👉ఏదో ఒక‌టి మాట్లాడండి.. ఏం మాట్లాడ‌తాం స‌ర్‌: వైసీపీలో ఇంట్ర‌స్టింగ్ సీన్‌..👉బీహార్ రిజల్ట్ కేంద్రానికి ఎఫెక్ట్ ….బీజేపీ లెక్కలేంటి ?..👉విజయవాడ ఊర్మిళనగర్‌లో ఘోర దారుణం..* 👉ప్రొద్దుటూరులో దారుణం*- తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు..-👉 అన్నమయ్య: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ..👉తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి లాభాల్లో ఉన్న ఆర్టీసీ కార్గో సేవలు..👉గద్వాల్ జిల్లాలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం..👉మద్యం మత్తులో సుత్తెతో తలపై కొట్టి కన్నతల్లీని హతమార్చిన కొడుకు*…..👉వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో అవినీతి ఎస్సైలపై వేటు!*…..👉ఒంటరి మహిళకు నంద్యాల సీఐ వేధింపులు.

👉ఏదో ఒక‌టి మాట్లాడండి.. ఏం మాట్లాడ‌తాం స‌ర్‌: వైసీపీలో ఇంట్ర‌స్టింగ్ సీన్‌ అయితే.. ఈ సంద‌ర్బంగా ప‌లువురు నాయ‌కులు.. మాట్లాడుతూ.. “ఏం మాట్లాడ‌తాం స‌ర్‌!. ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. శ‌నివారం అందుబాటులో ఉన్న కొద్ది మంది నాయకుల‌తో పార్టీ ఆఫీసు తాడేప‌ల్లిలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌జంగానే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా.. శ‌నివార‌మే సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ త‌దిత‌రులు `ఆటో డ్రైవ‌ర్ల సేవ‌లో..` పేరిట ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించిన త‌ర్వాత‌.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న డ్రైవ‌ర్ల‌కు రూ.15000 చొప్పున అందించే ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ప్రారంభించారు. ఎక్క‌డా ఎలాంటి విమ‌ర్శ‌లు రాలేదు. ఎవ‌రూ కూడా తాము అర్హుల‌మ‌ని.. అయినా.. త‌మ‌కు ప‌థ‌కంలో పేరు లేకుండా పోయింద‌ని కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌లేదు. మొత్తంగా ఈ ప‌థ‌కం శుభప్ర‌దంగా సాగిపోయింది. ఈ క్ర‌మంలో సాయంత్రం తాడేప‌ల్లిలో జ‌గ‌న్‌..త‌న‌కు స‌మీపంలో ఉన్న వారిని పిలిచి.. చిట్‌చాట్‌గా మాట్లాడార‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా వారిని.. మీడియా ముందుకు వెళ్లాల‌ని.. ఏదో ఒక‌టి మాట్లాడాల‌ని సూచించారు. “మ‌నం మీడియా స‌మావేశం పెట్టి.. ఏదో ఒకటి మాట్లాడాలి. లేక‌పోతే..వారు చెప్పేవే నిజ‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తారు. అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిపై స్పందించండి. మీకు స‌బ్జ‌క్టు కావాలంటే.. చెప్పండి.“ అని సూచించారు.

అయితే.. ఈ సంద‌ర్బంగా ప‌లువురు నాయ‌కులు.. మాట్లాడుతూ.. “ఏం మాట్లాడ‌తాం స‌ర్‌!. ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఇప్పుడు మ‌నం ఇవ్వ‌ట్లేదంటే.. ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితిలో లేరు. కొంత వెయిట్ చేయాలి. ముందుగా మీరు రంగంలోకి దిగితే.. కొంత ఊపు వ‌స్తుంది.“ అని సూచించారు. దీనికి జ‌గ‌న్ స్పందిస్తూ.. “నా గురించి ప‌క్క‌న పెట్టబ్బా.. ముందు మీరు మీడియా ముందుకు వెళ్లి.. ఏదో ఒక‌టి మాట్లాడండి. ప్ర‌జ‌ల‌కు కూడా నిజాలు తెలియాలి“ అన్నారు. మ‌నం ఏం మాట్లాడినా.. అటు నుంచి బ‌ల‌మైన కౌంట‌ర్ వ‌స్తోంద‌ని..గుంటూరుకు చెందిన ఓ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ నేత‌.. ఔను.. నిజ‌మే స‌ర్‌!. అని ముక్తాయించారు.

👉బీహార్ రిజల్ట్ కేంద్రానికి ఎఫెక్ట్ ….బీజేపీ లెక్కలేంటి ? ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపీ నుంచి చంద్రబాబు తెలుగుదేశం బీహార్ నుంచి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ సపోర్టుతో బండి లాగిస్తోంది. ఈ రెండు పార్టీలకు కలసి 28 మంది ఎంపీల మద్దతు ఉంది. బీహార్ ఎన్నికలు ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే కూటమికి నేరుగా ఎఫెక్ట్ అవుతాయా అంటే సాధారణంగా చూస్తే అలా జరగకూడదు. ఎందుకంటే 2024లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీయే సర్కార్ ఏర్పడింది. ఇక 2020 నవంబర్ లో ప్రజలు ఎన్నుకున్న ఎన్డీయే ప్రభుత్వం బీహార్ లో అయిదేళ్ళు పాలించింది. అయితే ఈసారి ఎన్నికల్లో బొమ్మ తిరగబడుతుందా నితీష్ కుమార్ మీద యాంటీ ఇంకెంబెన్సీ తీవ్రంగా పెరిగిపోయిందా నరేంద్ర మోడీ ఇమేజ్ మ్యాజిక్ పనిచేస్తుందా ఇవన్నీ ప్రశ్నలు. అయితే బీహార్ ఎన్నికలతో ముండి పెట్టి కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఢీ కొడుతున్నదెవరు. అసలు జాతీయ మీడియాలో బీహార్ ఎన్నికల తరువాత మొత్తం కేంద్ర రాజకీయం మారుతుంది అన్న జోస్యాలు ఏమిటి అసలు ఏమి జరుగుతోంది. ఈ మొత్తం మీద పూర్తి అవగాహన ఉన్న బీజేపీ లెక్కలేంటి అన్నది వేడి వేడి చర్చగా ఇపుడు ముందుకు వస్తోంది. *అలాంటి సీన్ ఉందా : బీహార్ లో ఎన్డీయే కూటమి ఓడే సీన్ ఉందా అన్నది ఇపుడు అసలైన చర్చ. నిజానికి చూస్తే హోరా హోరీ పోరు అక్కడ జరుగుతుందని ప్రీ పోల్ సర్వేలు అయితే స్పష్టంగా చెబుతున్నాయి. గతం కంటే మహా ఘట్ బంధన్ బాగా పుంజుకుంది అని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాదు దాదాపుగా అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల పరిధిలో ప్రభావితం చేస్తే ముస్లిం సామాజిక వర్గం ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు తీసుకుందని అది కూడా మహా ఘట్ బంధన్ కి అనుకూలిస్తుంది అని అంటున్నారు. రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రభావం కూడా కలసి వస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో కొద్దో గొప్పో ఈ రోజుకు అయితే మహా ఘట్ బంధన్ కే మొగ్గు ఉందని అంటున్నారు. ఓడితే సీన్ ఎలా : ఇక ఈ ప్రీ పోల్ సర్వేల అంచనాలే నిజం అయి ఎన్డీయే కూటమి ఓటమి పాలు అయితే అపుడు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా హాట్ హాట్ టాపిక్ గా ఉంది. ఇదే ఇపుడు జాతీయ మీడియాలో కూడా రకరకాలైన విశ్లేషణలతో ముందుకు వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో ఎన్డీయే ఓటమి పాలు అయితే నితీష్ కుమార్ మాజీ సీఎం అవుతారు. ఆయన అధికారం కోల్పోయి ఖాళీ అవుతారు అని అంటున్నారు. 2005 నుంచి 2025 దాకా రెండు దశాబ్దాలకు రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగానే నితీష్ పనిచేశారు. ఇపుడు ఆయన ఖాళీగా ఉంటే ఎలా అన్నది చర్చ. ఆయన జేడీయూకి చెందిన ఎంపీలు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వారు 12 మంది దాకా ఉన్నారు. దాంతో నితీష్ కి కేంద్రంలో చోటు కల్పిస్తారా అన్నది మరో చర్చ. అలా కల్పించిన చోటుతో నితీష్ సర్దుకుంటారా లేక నేరుగా ఉప ప్రధాని పొజిషన్ అడుగుతారా అన్నది మరో చర్చట. ఇవన్నీ ఊహాగానాలే కానీ ప్రచారంలో మాత్రం ఉంటున్నాయి.

👉ఎమ్మెల్యే ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన కాకర్ల సర్పంచ్*

*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, కాకర్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కోటపాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సర్పంచ్ జూపల్లి రంగమ్మ మరియు వారి అనుచరులు రావుల చిన్న రంగయ్య, తుళ్లూరి శేషగిరి, కందుల ఆమోస్ లు వైసిపిని వీడి టీడీపీలో చేరారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..*

👉విజయవాడ ఊర్మిళనగర్‌లో ఘోర దారుణం..*

పిన్నిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన అక్క కొడుకు.. భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని పగ.. మైనర్ అయిన తన కొడుకుతో కలిసి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు.. పిన్నిని ఇంటికి తీసుకెళ్లి కాళ్లు, చేతులు, తల నరికేసిన నిందితుడు..  శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురికి కాల్వల్లో పడేసిన దుర్మార్గుడు..

👉ప్రొద్దుటూరులో దారుణం*- తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు..- కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరాంనగర్ లో గవర్నమెంట్ టీచర్ హత్య..-తల్లి లక్ష్మిని కత్తితో గొంతుకోసి హత్య చేసిన కొడుకు యశ్వంత్.. యశ్వంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

👉బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకారం

గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణ ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. సంబంధిత ఫొటోను ట్రూత్లో పోస్టు చేశారు. బలగాల ఉపసంహరణ ప్రణాళికను హమాస్కు పంపించినట్లు చెప్పారు. హమాస్ అంగీకరిస్తే కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. వెంటనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందని వివరించారు. బలగాల ఉపసంహరణపై ఇజ్రాయెల్ ఇంకా అధికారిక ప్రకటన

👉 అన్నమయ్య: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ..* సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారం.. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ్ అధికారుల చేతికి దొరికిన డైరీ..డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన షాపుల నిర్వాహకుల పేర్లు.. డైరీలో సుమారు 78 మంది కి పైన పేర్లు ఉన్నట్లు సమాచారం..

👉తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి లాభాల్లో ఉన్న ఆర్టీసీ కార్గో సేవలు.. రూ.30 కోట్ల లాభాలు వచ్చే కార్గో సేవలు కేవలం రూ.3 కోట్లకే ప్రైవేట్ పరం.. ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం అవుతున్న తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఆస్తులు.. నిర్వహణ భారం కావడంతోనే ఈ నిర్ణయం అంటూ యాజమాన్యం కుంటి సాకులు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు సుమారు రూ.100 కోట్ల ఆదాయం, రూ.30 కోట్ల వరకు లాభం తెచ్చిపెట్టిన కార్గో సేవలు..2020లో ప్రారంభమై అనతికాలంలోనే ఆదరణ పొంది, లాభాల బాట పట్టిన ఆర్టీసీ కార్గో సేవలు..నెలకు రూ.3కోట్లు ఆర్టీసీకి చెల్లించేందుకు అంగీకరించిన బిడ్డర్‌కు కాంట్రాక్టును అప్పగింత.ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కార్గో సర్వీసుల్లో విధులు నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చడం లేదని వాదనలు

👉గద్వాల్ జిల్లాలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం..

ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణం

రెండు నెలల క్రితమే యువకుడిపై చీటింగ్ కేసు.. ఇటీవలే జైలు నుంచి విడుదలైన యువకుడు.. అప్పటి నుంచి ప్రియుడి ఇంటి ముందే యువతి నిరసన ..ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్న యువతి..  ప్రియుడే చంపాడని యువతి కుటుంబ సభ్యుల ఆరోపణ..నాలుగేళ్లుగా యువకుడితో ప్రియాంక ప్రేమాయణం

👉వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో అవినీతి ఎస్సైలపై వేటు!*

వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 15 రోజుల్లో ముగ్గురు ఎస్సైలు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. పోలీస్ అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై సీపీ సన్ ప్రీత్ సింగ్ విచారణ చేపట్టారు. నివేదికల ఆధారంగా ఎస్సైలు ప్రశాంత్, చరణ్, శ్రీకాంత్ లను సీపీ సస్పెండ్ చేశారు.

👉మద్యం మత్తులో సుత్తెతో తలపై కొట్టి కన్నతల్లీని హతమార్చిన కొడుకు*

మందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఘటన.. మద్యం మత్తులో కన్న తల్లి ఐల్లమ్మ కడతేర్చిన కొడుకు శ్రీకాంత్(32).. సుత్తెతో తలపై కొట్టి, పదునైన సీకుతో మెడలో పొడిచి చంపిన కిరాతకుడు..రక్తపు మడుగులో పడి ఉన్న మానుపాటి ఐల్లమ్మ (50)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి ..కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

👉నువ్వు చాలా అందంగా ఉన్నావ్..ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్ వద్దకు రా..నిన్ను, నీ పిల్లలను నేను చూసుకుంటా..- ఒంటరి మహిళకు నంద్యాల సీఐ వేధింపులు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా