👉మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ కలకలం…🌟రాజకీయ ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసలు..👉ఒంగోలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. .

🌟రాజకీయ ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసలు..రాజకీయ ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.. సినిమా తనకు అమ్మ లాంటిదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం.. సెట్‌లో రాజకీయాలు వద్దని మాత్రమే షరతు పెట్టానన్న పవన్.. ప్రకాశ్ రాజ్‌ను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని కొనియాడిన జనసేనాని.. ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు.. రాజకీయ రంగంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. వెండితెరపై మాత్రం అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. వీరిద్దరూ కీలక పాత్రల్లో నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిన్న‌ జరిగిన చిత్ర విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్‌తో తన వృత్తిపరమైన సంబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విబేధాలను పక్కనపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “సినిమా నాకు అమ్మ లాంటిది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమానే. ఎవరి రాజకీయ అభిప్రాయాల కారణంగా నేను నటనకు దూరం కాను. ‘ఓజీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్‌తో కలిసి నటిస్తారా? అని అడిగినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. కేవలం ఒకే ఒక్క షరతు పెట్టాను. సెట్‌లో రాజకీయ అంశాలు చర్చకు రాకూడదని కోరాను. ఆయన తన వృత్తిని గౌరవిస్తే, నేను కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశాను” అని తెలిపారు.ప్రకాశ్ రాజ్‌ను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని అభివర్ణించిన పవన్, “మా మధ్య ఏమైనా ఉంటే అవి బయట చూసుకుంటాం కానీ, సినిమా సెట్‌లో కాదు. ఈ సినిమాకు ఆయన అందించిన సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే పవన్, ఈ కార్యక్రమానికి హాజరై తన రాజకీయ ప్రత్యర్థిని ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా, వృత్తిధర్మానికి కట్టుబడి ఉంటానని పవన్ తన మాటల ద్వారా స్పష్టం చేశారు. ‘ఓజీ’ సినిమాలో ప్రకాశ్ రాజ్ పోషించిన సత్యదాదా పాత్రకు, పవన్ పోషించిన గంభీర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.

👉మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ కలకలం…*రాజధాని భోపాల్‌లో పాఠశాల పిల్లల్లో వ్యాప్తి చెందుతోన్న వైరస్.. 12 ఏళ్ల లోపు చిన్నారులలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వైరస్..ఇది సోకిన చిన్నారుల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో దద్దుర్లు..ఈ లక్షణాలతో బాధ పడే చిన్నారులను ఇంటి వద్దే ఉంచాలని అప్రమత్తం చేస్తున్న పాఠశాలల యాజమాన్యాలు.👉మహాత్మా గాంధీజీ వ్యక్తిత్వం, చూపిన మార్గం అందరికీ అనుసరణీయం. .. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు. *. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మాత్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడి.

👉ఒంగోలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.  హాజరైన కలెక్టర్ పీ.రాజాబాబు, ఎంపీ .మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు .దామచర్ల జనార్దన రావు, బీ.ఎన్.విజయ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ పీ.విజయ్ కుమార్, పీ.డీ.సీ.సీ. బ్యాంక్ చైర్మన్ కే.సీతా రామయ్య, మేయర్ గంగాడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.

*. రూ.40 లక్షలతో నిర్మించే గ్రామ చావిడికి శంఖుస్థాపన.

*. స్వచ్ఛతహీ సేవ కార్యక్రమంలో భాగంగా పదిమంది పారిశుధ్య కార్మికులకు సన్మానం.

👉అహింస మార్గంలో నడవండి*.. మార్కాపురం ప్రకాశం జిల్లా..

సమాజంలో ప్రతి ఒక్కరు గాంధీ చూపిన అహింసా మార్గంలో నడవాలని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి పురస్కరించుకొని న్యాయమూర్తుల ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలోని ఉప కారాగారంలోని విచారణ ఖైదీలతో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో చేసే నేరాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. ప్రతి ఒక్కరు గౌరవ మర్యాదలతో జీవించాలంటే ఎదుటివారి హక్కులకు భంగం కలిగించకూడదన్నారు. అనంతరం ఖైదీలకు ఫలహారాలు అందించారు. కార్యక్రమంలో సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ, న్యాయవాదులు పైడిమర్రి రామచంద్ర, కడియం రామయ్య యాదవ్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా