👉తమిళ రాజకీయం: పొత్తులు కలుపుతున్న `తొక్కిసలాట` రాజకీయాల్లో పొత్తులు.. చిత్తులు కామన్. ఏ రెండు పార్టీల మధ్యైనా.. పొత్తులు ఎప్పుడు కుదురుతాయో చెప్పడం కష్టం. రాజకీయాల్లో పొత్తులు.. చిత్తులు కామన్. ఏ రెండు పార్టీల మధ్యైనా.. పొత్తులు ఎప్పుడు కుదురుతాయో చెప్పడం కష్టం. అలానే.. ఎప్పుడు చిత్తవుతాయో.. కూడా చెప్పలేం. ఇలానే.. తమిళనాడు రాజకీయాలు కూడా.. సాగుతున్నాయి. గత నెల 27న జరిగిన కరూర్ తొక్కిసలాట అనంతరం.. రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. కొన్నాళ్లుగా బలమైన నేపథ్యం ఉన్నవారి కోసం ఎదురు చూస్తున్న బీజేపీ.. ఇప్పుడు తొక్కిసలాటలో బాధిత పార్టీగా ఉన్న తమిళగ వెట్రికళగం(టీవీకే)తో పొత్తుకు చేతులు చాపింది. ఇక, నిన్న మొన్నటి వరకు బీజేపీపై నిప్పులు చెరిగిన.. టీవీకే అధినేత విజయ్ కూడా..తన చుట్టూ కేసు ముసురుకుంటున్న సమయంలో దిగివచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం బీజేపీ నేతలు.. తమిళనాడుకే చెందిన ఎంపీ హేమమాలిని.. టీవీకేతో పొత్తుల విషయంపై అంతర్గతంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. దీనిపై మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు అంటూ.. రంగంలోకి దిగిన హేమ మాలిని కమిటీ.. సహజంగానే టీవీకే తప్పులేదని.. వాదిస్తోంది. ఇది విజయ్‌కుకలిసి వచ్చే పరిణామం. గతంలోనూ బీజేపీతో కలిసిన అనేక మంది నాయకులపై కేసులు పక్కదారి పట్టాయి. ఇప్పుడు విజయ్ వంతు వచ్చిందని అంటున్నారు.
ఈ క్రమంలో ఆయన నాలుగు కాదు.. 40 మెట్లు దిగివచ్చి.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు రెడీ అయినట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఆయన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులే కాదు.. పదవుల విషయంపై కూడా బీజేపీకి సమాచారం ఇచ్చారని అంటున్నారు. పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే.. సీఎం పీఠం మినహా.. ఇతర పదవుల్లో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఇచ్చేందుకు సుముఖమేనన్నది టీవీకే వర్గాలు చెబుతున్న మాట.
🌟 గంజాయి,మాదకద్రవ్యాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు…కీలక ప్రాంతాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
ప్రకాశం జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం పొదిలి మరియు దర్శి ప్రాంతాలలో ఆకస్మిక, విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముఖ్యంగా గంజాయి కేసుల్లో గతంలో నిందితులుగా ఉన్నవారి ఇళ్లతో సహా రద్దీ ప్రాంతాల లో తనిఖీ చేశారు.తనిఖీలలో డాగ్ స్క్వాడ్ గంజాయి మరియు మాదకద్రవ్యాలను గుర్తించడంలో శిక్షణ పొందిన రాక్సీ జాగిలాంతో పాటు పోలీసులు తనిఖీ నిర్వహించారు.
పొదిలిలో తనిఖీలు:పొదిలి ఆర్టీసీ బస్టాండ్ పార్సిల్ పాయింట్, పొదిలిలోని బెస్తపాలెం ఏరియాలో గతంలో గంజాయి కేసుల్లో నిందితులగా ఇళ్లను సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వేమన మరియు సిబ్బంది రాక్సీతో కలిసి తనిఖీ చేశారు.
దర్శిలో తనిఖీలు:దర్శి గడియారం స్తంభం మరియు ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, అనుమానాస్పద వస్తువులు, లగేజీలు మరియు పార్కింగ్ ప్రదేశాలను దర్శి సీఐ రామారావు, ఎస్సై మురళి మరియు సిబ్బంది రాక్సీ సాయంతో తనిఖీ చేశారు.
కంభం లో ..ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, అనుమానాస్పద వస్తువులు, లగేజీలు మరియు పార్కింగ్ ప్రదేశాలను సీఐకే మల్లికార్జున ఎస్ఐ బి నరసింహారావు వారి సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యతమని పేర్కొంటూ, జిల్లా పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని లేదా తక్షణ సహాయం కోసం డయల్ 112 కు కాల్ చేయాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
🌟పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు.. పీఎంఓ ఫిర్యాదుతో రామారావుపై కేసు నమోదు చేసిన సీబీఐ
పీఎంవో సీనియర్ అధికారినంటూ ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం.. రామారావు పేరుతో డిప్యూటీ సెక్రెటరీ ఎవరూ లేరంటూ స్పష్టం చేసిన పీఎంఓ.. టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం సిఫార్సు లేఖ రాసిన రామారావు.
🌟మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఫైన్!!
సినీ నటుడు మోహన్ బాబు కు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది.తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది.
15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది.విచారణ అనంతరం రూ. 15 లక్షల జరిమానా విధించింది.యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది~£
👉అప్పుల బాధతో రాష్ట్రంలో మరో రైతు ఆత్మహత్య
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండ గ్రామంలో వ్యవసాయం చేస్తూ, మామిడి తోటలను కౌలుకు తీసుకుంటున్న చిలువేరు రవి(50) అనే రైతు.. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేక, పెట్టుబడి కోసం చేసిన రూ.15 లక్షల అప్పు తీర్చలేనని మనస్థాపంతో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు.
👉 *కల్తీ మద్యం వెనుక లాభదారులు ఎవరు?*
కల్తీ మద్యం… ఒక పదం కాదు, ప్రాణాలను తీసే పిశాచం.
ప్రతి కొద్ది కాలానికోసారి పేదవాడి ఊర్లో మళ్లీ వినిపించే ఆ దారుణ వార్త — “కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు.”
కానీ ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది — ఈ విషమద్యం వెనుక ఉన్నవారు ఎవరు? ఈ వ్యాపారం ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? చట్టాలు ఉన్నా, నిబంధనలు ఉన్నా, కల్తీ మద్యం తయారీ ఆగడం లేదు. కారణం స్పష్టమే — లాభాలు భారీగా ఉన్నాయి, రక్షణ ఇచ్చేవారు శక్తివంతులు.
స్థానిక అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఆశ్రయాలు, మద్యం మాఫియాల దురాశ — ఇవన్నీ కలసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి.ప్రతీ ఘటన తర్వాత పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి, విచారణలు మొదలవుతాయి, కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ మౌనం. మరణించినవారు పేదలు కాబట్టి, బాధ్యులు తప్పించుకుంటున్నారు. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు — మానవత్వం లేని వ్యవస్థకు నిదర్శనం.
ప్రజల ప్రాణాలు రక్షించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.
కానీ కల్తీ మద్యం వ్యాపారం కొనసాగుతున్నంతవరకు ఆ బాధ్యత నిర్వీర్యం అవుతుంది.ఇలాంటి నేరాలను అణచివేయడానికి కఠినమైన చర్యలు, నిరంతర పర్యవేక్షణ అవసరం.ప్రజల ప్రాణాల మీద వ్యాపారం చేసే వారిని కఠినంగా శిక్షించకపోతే — ప్రతి కల్తీ మద్యం ఘటన మన పరిపాలనా విలువల మీదే ప్రశ్నగా మిగిలిపోతుంది.
👉అమరావతి కోసం రూ.60 వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు..రూ.7 వేలు కోట్లు మెడికల్ కాలేజీలు కోసం ఖర్చు పెట్టలేరా…ఏదైనా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం చాలా సులభం.- JD లక్ష్మీనారాయణ
👉టెలిగ్రామ్ యాప్ క్లిక్ తో రూ.1.25 లక్షలు మాయం
పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ పవన్, తన సెల్ఫోన్లో వచ్చిన టెలిగ్రామ్ యాప్ను పలుమార్లు క్లిక్ చేయడంతో రూ.40 వేలు, మరోసారి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.1.25 లక్షలు తన ఖాతాలోంచి పోగొట్టుకున్నాడు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.
👉జడ్చర్ల: బాలుడి మృతిపై NHRCలో ఫిర్యాదు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కుర్వపల్లిలో వరుణ్ తేజ్ అనే బాలుడి మృతికి కారణమైన ఆర్ఎంపీ శశి కిరణ్ పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ మంగళవారం జాతీయ బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో నకిలీ డాక్టర్ల ఆగడాలను అరికట్టి, అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
👉బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఆదేశాల మేరకు, జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.*బాపట్ల జిల్లా స్టూవర్టుపురం ఎస్.ఐ భాగ్యరాజ్ కి రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలోని స్టూవర్టుపురం గ్రామo లో జూదం ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు.
జూద స్థావరం పై నిర్వహించిన దాడిలో ఆరుగురిని జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.16,900/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పేకాట, కోడి పందాలు ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
👉డీజే సౌండ్ బాక్సులు వాడరాదు:: కంభం సీఐ కే మల్లికార్జున ..
కంభం , బి .పేట అర్థవీడు మండలాల పరిధిలో ఫంక్షన్లకు తిరునాళ్లకు ఏదైనా ఇతర కార్యక్రమాలకు ఎవరైనా మైకు సిస్టం వాడే సమయంలో డీజే లకు అనుమతి లేదని సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లికార్జున తెలిపారు .డీజే లను అధిక సంఖ్యలో వాడటం వల్ల ఆ శబ్దాలకు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు సమస్యలు ఉన్నవారు కూడా చనిపోవడం జరుగుతోందన్నారు.కావున ఎవరైనా ఎలాంటి ఫంక్షన్లు, ఉత్సవాలు తిరునాళ్లు అలాగే మీటింగులు జరుపుకోవాలని ఉంటారో వారు ఖచ్చితంగా స్థానిక ఎస్సై ద్వారా సబ్ డివిజనల్ పోలీస్ అధికారికి పర్మిషన్ అప్లై చేసుకోవాలన్నారు.పర్మిషన్ పొందిన వారు మైకు లేదా ఏదైనా సౌండ్ బాక్స్ లు పరిమిత సంఖ్యలో మాత్రమే వాడుతూ సౌండ్ మించకుండా ఉండేలా చూసుకోవాలని అలాకాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనిహెచ్చరించారు.
👉ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అదేశాలతో కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తోపాటు పరిసర ప్రాంతాలను పోలీసు జాగిలం రాక్సీ తో విస్తృతంగా పోలీసు సిబ్బంది తనిఖీలు చేయడమైనది.*
కంభం బస్టాండ్ లో ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అంతే కాకుండా మనకు తెలియకుండానే కొందరు వ్యక్తులు ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా బస్సులలో రవాణా చేస్తుంటారని ప్రజలకు పోలీసు వారు తెలియ చేసారు. అలాంటి వారి పట్ల ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దానిలో భాగంగానే.. మత్తుపదార్థాల అరికట్టేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన రాక్సి జాగిలంతో బస్టాండ్ లో తనిఖీలు చేస్తున్నామని ప్రయాణికులకు పోలీసు వారు తెలిపారు.
నిరంతరం తనిఖీలు చేయడం వల్లన అసాంఘిక కార్యక్రమాలు చేసే వారిని కట్టడి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే కంభం రైల్వేస్టేషన్ లోను రాక్సి డాగ్ తో అణువణువునా తనిఖీలు చేశారు. రైలుమార్గం ద్వారా కొంత మంది వ్యక్తులు గంజాయి… అక్రమ రవాణా చేస్తున్నారని వాటిని అరికట్టేందుకు తనిఖీలు చేశారు.
ఫ్లాట్ ఫామ్ పైన ప్రతి వస్తువును తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్ లోని పార్సిలు సర్వీసు లో రాక్సీ జాగిలంతో తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన పార్సిలు ను అధికారుల సమక్షంలో ఓపెన్ చేసి మరీ తనిఖీలు నిర్వహించారు.
అనుమానం వచ్చిన ప్రయాణికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో… ప్రయాణికులకు ఇబ్బందికరమైన వాసన వస్తే.. వేంటనే రైలులో ఉన్న గార్డ్ మరియు సిబ్బంది కు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసినారు.
రైలు లో ఎవరైనా గంజాయి కాని, ఇతర మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వారు హెచ్చరించమైనది.
ఈ తనిఖీలో కంభం ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, కంభం ఎస్సై నరసింహారావు, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ హ్యాండ్లర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

