🌟 రేషన్ కార్డులను ప్రవేశ పెట్టడం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో నూతన అధ్యాయం..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా శ్రీ…
ప్రకాశం జిల్లా..ఒంగోలు.. స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశ పెట్టడం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో స్మార్ట్నూతన అధ్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో క్యూ.ఆర్. కోడుతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. మంత్రితోపాటు కలెక్టర్ పి.రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ సభ్యుల వివరాలు, వారు రేషన్ సరుకులు పొందే దుకాణ డీలర్ వివరాలతో ఏటీఎం కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ విధానాన్ని పటిష్టపరచి ఎం.డి.యు. వాహనాల స్థానంలో డీలర్ వ్యవస్థను పునరుద్ధరించి వృద్ధులు, వికలాంగుల ఇంటికే నేరుగా రేషన్ సరుకులను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఒంటరి మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు కూడా రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వ 16 నెలల కాలంలోనే జిల్లాలో 20వేలకు పైగా కొత్త రేషన్ కార్డును మంజూరు చేసినట్లు చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, సరుకులు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. నెలలో ఎప్పుడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు కూడా వీటిని గుర్తింపు కార్డులుగా వాడుకోవచ్చని మంత్రి చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ దుర్వినియోగాన్ని నివారించేలా సాంకేత పరిజ్ఞానంతో ఈ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్డు ద్వారా ఏ షాపులో, ఏ సమయంలో రేషన్ సరుకులు తీసుకున్నారో ట్రేస్ చేయవచ్చు అన్నారు. కార్డు పోయినా జిరాక్స్ కాపీతో కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. రేషన్ బియ్యాన్ని చులకనగా చూడవద్దని, మరిన్ని పోషకాలు ప్రజలకు అందేలా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని కలెక్టర్ పి రాజబాబు వివరించారు.
ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం-2, స్త్రీశక్తి, ఆటో డ్రైవర్ల సేవలో వంటి కార్యక్రమాల ద్వారా ఆ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని, సమగ్ర వివరాలతో ఇదే మాదిరిగా స్మార్ట్ పాస్ బుక్కులు కూడా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6,51,818 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీరికి 1392 రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తామని తెలిపారు. కొత్తగా పెళ్లయిన వారు కూడా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేలా ఉమ్మడి కుటుంబం నుంచి డివైడ్ చేసి ఇచ్చేలా మే నెల నుంచే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రేషన్ షాపులను కూడా వివిధ సరుకులు అందుబాటులో ఉండేలా స్థానిక అవుట్ లెట్లుగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి నెలలోనూ ఒకరోజును ఎన్ఫోర్స్మెంట్ డే గా నిర్వహిస్తున్నామన్నారు. దీపం-2 పథకంలో ఇప్పటివరకు 10 లక్షల మందికి 70 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులకు భోజనం కోసం ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్లు వివరించారు.
ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ వేలిముద్రల సమస్యలకు చెక్కు పెట్టేలా కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది అన్నారు. సంక్షేమంలో ఇది నూతన ఒరవడి అని ఆయన వ్యాఖ్యానించారు.
మేయర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదే క్రమంలో స్మార్ట్ కార్డులను ప్రవేశ పెట్టడం సంతోషకరమన్నారు.అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు వారు అందించారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని డిఎస్ఓ పద్మశ్రీ తెలిపారు. ఒంగోలు ఆర్డీవో కళావతి, ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఆర్. వెంకట్రావు, ఇతర అధికారులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
🌟రేషన్ షాపుల్లో అవకతవకలను అరికట్టే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ :: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*కంభం పట్టణంలోని రామాలయం వీధి, గచ్చు కాలువ, తిప్ప ప్రాంతాల్లో శనివారం ఉదయం గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఉన్న రేషన్ కార్డుల వ్యవస్థలొ అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని అందుకే స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరికి సరుకులు అందేలా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ ఆలోచనల నేపథ్యంలో ప్రతి రేషన్ షాపును స్మార్ట్ షాప్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే రేషన్ అందే లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం చేసే మంచిని ఆదరించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెళ్లే లక్ష్యంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ వలె మన ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు..ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట మహాలక్ష్మి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతం శ్రీను, మండల తహసీల్దార్ కిరణ్, పట్టణ అధ్యక్షులు ఓబుళరెడ్డి మాధవ రావు, తోట శ్రీను, ఎన్టీఆర్ గౌస్, జనసేన అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, జిల్లా నాయకులు లంకా నరసింహారావు, మరియు కూటమి శ్రేణులు పాల్గోన్నారు..*
*చెన్నకేశవుల మరియు పాశం వారి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*కంభం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పట్టణానికి చెందిన చెన్నకేశవుల భాస్కర్ గారి కుమారుడు చి. ప్రత్యూష నాయుడు మరియు గిద్దలూరు మండలం, కొంగలవీడు గ్రామానికి చెందిన కీ. శే పాశం మురళీ కృష్ణ గారి కుమార్తె చి.ల.సౌ వాసవీ లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కంభం మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు..*
👉మండ్ల వారి వివాహంలో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల*
గిద్దలూరు పట్టణం, నంద్యాల రోడ్డులోని చీతిరాల కళ్యాణ మండపంలో, పట్టణానికి చెందిన మండ్ల వెంకటరమణ కుమార్ కుమారుడు చి. వినీత్ మరియు అనూష లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో మండ్ల శ్రీను, నల్లబోతుల రమాదేవి, కృష్ణమూర్తి, పసుపులేటి శ్రీను, మండల విద్యాధికారి అశ్విన్ తదితరులు పాల్గోన్నారు..*
👉దొనపాటి వారి వివాహ మహోత్సవoలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో MBR కళ్యాణ మండపంలో దొనపాటి నాగేశ్వరరెడ్డి ప్రసన్నలక్ష్మి గారి కుమార్తె లక్ష్మీ నమృత & కార్తిక్ శివారెడ్డి ల వివాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని వధూవరుల ఆశీర్వదించారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు*
👉వలీమా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు పట్టణం ఒంగోలు రోడ్డులోని తిరుమల కన్వెన్షన్ లో గిద్దలూరు మండలం దేవనగరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కొండూరి నరసింహులు కుమారుడు చి. జయసింహ మరియు మౌనిక ల వలీమా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు..*
👉ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ…!.. గిద్దలూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు శ్రీకారం..!
▪తొలిసంతకం చేసి ప్రారంభించిన మాజి ఎమ్మెల్యే,గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కె. పి.నాగార్జున రెడ్ది …కంభం మండలం కందులాపురంలో కార్యక్రమం..!
ముఖ్య అతిధులుగా హాజరైన ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కె.వి.రమణ రెడ్డి ..
..పేదలకు ఉచిత వైద్యంతోపాటు ఏటా 5 వేలమంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య పొందాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా కంభం మండలం కందులాపురంలో గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి రెడ్డి మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి ని కాదని చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం వలన ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన కొనసాగిస్తున్నారో మీఅందరికి తెలుసు దృతరాష్ట్రుడి పాలన సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు విపరీతమైన దనదాహంతో ఉన్నారన్నారు. ఎక్కడ చూసినా అక్రమ వసూళ్లు అరాచకాలే అన్ని నియోజకవర్గలోనూ దోపిడీ, చేస్తున్నారనీ 16 నెలల్లో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అన్ని వర్గాలపైన వివక్ష చూపిస్తున్నారన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. 15 నెలల్లో ఒక పార్టీ రోడ్డెక్కి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందంటే ఎంత చెడ్డపేరు వచ్చిందో ఒకసారి ఊహించుకోవాలన్నారు.
మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కె. పి. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ…
సూపర్ సిక్స్‌తో పాటు 200 హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 2–3 పథకాలు పాక్షికంగా అమలు చేశారు. కళ్లు ఆర్పకుండా అపద్ధాలు చెప్పడంతో చంద్రబాబు తనకు తానే సాటి అని మరోమారు నిరూపించుకున్నాడనీ ఆరోపించారు. మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో అమలు చేసిన అసరా, సున్నావడ్డీ పథకాలకు మంగళం పాడారన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేలు ఇస్తామన్న హామీ అమలు చేయలేదనీ 50 ఏళ్లు దాటిన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని చెప్పి అదికూడా ఇవ్వలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేయడం ద్వారా లక్షా 5 వేల కోట్ల ఆదాయం వచ్చింది. నెలకు 18 వేల కోట్లు. అంతకముందు చంద్రబాబు హయాంలో నెలకు 1100 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే జగనన్న హయాంలో 60 శాతం పెరిగిందన్నారు. అదే పద్ధతిలో ప్రస్తుతం నెలకు 2600 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. ఇప్పటిదాకా చూపించింది మాత్రం నెలకు 1200 కోట్లే. తక్కిన ఆదాయమంతా దోపిడీ చేశారు. అక్రమంగా లిక్కర్ తయారీ కేంద్రాల్లో స్పిరిట్ కలిపి బాటిళ్లలో నింపి మద్యం దుకాణాల్లో అమ్ముతుండడం వల్ల జనాల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. గుడి,బడి,బస్టాప్ అని చూడకుండా ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు తెరిచి మధ్యాన్ని ఏరులై పారిస్తూ మధ్యఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగ తయారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జగనన్న రాకముందు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలుండేవనీ జగనన్న వచ్చిన తర్వాత 17 కొత్త కళాశాలలను తీసుకొచ్చారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్నది రాజశేఖర్‌రెడ్డి కల. ఆయనే ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ క్రమంలో ఏటా 5 వేలమంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య చదువుకునే అవకాశాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాలను ఆపేశారనీ ,ఇప్పుడు ప్రైవేట్‌పరం చేసేందుకు పూనుకున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాల్సి ఉంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలిరానున్న రోజుల్లో పార్టీకి సంబంధించిన అన్ని గ్రామకమిటీలు,అనుబంధ కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు యేరువ రంగా రెడ్డి, గొంగటి చెన్న రెడ్డి, మేరీగ రవికుమార్, ఆవుల శ్రీధర్ రెడ్డి, ఎంపీపీలు చేగిరెడ్డి ఓబుల్ రెడ్డి తులసమ్మ, మేడూరి వెంకట్ రావు, వేగినాటి ఓసురా రెడ్డి,జెడ్పీటీసీలు సారె వెంకట్ నాయుడు, పగడాల శ్రీరంగం , బండ్లమూడి వెంకట రాజయ్య,సర్పంచులు,రాష్ట్ర అనుబంధ విభాగ సభ్యులు నెమలిదిన్నె చెన్నారెడ్డి, అబ్దుల్ గఫార్, చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్,మరియు జిల్లా,నియోజకవర్గ, మండల అనుబంధ విభాగ సభ్యులు మరియు కార్యకర్తలు హాజరు అయ్యారు.

