👉తుగ్లక్ పాలన…బాబు సంచలన వ్యాఖ్యలు …👉గాజాలో దయనీయ పరిస్థితి.. సాయం పేరుతో లైంగికదాడులు..👉అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్* ..👉యువకుల చేతుల్లో మత్తు పదార్థాలు*గుంటూరు* ..*ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట

👉అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్* పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 5లక్షల92వేల రూపాయలతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు,ఒక కారు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్ తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు :

1.తెప్పాలి సైదులు, తండ్రి పేరు బిక్షం, వయస్సు 55, స్వగ్రామం గడ్డి పల్లి, సూర్యాపేట జిల్లా. 2. మనుబోతుల రామకృష్ణ, తండ్రి పేరు సాయిరామ్, వయస్సు 36, నందిగామ, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత నివాసం పాలకుర్తి మండల కేంద్రం, జనగామ జిల్లా.3. పొడిల సురేష్ కుమార్, తండ్రి పేరు వెంకటనర్సయ్య, వయస్సు 35, స్వగ్రామం పెన్ పహాడ్, సూర్యాపేట జిల్లా, ప్రస్తుత నివాసం, పాలకుర్తి, జనగామ జిల్లా.4.పొడిల శ్రీధర్, తండ్రి ఆంజనేయులు, వయస్సు 30, స్వగ్రామం హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా, అని  పోలీసులు గుర్తించారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ.. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలోని ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా పేరుతో ఒక సంస్థను 2023 సంవత్సరంలో ఏర్పాటు చేసాడు. అనంతరం ప్రధాన నిందితుడు 2024 సంవత్సరంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు ఆశ చూపిస్తూ చీటీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ చిట్టీ లో చేరే వారు ముందుగా ఆరు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులు చెల్లించిన డబ్బులో నాలుగు వేలు తన వద్దనే డిపాజిత్ చేసుకొని మిగితా రెండు రెండు వేల రూపాయలకు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం నమ్మకం కలిగేందుకు సభ్యులకు రెండు వేల రూపాయల విలువ వస్తువులను అందజేస్తాడు వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం మూడు వందలు మాత్రమే వుంటాయి. ఈ సంస్థ లో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైన పొందవచ్చు. ఇందులో జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 20 నెలల పాటు డబ్బు ను తిరిగి అందజేసేవాడు. ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సుమారు 28, 493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతో పాటు వీరి నుండి 4వేల రూపాయల చొప్పున మొత్తం 11 కోట్ల39 లక్షల రూపాయలు ప్రజల డబ్బు ను తన వద్దనే భద్రపరుచుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే కాకుండా నిందితుడు సభ్యులకు కేవలం మూడు వందల రూపాయల విలువ వస్తువులను అందజేయడం ద్వారా మరో4కోట్ల 84 లక్షల రూపాయలను మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తు లో నిర్ధారణ అయింది.ముఖ్యంగా ప్రజలు అత్యాశతో ఈ సంస్థ లో లక్షల్లో పెట్టుబడి కూడా జరిగింది. ఈ సంస్థపై పోలీసులకు పలు పిర్యాదులు రావడంతో పాటు ఈ ముఠా సభ్యులు ప్రజల సొమ్ము తో తప్పించు పారిపోయే ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి విచారించగా ఈ ముఠా పాల్పడే మోసం పోలీసులకు వెల్లడించడంతో పాటు ఈ ముఠా వసూల్ చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లుగా గుర్తించిన పోలీస్ అధికారులు, 5కోట్ల 48 లక్షల, 64 వేల రూపాయలకు సంబంధించి ఎలాంటి లావా దేవీలు జరగకుండా బ్యాంక్ ఖాతాలను నిలిపివేయడం జరిగిందని.

ప్రధాన నిందితుడు పై గతంలో మెదక్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇల్లందు, ఎల్. బి నగర్ పోలీస్ స్టేషన్ల లో సుమారు పదికి పై గా చీటింగ్ కేసులు ఉన్నట్లు వరంగల్ సీపీ వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడు తూ ప్రజలు అధిక మొత్తం లో లాభం వస్తున్నది అని బోగస్ కంపెనీ లను నమ్మి ఎక్కువ మొత్తం లో డబ్బులు జమ చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆ కంపెనీ బోర్డ్ తిప్పేస్తారు అప్పుడు మొత్తం నష్టపోతారు. ఇటువంటి మోసాగాళ్ల మాటలు నమ్మకుండా డబ్బులు పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలి తక్కువ సమయం లో ఎక్కువ లాభం వస్తున్నదని చెబితే ఎవరు నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు.

ఈ ముఠా పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, వర్ధన్న పేట, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నర్సయ్య, మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్ పవన్, పాలకుర్తి సిఐ జానకీరాం రెడ్డి, పాలకుర్తి ఎస్. ఐ, టాస్క్ ఫోర్స్ ఎస్. ఐ వంశీ కృష్ణ, దిలీప్,తో టాస్క్ ఫోర్స్ మరియు పాలకుర్తి పోలీస్ సిబ్బంది ని పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.

👉యువకుల చేతుల్లో మత్తు పదార్థాలు*గుంటూరు*

ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలు స్వాధీనం…నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న ఓల్డ్ గుంటూరు పోలీసులు…గోవా నుండి మత్తు పదార్థాలు తెచ్చిన యువకులు…గోవా నుండి వస్తూ ట్రైన్ లో గంజాయి కొనుగోలు…వారి వద్ద నుండి మత్తు బిళ్ళలు గంజాయి స్వాధీనం…మత్తు పదార్థాలు అమ్మిన సేవించిన నేరస్థులే ఓల్డ్ గుంటూరు పోలీసులు వెల్లడి…

👉ఒంగోలు నగరంలోని 25వ డివిజన్ రంగారాయుడు చెరువు నందు శివాలయం పునఃనిర్మాణంలో భాగంగా స్లాబ్ వేస్తున్న సందర్బంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , నగర మేయర్ గంగాడ సుజాత, పి డి సి సి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య,కార్పొరేటర్ శాండిల్య, తాతా ప్రసాద్, పాలపర్తి సేనా రెడ్డి, కండే శ్రీనివాస రావు, మాలవరపు కృష్ణ రెడ్డి .

👉గాజాలో దయనీయ పరిస్థితి.. సాయం పేరుతో లైంగికదాడులు గాజా యుద్ధం అక్కడి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. అక్కడి మహిళలు మరింత భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గాజా యుద్ధం అక్కడి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. అక్కడి మహిళలు మరింత భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఆహార కొరత, ఉద్యోగ అవకాశాల లేకపోవడం.. సహాయ వనరులపై పెరుగుతున్న పోటీ మహిళలను మరింత కష్టాల్లోకి నెడుతుంది. అయితే, సహాయం మాటున కొందరు పురుషులు మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని అక్కడి వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కోసం ఆ పని చేసిన మహిళ.. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు ఓ తల్లి తీవ్రమైన అవమానం లైంగిక దోపిడీని ఎదుర్కొంంది.

38 ఏళ్ల ఒక తల్లి తన అనుభవాన్ని నేషనల్ మీడియా ముందు ఉంచింది. ‘సహాయం కోసం ఎదురు చూసే చోట ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనపై లైంగికదాడి చేశాడు. ఖాళీ అపార్ట్‌మెంట్ లోకి తీసుకెళ్లి నాపై లైంగికదాడి చేశాడు. నా పిల్లల ఆకలి తీర్చేందుకు ఇది తప్పలేదు. ఈ సందర్భం గాజాలోని సహాయ కేంద్రాల్లో మహిళలపై జరిగే దుర్వినియోగానికి ఉదాహరణ. హ్యూమన్ రైట్స్ వాచ్ సూచిస్తున్నట్లు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో లైంగిక దోపిడీ సర్వసాధారణ సమస్య. గాజాలో మహిళలు, బాలికలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాయం కోసం చూస్తున్న మహిళల్లో కొందరు గర్భవతులయ్యారని, వారికి మానసిక చికిత్స అవసరమయ్యిందని కొందరు సైనియార్టిస్టులు వెల్లడించారు. అర్థరాత్రి ఫోన్ చేస్తున్నారు.. ఇంకా, 29 నుంచి 35 ఏళ్ల వయస్సున్న మహిళలు, సహాయ వర్గాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. సహాయం చేస్తామని చెప్పి వస్తున్న వ్యక్తులు ఫోన్ నెంబర్లు ఇచ్చి, అర్థరాత్రి ఫోన్ చేయడం, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం వంటి సందర్భాలున్నాయి. గతేడాది గాజాలో 18 లైంగిక వేధింపుల కేసులు అధికారికంగా నమోదైనట్లు పీఎస్‌ఈఏ నెట్‌వర్క్ తెలిపింది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. ఈ పరిస్థితులు గాజాలోని మహిళల భద్రత, వారి మానసిక ఆరోగ్యం వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయం పొందే సమయాల్లో కూడా వారి రక్షణకు సమాజం.. అంతర్జాతీయ సంఘాలు, ప్రభుత్వాలు కృషి చేయాలి. యుద్ధం, ఆహార కొరత, లైంగిక దోపిడీ మానవతా విలువలను ఎలా నాశనం చేస్తాయో తెలియజేస్తుంది. సమాజం, ప్రభుత్వాలు, సహాయ సంస్థలు ఈ సమస్యను పక్కన పెట్టకుండా, మహిళల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.

👉తుగ్లక్ పాలన…బాబు సంచలనం ఏపీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. ఆ పార్టీ మీద టీడీపీ కూటమి ప్రత్యేకించి టీడీపీ ప్రతీ రోజూ విమర్శలు చేస్తూనే ఉంటుంది.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాట అయినా చాలా ఆలోచించి మాట్లాడుతారు.

అందులో కూడా ఎన్నో వ్యూహాలు ఉంటాయి. ఆయన జనం మదిలో చేరాలనే ప్రతీ విషయం చెబుతూంటారు సానుకూలమైన అంశం అయితే కచ్చితంగా ఒకటికి పది సార్లు చెబుతారు ఎంతో ఓపికగా కూడా చెబుతారు. అదే ప్రత్యర్థుల మీద విమర్శలు అయినా అంతే సౌండ్ చేసి చెబుతారు. ఇది కూడా జనాల మనసులో రిజిస్టర్ కావాలని ఆయన చెబుతారు. మొత్తం మీద చూస్తే కనుక చంద్రబాబు నోట ఒక మాట వచ్చింది అంటే అది ఎంతో స్ట్రాంగ్ గా ఉండడమే కాదు అనుకున్న లక్ష్యాన్ని చేదిస్తుంది అని అంటారు. తుగ్లక్ ఎవరు అంటే : చంద్రబాబు సామాజిక పెన్షన్ పంపిణీ విషయంలో ఒక పద్ధతి ప్రకారం జనం దగ్గరకు వెళ్తున్నారు. ప్రతీ నెలా ఇచ్చే పెన్షన్ కదా అని అనుకోవడం లేదు. ఏ నెలకు ఆ నెల ఇస్తున్నట్లుగా అది కొత్త పధకం గానే ఆయన జనాలకు చెబుతున్నారు. పెన్షన్ ఘనత తమదే అని జనాల బుర్రల్లో గట్టిగానే చాటుతున్నారు. అంతే కాదు ప్రత్యర్థుల మీద విమర్శలు అదే స్థాయిలో ఎక్కు పెడుతున్నారు. అక్టోబర్ పెన్షన్ల పంపిణీ కోసం ఆయన విజయనగరం జిల్లా దత్తిరాజేరుకు వచ్చారు. *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుగ్లక్ పాలన పోయింది అని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు ఆ విధంగా మేలు జరిగిందని స్వేచ్చ వచ్చిందని చెప్పారు. ఏపీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. ఆ పార్టీ మీద టీడీపీ కూటమి ప్రత్యేకించి టీడీపీ ప్రతీ రోజూ విమర్శలు చేస్తూనే ఉంటుంది. చిత్రమేంటి అంటే దానికి కౌంటర్లు ఇచ్చే పరిస్థితి మాత్రం వైసీపీలో ఎక్కడా కనిపించడం లేదు అని అంటున్నారు. వైసీపీ ఈ స్ట్రాటజీలో బాగా వెనకబడిపోతోంది. అదే సమయంలో జగన్ పాలన గురించే కాదు ఆయన క్యారెక్టర్ మీద కూడా టీడీపీ విమర్శలు చేస్తోంది. అసెంబ్లీలో బాలయ్య సైకో గాడు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇపుడు చంద్రబాబు అయితే తుగ్లక్ అనేశారు. అయితే ఇది మొదటి సారి మాత్రం కాదు ఇంతకు ముందు ఎన్నో సార్లు టీడీపీ వారు ఇదే విమర్శలు జగన్ మీద చేశారని గుర్తు చేస్తున్నారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న ఓల్డ్ గుంటూరు పోలీసులు…గోవా నుండి మత్తు పదార్థాలు తెచ్చిన యువకులు…గోవా నుండి వస్తూ ట్రైన్ లో గంజాయి కొనుగోలు…వారి వద్ద నుండి మత్తు బిళ్ళలు గంజాయి స్వాధీనం…మత్తు పదార్థాలు అమ్మిన సేవించిన నేరస్థులే ఓల్డ్ గుంటూరు పోలీసులు వెల్లడి…

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా