👉కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. కంపెనీ యజమాని అరెస్ట్.*..👉జ‌గ‌న్‌కు షాక్‌.. బాబుకు జోష్‌: ఇక‌, రైట్ రైట్‌!…👉భారత ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన మత ఉన్మాద దాడిని ఖండించండి ఆవాజ్ కమిటీ .. 👉మోహన్ బాబుకి బిగ్ షాక్.. అత్యాశకు పోయి ఢమాల్!.. 👉విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు*..మాగుంట శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాచగర్ల వెంకటరావు ..👉 మార్కాపురం పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్.. 👉కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించి రికార్డుల నిర్వహణపై SHOలు, స్టేషన్ రైటర్లకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు… ఘనంగా *గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల జన్మదిన వేడుకలు..

👉జ‌గ‌న్‌కు షాక్‌.. బాబుకు జోష్‌: ఇక‌, రైట్ రైట్‌! ఏపీలో వైసీపీ హ‌యాంలో కేంద్రం నుంచి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను కొత్త‌గా తీసుకువ‌చ్చారు. వీటిలో 5 కాలేజీ ల‌ను మాత్ర‌మే వైసీపీ హ‌యాంలో పూర్తి చేశారు.  వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. అదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌వ‌చిస్తున్న ప్రైవేటు మంత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. గ‌త నెల రోజులుగా రాష్ట్రంలో తీవ్ర వివాదానికి కార‌ణ‌మైన‌.. మెడిక‌ల్ కాలేజీల వ్య‌వ‌హారంపై ఏపీ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దీంతో జ‌గ‌న్ శిబిరం మూగ‌బోగా.. కూట‌మి నాయ‌కులు జోష్‌లో మునిగితేలుతున్నారు. ఇక‌, త‌మ నిర్ణ‌యానికి తిరుగు లేద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో వైసీపీ హ‌యాంలో కేంద్రం నుంచి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను కొత్త‌గా తీసుకువ‌చ్చారు. వీటిలో 5 కాలేజీ ల‌ను మాత్ర‌మే వైసీపీ హ‌యాంలో పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ఈ కాలేజీల్లో త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. మిగిలిన 12 కాలేజీల్లో 2 క‌ళాశాల‌లు 90 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. మ‌రికొంత ప‌నులు పూర్తి చేస్తే.. వ‌చ్చే ఏడాది నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక‌, మిగిలిన 10 కాలేజీల‌కు పునాదుల ద‌శ కూడా దాట‌లేదు. వీటిని పూర్తి చేయాలంటే.. రాష్ట్ర స‌ర్కారు వాటా కింద 10 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని కూట‌మిప్ర‌భుత్వం చెబుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర స‌ర్కారుకు ఉన్న ఇబ్బందుల రీత్యా అంత మొత్తం కేటాయించే ప‌రిస్తితి లేద‌ని చెబుతు న్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ 10 కాలేజీల నిర్మానాన్ని పీపీపీ(ప్రైవేటు-ప‌బ్లిక్‌-పార్ట‌న‌ర్ షిఫ్‌) విధానంలో 33 ఏళ్ల పాటు ప్రైవేటు కు అప్ప‌గించేందుకు ముందుకు వ‌చ్చింది. అయితే.. దీనిని వైసీపీ త‌ప్పుబ‌డుతోంది. పెద్ద ఎత్తున ఉద్య‌మానికి కూడా రెడీ అయింది. ఇంత‌లో గుంటూరుకు చెందిన డాక్ట‌ర్ వ‌సుంధ‌ర హైకోర్టు ను ఆశ్ర‌యించి.. స‌ర్కారు నిర్ణ‌యాన్ని కొట్టివేయాల‌ని కోరారు.

👉భారత ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన మత ఉన్మాద దాడిని ఖండించండి ఆవాజ్ కమిటీ పిలుపు*

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి (సి జే ఐ) బీ ఆర్ గవాయ్ పై మత ఉన్మాదుల దాడిని ఖండించండి అని ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ ఏ సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు, పి ఇక్బాల్ హుస్సేన్, ఎస్ ఎం డి షరీఫ్, ఎం ఎస్ బేగ్ ఖండించారు .

మత ఉన్మాదులు బరితెగించి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి బీ ఆర్ గవాయ్ పై నే ఓ మత ఉన్మాది బరితెగించి షూ విసిరేయడం చాలా దుర్మార్గమని భారత దేశ సార్వభౌమత్వాన్ని రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని కాపాడవలసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై మత ఉన్మాది ఈ రకంగా దాడి చేయడం హేయమైన చర్య అని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆవాజ్ కమిటీ పేర్కొన్నది.

సోమవారం ఉదయం కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం జస్టిస్ కె వినోద్ చంద్రన్ తో బీ ఆర్ గవాయ్ కూడిన ధర్మాసనంలో కేసు విచారణ సమయంలో డయాస్ వద్దకు వెళ్లిన న్యాయవాది రాకేష్ కిషోర్ ఒక్కసారిగా తన స్పోర్ట్స్ షూ తీసి సీ జే ఐ పై కి విసేరాడాన్ని వారు తీవ్రంగా ఖండించారు ఈ సంఘటన భారత రాజ్యాంగాన్ని,దేశ ప్రజలకు అవమానించినట్లే అని వారు తెలియజేశారు. సర్వోన్నత న్యాయమూర్తి అయిన ఆయన పైనే దాడి జరిగినప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు .మతోన్మాదం వల్ల ఈ దేశానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సోదర భావంతో అన్ని కుల మతాల కు అతీతంగా జీవిస్తున్న ప్రజలలో తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ్ పరివారం ఇటువంటి దాడులు చేయడం క్షమించరాని నేరమని, కాబట్టి తక్షణమే రాకేష్ కిషోర్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు న్యాయవాది ముసుగులో ఉండి ఈ రకమైన దాడి చేసిన వాడికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా భద్రతా దళాలు ,సిబ్బంది గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు . సంఘ్ పరివార్ వ్యాప్తి చేసిన ద్వేషానికి ప్రతిబింబమై ఈ భయంకరమైన సంఘటన అని వారు తెలియజేశారు .సిజేఐపై జరిగిన దాడిని ఖండించడానికి మాటలు సరిపోవని వారు వివరించారు .ఈ దాడి రాజ్యాంగం పై జరిగిన దాడి అని భారత దేశ సార్వభౌమత్వం పై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు.ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉండి ఉంటే ఈపాటికి దేశంలో మొత్తం అల్లా కల్లో లాలు లేపి దేశాన్ని మంటల్లో రగిలించే వారని పరోక్షంగా విమర్శించారు .ఇప్పటికైనా కుల మత భేదా భావన లేకుండా మసు లుకోవడానికి డర్టీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సంఘటనను ప్రజాతంత్ర వాదులు ప్రతిపక్షాలు వామపక్షాలు ఎప్పటికీ తీవ్రంగా ఖండించాయని వారు తెలియజేశారు.

👉నేడు ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాచగర్ల వెంకటరావు  మరియు కుటుంబ సభ్యులు.

👉మోహన్ బాబుకి బిగ్ షాక్.. అత్యాశకు పోయి ఢమాల్!.. విద్యార్థుల నుంచి ఫీజ్ రూపంలో రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని..ఇటీవల తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఆరోపణలు..విచారణ జరిపి.. అది నిజమేనంటూ ఆంధ్ర రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ నిర్ధారణ..15 లక్షల జరిమానా విధింపు.. రూ.26 కోట్లు 15 రోజుల్లో తిరిగివ్వాలని ఆదేశాలు..యూనివర్సిటీ గుర్తింపుని కూడా రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు

👉విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు*

విజయ్ నివాసంలో గురువారం ఉదయం బాంబు పేలబోతోందని పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ నేపథ్యంలో, బాంబు స్క్వాడ్ నిపుణులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలో ఉన్న తమిళనాడు వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసాన్ని బాంబులతో పేల్చి వేయనున్నామని, విజయ్ నివాసంలో గురువారం ఉదయం బాంబులు పేలబోతున్నాయని పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.ఈ నేపథ్యంలో, బాంబు స్క్వాడ్ నిపుణులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాంబు బెదిరింపు బూటకమని సోదాల్లో తేలింది. బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..

👉కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. కంపెనీ యజమాని అరెస్ట్.*

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్‌ అరెస్టయ్యారు. మధ్య ప్రదేశ్ పోలీసులు ఈ ఉదయం చెన్నైలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గు మందు తాగి ఒక్క మధ్య ప్రదేశ్‌లోనే 22 మంది దాకా చిన్న పిల్లలు చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు రంగనాథన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం అరెస్ట్ చేశారు.

👉 జిల్లా సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), మార్కాపురం ***

మార్కాపురం మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) మార్కపురం, పాఠశాలను సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్‌   నేడు మరోసారి గం.8.30 నిమిషాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. 9. గంటలలోపు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా రావడం గమనించి సబ్ కలెక్టర్ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించడం జరిగింది. కావున మార్కాపురం మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు ఉదయం గం|| 8.45 నిమిషములలోపు పాఠశాలకు హాజరగునట్లు చూడవలెను. ఇప్పటి నుండి ప్రతి రోజు సబ్ కలెక్టర్ మార్కాపురం వారు మండలంలోని అన్ని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాము అని చెప్పడం జరిగింది. కావున పాఠశాల సిబ్బందితోపాటు విద్యార్థులందరూ ప్రార్ధన సమయానికి హాజరయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు మరియు తరగతి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొనవలెనన్నారు.

హాస్టల్ నుండి వచ్చే విద్యార్ధులు ఎవరైనా ఉంటే వారు కూడా ఖచ్చితంగా గం|| 8.45 నిమిషములలోపు పాఠశాలకు హాజరు అగునట్లు చూసే విధముగా హాస్టల్ వార్డెన్ లకు సమాచారమును ఇవ్వ వలసినదిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియచేసారు అలా కాకుండా ఎవరైనా హాస్టల్ విద్యార్థులు పాఠశాలకు లేటుగా వచ్చిన యెడల హాస్టల్ వార్డెన్ ల పైన శాఖా పరమైన చర్యలు తీసుకోబడునని సబ్ కలెక్టర్ తెలియపరచారు.

👉 మార్కాపురం పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్‌

9వ తరగతి చదువుతున్న కీర్తన, తల్లి హెడ్మాస్టర్ పై సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు ..హెడ్మాస్టర్ నా కూతుర్ని తీవ్రంగా కొట్టడంతో ఫిట్స్ వచ్చిందని సబ్ కలెక్టర్ ముందు బోరున ఏడిసిన తల్లి ..విద్యార్థులను కొట్టడంపై తీవ్రంగా స్పందించిన సబ్ కలెక్టర్ హెడ్మాస్టర్ పై ఎంక్వయిరీ రిపోర్టర్ అందచేయాలని ఎంఈఓ కి ఆదేశాలు

👉కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించి రికార్డుల నిర్వహణపై SHOలు, స్టేషన్ రైటర్లకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ వి హర్ష వర్ధన్ రాజు.*ఒంగోలు.. నూతన చట్టాల ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాల్సిన స్టేషన్ రికార్డులు పక్కాగా ఉండాలి: జిల్లా ఎస్పీ కొత్తగా అమలులోకి వచ్చిన క్రిమినల్ చట్టాల ప్రకారం, ప్రతి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించవలసిన రికార్డుల నిర్వహణ మరియు నూతన ప్రొఫార్మాలపై అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్ లో జిల్లా ఎస్పీ ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ SHOలు, అన్ని స్టేషన్ ల రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంతో రూపొందించిన కొత్త చట్టాలపై ప్రతి పోలీసు అధికారికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. నూతన చట్టాలకు అనుగుణంగా రూపొందించిన రిజిస్టర్లను తప్పనిసరిగా, నిక్కచ్చిగా నిర్వహించాలని ఆదేశించారు.నూతన చట్టాల ప్రధాన లక్ష్యం డిజిటలైజేషన్ మరియు వేగవంతమైన న్యాయం సాధన అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. దీనిలో భాగంగా జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) మరియు ఈ-ఎఫ్‌ఐఆర్ (E-FIR) విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రికార్డుల నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. అధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు, దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ-సమన్స్ (E-Summons) పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్ (Videography), మరియు ఈ-సాక్ష్యం (E-Evidence) వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లు కూడా కొత్త ప్రొఫార్మా ప్రకారం జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. నేరాల దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయడానికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలని సూచించారు..కొత్త చట్టాల అమలుతో పోలీసుల జవాబుదారీతనం మరియు పారదర్శకత మరింతగా పెరుగుతాయని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రాపర్టీ మరియు గవర్నమెంట్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. కొత్త మార్పుల ప్రకారం, ఛార్జ్‌షీట్ దాఖలు, ఎఫ్‌ఎస్‌ఎల్‌ (FSL) నివేదికల నమోదు, అలాగే ప్రిలిమినరీ ఎంక్వైరీ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.రికార్డులన్నింటినీ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. నూతన చట్టాలను విజయవంతంగా అమలు చేయడానికి సమర్థవంతమైన రికార్డుల నిర్వహణ చాలా ముఖ్యమన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

👉*కంబం లో అంబరాన్ని అంటిన సంబరాలు..

*ప్రకాశం జిల్లా కంబం మండలం కందులాపురం సెంటర్లో ఆకాశమే హద్దుగా జననేత జన్మదిన వేడుకలు అభివృద్ధి తన ద్యేయంగా ప్రజా సంక్షేమం తన ఊపిరిగా భావిoచే ప్రియతమ నేత అందరి బoదువుగా ఉండే గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు  ” ముత్తుముల అశోక్ రెడ్డి  పుట్టినరోజు వేడుకలు సోదరుడు ముత్తుముల క్రిష్ణ కిషోర్ రెడ్డి  అద్వర్యంలోతెలుగుదేశం పార్టీ కార్యాకర్తలతో కలిసి కేక్ కట్చేసి ,స్వీట్స్ పంచుతూ అంగరంగ వైభవంగానిర్వహించారు అనంతరం కంబం మండలం లోని రోడ్లు మరియు కాలువలు శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులకు మంచినీటి క్యాన్లు పంపినిచేశారు , తరువాత నాయకుల ఆధ్వర్యంలో పేద పిల్లలకు పుస్తకాలు , పెన్నులు , చాక్లెట్ లు పంపిణీ చేశారు ఈ వేడుకలో కంబం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు*

👉56 కేజీల భారీ అబిమానంతో ముత్తుముల జన్మదిన వేడుకలు*…*ప్రకాశం జిల్లా కోమరోలు మండలం తాటిచెర్ల మోటు సర్కిల్ లో కోమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భొనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి  జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు  ముత్తుముల క్రిష్ణకిశోర్ రెడ్డి  పాల్గొన్నారు .56 కేజీల భారీ కేక్ ని కట్ చేసి బాణా ,సంచాలతో స్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం క్రిష్ణ కిశోర్ రెడీ కి శాలువా , పూలమాల వేసి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కోమరోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు*

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా