👉 సుప్రీంకోర్టులోనే చీఫ్‌జస్టిస్ గవాయ్‌పై దాడికి ప్రయత్నం!😱.. 👉విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు* *ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి: సుప్రీం కోర్ట్*👉దొనకొండలో మిసైళ్ల తయారీ – రూ.1,200 కోట్లతో బీడీఎల్‌ భారీ ప్రాజెక్ట్‌..👉ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన డీజే మోత*..*ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం…కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు*..👉ప్రజా ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు త్వరిత న్యాయం అందించాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ .*👉దొనకొండలో స్కై ఐ ప్రకాశం డ్రోన్ బీట్ – ప్రజా భద్రతకు కొత్త దిశ*

👉 సుప్రీంకోర్టులోనే చీఫ్‌జస్టిస్ గవాయ్‌పై దాడికి ప్రయత్నం!😱😱😱

భారత జ్యూడిషియరీ చరిత్రలోనే బ్లాక్ డేగా ఈ సోమవారం నిలిచిపోతుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు విచారణ జరుపుతున్న సమయంలో ఓ లాయర్ నేరుగా సీజేఐ గవాయ్‌పై దాడికి ప్రయత్నించారు. చెప్పును ఆయనపై విసిరారు. ఆ లాయర్ చేస్తున్న పని చూసి దిగ్భ్రాంతికి గురైన మిగతా లాయర్లు ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సుప్రీంకోర్టులో సంచలనం సృష్టించింది. ఇలాంటి దాజులకు భయపడేది లేదని సీజేఐ గవాయ్ ప్రకటించారు.

చీఫ్ జస్టిస్‌పై ఆ లాయర్ ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నించారన్న దానిపై స్పష్టత లేదు. ఇటీవల సీజేఐ గవాయ్.. హిందూ ధర్మాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి. ఓ కేసు విషయంలో దేవుడిని అడగండి అని వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరిగింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. తాను ఏ మతాన్ని కించ పరచలేదని స్పష్టం చేశారు. సనాతనాన్ని కించపరిచారని ఆ లాయర్ దాడి చేసినట్లుగా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కానీ అంతర్గతంగా ఇంకేమైనా కారణం ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీజేఐ గవాయ్‌పై దాడిచేసిన లాయర్ పేరు రాకేష్ కిషోర్ గా గుర్తించారు. లాయర్‌ను అరెస్ట్ చేసి, కోర్టు గౌరవానికి అవమానం చేసినందుకు కాంటెంప్ట్ కేసు నమోదు చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలపై అసలు దృష్టి పెట్టవద్దని..యథావిధిగా కోర్టు కార్యకలాపాలు కొనసాగించాలని సీజేఐ ఆదేశించారు. దాంతో సుప్రీంకోర్టులో కార్యకలాపాలు యధావిథిగా సాగాయి.

👉విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు*

*ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి……..సుప్రీం కోర్ట్*

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారించి.. ‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది….

ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర మిసైళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న బీడీఎల్‌ – ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 1,600 మందికి ఉపాధి*

👉దొనకొండలో మిసైళ్ల తయారీ – రూ.1,200 కోట్లతో బీడీఎల్‌ భారీ ప్రాజెక్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేయబోతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) ఇప్పుడు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండలో భారీ స్థాయి సమీకృత ఆయుధ వ్యవస్థ, ప్రొపెల్లెంట్‌ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కానుంది.బీడీఎల్‌ సంస్థ మొదటి దశలో రూ.650 కోట్లను, రెండో దశలో రూ.550 కోట్లను వెచ్చించనుంది. మొత్తం రూ.1,200 కోట్లతో ఈ యూనిట్‌ స్థాపన జరగనుంది. ప్రొపెల్లెంట్‌ మోటార్లు, సమీకృత ఆయుధ వ్యవస్థల తయారీ, టెస్టింగ్‌ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ప్రాజెక్ట్‌ అమలు పూర్తి స్థాయిలో జరిగితే రాష్ట్రం రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది.

ఉపాధికి కొత్త అవకాశాలు: ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా మరో 1,000 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 1,600 మంది ఈ ప్రాజెక్ట్‌ ద్వారా లబ్ధి పొందబోతున్నారు. తయారీ యూనిట్‌తో పాటు 200 ఎకరాల్లో ఉద్యోగుల కోసం ఆధునిక టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయనుంది. 600 కుటుంబాలకు నివాస సదుపాయాలు కల్పించేందుకు బీడీఎల్‌ ప్రతిపాదించింది.

భూమి కేటాయింపు – ప్రభుత్వ ప్రణాళికలు: ప్రాజెక్ట్‌ కోసం 1,400 ఎకరాల భూమి అవసరమని బీడీఎల్‌ ప్రభుత్వం ముందుంచింది. దీనిలో ప్రభుత్వం తన దగ్గర ఉన్న 317 ఎకరాలను ఎకరాకు రూ.7.73 లక్షల చొప్పున కేటాయించనుంది. మిగిలిన భూములను సాధ్యమైనంత త్వరగా సేకరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మొత్తం 1,346.67 ఎకరాలను ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకరించింది.

సమీకృత ఆయుధ వ్యవస్థలు: సెన్సర్లు, కమ్యూనికేషన్‌ పరికరాలు, క్షిపణులు, తుపాకులు వంటి వివిధ ఆయుధ వ్యవస్థలను సమన్వయపరిచే ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ తయారీ ఈ యూనిట్‌లో ప్రధానంగా జరుగుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు, సైన్యానికి అవసరమైన వెయ్యి టన్నుల వరకు పేలోడ్‌లను మోయగల రాకెట్‌ మోటార్లను కూడా తయారు చేయనుంది. ఇది భారత రక్షణ రంగానికి అత్యాధునిక సాంకేతికతను అందించే సంస్థగా నిలవనుంది.

నిర్మాణ షెడ్యూల్‌: బీడీఎల్‌ డీపీఆర్‌ ప్రకారం, 2026 మార్చి నాటికి అన్ని అనుమతులు పొందనుంది. అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 2028 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, అదే ఏడాది సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. యంత్రాల అమరిక జూన్‌ 2028లో జరుగుతుంది.

మౌలిక వసతులు – విస్తృత ప్రణాళిక: యూనిట్‌ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా బీడీఎల్‌ ప్రతిపాదనలో ఉన్నాయి.

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నుంచి యూనిట్‌ వరకు 8 కిలోమీటర్ల రెండు లేన్ల రహదారి

రోజుకు 25 వేల కిలోవాట్ల విద్యుత్‌ సరఫరా.. రోజుకు 2 వేల కిలోలీటర్ల నీటి సదుపాయం

ఆంధ్రప్రదేశ్‌కు రక్షణ రంగంలో గుర్తింపు: ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో భారత్‌ ఫోర్జ్‌ అనుబంధ సంస్థ కల్యాణి స్ట్రాటజీస్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ రూ.2,400 కోట్లతో అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు దొనకొండలో బీడీఎల్‌ యూనిట్‌ కూడా వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ రక్షణ పరిశ్రమలో దేశవ్యాప్తంగా ప్రముఖ కేంద్రంగా అవతరించనుంది. రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం మరింత బలపడుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు

👉ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన డీజే మోత*

బతుకమ్మ ఆడుతూ నవ వధువు సహా మరో మహిళ మృతి..నిర్మల్ జిల్లాలోని బంగల్‌పేట్ కాలనీలో బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన బిట్టింగు భాగ్యలక్ష్మి(56)..భైంసా మండల వానల్‌పాడ్ గ్రామంలో బతుకమ్మ ఆడుతూ డీజే శబ్దానికి తట్టుకోలేక మృతి చెందిన నవ వధువు రుషిత (22)

  • 👉దొనకొండలో స్కై ఐ ప్రకాశం డ్రోన్ బీట్ – ప్రజా భద్రతకు కొత్త దిశ*

ప్రకాశం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు “Sky Eye Prakasam” ప్రాజెక్ట్‌లో భాగంగా దొనకొండలో డ్రోన్ బీట్ సేవలు ప్రారంభించబడ్డాయి.డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు రహదారులపై పర్యవేక్షణ నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలు,అక్రమ కార్యకలాపాలు (జూదం, మద్యం తయారీ, గాంబ్లింగ్ మొదలైనవి),ప్రజా గుంపుల నియంత్రణ,ట్రాఫిక్ పరిస్థితుల పర్యవేక్షణ — వంటి అంశాలను సమర్థవంతంగా పరిశీలిస్తున్నారు.

👉ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం..కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్‌లో గుర్తింపు..భారీగా నకిలీ మద్యం స్వాధీనం..నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మెషీన్లు స్వాధీన

👉ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు*

ప్రకాశం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఒంగోలు మరియు చీమకుర్తి పరిసర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ (పేలుడు పదార్థాలు గుర్తించే జాగిలాలు చీత, మాగ్గీ) మరియు బాంబ్ స్క్వాడ్ బృందాలతో పాటు స్థానిక ఒంగోలు, చీమకుర్తి పోలీస్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ పార్సిల్ పాయింట్, ఓల్డ్ మార్కెట్ సెంటర్, కర్నూల్ రోడ్, నెల్లూరు బస్టాండ్ పరిసరాల్లో ఉన్న డార్మిటరీలు, అలాగే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు, లగేజీలు మరియు పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేశారు. ఇదే విధంగా చీమకుర్తి ఆర్టీసీ బస్టాండ్, ఆసుపత్రులు మరియు గ్రానైట్ ఫ్యాక్టరీల పరిసర ప్రాంతాలను కూడా డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని లేదా డయల్ 112 కాల్ చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు, నేర నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమన్నారు. ఈ తనిఖీలో చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఎస్సై చెంచయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.

👉ప్రజా ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు త్వరిత న్యాయం అందించాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ .*ఒంగోలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 66 ఫిర్యాదులు..ఫిర్యాదీదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ గారు ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ/ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు మరియు ఇతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించారు. వారి యొక్క సమస్యలను విని సానుకూలంగా స్పందించి చట్టపరంగా త్వరితగతిన న్యాయం అందిస్తామని ఎస్పీ  భరోసా కల్పించారు.

సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో కొంత మంది వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామని భరోసా వారిలో కలిగించాలని సిబ్బందికి తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.  కార్యక్రమంలో పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, పామూరు సీఐ బీమానాయక్, కంభం సీఐ మల్లికార్జున ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు నరసింహరావు. జనార్దన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా