👉 లద్దాఖ్ మంచుకొండల్లో అగ్గి పిడుగు.. ఎవరీ సోనమ్ వాంగ్ చుక్ ?.. లద్దాఖ్ లో ఆందోళన అనంతరం ఢిల్లీని ముట్టడిస్తామని సోనమ్ ప్రకటించారు. దీంతో ఆయనను సెప్టెంబరు 26న పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు మోపారు. లద్దాఖ్… భారతదేశంలో మరో రాష్ట్రం ( 30 లేదా 31వ) అవుతుందా? ఏమో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు..! 2019లో ఆర్టికిల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్, లద్దాఖ్ లను వేరే చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చాక వీటికి రాష్ట్ర హోదా కల్పించే అంశం తరచూ ప్రస్తావనకు వస్తోంది. కానీ, ఏదీ కాలేదు. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభావం అధికంగా ఉండే లద్దాఖ్ లో అనూహ్యంగా నిరసనలు మొదలయ్యాయి. దీనివెనుక ఉన్నది సోనమ్ వాంగ్ చుక్. లద్దాఖ్ లో హింస జరగడంతో ఆయనను అరెస్టు చేశారు. మళ్లీ హీట్ ఢిల్లీని కదిలించారు.. లద్దాఖ్ లో ఆందోళన అనంతరం ఢిల్లీని ముట్టడిస్తామని సోనమ్ ప్రకటించారు.
దీంతో ఆయనను సెప్టెంబరు 26న పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు మోపారు. అంతేకాదు.. సోనమ్ పాకిస్థాన్ సానుభూతిపరుడని, పెహల్గాం ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు మోపారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదంతా తెలిశాక సోనమ్ భార్య గీతాంజలి జె అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం.. మిగతా కేసుల విచారణను పక్కనపెట్టి మరీ సోనమ్ కేసును విచారించింది సుప్రీంకోర్టు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సోనమ్ కేసు గంట సేపు విచారించింది సుప్రీంకోర్టు. దీనికి సమయం కేటాయిస్తాం అంటూ మంగళవారం పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. సోనమ్ అరెస్టుకు ముందు నోటీసులు ఇచ్చారా? ఆయన భార్యకు తెలిపారా? ఈ బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదా? అసలు కేంద్రమే ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెలా ప్రవర్తిస్తాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. సోమన్ కారణంగా జాతీయ భద్రతకు వచ్చిన ప్రమాదం ఏమిటని నిలదీసింది. దీనిపై వివరణ కోరింది. ఆయనకు పెహల్గాం దాడుల్లో పాత్ర ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించగా.. నిర్ద్వందంగా కొట్టివేసింది.
👉సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్పర్సన్ , రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఒకవైపు దీని వినియోగాన్ని నివారించి, మరోవైపు ఇప్పటికే ఉన్న వ్యర్ధాలను రీసైకిల్ , రీయూజ్
చేయటం ద్వారా సర్క్యులర్ ఎకానమీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనములో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఇతర అధికారులతో వివిధ అంశాలపై కృష్ణయ్య చర్చించారు.
పరిశ్రమల ఏర్పాటు ద్వారా, ముఖ్యంగా ప్రకాశం వంటి జిల్లాలలో ఉపాధి అవకాశాలు పెంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదే సమయంలో కాలుష్యాన్ని కూడా తగ్గించడంపై దృష్టి సారించాల్సిన అవసరం సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఇప్పటికే గ్రానైట్స్ తో పాటు మత్స్య, వ్యవసాయ- దాని అనుబంధ రంగాలలో అవలంబిస్తున్న విధానాల ద్వారా వస్తున్న వ్యర్ధాల వలన పర్యావరణం కాలుష్యం అవుతున్న తీరుపై ఆయన చర్చించారు. ఆయా రంగాల ద్వారా వస్తున్న వ్యర్ధాలను రీయూజ్ చేయటంపై దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. ఈ దిశగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యర్థాలను ఉపయోగించుకుని వివిధ ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే ఆరోగ్యపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా జరగకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆయన చెప్పారు. వీటిని వినియోగిస్తే విధించే జరిమానాల గురించి చిల్లర వర్తకులకు కూడా అవగాహన కల్పించాలని, అదే సమయంలో తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ప్రత్యామ్నాయాలను కూడా చూపించాలని చెప్పారు. బయోడీగ్రేడబుల్ సంచులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని, సర్కులర్ ఎకానమీకి కూడా ఊతమిచ్చినట్లు అవుతుందని వివరించారు. ఈ దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య చెప్పారు. పరిశ్రమలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల పరిసరాలు శుభ్రంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రానైట్ పరిశ్రమల వ్యర్థాలను ఉపయోగించి స్థానికంగానే ఇతర ఉత్పత్తులు తయారుచేసేలా ఉన్న అవకాశాలను గుర్తించాలని దిశా నిర్దేశం చేశారు. గ్రానైట్ వ్యర్థాల కోసం నిర్దిష్ట స్థలం గుర్తింపు, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాన్ని ఒంగోలులో నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయింపుపైనా కృష్ణయ్య చర్చించారు.
కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నివారణ, వివిధ రంగాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్ పర్సన్ చేసిన సూచనలను సంబంధిత శాఖలు సమన్వయంతో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ. రాఘవరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డిఓ కళావతి, జిల్లా వ్యవసాయ అధికారి ( ఇంచార్జ్) రజనీకుమారి, డీఎస్ఓ పద్మశ్రీ, ఏపీ ఎం.ఐ.పీ. పీ.డీ. శ్రీనివాసులు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గోపీచంద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, అన్ని మునిసిపాలిటీలు, అటవీ, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు.
👉నాలుగు టన్నుల చౌక బియ్యం పట్టివేత* ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో నాలుగు టన్నుల చౌక బియ్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఓ మినీ ట్రక్కులో 80 బస్తాలలో నాలుగు టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ట్రక్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత సంబంధిత అధికారులకు పోలీసులు సమాచారం అందించి వారి ఫిర్యాదు ద్వారా కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా కావలికి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
👉తల్లిదండ్రులను కొట్టి గెంటేసిన కొడుకు*
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఓ కొడుకు తన తల్లిదండ్రులను కొట్టి ఇంట్లోంచి గెంటేసిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వనచర్ల వెంకటేశ్ తన తల్లిదండ్రులైన రాంబాబు, మంగమ్మలను చితకబాది రోడ్డుపైకి గెంటేశాడు. ఆ రాత్రి వారు పక్కింట్లో నిద్రపోగా వారికీ ఆశ్రయం ఇచ్చిన వారిని బూతులు తిట్టాడు. తన సోదరి కేతా భవాని తల్లిదండ్రులతో కలిసి ఉంటుండటంతో ఆమెను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఒత్తిడి చేసేందుకు వెంకటేశ్ ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
👉10 కోట్లు ఎగ్గొట్టిన వడ్డీ వ్యాపారి ఇంటి పై బాధితుల దాడి*
నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాలో ఇటీవల అధికవడ్డీల ఆశ చూపి భాదితులకు మొండిచేయి చూపించి 10 కోట్ల మేర ఎగ్గొట్టి తిరుగుతున్న బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి ఇంటి పై బాధితుల దాడి..ఫర్నీచర్ ధ్వంసం చేసి తగలబెట్టిన భాదితులు..ఐపీ పెట్టి కోర్టుకు పోయి 300 మందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బాలాజీ నాయక్..ఇవ్వాళ ఉదయం పెద్ద ఎత్తున బాధితులు తరలి వచ్చి బాలాజీ నాయక్ ఇంటిపై దాడి..!
ఏసీ మరియు ఫ్రిజ్ రిపేర్లు నందు ఉచిత శిక్షణ :-
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు ఏసీ మరియు ఫ్రిజ్ రిపేర్లు నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 22 వ తేదీ నుండి నవంబర్ 20 వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు యువకులు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను 9573363141ఇట్లు డైరెక్టర్ రూట్ సెట్ సంస్థ, ఒంగోలు.
👉కోలాటం బృందానికి డీజే బాక్సులు బహూకరించిన గిద్దలూరు ఎమ్మెల్యే*
*హర్షం వ్యక్తం చేస్తున్న కోలాటం కళాకారులు* ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామంలో కోలాటం బృందానికి డీజే బాక్సులు బహుమతిగా అందించిన గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి.. కోలాటం అనేది ఒక మంచిపల్లెటూరు ఆహ్లాదకర మైన వాతావరణంలో పెంపొందించేలా ఒక వ్యాయామముగా పనిచేస్తుందని ఇటువంటి కలలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని గిద్దలూరు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పందులపల్లి టిడిపి నాయకులు ఆవుల శ్రీనివాసరెడ్డి మరి గ్రామస్తులు ఆధ్వర్యంలో కోలాటం బృందానికి డీజే బాక్సులు బహుమతి అందజేశారు.
👉ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం*
*రాచర్ల మండల కేంద్రంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గోన్న టీడీపీ నేత ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి**ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు అన్నారు.. గిద్దలూరు గౌ. శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే లక్ష్యంతో పబ్లిక్ గ్రీవెన్స్ ను ఏర్పాటు చేయటం జరిగిందని, మొదటి రోజు రాచర్ల మండలంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కృష్ణ కిషోర్ గారు వాల్మీకి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ప్రజలు రెవిన్యూ, విద్యుత్, త్రాగునీటి రోడ్లు తదితర సమస్యల పై అర్జీలు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు గోపిరెడ్డి జీవన్ రెడ్డి, భవనం పుల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ బత్తిని వెంకటేశ్వర్లు, అంబవరం శ్రీనివాసరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గోన్నారు..*
👉మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురిపై కేసు నమోదు.. ప్రకాశం జిల్లా …గిద్దలూరు పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిన నలుగురిపై సోమవారం కేసు నమోదు చేశామని అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. అలానే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన నలుగురు ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించడంతోపాటు సెల్ ఫోన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపిన మరో నలుగురిపై కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సిఐ సురేష్ హెచ్చరించారు….

