👉 కొండా సురేఖకు మరో షాక్..!!!
ఆర్‌అండ్‌బీకి మేడారం జాతర పనులు.. రికార్డులు అప్పగించాలని మంత్రి కొండా సురేఖకి చెందిన దేవాదాయశాఖకు ఆదేశం..మేడారం జాతర పనులను రోడ్లు-భవనాల శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం .. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కొట్లాటతో ఈ నిర్ణయం..ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ.
👉 కాంగ్రెస్ లో దుమారం …మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు..మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత..కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..సుమంత్ .. కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది .. నిన్న సుమంత్ ను బాధ్యతలనుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
👉 రేవంత్ రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలో మొత్తం భూములు కబ్జా చేస్తున్నారు .. మంచిరేవులలో విలాస్ కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం ఎండోమెంట్ భూమిని అడిగారు.. అది ఇస్తే పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామని అన్నారు.. ఈ ఫైల్ మీద కొండా సురేఖ సంతకం చేస్తే, జపాన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్‌ను ఆపించాడు..ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు.. అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్‌ను రేవంత్ రెడ్డి ఆపేశాడు – కొండా సురేఖ కూతురు సుస్మిత..
👉 కొండా సురేఖ మంత్రి పదవి ఊస్టింగ్?
కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించనున్న రేవంత్ రెడ్డి? …ఏకంగా టెండర్ల పేర్లతో , సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే బయట పెట్టడంతో కంగు తిన్న రేవంత్ రెడ్డి వర్గం..సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించినందుకు కొండా సురేఖపై వేటు వేసేందుకు రేవంత్ రెడ్డి సిద్దమైనట్లు సమాచారంఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో కొండా సురేఖపై వేటు వేసే అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
👉 తెలంగాణ కాంగ్రెస్ నాయకుడి రిసార్ట్‌లో.. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ.. 56 మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ అరెస్టు..
యువతులతో ముజ్రా, అర్ధనగ్న డ్యాన్స్, క్యాసినో సైతం ఏర్పాటు.. రెస్క్యూ హోంకు 20 మంది యువతులు..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డికి చెందిన ‘కే చంద్రశేఖర్ రెడ్డి’ అనే రిసార్ట్ పై పోలీసుల దాడి.. గాజులరామారంలో వేద అగ్రి ఇన్‌వరేషన్ పేరుతో తిరుపతిరెడ్డి, ఇబ్రహీంపట్నం రాందాస్ పల్లిలో రాక్ స్టార్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలు తయారు చేస్తుండగా.. తమ ఉత్పత్తులను భారీగా విక్రయించుకోవడంలో భాగంగా విత్తనాల డీలర్లకు పార్టీ ఇచ్చేందుకు మంగళవారం రాత్రికి కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డికి చెందిన రిసార్ట్‌ను కిరాయికి తీసుకున్నట్లు గుర్తింపు
👉హాట్ టాపిక్ గా మారిన……ఎమ్మెల్యే మాటలు……కూటమి ప్రభుత్వం లో కలవరం సృష్టిస్తున్న వాఖ్యలు….నేను తలచుకుంటే జనసేన ఖాళీ అవుతుంది’: టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల*
ఆంధ్ర ..శ్రీకాళహస్తి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను ఒక్కసారి ‘ఊ’ అంటే జనసేన పార్టీ (JSP) ఖాళీ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, చప్పట్లు, ఈలలు, కేరింతలు కొట్టిన వారిలో ఒకరికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో వేడిని పెంచాయి..
👉గుంటూరు-పెదకూరపాడు స్టేషన్లు మధ్య ఘటనపై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ*. అమరావతి*
*మహిళా కోచ్ లో మగాళ్ళను ఎలా అనుమతిస్తారు..?*
*రైలు ప్రయాణీకురాలిపై అత్యాచార ఘటన బాధాకరం*
*రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మహిళా ప్రయాణీకులకు మెరుగైన భద్రత కల్పించాలి*.. *గుంటూరు రైల్వే డీఆర్ఎం, విజయవాడ రైల్వే ఎస్పీలకు ‘ఏపీ మహిళా కమిషన్’ లేఖలు. .రైళ్ళల్లో మహిళలకు కేటాయించిన కోచ్ లలో మగాళ్ళను ఎలా అనుతిస్తారని ఏపీ మహిళా కమిషన్ డాక్టర్ రాయపాటి శైలజ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంత్రగాచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళా ప్యాసింజర్ పై గుంటూరు, పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన అత్యాచార ఘటనపై బుధవారం ఆమె స్పందించారు. ఘటన చాలా బాధాకరమన్నారు. ఈమేరకు ఘటన పూర్వాపరాలను గుంటూరు ఆర్పీఎఫ్ అధికారులతో మాట్లాడి చర్యలనిమిత్తం మహిళా కమిషన్ అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో కార్యాలయ అధికారులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో ఫోన్ లో సంప్రదించగా.. ఓ మహిళ రాజమహేంద్రవరంలో సంత్రగచి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చెర్లపల్లి దాకా ప్రయాణించడానికి ఎక్కగా.. ట్రైన్ గుంటూరు స్టేషన్లో ఆగిన సమయంలో, 40 సంవత్సరాల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మహిళా కోచ్‌లోకి ప్రవేశించాడని.. ఆగంతకుడు మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. బాధితురాలి వద్దనున్న నగదు (రూ.5600) మరియు మొబైల్ ను దోచుకున్నట్లు ..పెదకూరపాడు స్టేషన్ దగ్గర రైలులోంచి దూకి పరారైనట్లు బాధితురాలు ఫిర్యాదిచ్చినట్లు చెప్పారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి, కేసును నడికుడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయని.. బాధితురాలు చెబుతున్న ప్రకారం గుంటూరు, పెదకూరపాడు రైల్వేస్టేషన్ ల మధ్య మొబైల్ ట్రాక్ లోకేషన్లు, సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతికత ద్వారా నిందితుడ్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చెప్పారు.
*డీఆర్ఎం, ఆర్పీఎఫ్ ఎస్పీలకు లేఖలు:*
తక్షణమే ఈ కేసుపై వేగవంతమైన దర్యాప్తును ప్రారంభించి నేరస్తుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులను కోరారు. ఈమేరకు గుంటూరు రైల్వేస్టేషన్ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం)కు, విజయవాడ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే సెక్యూరిటీ ఫోర్స్, గుంటూరు వారికి మహిళా కమిషన్ ద్వారా బుధవారం లేఖలు పంపారు. మహిళా ప్రయాణికుల భద్రతను నిర్ధారించే చర్యలు వేగవంతం చేయాలన్నారు. మహిళా కంపార్ట్‌మెంట్‌లో మహిళా కానిస్టేబుళ్లను డ్యూటీకి నియమించాలని, మహిళల కోచ్ లలో ప్రయాణించడానికి ప్రయత్నించకుండా పురుషులను నిరోధించడానికి ఆర్పీఎఫ్ క్రమం తప్పకుండా డ్రైవ్‌లను నిర్వహించాలని కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ కోరారు. రైళ్లలో ప్రయాణీకులకు సంబంధించిన భద్రతా లోపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలన్నారు. ఒంటరి మహిళా ప్రయాణీకుల భద్రతపై మరింత నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. సంత్రగాచి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ లో జరిగిన ఘటనపై పూర్తి దర్యాప్తు అనంతరం కమిషన్ కు నివేదిక పంపాలని లేఖలో ఆమె కోరారు.
👉Acb వలలో మరో అవినీతి తిమింగలం…. *అమలాపురం.. అమలాపురం తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కారు.గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి తహసీల్దార్ అశోక్ ప్రసాద్ రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివరకు బాధితుడు రూ.50 వేలకు ఒప్పందం చేసుకొన్నాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము ద్వారా తహసీల్దార్ అశోక్ ప్రసాద్ రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.
👉సామెత ఒకటి ఉంది…కుక్కను కాల్చినట్టు కాల్చారు అని…..తాజాగా…దేశద్రోహం చేశారన్న ఆరోపణలతో….గాజాలో 8 మందికి గన్ షాట్ తో మరణశిక్ష విధించింన హమాస్.. .. తీవ్రంగా హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్*
గాజా స్ట్రిప్‌లో సీజ్‌ఫైర్ ఒప్పందం అమల్లోకి వచ్చినది… వచ్చిన కొద్ది గంటల్లోనే హమాస్ తన నియంత్రణను బలపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలపై సోమవారం సాయంత్రం 8 మంది పాలస్తీనియన్లకు బహిరంగంగా మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ హమాస్ వెంటనే ఆయుధాలను వదిలివేయాలని లేదంటే తామే వారిని నిరాయుధులను చేస్తామని హెచ్చరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
👉సుప్రీం కోర్టులో రేవంత్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన SLPని కొట్టేసింది సుప్రీం కోర్టు. 50% రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసి లాభం ఏంటి? చెప్పాలని ప్రశ్నించింది…అసలు చట్టం చేయకుండా జీవో ఎలా ఇస్తారు? అని ప్రశ్నించింది. పాత రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పింది సుప్రీం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది._
👉 తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు.. మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట.. రేవతి, తన్వి యాదవ్‌లను పోలీస్ కస్టడీకి అనుమతించిన తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. బెయిల్‌లో ఉన్న ఇద్దరిని పోలీస్ కస్టడీకి హైకోర్టు ఎలా అనుమతిస్తుందని వాదించిన మహిళా జర్నలిస్టుల తరపు లాయర్.. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు

