న వాగులు, వంకలలో లభ్యమయ్యే ఇసుకను స్థానికులే వినియోగించుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ జరుగుమల్లి నుంచి కొందరు అక్రమంగా ఒంగోలు నగరంలోకి తీసుకువస్తున్నారని, ఫలితంగా ఈ యార్డుల నుంచి సరఫరా చేసే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రవాణాదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయా వనరుల నుంచి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు,  మైనింగ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించి ఈ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు ఇసుక సరసమైన ధరలో అందుబాటులో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్యానికి, మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తమ గ్రామాల్లోని వాగులు, వంకలకు బయట నుంచి వాహనాలు వస్తే వాటిని అడ్డుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఇసుకను రవాణా చేసే వాహనాలకు ఫిట్నెస్, ఇతర పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, ప్రజలకు అవసరమైన స్థాయిలో స్టాక్ యార్డులలోనూ ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ యార్డుల నుంచి ఇసుకను కొనుగోలు చేసే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గత 6 నెలల కాలంలో యార్డుల నుంచి ఇసుకను కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించి, వారితో మాట్లాడాలని గనుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  సరసమైన ధరలకే ఇసుక లభ్యం కావడం, ఈ విషయంలో ప్రజల్లోనూ సానుకూల అభిప్రాయం వ్యక్తం కావటమే లక్ష్యంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇసుకపై సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ఆయన తెలిపారు.   ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఒంగోలు ఆర్డీవో కళావతి, ఒంగోలు డి.ఎస్.పి. ఆర్. శ్రీనివాసరావు, డిటిసి సుశీల, ఆర్డబ్ల్యూఎస్. ఎస్.ఈ. బాల శంకరరావు, భూగర్భ నీటి వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

👉ఏసీబీకి చిక్కిన ‘లంచాల’ తహశీల్దార్..!!*

కోనసీమ జిల్లా అమలాపురం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తహశీల్దార్ అశోక్ ప్రసాద్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతని టేబుల్పై అక్రమంగా ఉన్న రూ.5.84 లక్షల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..!!

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా