👉ఆప్ఘనిస్తాన్‌తో దోస్తీ వెనుక వ్యూహమేంటి? భారత్ పర్యటన వెనుక రాజకీయం! …. ఇన్నాళ్లుగా పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఆఫ్గానిస్తాన్ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం, భారత్‌తో బంధం బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపడం ఆసియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లుగా పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఆఫ్గానిస్తాన్ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం, భారత్‌తో బంధం బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపడం ఆసియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇటీవల తాలిబన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటన “భారత్ అంటే ప్రాణం ఇస్తాం” అంటూ తాలిబన్ వర్గాలు చేసిన ప్రకటనలు రెండు దేశాల సంబంధాలపై కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. ఇది కేవలం మైత్రా? లేక సుదీర్ఘ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమా? అనేది చర్చనీయాంశంగా మారింది.
గత రెండు దశాబ్దాల్లో భారత్ అఫ్గానిస్తాన్‌లో సుమారు $3 బిలియన్లకు పైగా భారీగా పెట్టుబడులు పెట్టింది. మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, నీటి వనరుల అభివృద్ధి వంటి రంగాలకు భారత్ అండగా నిలిచింది. సల్మా డ్యామ్, జారంజ్–డెలారమ్ హైవే, ఆఫ్గాన్ పార్లమెంట్ భవనం వంటి కీలక ప్రాజెక్టులు ఆఫ్గాన్ నిర్మాణంలో భారత్ పాత్రను చాటుతున్నాయి. తాలిబన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ భారీ పెట్టుబడుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాలిబన్‌తో కనీస అవగాహన కుదర్చుకోకపోతే ఈ పెట్టుబడులు, నిర్మాణాలు వృథా అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ పెట్టుబడులను రక్షించుకోవడం భారత్‌కు తక్షణ ప్రాధాన్యతగా ఉంది. సాంప్రదాయకంగా భారత్‌పై శత్రుత్వ ధోరణిలో ఉన్న తాలిబన్ ఇటీవల తన వైఖరిని మార్చుకోవడం ఆసక్తికరమైన పరిణామం. చైనా, పాకిస్తాన్‌లతో బంధాలను కొనసాగిస్తూనే భారత్‌తో సానుకూల సంభాషణలు జరుపుతోంది. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు: ప్రపంచ దేశాల నుంచి, ముఖ్యంగా భారత్ వంటి కీలక ప్రాంతీయ శక్తి నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందాలనే ప్రయత్నం. భారత్ సహకారంతో గతంలో ఆగిపోయిన వాణిజ్య మార్గాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించాలన్న లక్ష్యం. అయితే, తాలిబన్ వైఖరిలో ఈ మార్పు నిజంగా అంతర్గత మార్పా? లేక కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం తాత్కాలికంగా అనుసరిస్తున్న దౌత్య వ్యూహమా? అన్నది కాలమే నిర్ణయించాలి.
👉 ఏపీలో పోలీసు వ్యవస్థను మూసేయండి: హైకోర్టు షాకింగ్ కామెంట్స్ …!!! పరకామణి డిప్యూటీ ఈవో సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో పెద్దఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారు. దీని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంది. ఏపీ పోలీసులపై తరచుగా సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్న హైకోర్టు.. తాజాగా సోమవారం మరింత ఆగ్రహంతో మండిపడింది. ఏపీ లో పోలీసు వ్యవస్థను మూసేయాలని.. డీజీపీ నిద్ర పోతున్నారా? అని తీవ్రంగా స్పందించింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ హయాంలో జరిగిన ఓ వ్యవహారానికి సంబంధించి సదరు ఫైళ్లు, కేసుల దస్త్రాలను సీజ్ చేసి తమకు ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలను పోలీసులు పెడచెవిన పెట్టారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా డీజీపీ నిర్లక్ష్యమని పేర్కొంది. తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడం నిప్పులు చెరిగింది. “రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసివేయడం మంచిది. డీజీపీ నిద్రపోతున్నారు.“ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగింది? 2023లో( వైసీపీ ప్రభుత్వ హయాం) తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో రూ. కోట్ల కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల కూడా హల్చల్ చేశాయి. అయితే.. కుంభకోణం పై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని ఓ జర్నలిస్టు.. టీటీడీ ఈవోకు వినతి పత్రం ఇవ్వగా.. ఆయన దానిని పట్టించుకోలేదు. దీంతో జర్నలిస్టు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబర్ 10న ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెల్లడించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలని కోరారు. ఇదేసమయంలో అసలు పరకామణిలో ఏం జరిగిందో వివరించారు. పరకామణి డిప్యూటీ ఈవో సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారు. దీని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంది. దీనిని అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి గుర్తించి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. అయితే.. తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ లో నిందితుడు రవికుమార్ రాజీ చేసుకున్నారు. ఆ తర్వాత కూటమి సర్కారు వచ్చిన నేపథ్యంలో దీనిపై విచారణ చేయాలని ఈవోను కోరగా ఆయన పట్టించుకోలేదు. ఈ వివరాలను కోర్టుకువెల్లడించారు. దీనిపై గత నెల్లోనే స్పందించిన హైకోర్టు.. పరకామణి నుండి నగదు అపహరణ విషయంలో ఇచ్చిన ఫిర్యాదును లోక్అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులు, లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్, టీటీడీ బోర్డు తీర్మానాలు, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రొసీడింగ్స్ ను తక్షణం స్వాధీనం చేసుకోవాలని, వాటిని సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని గత నెల్లో పోలీసులను ఆదేశించింది. అయితే.. ఈ విషయంలో సీఐడీ ఐజీ పోస్టు లేదని.. అందుకే స్వాధీనం చేసుకోలేదని.. పోలీసులు తాజాగా కోర్టుకు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసు శాఖను మూసేయాలని వ్యాఖ్యానించింది. అనంతరం.. కొంత సర్దుమణిగిన తర్వాత.. ఈ దఫా విచారణకు రికార్డులు సమర్పించాలని ఆదేశించింది.
👉కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహకారంతో, అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు.. వచ్చే ఐదేళ్లలో విశాఖలో గూగుల్ పెట్టే పెట్టుబడి $15 బిలియన్ డాలర్లు : గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియన్
👉 త్వరితగతిన “చంద్రన్న భీమా” పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు పి. తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి, మాజీ కార్పొరేటర్ పావురాల చంద్రశేఖర్ లు ఒక ప్రకటనలో వినతి చేశారు.
👉ఉంగరాల నాగేంద్రరావు కు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత ..రైల్వే కోడూరు నియోజకవర్గం…
కోడూరు పట్టణానికి చెందిన ఉంగరాల నాగేంద్రరావు కు రూ.51,310/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి స్వగృహం వద్ద ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి.. సయ్యద్ మెహతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు..
👉 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* పిలుపు మేరకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్* (చిన్ని) ఆదేశాల మేరకు మాజీ పోలీసు హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల్ మీరా*, మాజీ ఎమ్మెల్సీ *బుద్ద వెంకన్న*, మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి *మొహమ్మద్ ఫతాఉల్లాహ్ సూచనల మేరకు 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో *సూపర్ జియస్టి సూపర్ సేవింగ్స్* కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు యూనిటీ చార్జీలు బూత్ కన్వీనర్లు పాల్గొనడం జరిగింది..

