👉వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడో..
2025 శాంతి నోబుల్ బహుమతి విజేతగా వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడో (María Corina Machado) ఎంపిక అయ్యారు. నార్వే నోబుల్ కమిటీ అక్టోబర్ 10, 2025న ఈ ప్రకటన చేసింది. ఆమెకు ఈ బహుమతి “వెనెజువెలా ప్రజల డెమోక్రటిక్ హక్కులను ప్రోత్సహించడానికి మరియు డిక్టేటర్ షిప్ నుండి న్యాయమైన, శాంతియుత డెమోక్రటిక్ మార్పుకు ఆమె అలసిపోని పోరాటానికి” లభించింది. ఈ బహుమతి విలువ స్వీడిష్ క్రౌన్లలో 11 మిలియన్లు (సుమారు 12 మిలియన్ అమెరికన్ డాలర్లు), భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 10.25 కోట్లు (పది కోట్ల ఇరవై ఐదు లక్షలు) డిసెంబర్ 10, 2025న ఒస్లో లో అందజేయ బడుతుంది.
👉కరూర్ తొక్కిసలాట ఘటన… సుప్రీంలో కీలక పరిణామం! తొక్కిసలాట మృతుల పోస్ట్ మార్టం పరీక్షలు అర్ధరాత్రి నిర్వహించి నాలుగు గంటల్లో ఎలా పూర్తి చేశారూ .. !!! సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందడంతో పాటు పదుల సంఖ్య గాయపడ్డారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అవును… కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంలో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులతోనే సిట్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. ఈ సమయంలో తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. అంతకంటే ముందు మరణించిన బాధితురాలి తరపున కేంద్ర సంస్థతో దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లకు ప్రతిస్పందనగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఇదే సమయంలో సెప్టెంబర్ 27న కరూర్ లో తొక్కిసలాటకు దారితీసిన రోడ్ షో ర్యాలీకి టీవీకేకి ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా కరూర్ తొక్కిసలాట మృతుల పోస్ట్ మార్టం పరీక్షలు అర్ధరాత్రి నిర్వహించి నాలుగు గంటల్లో ఎలా పూర్తి చేశారని కూడా కోర్టు ప్రశ్నించింది. ఏఐడీఎంకే కూడా ర్యాలీకి అనుమతి కోరగా… స్థలం ఇరుకుగా ఉందని, అందువల్ల అనుమతి ఇవ్వలేమని చెప్పిన పోలీసులు.. అదే స్థలంలో టీవీకే పార్టీకి మాత్రం అనుమతి ఇచ్చారని.. ఏఐడీఎంకే కోసం జనం రద్దీగా ఉంటే.. టీవీకే కోసం కూడా జనం రద్దీగా ఉంటారని.. ఇందులో మొత్తం తప్పు రాష్ట్ర పోలీసులదే అని తెలిపారు. అదేవిధంగా పిటిషనర్ లేవనెత్తిన మరో అంశం ఏమిటంటే.. 27వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఈ సంఘటన జరిగిందని.. అందరినీ రాత్రి 9-10 గంటలకు ఆసుపత్రికి తరలించారని.. ఈ సమయంలో ఓ వ్యక్తి భార్యను కోల్పోయి దుఃఖంలో ఉన్నాడని.. అయితే.. రాత్రి 10:30 గంటలకు 30 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, ఉదయం 4 గంటలకు దహన సంస్కారాలు పూర్తి చేశారని తెలిపారు.
👉 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
రూర్బన్ పంచాయతీలలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ ఎంపీడీవో కేడర్కు వారిని ప్రమోట్ చేస్తామన్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు. 4 గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ: పవన్.. పంచాయతీలు బలోపేతం అవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు.
7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నామన్నారు. గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేసినట్లు వివరించారు.
👉బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం*ఆంధ్రా ..
విశాఖపట్నం…దువ్వాడలో ఉన్న లావిసి బ్యూటీ సెలూన్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్ఐ భరత్ కుమార్ రాజు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
👉ఒంగోలు నగరంలోని స్పా సెంటర్లపై ఏక కాలంలో దాడులు నిర్వహించిన ప్రకాశం పోలీసు బృందాలు..
👉 స్పా సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు…చట్టవ్యతిరేక, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలసి గురువారం ఒంగోలు టౌన్ లోని 9 స్పా సెంటర్లపై సిఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది 9 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో స్పా సెంటర్ల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులు, అనుమతులు, ఉద్యోగుల వివరాలను పూర్తిగా పరిశీలించారు. స్పా సెంటర్లలోని సీసీ కెమెరాల పనితీరు, అంతర్గత నిర్మాణ శైలి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రకాశం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు.
ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీలో ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు,ఒంగోలు సబ్ డివిజన్ ఎస్సైలు నాగమలేశ్వరావు, సుధాకర్, పున్నారావు, అజయ్ బాబు, వెంకట్ సైదులు, నాగేంద్ర కుమార్, ఫణిభూషణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉 ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కృష్టా పురం లో దోపిడీ దొంగల హల్చల్ ..
దొంగతనానికి వచ్చిన దొంగలను గుర్తించిన గ్రామస్తులు.. పట్టుకునేందుకు ప్రయతించడం తో పరారీ అవుతుండగా వారిలో ఒకరు దొరకగా మరో నలుగురు పరారీ…దొరికిన దొంగను పోలీసులకు అప్పగింత..

