👉పాక్‌ – అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఏమి జరుగుతుంది..?.. 👉చిన్నారుల ప్రాణం ఖరీదు 10% కమీషన్!… 👉జగన్ ఆస్తుల వివాదంలో ఊహించని మలుపు !!!..👉హైదరాబాద్ మహేశ్వరంలో KCR రిసార్ట్స్ లో రేవ్ పార్టీ భగ్నం…👉*జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం..ఆ డబ్బు ఎవరిది?..👉వేణు స్వామి పూజల్లో మాంసం, మద్యం!!!.. 👉కొడుకు పట్టించుకోవడం లేదని 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన తండ్రి..

👉చిన్నారుల ప్రాణం ఖరీదు 10% కమీషన్!

MPలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి 23 మంది చిన్నారులు చనిపోవడం తెలిసిందే. వీరికి ఆ దగ్గు మందు ప్రిస్కైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీ సంపాదించింది ఎంతో తెలుసా? ఒక్కో బాటిల్ ధర రూ.24.54 కాగా Sresan కంపెనీ నుంచి అతడికి వచ్చేది 10% కమీషన్ (రూ.2.54). ప్రభుత్వ డాక్టర్ అయినప్పటికీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రమాదకరమని తెలిసినా సోనీ రిపీటెడ్గా కోల్డ్రిఫ్ ప్రిస్కైబ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

👉హైదరాబాద్ మహేశ్వరంలో KCR రిసార్ట్స్ లో రేవ్ పార్టీ భగ్నం…*

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం, రేవ్ పార్టీల కల్చర్ పెరిగిపోతోంది. రేవ్ పార్టీలు చట్టానికి విరుద్ధమని ప్రభుత్వం, పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు రావడంలేదు.ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్ హౌస్ లు రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి.. హైదరాబాద్ మహేశ్వరంలో రేవ్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. మంగళవారం ( అక్టోబర్ 14 ) మహేశ్వరంలోని కే చంద్రారెడ్డి రిసార్ట్స్ పై దాడి చేసిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు.

ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్లకు మందు, అమ్మాయిలతో పార్టీ ప్లాన్ చేయగా.. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో లిక్కర్ కోసం పోలీసుల అనుమతి తీసుకున్న కంపెనీ యజమాని అమ్మాయిలను డ్యాన్సర్లను కూడా అరెంజ్ చేశాడు.

డైల్ 100 కు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు ఎస్ఓటీ పోలీసులు. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేసి పార్టీలోని లిక్కర్ తో పాటు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో లిక్కర్ కు అనుమతి ఉన్నప్పటికీ అమ్మాయిలు, డ్యాన్సర్లను అరెంజ్ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు పోలీసులు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధమని..ఇలాంటి పార్టీలకు రిసార్ట్స్ రెంట్ ఇవ్వద్దని రిసార్ట్స్ నిర్వాహకులకు సూచించారు పోలీసులు….
👉వేణు స్వామి పూజల్లో మాంసం, మద్యం!!!

జ్యోతిష్యుడు వేణు స్వామి వటుక భైరవ పూజల్లో మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి, హోమంలో ఆహుతి ఇవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో సంతానం లేనివారు కామాఖ్య ఆలయం కొండపైన కలిస్తే పిల్లలు పుడతారని, అక్కడ మాంసాహారం నైవేద్యంగా సమర్పిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కామాఖ్య ఆలయ అర్చకులు ఆయనను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. వేణు స్వామి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో ఉంటారు~
👉జగన్ ఆస్తుల వివాదంలో ఊహించని మలుపు !!!

ఆంధ్రప్రదేశ్ : వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. షేర్ల బదిలీపై హైదరాబాద్ NCLT ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల చెన్నై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అవి జగన్ వద్దే ఉన్నాయని హైదరాబాద్ NCLT గతంలో తీర్పు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన చెన్నై ట్రిబ్యునల్, హైదరాబాద్ NCLT ఉత్తర్వులపై స్టేటస్ కోవిధించింది~£
👉కొడుకు పట్టించుకోవడం లేదని 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన తండ్రి

కనిపెంచిన కొడుకు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్‌రెడ్డి తన 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14న జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమిని అప్పగించే పత్రాలపై సంతకం చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారసులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ భూమిలో తన భార్య జ్ఞాపకార్థం పాఠశాల నిర్మించాలని ఆయన కోరారు~£
👉చనిపోయాడని భావించి అంత్యక్రియలకు సిద్ధం.. బతికే ఉన్నాడని తెలిసి షాక్!

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాఖాపూర్ గ్రామంలో వింత ఘటన జరిగింది. వైద్యం కోసం వరంగల్, కరీంనగర్ ఆసుపత్రులకు తీసుకెళ్లిన తనుగుల శ్రీనివాస్ ఇంటికి తిరిగి వచ్చాక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు చనిపోయాడని భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, శ్రీనివాస్‌పై చెమటలు గమనించి, నాడి చూస్తే బతికే ఉన్నాడని నిర్ధారించారు. వెంటనే వైద్యులను పిలిపించి పరీక్షించగా, అతను బతికే ఉన్నాడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురై, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చనిపోయాడని వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టిన బంధువులు వాటిని తొలగించుకున్నారు.
👉*జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం..ఆ డబ్బు ఎవరిది?..*

హైదరాబాద్‌లో జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో పటిష్ఠమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌ (SST–11B) పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించింది. మైత్రీవనం ఎక్స్‌రోడ్స్, సారథి స్టూడియో సమీపంలో జరిగిన వాహన తనిఖీల సమయంలో అక్రమంగా తీసుకెళ్తున్న రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల సమయంలో TS09FF 6111 నంబర్ గల కారును ఆపి పరిశీలించగా అందులో భారీగా నగదు దొరికింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన శ్రీ జైరాం తలాసియాగా గుర్తించారు. ప్రారంభ సమాచారం ప్రకారం జైరాం తలాసియా ఈ నగదును తన కారులో యూసుఫ్‌గూడ వైపు తీసుకెళ్తున్న సమయంలో తనిఖీలు జరిపిన SST బృందం ఆయనను నిలిపివేసింది. ఎన్నికల సంఘం అమలు చేస్తున్న కఠిన ఆచరణ మార్గదర్శకాల ప్రకారం, ఏవైనా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం కోడ్‌ ఉల్లంఘన కిందకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. SST బృందం తక్షణమే నగదును స్వాధీనం చేసుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించింది. ప్రస్తుతం పోలీసులు నగదు మూలం, దాని ప్రయోజనం, ఎవరికి ఇవ్వబోతున్నారన్న కోణంలో విచారణ ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ ద్వారా ప్రలోభాలిస్తే అది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నగదుకు రాజకీయ సంబంధాలున్నాయా.. లేదా వ్యాపార సంబంధాలు అనే విషయాలను ఖరారు చేసేందుకు అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారులకు SST బృందం సమర్పించనుంది. ప్రజలు కూడా ఎన్నికల సమయంలో అనుమానాస్పదంగా కనిపించే నగదు రవాణా, వస్తువుల పంపిణీ వంటి ఘటనలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు..

👉వేణు స్వామి పూజల్లో మాంసం, మద్యం

జ్యోతిష్యుడు వేణు స్వామి వటుక భైరవ పూజల్లో మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి, హోమంలో ఆహుతి ఇవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో సంతానం లేనివారు కామాఖ్య ఆలయం కొండపైన కలిస్తే పిల్లలు పుడతారని, అక్కడ మాంసాహారం నైవేద్యంగా సమర్పిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కామాఖ్య ఆలయ అర్చకులు ఆయనను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. వేణు స్వామి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో ఉంటారు~£

👉చేతుల పరిశుభ్రతపై అవగాహన*
కంభం:చేతుల పరిశుభ్రతతో ఆరోగ్య భద్రతను పొందవచ్చని ఎంపీడీవో వీరభద్రాచారి అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు చేతుల పరిశుభ్రత పై అవగాహన కలిగించారు.చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పలు రకాలైన వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ-1 అబ్దుల్ సత్తార్, పీడీలు సుబ్రహ్మణ్యం, విజయకుమార్, ఉపాధ్యాయులు రమణారెడ్డి పాండురంగబాబు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు
👉పాక్‌ – అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఏమి జరుగుతుంది.. రంగంలోకి రెహమాన్‌..!

గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ – ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ – ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మరోసారి భీకర ఘర్షణలు జరిగాయని స్థానిక మీడియా నివేదించింది. ఈ ఘర్షణల్లో ఇరువైపుల పౌరులు మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. దీంతో.. ఇరు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తానని జేయూఐ-ఎఫ్ చీఫ్ ఎంట్రీ ఇచ్చారు. అవును… పాకిస్తాన్ – ఆఫ్గన్ దళాలు బుధవారం తెల్లవారుజామున భీకర సరిహద్దు ఘర్షణలకు దిగాయి. ఇందులో భాగంగా ఆఫ్గన్ లోని కాందహార్ ప్రావిన్స్, పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్ ప్రాంతాల మధ్య కీలక సరిహద్దు జిల్లా అయిన స్పిన్ బోల్డాక్‌ లో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీ పోరాటం జరిగిందని ఆఫ్గాన్ కు చెందిన ఖామా ప్రెస్ నివేదించింది. పాకిస్తాన్ దళాలు నివాస ప్రాంతాలపై షెల్ దాడులు చేశాయని, దీనివల్ల చాలా మంది పౌరులు తమ ఇళ్లను వదిలి పారిపోయారని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో… పాకిస్తాన్ ఆ ప్రాంతంలోని పౌర ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ ఆయుధ దాడులను ప్రారంభించిందని కాందహార్ నివాసితులు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. స్పందించిన పాక్ భద్రతాధికారులు!: ఈ వ్యవహారంపై పాక్ భద్రతాధికారులు స్పందించారు. ఇందులో భాగంగా… అఫ్గాన్‌ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని.. దాని ట్యాంకులను, సైనిక పోస్ట్‌ లను దెబ్బతీశామని పేర్కొన్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్‌ దళాలు, తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్ట్‌ లపై కాల్పులు జరిపారని పాక్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది. అయితే… ఆఫ్గాన్ కాల్పులకు పాక్‌ దళాల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపింది. ఇదే సమయంలో… టీటీపీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్‌ భద్రతాధికారులు తెలిపారు. మరోవైపు.. అఫ్గాన్‌ లో ఖోస్ట్‌ ప్రావిన్స్‌ లోని డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్‌ అహ్రర్‌ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు. ‘మధ్యవర్తిత్వానికి సిద్ధం’!: ఈ స్థాయిలో పాక్ – ఆఫ్గన్ సరిహద్దులు భగ్గుమంటున్న నేపథ్యంలో ‘జమైత్ ఉలేమా – ఈ – ఇస్లాం – ఫ్లజ్‌ (జేయూఐ-ఎఫ్)’ పార్టీ చీఫ్‌ మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ స్పందించారు. ఇందులో భాగంగా… ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానని అన్నారు.

నేపథ్యంలో ‘జమైత్ ఉలేమా – ఈ – ఇస్లాం – ఫ్లజ్‌ (జేయూఐ-ఎఫ్)’ పార్టీ చీఫ్‌ మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ స్పందించారు. ఇందులో భాగంగా… ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానని అన్నారు. 58 మంది కాదు 23 మందే!: కాగా… ఆఫ్ఘనిస్తాన్‌ లో వరుస పేలుళ్లకు పాకిస్తానే కారణమని ముత్తాఖీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబూల్‌ లో ఇటీవల జరిగిన వైమానిక దాడుల తర్వాత ఆఫ్ఘన్ సరిహద్దులో జరిగిన ప్రతిదాడుల్లో 58 మంది పాక్ సైనికులు మృతి చెందారని, 30 మంది గాయపడ్డారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆదివారం వెల్లడించారు. ఇలా 58 మంది సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించిన తర్వాత.. పాక్ స్పందించింది. ఇందులో భాగంగా… ఆ వాదనలను తోసిపుచ్చుతూ, తమ సైనికులు 23 మందిని మాత్రమే కోల్పోయినట్లు పేర్కొంది.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా