👉ఆరెస్సెస్ శిబిరాలపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు.. యువకుడి ఆత్మహత్యతో వివాదం* ‘ఆర్ఎస్ఎస్ సభ్యుల లైంగిక వేధింపుల వల్లే యువకుడి ఆత్మహత్య’ అంటూ ఆరోపణలు..చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు.. * దేశవ్యాప్తంగా ఉన్న శిబిరాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని యువకుడి ఆరోపణ.. ఆర్ఎస్ఎస్ శిబిరాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రియాంక గాంధీ డిమాండ్..*
*కేరళలో ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శిబిరాల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కేరళకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
కేరళకు చెందిన ఆనందు అజి అనే ఐటీ నిపుణుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పలువురు ఆరెస్సెస్ సభ్యులు తనపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారని, వారి వేధింపుల వల్లే తాను మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని ఆనందు ఆ పోస్టులో ఆరోపించాడు. తాను ఒక్కడినే బాధితుడిని కాదని, దేశవ్యాప్తంగా ఉన్న ఆరెస్సెస్ శిబిరాల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయని హెచ్చరించాడు..ఈ ఘటనపై ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఆనందు అజి తన ఆత్మహత్య సందేశంలో ఆరెస్సెస్ సభ్యులు తనపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో విచ్చలవిడిగా లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఇది నిజమైతే చాలా భయంకరమని”ఆమె పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ శిబిరాలకు హాజరయ్యే లక్షలాది మంది పిల్లలు, యువకుల భద్రత ప్రమాదంలో పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఆరెస్సెస్ నాయకత్వం ఈ విషయంపై వెంటనే స్పందించాలి, వాస్తవాలను బయటపెట్టాలి. అబ్బాయిలపై జరిగే లైంగిక వేధింపులు కూడా అమ్మాయిలపై జరిగే వేధింపులతో సమానమైనవే. ఇలాంటి దారుణాలపై ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలి” అని ఆమె పేర్కొన్నారు.మరోవైపు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వీకే సనోజ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ బాధ్యులైన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆనందు తన పోస్టులో ప్రస్తావించిన శాఖల నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో, కేరళ పోలీసులు ఆనందు మృతికి దారితీసిన పరిస్థితులపై ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ఆరెస్సెస్ శిబిరాలపై వస్తున్న ఆరోపణలపై విస్తృత స్థాయి దర్యాప్తు జరపాలని రాజకీయంగా, సామాజికంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.
👉నకిలీకి చెక్.. ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు*
ఉండవల్లి: రాష్ట్రానికి కల్తీ మద్యం వైకాపా ప్రభుత్వం నుంచి వారసత్వ సంపదగా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కేసులో షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని, దీనిపై ప్రస్తుతం మాట్లాడదలచుకోలేదన్నారు. కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు రూపొందించిన ‘ ఏపీ ఎక్సైజ్సురక్షా యాప్’ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నకిలీ మద్యంపై సిట్ బృందంతో మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. సీట్లో రాహుల్దేవ్ శర్మ, కె. చక్రవర్తి, మలికా గార్గ్ సభ్యులుగా ఉంటారని చెప్పారు.
“నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్’ ను డిజైన్ చేశాం. స్కాన్ చేస్తే చాలు.. ఆ సీసాకు సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి. ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుంది. మరోచోట అమ్మేందుకు వీల్లేదు. అలా చేస్తే నేరం కూడా. స్కాన్ చేశాక తయారీ కేంద్రం, తేదీ, బ్యాచ్ అన్నీ వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తాం. నకిలీ మద్యం కేసులో ఎలాంటి రాజీ లేదు.. మొత్తం ప్రక్షాళన చేస్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
👉సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన కనిగిరి సీఐ షేక్ ఖాజావలి..
కనిగిరి కాస్మోపాలేట్ క్లబ్ నందు టెన్నిస్ ఆడుతున్న కనిగిరి పిఎసిఎస్ అధ్యక్షులు అద్దంకి రంగబాబు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడే టెన్నిస్ ఆడుతున్న కనిగిరి సీఐ ఖాజావలి ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. ప్రాథమిక వైద్య పరమైన చర్యగా సిపిఆర్ ( కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేయటంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనను చూసిన సభ్యులు మరియు టెన్నిస్ పక్కనే ఉన్న కాస్మోపాలిటీ సభ్యులు మరియు టెన్నిస్ క్రీడాకారులు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తన సొంత కారులో వెంటనే అందరు కలిసి సమీపoలోని హాస్పిటల్ నందు చేర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ సరైన సమయంలో తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇలానే ప్రతి ఒక్కరు సి పి ఆర్ పి పైఅవగాహన కలిగి ఉండాలని డాక్టర్ కిరణ్ తెలిపారు. కనిగిరి సీఐ షేక్ ఖాజావలి మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టుల అందరితో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ సిపిఆర్ మీద అవగాహన కల్పిస్తానని ,ఎవరైనా కానీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఆ సమయంలో సి పి ఆర్ చేసి ప్రాణాపాయం పరిస్థితులను నుండి కాపాడవచ్చు అని సిఐ ఖాజావలి తెలిపారు.
👉 ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి – కూటమి ప్రభుత్వం చేతులారా ప్రతిపక్షాలకు ఆయుధాలు* !
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి రేపుతున్నాయి.ప్రత్యేకంగా రెండు ముఖ్య అంశాలు — *మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ మరియు కల్తీ మద్యం వ్యవహారం..ఇవే ఇప్పుడు ప్రతిపక్షాలకు బలమైన రాజకీయ ఆయుధాలుగా మారాయి.
* మెడికల్ కాలేజీల* *ప్రైవేటీకరణ నిర్ణయం*
పీపీపీ (PPP) పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు రంగానికి అప్పగించడం ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పిదమని ప్రజల అభిప్రాయం.పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండకపోవచ్చన్న భయం ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది.ఈ నిర్ణయం వల్ల ప్రజల మనసుల్లో ప్రభుత్వం పట్ల అవిశ్వాసం పెరిగింది.
*🍾 కల్తీ మద్యం వ్యవహారం*
ఇంకో వైపు, కల్తీ మద్యం ఘటనలపై ప్రెస్ మీట్‌లు పెడుతూ “ఇకపై కల్తీ లేని మద్యం తయారు చేస్తాం” అని చెప్పడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది.మద్యం నియంత్రణ గురించి మాట్లాడటం బదులు, “మద్యం తయారీ”పై దృష్టి పెట్టడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది.“మద్యం తయారు చేయడం, అది ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యతేనా?” అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.
* ఈ రెండు అంశాలూ కలిపి కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ పాయింట్లు అయ్యాయి..*ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండగా, ప్రతిపక్షాలు ఈ విషయాలను బలమైన ఆయుధాలుగా వాడుకుంటున్నాయి.*ఇలా చూస్తే — ప్రజల సమస్యల కంటే ప్రచారమే ముఖ్యం అవుతోంది అన్న భావన రాకుండా ఉండటానికి ప్రభుత్వం తన విధానాలను సవరిస్తేనే మంచిది.
👉 హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం.. కలెక్టరేట్‌లోనే తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ …నిందితుడి దాడి నుండి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు..కలెక్టరేట్‌లోనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటే అతనికి పై స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికుల ఆరోపణలు…ఇర్ఫాన్ సోహెల్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్.. లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు
👉 బెడ్రూంలో కెమెరాలు పెట్టి దొరికిపోయా.. రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్*
వినూత డ్రైవర్ రాయుడు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.రాయుడు విడుదల చేసిన షాకింగ్ సెల్ఫీ వీడియోలో, ఎన్నికల ముందు నుంచే తాను టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. సుధీర్ రెడ్డి తనకు రెండు లక్షలు ఇచ్చారని, వినూత, చంద్రబాబును చంపాలని ఆయన చెప్పాడని రాయుడు ఆరోపించాడు.కారు యాక్సిడెంట్ ద్వారా రెండుసార్లు ప్రయత్నించినా కుదరలేదని ఆ వీడియోలో పేర్కొన్నాడు.
👉అయ్యో ఎంత విషాదం.. ట్రైన్ కిందపడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న వైనం*
కడప జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో నేపథ్యంలో భార్యాభర్తలు, ఏడాదిన్నర కుమారుడితో సహా గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో ఈ ఘటన జరిగింది. కడప- కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఒక కుటుంబ వేగంగా వస్తున్న గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారుఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుంతా ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలు, కుమారుడిగా గుర్తించారు. వారు శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, కుమారుడు రిత్విక్‌గా నిర్ధారించారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా, లేక మరో ఇతర కారణాలేమైనా ఉన్నాయ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉*బూచేపల్లి వారి ఓణీల మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా*
*హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ అన్వయ కన్వెన్షన్ లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డిల మనుమరాలు,దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, నందినిల కుమార్తె ‘తన్విక రెడ్డి’ ఓణీల వేడుక ఆదివారం జరిగింది.ఈ వేడుకకు గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు, వారి తనయుడు అన్నా కృష్ణ చైతన్య,కోడలు అన్నా అనూష తదితరులు పాల్గొని అభినందించి, ఆశీర్వదించారు.*
👉ట్రంప్ నోట ‘తోమహాక్’ ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ‘మాస్కో రాజీకి రాకపోతే కీవ్‌కు తోమహాక్ క్షిపణులను అందజేస్తాను’ అని ట్రంప్ అన్నారు. కేవలం మాట కాదు, ప్రపంచ శాంతి స్థితిని ప్రభావితం చేసే హెచ్చరిక ఇదని నిపుణులు అంటున్నారు. ‘తోమహాక్’ (Tomahawk Land Attack Missile – TLAM) అమెరికా సముద్ర దళానికి గర్వకారణం. దీని అభివృద్ధి 1970లో ప్రారంభమై, 1983 నాటికి సైన్యం చేతికి వచ్చింది. దీని పొడవు సుమారు 5.6 మీటర్లు, బరువు దాదాపు 1.5 టన్నులు. ఇది సముద్రం తలం నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని 880 కిలోమీటర్ల వేగంతో ఛేదించగలదు. దీనిలోని జీపీఎస్, ఇనర్షల్ నావిగేషన్ వ్యవస్థలు రియల్‌టైమ్ డేటా లింక్‌లు దీన్ని అత్యంత ఖచ్చితమైన ఆయుధంగా నిలబెట్టాయి. ఇది ఉపరితలానికి కేవలం 30–35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం కలిగి ఉండడంతో రాడార్లు దీన్ని గుర్తించడానికి కష్టం అవుతుంది. ఇరాక్ యుద్ధం (డిజర్ట్ స్ట్రామ్)లో మొదటిసారి దీన్ని వాడిన అమెరికా, 42 రోజుల్లో 297 క్షిపణులను ప్రయోగించింది. ఒక్కో తోమహాక్ ఖరీదు సుమారు 2 మిలియన్ డాలర్లు, అంటే రూ. 16 కోట్లకు పైగా. ఈ క్షిపణి ఒక్కదానితో శత్రు కమాండ్ సెంటర్లను సునాయాసంగా ధ్వంసం చేయగల శక్తి ఉంది. రష్యా కఠిన హెచ్చరిక ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా తీవ్రంగా స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ‘ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు అందిస్తే, మాస్కో–వాషింగ్టన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి’ అని హెచ్చరించారు. స్పష్టంగా చెప్పాలంటే, రష్యా ఆ క్షిపణిలో అణ్వాయుధం ఉందని భావిస్తుందని, అప్పుడు సైన్యమే తగిన ప్రతిస్పందన ఇస్తుందని తెలిపారు. ఇది అణు యుద్ధ భయాన్ని మళ్లీ ప్రపంచంలో ముందుకు తెస్తోంది. ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ ఘర్షణతో యూరప్ అస్థిరంగా ఉంది. అటువంటి సమయంలో అమెరికా నుంచి కొత్త ఆయుధ సహాయం ముఖ్యంగా తోమహాక్ వంటి దూకుడు క్షిపణుల ప్రస్తావన అంతర్జాతీయ శాంతికి మరింత ప్రమాదం. యుద్ధాలను ఆపాలంటే ఆయుధాల వాడకం కాదు ఇరు దేశాలు మాట్లాడుకోవాలి.. రాజనీతికి ప్రాధాన్యతివ్వాలి. ట్రంప్ లాంటి నాయకులకూ.. పుతిన్ లాంటి ప్రత్యర్థులకూ శాంతి సాధనలో సమన్వయం అవసరం. లేకపోతే, ‘తోమహాక్’ వంటి శక్తివంతమైన క్షిపణి మానవజాతి శాంతికి మరొక నిశ్శబ్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

