👉పల్నాడు వజ్రాలపాడులో మెలియయిడోసిస్ బ్యాక్టీరియా కలకలం.*👉టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోటంరెడ్డి.. 🌟నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీకి అభ్యంతరం ఏమిటి?: సీఎం చంద్రబాబు..👉 పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం..👉పశ్చిమ బెంగాల్ లో దారుణం.. మరో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.👉కామారెడ్డిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్‌…👉 ఇదంతా కల్తీ మందే. ..తాగితే పోతారు- CPM..👉సైడ్ బిజినెస్ కోసం పోతే మెయిన్ ఉద్యోగం పోయింది*😱..👉 మెదక్ జిల్లాలో దారుణం – కూలీ మహిళపై అత్యాచారం, చిత్రహింసలు .మృతి …👉కల్తీ మద్యం కేసులో ట్విస్ట్.. ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చిన నిందితుడు జనార్ధన్… 👉మంత్రి లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా చెట్లు నరికేశారని వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్, సోషల్ మీడియాలో ప్రచారం..*👉న్యాయం అడిగిన మ‌హిళ‌ను బైక్‌తో గుద్దిన పోలీస్‌…

👉 పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం..

బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న రెండు దేశాలు.. పాక్ 7 పోస్టుల వెంట ఆఫ్ఘన్ భీకర కాల్పులు.. తమ కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు మరణించారని ఆఫ్ఘన్ ప్రకటన.. కౌంటర్ ఫైరింగ్లో పలువురు ఆఫ్ఘన్ సైనికులు చనిపోయారన్న పాక్..

🌟ప్రతీ కుటుంబానికీ ఆదాయం…మెరుగైన జీవనోపాధి లక్ష్యం*.. *ప్రతీ ఇంటా చిరువ్యాపారమో..చిన్న పరిశ్రమో స్థాపించేలా ప్రణాళిక*.. *నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు*… *రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా స్మార్ట్ దుకాణాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం*  *కల్తీ మద్యాన్ని గుర్తించేలా త్వరలో మొబైల్ యాప్*

*పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం తేవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు*😱😱😱

*కల్తీ మద్యం, పీపీపీ కాలేజీల వ్యవహారంలో వైసీపీ దుష్పచారంపై సీఎం చంద్రబాబు విమర్శలు*

*అమరావతి, అక్టోబరు 11:-* ప్రతీ కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ విధానంలో భాగంగా ప్రతీ ఇంటా చిరు వ్యాపారమో చిరు పరిశ్రమనో స్థాపించేలా పని చేస్తున్నామని సీఎం వెల్లడించారు. శనివారం నెల్లూరులోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను సీఎం అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఈ దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 30 మాడ్యులర్ కంటైనర్లతో 120 దుకాణాలను ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించింది. వీటిని వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా లబ్దిదారులైన దుకాణదారులతో మాట్లాడారు. అనంతరం సీఎం మాట్లాడుతూ…”నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్‌లో దుకాణాలు పొందిన 120 మంది ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌లు అయ్యారు. 18 ఏళ్లకు పైగా వీధి వ్యాపారాలు చేసి ఇప్పుడు అత్యాధునిక దుకాణాలు పొంది వ్యాపారాలు చేస్తున్న మీ అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు ఈ దుకాణాలను అత్యంత పారదర్శకంగా కేటాయించాం. గతంలో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో వ్యాపారాలు చేసుకునే స్థితి నుంచి ఇప్పుడు అత్యాధునిక దుకాణాల ద్వారా వ్యాపారం చేసుకునే సౌలభ్యం మీకు కలిగింది. కొనుగోలుదారులకు అన్ని వస్తువులూ ఒకే చోట లభించేలా ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాంతం ఏర్పాటు అయ్యింది. ఎవరైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే ఎక్కడికీ వెళ్లకుండా ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేయటం అభినందనీయం. రూఫ్ టాప్ సీటింగ్, వైఫై లాంటి ఏర్పాట్లు చేయటం సంతోషంగా ఉంది. ఈ వినూత్న ప్రయత్నం చేసిన మంత్రి నారాయణ, పురపాలక శాఖ, మెప్మా అధికారులను అభినందిస్తున్నాను. ఈ తరహా వినూత్న ఆలోచనలు, ప్రయత్నాలు మరిన్ని జరగాలి. అని ముఖ్యమంత్రి అన్నారు.

కూటమి ప్రభుత్వం పేదలు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ద్వారా నెల్లూరుకు ముందుగానే దీపావళి వచ్చిందని.. ఈ వెలుగులు శాశ్వతం చేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో ఆధునిక దుకాణాలను ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. నెల్లూరు మైపాడు గేట్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు చేసి తొలిసారి ఓ మంచి ప్రయోగం చేశామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. 120 మంది చిన్నపారిశ్రామిక వేత్తలుగా మొదటి అడుగు వేశారని.. మీరు మరింతగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. రాష్ట్రంలో డ్వాక్రా, మెప్మా సంఘాలకు చెందిన 1 లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తామని అన్నారు.

🌟వీధి వ్యాపారాలు చేసే మాకు శాశ్వత దుకాణాలు: మహిళా లబ్దిదారులు*

నెల్లూరు మైపాడు గేట్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌లో దుకాణాలు దక్కించుకున్న మహిళలు అమితానందాన్ని వ్యక్తం చేశారు. మహిళా వ్యాపారులతో ముఖ్యమంత్రి అమరావతి నుంచి వర్చువల్‌గా మాట్లాడి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ స్మార్ట్ దుకాణాలు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయన్న అంశాలను వారి నుంచే అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీధి వ్యాపారాలకు సైతం కిరాయి చెల్లించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈ దుకాణలు ఇచ్చి ఆదుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపిందని లబ్దిదారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం పేదలు, మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకే ప్రభుత్వం కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ లో దుకాణాలు పొందిన మహిళా వ్యాపారులు వాటి హక్కు పత్రాలను చేతుల్లో పట్టుకుని ముఖ్యమంత్రికి చూపించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా నిత్యావసరాలతో పాటు వివిధ వస్తువుల ధరలు తగ్గాయని రెండు శ్లాబ్‌లతో ప్రజలపై భారం తగ్గిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ కూడా కర్నూలుకు వచ్చి ఈ అంశాలను ప్రజలకు వివరిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

🌟కల్తీ మద్యం గుర్తించేందుకు కొత్త యాప్*

గత పాలనలో మద్యం విధానంలో

అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఎం అన్నారు. గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలు తీసి ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఎవరు నకిలీ మద్యం తయారుచేసినా, విక్రయించినా వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం హెచ్చరించారు. ఇటీవల ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేసిన వారిని పట్టుకుని కేసులు పెట్టామని ..ఈ వ్యవహారంలో టీడీపీ వారున్నా ఉపేక్షించకుండా అరెస్టు చేసి కఠినంగా వ్యవహరించామని అన్నారు. కొందరు దీనిని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తూ శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తండ్రి చనిపోతే డ్రామాలాడారని.. బాబాయిని చంపేసి మాపై దుష్ప్రచారం చేయడం చూశామని వ్యాఖ్యానించారు. నెల్లూరులో సాధారణ మరణాన్ని కూడా మద్యం తాగి చనిపోయారంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలోనే ప్రభుత్వం ఓ యాప్ ను తీసుకురానుందని సీఎం ప్రకటించారు. అనుమానం ఉన్న ఎవరైనా మద్యం బాటిల్‌పై ఉన్న హోలో గ్రామ్ స్కాన్ చేస్తే వివరాలు తెలుసుకునేలా యాప్ రూపొందిస్తున్నట్టు వివరించారు.

🌟నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీకి అభ్యంతరం ఏమిటి?*

పీపీపీ విధానంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీకి వచ్చిన అభ్యంతరం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పీపీపీలో నిర్మించే వైద్య కళాశాలల్లో నాణ్యమైన వైద్య సేవలతో పాటు 110 మెడికల్ సీట్లు అదనంగా పేద విద్యార్ధులకు అందుబాటులోకి వస్తాయని సీఎం స్పష్టం చేశారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు వారికి అనారోగ్యం కలిగితే కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని.. కానీ పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన వైద్యం వద్దా అని నిలదీశారు. తాను ఏ పని చేసినా పేదలను దృష్టిలో ఉంచుకునే చేస్తానని, మంచి విద్య, వైద్యంతో పాటు ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. గత పాలకులు అనుసరించిన విధానంతో ఆస్పత్రులు కడితే కనీసం 20 ఏళ్లు పడుతుందని అప్పటి వరకూ పేదలు ఇబ్బందులు పడాలా అని సీఎం ప్రశ్నించారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయన్నారు. యజ్ఞంలా చేస్తున్న మంచి కార్యక్రమాలకు విఘ్నాలు కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నెల్లూరులో కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులతో పాటు దగదర్తి ఎయిర్ పోర్టు, బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ లాంటి ప్రాజెక్టులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వానికి వారి సహకారం అవసరం అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా సహా నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

👉 వాట్సప్‌ లేకుంటే అరట్టై ఉందిగా…సుప్రీంకోర్టు వ్యాఖ్య*

వాట్సప్‌ బదులుగా స్వదేశీ యాప్‌ అయిన అరట్టైను ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన ఖాతాను వాట్సప్‌ బ్లాక్‌ చేసిందని, దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్య చేసింది…ఓ పాలీ డయాగ్నిక్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తి గత 10-12 ఏళ్లుగా వాట్సప్‌ ద్వారా తన ఖాతాదార్లకు సమాచారం పంపిస్తున్నాడు. ఉన్నట్టుండి వాట్సప్‌ తన ఖాతాను బ్లాక్‌ చేయడంతో ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటూ 32వ అధికరణం కింద సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. సమాచారం అందజేయడానికి స్వదేశీ యాప్‌ అరట్టై ఉంది కదా, దాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించింది….

👉కామారెడ్డిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

దొంగనోట్లు చెలామణి చేస్తున్న 8 మంది అరెస్ట్‌ .. నలుగురి కోసం గాలిస్తున్న పోలీసులు..హర్యానా, రాజస్థాన్‌, యూపీ, బిహార్‌తో పాటు..బెంగాల్‌, మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తింపు..

👉తమిళనాడు: తంజావురులో దారుణం..భార్య మీద కోపంతో ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన తండ్రి..హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయిన తండ్రి వినోద్ కుమార్..వివాహేతర సంబంధం పెట్టుకుని వేరే వ్యక్తితో వెళ్లిపోయిన భార్య..

👉సైడ్ బిజినెస్ కోసం పోతే మెయిన్ ఉద్యోగం పోయింది*😱😱😱

మంత్రి తుమ్మల అనుచరుడు, ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సస్పెండ్.. ఖమ్మంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టినందుకు యజమానిపై బూతులతో విరుచుకుపడి, చంపేస్తామంటూ దాడి చేసిన లక్ష్మణ్…నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసి, ప్రస్తుతం డీఈవో ఆఫీసులో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్… విధులు వదిలేసి గొడవలో పాల్గొన్నందుకు లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా విద్యాధికారిణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

👉పశ్చిమ బెంగాల్ లో దారుణం.. మరో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..పశ్చిమ బర్థమాన్ జిల్లాలో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం.. దుర్గాపూర్ లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. స్నేహితుడితో కలిసి భోజనానికి క్యాంపస్ బయటకు వెళ్లిన విద్యార్థిని..  విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు యువకులు..  గత ఏడాది ఆగస్టులో ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిని రేప్ చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది

👉భార్య విడిచివెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తంజావూర్ జిల్లా మదుక్కూర్ సమీపంలోని గోపాలసముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్(38) ఫొటోగ్రాఫర్ గా, డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు నిత్య(35)తో వివాహం కాగా ఓవియా(12), కీర్తి(8), ఈశ్వరన్(5) అనే ముగ్గురు పిల్లలున్నారు. నిత్యకు తిరువారూర్ జిల్లా మన్నార్ కుడికి చెందిన ఒకరితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆరునెలల కిందట ఆమె భర్త, పిల్లలను వదిలేసి ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. వినోద్ కుమార్ కొద్దిరోజుల కిందట భార్యను కలిసి తిరిగి రావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో పిల్లలకు స్వీట్లు ఇచ్చి తినాలని చెప్పాడు. అవి తింటుండగానే ముగ్గురు పిల్లల గొంతు కోసేశాడు. రక్తపుమడుగులో అక్కడిక్కడే వారు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం వినోద్ కుమార్ మదుక్కూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

👉 మెదక్ జిల్లాలో దారుణం – కూలీ మహిళపై అత్యాచారం, చిత్రహింసలు .మృతి ..పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ నిరుపేద మహిళపై కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. పని ఇప్పిస్తామని నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడి చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు మెదక్ మండలం జానకంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందినవారు. ఆమె భర్త మెదక్ పట్టణంలో అడ్డా కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు కలిసి కూలీ పనులు చేస్తూ ఉంటారు. అయితే తన భర్త గద్వాల్ లో రెండు రోజుల పాటు పని ఉంది అని వెళ్ళడంతో ఆ మహిళ ఒక్కతే క్యారేజ్ పెట్టుకుని శుక్రవారం ఉదయం కూలి పని కోసం మెదక్ పట్టణానికి వచ్చింది. అక్కడి కూలీల అడ్డాలో పని కోసం ఎదురుచూస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను సంప్రదించారు. పని ఉందని నమ్మబలికి, ఆమెను కొల్చారం మండలం అప్పాజీపల్లి శివారులోని ఏడుపాయల వెళ్లే రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వివస్త్రను చేసి, రెండు చేతులను ఓ స్తంభానికి కట్టేసి అక్కడి నుంచి పారిపోయారు. రాత్రంతా బాధతో అలమటించిన ఆ మహిళను శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, బాధితురాలను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

👉కల్తీ మద్యం కేసులో ట్విస్ట్.. ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చిన నిందితుడు జనార్ధన్.. జనార్ధన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి ఆరా తీసిన పోలీసులు..

ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలో ఎయిర్పోర్టులో పోయిందన్న జనార్ధన్.. జనార్ధన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు.. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారుల ప్రయత్నాలు.

👉మంత్రి లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా చెట్లు నరికేశారని వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్, సోషల్ మీడియాలో ప్రచారం..*అది ఫేక్ అంటూ ఖండించిన లోకేష్..గతంలో సీఎంగా ఉన్న జగన్ హెలికాప్టర్ లో వెళ్తున్నా కింద చెట్లు కొట్టేసేవారు అని లోకేష్ కౌంటర్..సాధారణంగా చేసే రోడ్డు బ్యూటిఫికేషన్ పనులను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని వైసీపీపై ఫైర్..విశాఖపట్నంలో ఎక్కడా చెట్లు కొట్టేయలేదని మంత్రి లోకేష్ వివరణ..

👉ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం కొండపేట వాగు వద్ద అర్బన్ సిఐ సురేష్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాగులో నీటి ప్రవాహం ఇప్పటికే ఉదృతంగా ఉంది, అక్కడ నీటి గుండాలు కూడా కనిపిస్తున్నాయి. పిల్లలు మరియు పెద్దలు ఎవరు అయినా ఈతకు ప్రయత్నించరాదు, ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని సీఐ ప్రజలను హెచ్చరించారు. *గిద్దలూరు కొండపేట వాగు వద్ద పరిస్థితి*  వాగులో నీటి ప్రవాహం అత్యంత వేగంగా వుంది. నీటి గుండాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఇవి ప్రమాదాత్మకంగా మారవచ్చు అని ఆయన హెచ్చరించారు

👉 ఇదంతా కల్తీ మందే. ..తాగితే పోతారు- CPM నేతలు..నకిలీ మద్యం అరికట్టాలంటూ విజయవాడ లో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన..విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్ ఎదుట మహిళల నిరసన..మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైన్ షాప్ ఎదుట నిరసన

👉 సంక్షేమశాఖ అధికారి మయూరిని నిలదీసిన విద్యార్థులు, తల్లిదండ్రులు..హాస్టల్లో సరైన వసతులు లేవంటూ నిలదీత..బల్లి పడిన నీళ్లు తమ పిల్లలతో తాగిస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆగ్రహం.. గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత.. హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతున్న విద్యార్థులు..ఖాళీ చేస్తే మళ్లీ హాస్టల్లోకి అనుమతించమన్న అధికారి మయూరి

👉టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోటంరెడ్డి

నెల్లూరు జిల్లా నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్నాడంటూ ఆయన ఆరోపించారు. రేషన్ బియ్యం పాలిట మాఫియా డాన్ గా మారిన ఈ టీడీపీ నేత ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్లో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయి టీడీపీలోనూ చర్చనీయాంశమైంది.

మాఫియా డాన్ గా మారి…శ్రీనివాసులు రెడ్డి ఎవరిని టార్గెట్ చేశారన్న చర్చ సింహపురి పొలిటికల్ లీడర్స్ లో జరుగుతుంది. గత కొద్ది రోజులుగా టీడీపీ నేత మాఫియా డాన్ గా మారి రేషన్ బియ్యాన్ని తమిళనాడుకు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నాడని, అతని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, అందుకే తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొనడం విశేషం.

👉 విశాఖ: రుషికొండ భవనాలపై ప్రజల నుంచి సూచనలు స్వీకరించనున్న ఏపీటీఏ.. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన భవనాల వినియోగంపై సూచనల కోసం బహిరంగ ప్రకటన.. ఏపీటీఏ వెబ్‌సైట్ ద్వారా సలహాలు ఇచ్చేలా ఏర్పాటు.. రుషికొండ భవనాలపై ఇప్పటికే మంత్రుల కమిటీ వేసిన ప్రభుత్వం.. రెండు రోజుల క్రితం సమావేశమైన కమిటీ.. త్వరలో ప్రభుత్వానికి చేరనున్న మంత్రుల కమిటీ నివేదిక..

👉న్యాయం అడిగిన మ‌హిళ‌ను బైక్‌తో గుద్దిన పోలీస్‌…

పులివెందుల యాదవారిపల్లి స్థల వివాదంలో పోలీసుల జోక్యం..లక్ష్మీదేవిని బైక్ తో పోలీసులు ఢీకొట్టారని స్థానికుల ఆగ్రహం..మనస్తాపంతో విషద్రావణం తాగిన మహిళ.. పరిస్థితి విషమం..8 నెలలుగా స్థల వివాదం జరుగుతున్నట్టు స్థానికుల వివరణ .. తక్షణం న్యాయం జరగాలంటూ బాధితుల ఆందోళన

👉పల్నాడు వజ్రాలపాడులో మెలియయిడోసిస్ బ్యాక్టీరియా కలకలం.*

దావుపల్లి తండా వాసుకి బ్యాక్టీరియా గుర్తించిన స్థానిక ప్రభుత్వ వైద్యులు .. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తండ వ్యక్తి… మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి తరలింపు .. తండా ప్రాంతంలో అందరికి వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యుల బృందం..

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా