👉రాహుల్ కి షాకింగ్ రిక్వెస్ట్….స్వీట్ కోసమని వెళ్తే ! రాహుల్ గాంధీకి ఒక తీయని అనుభవం ఎదురైంది. అది కూడా దీపావళి పండుగ వేళ. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత, గాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన వారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు. ఇలా ముందు చాలానే ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ ఇప్పటికి అయిదు సార్లు ఎంపీగా గెలిచి లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయం గురించి చెప్పాలంటే అది వేరే స్టోరీ. ఇక రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన పెళ్ళి చేసుకోలేదు. రాహుల్ వయసు అక్షరాలా 55 ఏళ్ళు. అయినా ఎక్కడా గ్లామర్ తగ్గలేదు, ఆయన సరే అంటే పెళ్ళి చేసుకోవడానికి క్యూ కట్టే లేడీస్ కి కొదవ లేదు. అయితే ప్రాబ్లమల్లా రాహుల్ గాంధీ పెళ్ళికి ఓకే చెప్పకపోవడమే. అందుకే అంతా అంటున్నారు ఆయన్ని పెళ్ళిచేసుకోమని. **తీయని అనుభవం : రాహుల్ గాంధీకి ఒక తీయని అనుభవం ఎదురైంది. అది కూడా దీపావళి పండుగ వేళ. రాహుల్ గాంధీ చాలా కాలంగా ఢిల్లీలోని ఒక స్వీట్ షాప్ లో స్వీట్స్ కొనుగోలు చేస్తూ వస్తున్నారు అలా ఆయన ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాప్ కి వెళ్ళారు. అక్కడ ఆయన్ తన కుటుంబానికి స్నేహితులకు స్వీట్లు కొనుగోలు చేయడమే కాదు తానే స్వయంగా రెండు స్వీట్లు కూడా తయారు చేశారు. రాహుల్ కి వంటలు వచ్చు అన్నది ఇక్కడ గమనించాలి. అంతే కాదు ఆయనకు వంటలు చేయడం అన్నది ఒక హాబీ కాదు ఆసక్తి కూడా ఉంది. అందుకే తాను స్వీట్లు కొనుగోలుతో పాటు తయారు చేస్తాను అంటే యజమాని సైతం ఓకే చెప్పేశారు. అయితే ఇదే సందర్భంలో రాహుల్ ని షాప్ యజమాని సుశాంత్ జైన్ ఒక తీయని అభ్యర్ధన చేశారు. రాహుల్ జీ తొందరగా పెళ్ళి చేసుకోండి జీ అంటూ. రాహుల్ ఏం చెప్పారంటే : అయితే ఈ తరహా రిక్వెస్ట్ తనకు వస్తుందని అసలు ఊహించలేదు రాహుల్ గాంధీ. అందుకే ఆయన దానికి బదులు అయితే ఇవ్వలేదు, తాను బేసిన్ లడ్డూ, అలాగే ఇమర్తి తయారు చేశారు. అయితే స్వీట్ షాప్ యజమానికి రాహుల్ తో ఉన్న చనువు కారణంగానే ఈ రిక్వెస్ట్ చేశారు. రాహుల్ మీరు పెళ్ళి చేసుకుంటే భారీ ఎత్తున స్వీట్ ఆర్డర్స్ మా షాప్ కి వస్తాయని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. దానికి రాహుల్ కూడా నవ్వేశారు. పైగా రాహుల్ కి తమ దుకాణం సొంత దుకాణం లాంటిది అని మీడియాకు సుశాంత్ జైన్ చెప్పారు. రాహుల్ ని ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అభివర్ణించారు. రాహుల్ పెళ్ళి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది అని కూడా జైన్ అనడం విశేషం. 
*రాహుల్ ట్వీట్ : ఇక తాను స్వీట్ దుకాణానికి వెళ్ళడం అక్కడ స్వయంగా రెండు స్వీట్లు తయారు చేయడం మీద రాహుల్ ఎక్స్ వేదికగా తన అభిమానులతో ఆ విశేషాలను పంచుకున్నారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైనది ఘంటేవాలా స్వీట్ షాప్ అని ఆయన చెప్పారు. అక్కడ తాను ఇమర్తి బేసన్ లడ్డూలను తయారు చేయడానికి ప్రయత్నించాను అని చెప్పారు. శతాబ్దాల నాటి ఈ దుకాణం తీపిదనం నేటికీ స్వచ్ఛంగా సంప్రదాయబద్ధంగా ఉందని అదే హృదయానికి హత్తుకుంటోంది అని రాహుల్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఇంతకీ పెళ్ళెప్పుడు : రాహుల్ గాంధీ పెళ్ళి ఎపుడు అన్నది సదరు దుకాణందారుడికే కాదు దేశమందరికీ ప్రశ్నగానే ఉంది. జవాబు అయితే రాహుల్ చెప్పడం లేదు. ఆయన తరచూ విశ్వవిద్యాలయాలకు వెళ్తారు, అక్కడ ఉన్న విద్యార్ధినీ విద్యార్ధులతో ముచ్చటిస్తారు. వారు వేసే మొదటి ప్రశ్న కూడా ఇదే. రాహుల్ జీ మీ పెళ్ళి ఎపుడూ అని. దానికి రాహుల్ ఒక్కోసారి డైరెక్ట్ గా బదులిస్తారు. చేసుకుంటే మీ అందరికీ చెబుతాను అని. మరోసారి దాటవేస్తారు. మొత్తానికి రాహుల్ కి పెళ్ళి చేసుకునే ఆలోచన ఉందా లేదా అన్నది కాంగ్రెస్ వర్గాలకే అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా 55 ఏళ్ళ వయసు నిండిన రాహుల్ గాంధీ పెళ్ళి చేసుకుంటే అది అతి పెద్ద వార్తగా రికార్డులు క్రియేట్ చేస్తుందన్నది వాస్తవం. సోషల్ మీడియా అయితే దద్దరిల్లి పోయేంతగా వైరల్ అవుతుంది. మరి ఆ న్యూస్ వినే రోజు దగ్గరలో ఉందా లేక దూరంగా ఉందా లేక అసలు లేదా ఏమో కాలమే జవాబు చెప్పాలి మరి.
👉 పోలీసులకు టఫ్ టాస్క్ ఇచ్చిన చంద్రబాబు …
ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసుల పనితీరుని మెచ్చుకుంటూనే వారికి దిశా నిర్దేశం చేశారు. ఏపీ పోలీసులు దేశానికే ఒక బ్రాండ్ అని వారి ఘనతను గుర్తు చేస్తూనే ఇంకా పెద్ద చాలెంజ్ లను ఎదుర్కోవాలని కోరారు. అంతే కాదు రానున్న కాలం టెక్నాలజీ వాటికి అనుగుణంగా పెరిగిపోతున్న నేరాలు ఒక పెను సవాల్ కాబోతున్నాయని వాటిని కూడా అంతే సమర్థతతో పోలీసులు చేదించి సాధించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇంటెలిజెంట్ క్రైమ్స్ అంటూ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటెలిజెంట్ క్రైమ్స్ అన్న పదం వాడారు. అవును టెక్నాలజీ పెరిగిన తరువాత ఈ కొత్త రకం నేరాలు ఆవిష్కృతం అవుతున్నాయి. నేరస్తుడు ఎక్కడో ఉంటాడు, నేరం మాత్రం జరిగిపోతుంది, మూలాలు కనుగొనాలీ అంటే చాలానే చేయాలి, దాంతో ఈ తరహా నేరాల పట్ల పూర్తిగా అలెర్ట్ గా ఉండాలని బాబు పోలీస్ శాఖను కోరారు. ఇంటెలిజెంట్ క్రైమ్స్ విషయంలో నేరస్తుల కంటే పోలీసు యంత్రాంగం ముందుండాలని బాబు కోరారు. ఆ విధంగా చేయగలిగితేనే వీటిని పూర్తిగా అరికట్టగలమని అన్నారు. ఇది చాలా టఫ్ చాలెంజ్ గా పోలీసుల ముందు ఉంది. నిజానికి చెబితే రాజకీయ పలుకుబడితోనే ఎక్కువగా నేరాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈ రోజున కూడా అయితే పుట్టలేదు, చాలా కాలంగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో అధికం అయింది. నేరాలు చేసేవారికి ఒక అండ దొరుకుతోంది. వారు పైకి ముసుగు వేసుకుంటున్నారు. లోపల జరిగేది వేరుగా ఉంటోంది. ఏమంటే రాజకీయ వేధింపులుగా చెబుతున్నారు. కానీ జరగాల్సిన అకృత్యాలు తెర వెనక సాగిపోతూంటాయి. ఈ విధంగా రాజకీయ ముసుగు వేసుకుని నేరాలు చేసే వారి ముసుగు తొలగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పోలీసులకు సూచించారు. వీటిని అరికట్టకపోతే ఏపీలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుందని అందువల్ల పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆయన హెచ్చరించారు. ట్రెడిషనల్ డ్యూటీ మైండ్ సెట్ నుంచి : అయితే ఇది ఏమంత సులువు అయితే కాదు, టఫ్ జాబ్, ఎందుకంటే కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా రాజకీయాల వెనక ఉన్న నేరాలు ముసుగు వ్యవహారాలు ఉంటాయి. వీటి విషయంలోనే ఎక్కువగా పోలీసులు ఆందోళన చెందుతూంటారు, వీటి కారణంగానే వారు ఇబ్బందులు పడడమే కాకుండా విమర్శలు ఎదుర్కొంటూంటారు. కానీ ఏపీలో అంతా సజావుగా ఉండాలంటే పోలీసులు తమ విధులను కచ్చితంగా నిర్వహించడమే కాకుండా ట్రెడిషనల్ డ్యూటీ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మరింత స్మార్ట్ గా వ్యవహరించాలని చంద్రబాబు కోరారు. విజిబుల్ పోలీసింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఎదురుగా ఖాకీ డ్రస్ తో సిబ్బంది ఉంటారు. కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. పోలీస్ ప్రత్యక్షంగా లేకపోయినా నేరాలను అదుపు చేయడం. పోలీసు ఎల్లెడలా ఉండేలా చేయడం, ప్రజలకు ఆ విధగా భరోసా కల్పించడమే కాదు నేరస్తులకు హెచ్చరికగా వ్యవహరించడం. ఈ తరహా పోలీసింగ్ అతి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందుకోసం టెక్నాలజీని పోలీసులు విస్తృతంగా వాడుకోవాలని ఆయన సూచించారు.
👉డి.ఎస్.పి వ్యవహార శైలిపై పవన్ సీరియస్* అమరావతి.. :
పశ్చిమగోదావరి జిల్లా *భీమవరం డీఎస్పీ జయసూర్య* వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం..భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై పలు ఆరోపణలు..కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడిన పవన్..జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు..భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు సూచించిన పవన్.
👉 ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పిసిపల్లి మండల కేంద్రము లో మంగళవారం ఉదయం ట్రంప్ దిష్టి బొమ్మను తగులబెట్టారు.ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు, బడుగు వెఃకటేశ్వర్లు ,బడుగు జనార్ధన్,గుంటగాని యాకోబు, స్టీఫెన్, రాజు, రైతు సంఘం నాయకులు నారపరెడ్డి,మాలకొండయ్య,ఎస్సయ్య,పోతులూరయ్య,అండ్ర మాలకొండయ్య,, బెంజమిన్ , కరణం రామారావు తదితరులు పాల్గొన్నారు.
👉ట్రంప్ విధించిన 50% సుంకాలను ఎత్తి వేయాలి.. ప్రజా సంఘాలు డిమాండ్..
జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామం లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంపు భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ఫై విధించిన 50% సుంకలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ట్రంప్ సుంకాల కాపీలను దహనం చేయటం జరిగింది. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి. మోజెస్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంపు భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల ఫై సుంకాలు విధించటం దుర్మార్గం అని అన్నారు. ఇది భారత ప్రజల ఫై పెను భారాలు మోపుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారత దేశ ఆర్థిక వ్యవస్థ ను దెబ్బ తీసే కుట్ర అని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టీ. రాము మాట్లాడుతూ భారత దేశ ఎగుమతుల ఫై సుంకాలు విదిస్తే మోడీ మౌనంగా ఉండటం అన్యాయం అని అన్నారు. ఇది భారత దేశ కార్మిక వర్గం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది అని అన్నారు. ట్రంప్ విధించిన సుంకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోతే ప్రజలు తగిన బుద్ది చెబుతారు అని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమం లో టీ. సుబ్బారావు, జీ. అంకయ్య, బి. శివయ్య, కేవీ. శేషయ్య, బి. రమణయ్య, టీ. నారాయణరావు, ఇ. ఏసుబాబు, కె. యలమంద తదితరులు పాల్గొన్నారు..
🌟ప్రకాశం జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణ..పోలీస్ అమర వీరులకు ఘన నివాళులర్పించిన మంత్రి , జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు*
*పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం: రాష్ట్ర మంత్రివర్యులు డోలాశ్రీ
*నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీసులు అందించే సేవలు ఎంతో విలువైనవని: జిల్లా కలెక్టర్ రాజబాబు.*
*దేశ భద్రత, ప్రజా రక్షణలో పోలీసుల అంకితభావం, త్యాగం అమర స్మృతిగా నిలుస్తుంది… నిత్య స్ఫూర్తిదాయకం:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.
అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయం & గ్రామ వాలంటీర్ శాఖా మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోలా వీరాంజనేయులు , జిల్లా కలెక్టర్ రాజబాబు, ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, , ప్రజాప్రతినిధులు మరియు పోలీసు అధికారులు ఘనంగా నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. పెరేడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు.అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ మంత్రి గారు,జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ , ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అమరవీరులకు నివాళులు అర్పించారు.*
పోలీసు అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా విధుల నిర్వహణలో పోలీసు, ఇతర భద్రతా సిబ్బంది చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. విధుల నిర్వహణలో జిల్లాలో గత ఏడాది 13 మంది పోలీసు సిబ్బంది అమరులు అయినట్లు తెలిపారు. ఆర్థికంగానూ, మానవతా దృక్పథంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ అమరులైన వారి స్ఫూర్తిని భావితరాల సిబ్బంది కూడా కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు.
దేశభద్రతలో, శాంతిభద్రతల పరిరక్షణలో నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బంది మన అందరికీ గర్వకారణమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. దేనికోసం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలు త్యాగం చేశారో ఆ త్యాగం వెనుక ఉన్న ఉద్దేశాన్ని, నిస్వార్థ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ మరింత స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకువెళుతూ అమరవీరుల సమస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా మారుతున్న పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలోనూ, విపత్తులలో సహాయక చర్యలు చేపట్టడంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ గారు అన్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొంటూ ప్రజా రక్షణే మహా ధ్యేయంగా విధుల నిర్వహణలో పోలీసు సిబ్బంది చూపుతున్న చిత్తశుద్ధి మనందరికీ ఆదర్శమని కలెక్టర్ కొనియాడారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భముగా అందరికీ నమస్సుమాంజలులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమై, విధినిర్వహణలో అశువులు బాసిన, అమర పోలీసు సోదరులకు భాష్పాంజలి ఘటిస్తూ యావద్భారత దేశం ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నదని, 1959 వ సంవత్సరము అక్టోబరు 21వ తేదిన జమ్మూ కాశ్మీర్ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తున గల దేశ సరిహద్దు అయిన లడక్ లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతములో భారత దేశం పై చైనా దురాక్రమణకు పాల్పడినదని, రక్తాన్ని గడ్డకట్టించే చలిలో దేశరక్షణ కోసం కాపల డ్యూటీ లో వుండి అకస్మాత్తుగా దొంగదెబ్బ తీసిన చైనా ముష్కర సైనికులతో వీరోచిత పోరాటము చేసి 10 మంది జవాన్లు అశువులు బాసారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరము అక్టోబరు 21 న “పోలీసు అమర వీరుల సంస్మరణ దినం” జరుపుకుంటున్నామని, ఇటీవలే భారత ప్రభుత్వము అక్టోబరు 21వ తేదీని “నేషనల్ పోలీస్ డే” గా ప్రకటించిందని తెలిపారు.
ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడి వారికి బహుమతులు అందజేశారు.ఈ సంవత్సరం దేశ వ్యాప్తముగా ప్రాణాలను కోల్పోయిన 191 మంది పోలీస్ బలగాల సిబ్బంది యొక్క పేర్లులను అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వర రావు ఈ కార్యక్రమములో చదివి విన్పించి శ్రద్దాంజలి ఘటించినారు. కార్యక్రమంలో సంతనూతలపాడు యంయల్ఏ బీ.ఎన్.విజయకుమార్ , కనిగిరి యంయల్ఏ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి , ఒంగోలు మేయర్ గంగాడ సుజాత , పీ.డీ.సీ.సీ. బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్.లక్ష్మానాయక్, ఉప రవాణా శాఖ కమిషనర్ అర్.సుశీల, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ క్లినిక్ డాక్టర్ భానుమతి, సీఐలు, ఆర్ ఐ లు, ఎస్సైలు,అమర వీరుల కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
👉దర్శిలో పోలీసుల అమర వీరుల దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సీఐ వై రామారావు ఎస్సై ఎం మురళి తాసిల్దార్ ఎం శ్రావణ్ కుమార్ తో పాటు పోలీసులు పుర ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు.
👉 పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా కంభం లో సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కంభం సీఐ కే మల్లికార్జున రావు,ఎస్ఐ నరసింహారావు, అర్ధవీడు ఎస్సై శివ నాంచారయ్య, బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి మరియు ఎమ్మార్వో కే.కిరణ్,రెవెన్యూ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు

