👉A I సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ ముఖాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్.. డబ్బులు తీసుకొని ఘరానా మోసం…*😱 ..👉ఒంగోలు విమానాశ్రయం మరియు తదితర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన -ఒంగోలు ఎంపీ మాగుంట..👉ఎర్రవల్లి ఫాంహౌస్ కు కె టి ఆర్, హరీశ్ రావు..👉 బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే: సీఎం డౌన్ డౌన్ అంటూ సంఘాల నిరసన.. 👉డాక్టర్ సీటు సాధించిన పోలీసుల పిల్లలను అభినందించిన సీపీ*.. 👉 ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం.. ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు..👉 IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్..👉గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు 20 కోట్ల రూపాయల విరాళం!.. 👉 హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..👉చిత్తూరు లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా..👉జిల్లాలో మూతపడనున్న 52 ఎయిడెడ్ పాఠశాలలు*.. * కంభం లో ఘనంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..

👉ఏం తమ్ముళ్లు ఎలా ఉన్నారు…! అంటూ…*A I సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ ముఖాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్.. డబ్బులు తీసుకొని ఘరానా మోసం…*😱😱😱

*నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, మోసపోయామని గ్రహించిన 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు…*

*తెలంగాణ తెలుగుదేశం నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా గుర్తించిన పోలీసులు..*

*ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమ పీఏ పేరుతో ఫోన్ చేసి, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పిన దుండగుడు..*

కాసేపటికి దేవినేని ఉమ మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి, టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని, మూడు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని చెప్పిన వ్యక్తి.. దీంతో రూ.35 వేలు డబ్బును పంపిన సదరు టీడీపీ నాయకుడు.. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని తెలిపిన దుండగుడు.. చెప్పినట్టుగానే కాసేపటికి చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో, నిజమని నమ్మిన టీడీపీ నాయకులు..కాసేపటికి ఫోన్ చేసి విజయవాడకు వస్తే చంద్రబాబును కల్పించి, బీ ఫాం ఇప్పిస్తానని చెప్పడంతో, విజయవాడకు వెళ్లిన 18 మంది టీడీపీ నాయకులు..

హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో, విజయవాడలోని ఒక హోటల్లో బస చేసేందుకు వెళ్లిన నాయకులు..సాయంత్రం తిరిగి ఫోన్ చేసి, చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలని తెలిపిన దుండగులు..ఈ క్రమంలో ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగగా రంగంలోకి దిగిన పోలీసులు..విషయం తెలుసుకున్న పోలీసులు దేవినేని ఉమకు ఫోన్ చేయగా, తాను ఎవరికి ఫోన్ చేయలేదని స్పష్టం చేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ..ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తమ పరువే పోతుందని, సైలెంట్‌గా వెనుదిరిగిన తెలంగాణ టీడీపీ నాయకులు

👉ఒంగోలు విమానాశ్రయం మరియు తదితర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన -ఒంగోలు ఎంపీ మాగుంట..  ఈ రోజు వెలగపూడి లోని సచివాలయంలో ముఖ్యమంత్ర్రి కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి .ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై చర్చించినారు.

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాలలో బాగా వెనుకబడిఉన్నందున, దాని పరిధిలో భూ సేకరణ జరిగిన ఒంగోలు విమానాశ్రయం నిర్మాణ అనుమతులు త్వరితగతిన పొంది, పనులు మొదలు పెట్టడం గురించి, కొండపి, కనిగిరి, మార్కాపురం మరియు యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 39 రోడ్లు పునర్నిర్మాణానికి పి.యం.జి.ఎస్.వై. (IV) పధకం క్రింద రూ. 135 కోట్లు మంజూరు చేయించడం గురించి, కోస్టల్ కారిడార్ రోడ్డు నిర్మాణం గురించి మరియు పీఎం E – BUS సేవా పధకం క్రింద ఒంగోలు లోని APSRTC కి ఎలక్ట్రిక్ బస్సులను కేయించాలని కేంద్రంతో సంప్రదించి వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయవలసినదిగా ముఖ్యమంత్రిగాని కోరినారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రంతో సంప్రదించి ఒంగోలు విమానాశ్రయం, పి.యం.జి.ఎస్.వై. (IV) పధకం క్రింద రోడ్లు, కోస్టల్ కారిడార్ రోడ్డు మరియు ఒంగోలు RTC కి ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే మంజూరు చేస్తానని తెలియజేసినారు.

👉 👉  జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా…హైదరాబాద్ లో తిరుగులేదని చాటుకోవడంతో పాటు,పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని…B.R.S భావిస్తోంది.ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి..సునీత పేరును ప్రకటించిన గులాబీ పార్టీ…ఎన్నికల వ్యూహం,ప్రచారంపై దృష్టి సారించింది.

👉ఎర్రవల్లి ఫాంహౌస్ కు కె టి ఆర్, హరీశ్ రావు

తెలంగాణ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు ఆ పార్టీ నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్ కు చేరుకుంటున్నారు. ఈ మేరకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎర్రవల్లి ఫాంహౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ వారితో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ పై పార్టీ నేతలకు KCR దిశానిర్దేశం చేయనున్నారు.

👉 బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే: సీఎం డౌన్ డౌన్ అంటూ సంఘాల నిరసన

తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ చర్యను నిరసిస్తూ బీసీ సంఘాల నేతలు తెలంగాణ హైకోర్టు వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

👉డాక్టర్ సీటు సాధించిన పోలీసుల పిల్లలను అభినందించిన సీపీ*

యం.బి. బి.ఎస్ లో సీటు సాధించిన పోలీస్ పిల్లలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించి అభినందనందించారు. కొద్ది రోజుల క్రితం యం. బి. బి. ఎస్ మొదట విడత కౌన్సిలింగ్లో సెంట్రల్ జోన్ షేక్ సలీమా కుమార్తె తాన్య సభ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, హోంగార్డ్ బాలకిషన్ కుమారుడు ముప్పా చందుకు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు, మరో హోం గార్డ్ మోహన్ కుమార్తె భవాని ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలో సీటు సాధించింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న పిల్లలు చదువుల పట్ల అశ్రద్ధ వహించవద్దని.. వారిని ఉన్నత చదువులు చదివే విధంగా ప్రోత్సాహించాలని, తమ పిల్లలు యం. బి. బి. ఎస్ సీటు సాధించడం కృషి చేసిన తల్లిదండ్రులకు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అడిషనల్ డీసీపీ లు శ్రీనివాస్, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్. ఐ చంద్రశేఖర్ తో హోం గార్డ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

👉స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే.. ప్రభుత్వం నెక్స్ట్ ప్లాన్ ఇదేనా!

తెలంగాణలో ఇవాళ MPTC, ZPTC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. కాగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణగా జరగగా.. స్థానిక ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ ప్లాన్ బీ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు ఆగకుండా పాత రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు వెళ్తుందని సమాచారం.

👉 ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం.. ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు..

ఒకే గొడుగు కిందకు ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు..విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం..ఈ నెల 9న‌ సాయంత్రం 6 నుంచి 13 ఉదయం 10 వరకు లావాదేవీలు బంద్..ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిపివేత

👉 IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్..IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్..

హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలే కారణమని పురాణ్ కుమార్ భార్య IAS అధికారిణి అమ్నీత్ పి. కుమార్ ఆరోపించారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు చండీగఢ్ పోలీసులకు అమ్నీత్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 7 చండీగఢ్‌లోని తమ నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

👉ఆదిలాబాద్ లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్..

ఆదిలాబాద్ రూరల్ మండలం అశోదలో గంజాయి సాగు చేస్తున్న మేస్రం భుజంగ్ రావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

👉 ఏసీబీ వలలో చిట్యాల ఎమ్మార్వో…? నల్గొండ :

ఓ వ్యక్తి నుంచి రూ 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిట్యాల ఎమ్మార్వో క్రిష్ణ….గతంలోనూ కృష్ణ పై అనేక అవినీతి ఆరోపణలు…కృష్ణ అస్తులపైనా కొనసాగుతున్న ఏసీబీ విచారణ…

👉గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు 20 కోట్ల రూపాయల విరాళం! 💐💐💐

అమెరికాలో స్థిరపడిన *గుంటూరు వైద్యురాలు డాక్టర్‌ ఉమా గవిని ఔదార్యం*గుంటూరు : యాభై ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు. మొత్తం రూ.20 కోట్ల ( 2.50 లక్షల డాలర్లు ) ఆస్తిని జీ.జీ.హెచ్‌ లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్టు గా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లిన *సూపర్ స్పెషలిటీ ‌ డాక్టర్‌*

👉 హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..

ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించి.. జీడిమెట్లలో రూ.72 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం…220 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్ లభ్యం కావడంతో.. దాన్ని సీజ్ చేసేసిన ఈగల్ టీమ్ అధికారులు…మొత్తం నలుగురు నిందితులు అరెస్టు.. మరొకరు పరారీలో ఉండగా గాలింపు చర్యలు షురూ..హైదరాబాద్‌లోనే ఒక పరిశ్రమలో ఈ డ్రగ్స్‌ని తయారు చేసినట్లుగా గుర్తించిన అధికారులు

👉పోలీసుల వేధింపులు తట్టుకోలేనంటూ డీ మార్ట్ బిల్డింగ్ ఎక్కి యువకుడు హల్చల్ దూకేస్తా నేను చచ్చిపోతా నన్ను ఆపకండి అంటూ బెదిరింపులకు పాల్పడిన యువకుడు పేరు వడ్డాది కృష్ణ .. గాజువాక సింహగిరి కాలనీ కి చెందిన కృష్ణ (20) తల్లిదండ్రులు చనిపోయారు. తండ్రి వడ్డాది శ్రీను జీవీఎంసీ ఔట్ సోర్సింగ్ లో పనిచేవారు. కృష్ణ అమ్మ నాన్న చనిపోయిన తరువాత 80 ఏళ్ల వయసున్న నాన్నమ్మ తో కలిసి అన్నయ్య దగ్గరే ఉండేవాడు..

ఒక కొట్లాట కేసులో కృష్ణపై కేసు నమోదైంది…అప్పటి నుండి ఇంటి నుండి వెళ్లిపోయిన మనవడి కోసం 6 నెలలుగా ఆ వృద్ధురాలు ఎదురు చూస్తూనే ఉంది. ఆరు నెలలుగా ఆచూకీ లేని కృష్ణ ఒక్కసారిగా ఆత్మహత్య యత్నం చేయడంతో షాకింగ్ కి గురయ్యారు బంధువులు.

పోలీసులు నన్ను వేధిస్తున్నారు అంటూ నేను చనిపోతా అంటూ గోపాలపట్నం డీ మార్ట్ బిల్డింగ్ ఎక్కి హడావిడి చేసాడు.పోలీస్ లు , ఫైర్ సిబ్బంది నచ్చ జెప్పి కిందకి దించారు..యువకుడు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించి స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు

👉విశాఖ కేజీహెచ్ వ‌ద్ద పోలీసుల అత్యుత్సాహం..!!!

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్రెస్‌మీట్‌కు అనుమ‌తించ‌ని ప్రభుత్వం..ఆస్ప‌త్రి నుంచి మీడియాను బ‌య‌ట‌కు పంపించిన పోలీసులు..మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడ‌కూడ‌ద‌ని ప్రభుత్వం ఆంక్ష‌లు..  ప్రభుత్వ తీరుపై మీడియా ప్ర‌తినిధులు, వైసీపీ శ్రేణులు ఆగ్రహం

👉చిత్తూరు లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా..

అపోలో యూనివర్సిటీ గర్ల్స్ బాత్రూంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..టాయిలెట్స్ లో శబ్దం వస్తుందని గమనించిన విద్యార్థిని, ఈనెల 1న యూనివర్సిటీ రిజిస్టార్ కు సమాచారం.. అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ పోతురాజు రహస్యంగా తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన చిత్తూరు తాలూకా పోలీసులు.. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సైట్ ఇంజనీర్ కాంతా రూబెన్, విరుద్ నగర్ జిల్లా వాసి..  నిందితుడు వద్ద నుండి ఇప్పటికే మొబైల్, ల్యాప్టాప్ స్వాధీనం..నిందితుడిని విచారిస్తున్నట్లు చిత్తూరు తాలూకా సిఐ నిత్య బాబు.!

👉కుక్క కరిచినా చికిత్స చేయించకపోవడంతో మహారాష్ట్రలో 3 ఏళ్ల బాలుడు రేబిస్తో మృతి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఆడుకుంటున్నప్పుడు 3 ఏళ్ల బాలుడు అర్మాన్ని కుక్క కరవగా, 10 రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్తో మరణించాడు. కుక్క కరిచినట్లు తాము గమనించలేదని, ఇది జరిగిన 8 రోజులకు అర్మాన్ తలపై పంటి గాట్లను చూశామని కుటుంబ సభ్యులు తెలిపారు. “అర్మాన్ నీటిని చూసి కూడా భయపడ్డాడు. తన శరీరాన్ని గోక్కునేవాడు. వీధి కుక్క మాదిరి బాలుడి నోటి నుంచి చొంగ కారింది,” అని బంధువు చెప్పారు~£

👉త్వరలో 11,000+ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?

పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవల డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో సివిల్ ఎస్సై 315, సివిల్ కానిస్టేబుల్ 3,580, RSI పోస్టులు 96, APSP కానిస్టేబుల్ పోస్టులు 2,520 ఉన్నాయి.

👉జిల్లాలో మూతపడనున్న 52 ఎయిడెడ్ పాఠశాలలు*

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 52 ఎయిడెడ్ పాఠశాలలను మూత వేసేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. 40 కన్నా తక్కువగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించి వాటిని మూసివేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి ఆదేశాలు పూర్తిగా అమలు చేయాలని కమీషనర్ తెలిపారు. మూతపడ్డ పాఠశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్థులను దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు చేర్పించాలన్నారు. ఇంకా ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా స్థానాలలో భర్తీ చేస్తారన్నారు.

👉ప్రకాశం జిల్లా కంభం లో ఘనంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి జన్మదిన వేడుకలు..

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా