👉ప్రధాని మోదీపై ‘ఎక్స్’లో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు …. !!!
కర్నూలు వేదికగా మోదీ దీపావళి టపాకాయ తుస్సుమంది అంటూ విమర్శలు ..వచ్చిందేమో ఏపీకి.. కానీ బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం వేశారంటూ ఎద్దేవా .. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయలకు తెర లేపి మరోసారి రాష్ట్ర ప్రజలను మోదీ ఘరానా మోసం చేశారని వ్యాఖ్యలు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించిన వైఎస్ షర్మిల.
👉 టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో కలకలం!!!
రాజమండ్రి అర్బన్, రూరల్‌లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో ఫోన్‌లో మాట్లాడిన రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్చార్జ్ మజ్జి రాంబాబు ..సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన టీడీపీ నేత రాంబాబు ఫోన్ సంభాషణ..ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయం కూడా ఆడియోలో ఉన్నాయి. నార్త్, సౌత్ ఎక్సైజ్ సీఐ లను కూర్చోబెట్టి మాట్లాడదామన్న రాంబాబు… ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది
👉 హైదరాబాద్: మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో ఐపీఎస్‌లే కీలకమని బీఎస్‌ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 77వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ హక్కులను కాపాడాలని, ముందున్న సవాళ్లు అధిగమించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై దృష్టి పెట్టాలన్నారు. ధనవంతులు, పేదవారిని ఒకేలా చూడాలని సూచించారు.‘‘ఆపరేషన్ సిందూర్‌లో పోలీసు సిబ్బంది ఎంతో సహకారం అందించారు. సాయుధ దళాలతో కలిసి పనిచేశారు. సాంకేతికత మీద మాత్రమే ఆధారపడొద్దు.. క్షేత్ర స్థాయిలో పని చేయాలి. పోలీసు స్టేషన్ అనేది ప్రతి పౌరుడికి మొదటి నమ్మకం. ఐపీఎస్‌లుగా మీకు ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యం. మీరు బలంగా ఉంటేనే విధుల్లో సమగ్రంగా రాణించగలరు. కొత్త చట్టాలను పటిష్ఠంగా అమలు చేయండి. క్షేత్రస్థాయిలో ప్రతిరోజు ఒక సవాలే. రాజ్యాంగానికి లోబడి పని చేస్తే ఉన్నతంగా ఉండగలరు. మీరు ఐపీఎస్‌లు మాత్రమే కాదు.. పేదలను ఆపద నుంచి కాపాడే సంరక్షకులు’’ అని దల్జీత్ సింగ్ చౌదరి అన్నారు.
👉పంతం నెగ్గించుకున్న కొండా.. ఆ నేత ఔట్!..
తెలంగాణ : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్ రెడ్డిని మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయడంతో, కరణం ప్రహ్లాద్ రావును కొత్త జిల్లా కన్వీనర్‌గా నియమించారు. రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడిని మార్చాలన్న విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్‌పై హైకమాండ్ భూపాల్ గౌడ్‌కు హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అధ్యక్షుల నియామకాలపై పార్టీలో చర్చ కొనసాగుతోంది.
👉 కత్తితో నిందితుడి దాడి.. కానిస్టేబుల్ మృతి
తెలంగాణ : నిజామాబాద్ నగరంలో ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, నిందితుడు కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ (42) మృతి చెందారు. శుక్రవారం రాత్రి హాస్మీ కాలనీకి చెందిన రియాజ్ (24) అనే నిందితుడిని పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రమోద్, అతని మేనల్లుడు వెళ్లారు. అదుపులోకి తీసుకుని బైక్‌పై స్టేషన్‌కు వస్తుండగా, వినాయక్‌నగర్ వద్ద నిందితుడు కానిస్టేబుల్ ఛాతీలో కత్తితో పొడిచి, ఆపేందుకు ప్రయత్నించిన మేనల్లుడిపైనా దాడి చేశాడు.
👉తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించింది. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్‌కు తమిళనాడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. గడచిన 15 రోజులుగా బాంబు బెదిరింపుల మెయిల్స్ వరుసగా రావడం కలకలం రేపుతోంది.
👉 11 మంది బాలురపై లైంగిక దాడి..
తెలంగాణ .. హైదరాబాద్‌లోని సైదాబాద్ జువెనైల్ హోంలో స్టాఫ్ గార్డ్ రహమాన్‌పై మరో ముగ్గురు బాలుర లైంగిక దాడి ఫిర్యాదులు రావడంతో మొత్తం ఐదు పోక్సో కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలలుగా నిందితుడు 11 మందికి పైగా బాలలను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు హోంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకుని, బాలలతో మాట్లాడి కీలక వివరాలు సేకరించారు. విచారణలో రహమాన్ అకృత్యాలు తెలుసుకుని పోలీసులు సైతం చలించిపోతున్నారు.
👉 తిరుమల వెళ్లే వారు బీ అలర్ట్…..తిరుమల రెండో ఘాట్ రోడ్డులో చిరుత సంచారం*
తిరుపతిలో శుక్రవారం తెల్లవారుజామున చిరుత పులి సంచారం కలకలం రేపింది.అలిపిరి జూపార్క్ రోడ్ సమీపంలో భక్తులకు కనిపించిన చిరుతను కారులో వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీటీడీ అధికారులు అప్రమత్తమై, చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించి, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులో కూడా చిరుతల సంచారంపై నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
👉 ఇలాగైతే మద్యం వ్యాపారం చేయలేం.. అనకాపల్లి
అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మద్యం దుకాణాల యజమానులు నిరసన..వ్యాపారాలు చేయలేమంటూ మద్యం దుకాణాల యజమానులు నిరసన..మద్యం దుకాణాలు తాళాలు జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించిన యజమానులు..మార్జిన్ 20శాతం అమలు చేయాలంటూ ఎక్సైజ్ డీలర్లు నినాదాలు..సమస్యలు పరిష్కరించకుంటే దుకాణాలు నిర్వహించలేమన్న నిర్వాహకులు..
👉సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డోలా శ్రీ.. టంగుటూరు
రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ఆలోచన అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
శుక్రవారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు రూ.30.14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం, ఆలోచన అని అన్నారు. అందులో భాగంగా పేద ప్రజలు ఆనారోగ్యం పాలై ఆసుపత్రి ఖర్చుల కోసం చాలా మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కి దరఖాస్తు చేసుకోవడం జరుగుచున్నదన్నారు. వారిలో కొండపి నియోజకవర్గ పరిధిలో 45 మందికి 30 లక్షల 14 వేల రూపాయలు మంజూరు కాగా, వారికి ఈ రోజు చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 925 మంది లబ్దిదారులకు 7 కోట్ల 57 లక్షల 64 వేల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నదన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకురావడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో అన్నీ రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషణ్ చేసి సంజీవిని పధకం ద్వారా ప్రజల ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ 25 లక్షల రూపాయల వరకు ఇన్సురెన్స్ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్ తో వైద్య కళాశాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు మంత్రి అన్నారు. ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలను అందించి వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.

