👉 పీఎం కోసం.. సీఎం.. మనసు పెట్టేస్తున్నారుగా.. ! ఆ మాత్రం ఉండాలి తప్పదు మరి.. `పీఎం కోసం సీఎం` ఈ మాట టిడిపి నాయకుల్లో బలంగా వినిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీకి తీసుకురావడంతో పాటు ఆయన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాదు పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా ఆయన ప్రకటిస్తున్నారు.
ఒకప్పుడు ప్రధాన మంత్రులు వస్తే ఆ రోజుతో ఆ కార్యక్రమం అనంతరం వేరే కార్యక్రమాలకు వెళ్లేవారు. కానీ, ఇటీవల కాలంలో ప్రధానమంత్రి వెంటే ఉంటూ ప్రధానమంత్రి కార్యక్రమం అయిన తర్వాత అదే కార్యక్రమం పై సమీక్షలు చేయటం అధికారులతో చర్చించటం వంటివి చేస్తున్నారు. గతంలో యోగాంధ్రకు ఒకసారి, అదేవిధంగా అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణం కోసం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ఇప్పుడు నాలుగోసారి కర్నూలుకు వచ్చారు. అయితే ఈ పర్యటనలు అన్నీ కూడా ప్రధానమంత్రి ప్రతిష్టను కాపాడేందుకు, అదే విధంగా ఆయన స్థాయిని మరింత పెంచేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది టిడిపి నాయకులు చెబుతున్న మాట. ఈ క్రమంలో ప్రధాన మంత్రి పర్యటనల కోసం సీఎం చంద్రబాబు దాదాపు 4 -5 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారని ఆయన చాలా సమయం వెచ్చిస్తున్నారని కూడా అంటున్నారు. తాజాగా కర్నూలు పర్యటనకు సంబంధించి టిడిపి నాయకులతో సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇది గతంలో ఎప్పుడూ చేయలేదు. పైగా అందరినీ అలర్ట్ చేయడంతో పాటు మంత్రులందరూ కర్నూలు పర్యటనకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. అదే విధంగా కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు అందరూ కూడా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంటే గతానికి భిన్నంగా సీఎం చంద్రబాబు ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పెద్దపీట వేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బిజెపి నాయకులకన్నా కూడా ఎక్కువగానే ప్రధానమంత్రికి ప్రాధాన్య ఇస్తున్నారు అన్నది వాస్తవం. దీని వెనక రాజకీయాలు ఉన్నాయా వ్యక్తిగతంగా రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుంద ని చంద్రబాబు భావిస్తున్నారా అనేది పక్కన పెడితే ఎన్నడూ లేని విధంగా పీఎం కోసం సీఎం మనసు పెడుతున్నారు అన్నది మాత్రం స్పష్టమవుతోంది. ఇదే విషయం ఇప్పుడు పార్టీ నాయకుల్లో చర్చగా మారింది. అయితే.. ప్రధాని ఆమేరకు సహకరిస్తారా? అనేది చూడాలి.
👉 మాగుంట సంచలన ప్రకటన…వారసుడు ఆయనే !
తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా 2024 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా 2024 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. ఆయన అంతకు ముందు 2019 నుంచి 2024 దాకా వైసీపీ నుంచి ఈ పదవిలో కొనసాగారు. అంతకు ముందు కాంగ్రెస్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన కుటుంబం మొత్తం రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చినదే. మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా చేస్తే ఆయన హత్య తరువాత సతీమణి మాగుంట పార్వతమ్మ అదే సీటు నుంచి ఎంపీ అయ్యారు. ఇలా చూస్తే ఒంగోలు ఎంపీ సీటు మాగుంట కుటుంబాన్ని దశాబ్దాలుగా పార్టీలకు అతీతంగా ఆదరిస్తూ వస్తోంది అన్నది స్పష్టం.* రాజకీయ విరామం : ఇవన్నీ పక్కన పెడితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదులు దాటిన వారు అవుతారు. దాంతో తన రాజకీయం ఇక చాలు అని ఆయన అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని కూడా మరో కీలక ప్రకటనను ఆయన చేయడం విశేషం. యువ నేతగా : ఇక మాగుంట రాఘవరెడ్డి యువనేతగా ఉంటూ వస్తున్నారు. తండ్రికి రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వైసీపీలో ఉన్నపుడే ఆయన పోటీ చేయాల్సింది అని ప్రచారంలో ఉంది. ఇపుడు పార్టీ మారింది అంతే తేడా అంటున్నారు. అయితే ఒంగోలు పార్లమెంట్ చరిత్ర చూస్తే టీడీపీ ఇక్కడ గెలిచింది తక్కువ సార్లే అని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కి పట్టు ఎక్కువ అని చెబుతారు. * గెలిచింది మూడు సార్లే : ఇక తెలుగుదేశం ఏర్పాటు అయ్యాక 1984లో తొలిసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే బెజవాడ పాపిరెడ్డి గెలిచారు. ఆ తరువాత మళ్లీ 1999లో టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అంటే 2024లో టీడీపీ గెలిచింది. ఇక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. వైసీపీ రెండు సార్లు గెలిచింది. దాంతో వైసీపీకి ఇక్కడ బలం చాలా ఉంది అని అంటున్నారు. అంతే కాదు రెడ్లు అధికంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇదని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆ సామాజిక వర్గం బలం అన్నీ కలసి గతంలో కాంగ్రెస్ ని తరువాత కాలంలో వైసీపీని గెలిపిస్తూ వచ్చాయని చెబుతున్నారు. 2014లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలు అయిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇక 2029 లో ఒంగోలు నుంచి వైసీపీ తరఫున పోటీకి జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి రెడీ అవుతున్నారు. నిజానికి ఆయనకు 2024లోనే టికెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేకపోయారు కానీ 2029లో ఆయన పోటీ చేసి తీరుతారని అంటున్నారు. దాంతో ఆయనతో తలపడి మాగుంట రాఘవరెడ్డి గెలవాల్సి ఉంటుంది. పైగా సామాజిక వర్గ సమీకరణలు అన్నీ చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మాగుంట ఫ్యామిలీలో కొత్త తరం పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం అయిపోయింది అన్న మాట.
👉ఫినాయిల్ తాగిన 24మంది హిజ్రాలు.. తెరపైకి షాకింగ్ రీజన్! సామూహిక ఆత్మహత్యాయత్నం వార్త వ్యాపించడంతో.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఆసుపత్రి వద్ద గుమిగూడారు. ఇండోర్ లో జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఇద్దరు ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం కీలక మలుపు తీసుకుంది. ఇందులో భాగంగా… ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండోర్ లో 24 మంది ట్రాన్స్ జెండర్ మహిళలు ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ (ఫినాయిల్) తాగి సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. అవును… ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి ఇండోర్ లో 24 మంది ట్రాన్స్ జెండర్లు ఫినాయిల్ తాగి సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ సందర్భంగా… రెండు డజన్ల మంది ట్రాన్స్ జెండర్లు ఒక గదిలోకి వెళ్లి ఫినైల్ తాగారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. దీంతో.. పోలీసులు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ఎంకే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్ ఛార్జ్ డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్… ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ 24 మందినీ వెంటనే మహారాజా యస్వంతరావు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి వారంతా కలిసి ఫినైల్ తాగినట్లు పేర్కొన్నారు. వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని.. అందరి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకం రేపింది. సామూహిక ఆత్మహత్యాయత్నం వార్త వ్యాపించడంతో.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఆసుపత్రి వద్ద గుమిగూడారు. కొందరు ఆసుపత్రి లోపల కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించినట్లు కథనాలొచ్చాయి. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారు.
👉 గిత్తలూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ..
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అవగాహనా ర్యాలీ లో భాగంగా మార్కాపురం డివిజన్ ఆర్టి ఒ చందన మాట్లాడుతూ గతనెల 22/09/2025 తేదీన కేంద్రప్రభుత్వం అమలు చేసిన సూపర్ GST సూపర్ సేవింగ్స్. అవగాహన ర్యాలీలో పాల్గొని వాటి యొక్క ప్రాముఖ్యత ని క్లుప్తంగా వివరించారు ముఖ్య అతిధిగా ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఈ అవగాహనా ర్యాలీ ముఖ్య ఉద్దేశం పేద, బడుగు వర్గాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్ పై మరియు స్పైర్ పార్ట్శ్ పై GST గతంలో 12% ఉండగా నేడు 5% కు తగ్గింది అని తార్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 12 నుండి 5 , లైట్ మోటర్ వెహికిల్స్ LGV’S కి ఇంకా CC బస్ లు మినీ బస్ లకు కూడా GST 28% నుండి 18% కి తీసుకురావడం జరిగింది ట్రాన్సుపోర్టు ఇన్సురెన్స్ 12 నుండి 5 కి తగ్గింది ప్రైవేటు వెహికిల్స్ చాలా వరకు రేట్లు తగ్గుతాయి దీని వలన చాలా వరకు ట్రావెలింగ్ రేట్లు తగ్గడం వలన మనకు నిత్య అవసర రేట్లు కూడా తగ్గుతాయి ..ఇంతటి మంచి పథకం అమలు చేసిన ప్రధానమంత్రి మోడీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.అనంతరం జెండాను ఊపి ర్యాలీ ని ప్రాంభించారు.కార్యక్రమంలో వీరితోపాటు మార్కాపురం MVI మాధవరవు , ఒంగోలు MVI G. భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మండల అధ్యక్షుడు మార్థాల సుబ్బారెడ్డి,మున్సిపల్ కమిషనర్ EV రమణబాబు, సొసైటీబ్యాంక్ చైర్మన్ బాల ఈశ్వరయ్య, పట్టణ అధ్యక్షుడు శెహషా వలి, మండల , వార్డ్ ఇంచార్జ్ లు , నాయకులు పాల్గొన్నారు.

