👉 సీఎం చంద్రబాబు విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తిన APCC చీఫ్ వైయస్ షర్మిల..విజయవాడ ..
2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు, దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్ రూమ్ ఉందని పేర్కొంది. దానిపై దృష్టి పెట్టండని మేము అడగడం తప్పా ?..
కనీసం రోడ్లు ,డ్రైనేజీ కూడా SC,ST కాలనీలలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా ?
* ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా ..బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా ?
* TTD నిధులతో TTD నే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదు..మేము లేవనెత్తిన సమస్యల్లా TTD నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి ప్రమోషన్ చేసుకోవడం ఏంటి ? .. ఒక మతానికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి మాట్లాడకూడదు.. తాను ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలి.
– కూటమి ప్రభుత్వంలో, బీజేపీతో కలిసున్న సీఎం గారు.. మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదు. .మేమేదో హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై, వ్యక్తిగతంగా నాపై BJP, RSS మత ఛాందస వాదులు విష ప్రచారం చేస్తున్నారు. * హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారు. పీఠాధిపతులతో తిట్టిస్తున్నారు..నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశ్యాన్ని మత పిచ్చి RSS, BJP వాదులు ఆపాదిస్తున్నారు.
* మత రాజకీయాలు చేసి లబ్ది పొందేందుకు BJP, RSS చేస్తున్నవి నీచ రాజకీయాలు. హిందూ ధర్మానికి, మతానికి, నేను గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. . కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం. .ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతం.
– పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే,భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇది ఘోర అపచారం అని, వెంటనే CBI దర్యాప్తుకు ఆదేశించాలని మొదట డిమాండ్ చేసింది నేనే.
– ప్రజల పక్షాన మా డిమాండ్ లో మంచిని వెతకకుండా, దానికి చంద్రబాబు గారు సమాధానం చెప్పకుండా , కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు.
– ప్రజల కోసం మేము మాట్లాడితే, మతం కోసం RSS, బీజేపీ మాట్లాడుతుంది . ఎవరు మత పిచ్చిగాల్లో, ఎవరు మత విద్రోహులో, విషం చిమ్మేది ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. – TTD ని గుంజడం కాదు .. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే ..మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాలన్నారు.
👉ఐబొమ్మ అనే పైరసీ వెబ్‌సైట్ రెండు సంవత్సరాల క్రితం వేసిన పోస్ట్‌ను వెరిఫై చేసుకోకుండా ఇప్పుడు వైరల్ చేస్తున్న మీడియా ఛానల్స్ ..గతంలో తమ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసినందుకు వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ నిర్వాహకులు..ఆ పోస్ట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తూ, పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ అంటూ ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్న పలు మీడియా ఛానల్స్
👉నాపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు.. నా తల్లిదండ్రులను మానసికంగా వేధించారు..చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు..2014-19 మధ్య కూడా నాపై తప్పుడు కేసు పెట్టారు ఎంపీ మిథున్‌రెడ్డి
👉 *బీజేపీ వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత *
రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలంగాణ జాగృతి ప్రత్యక్షరాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈటల రాజేందర్ ఎన్నికలకు వెళ్లవద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని అంటారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మేము క్యాన్సిల్ చేయిస్తామని అంటారు. ఈటల, బీజేపీ పార్టీ వాళ్లు కోర్టులా, జడ్జిలా అని అడుగుతున్నా. బిల్లు, రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్లే కోర్టుకు వెళ్లి క్యాన్సల్ చేయిస్తరంట. బీసీల పట్ల ఈటల, బీజేపీ వైఖరి ఇదేనా అని అడుగుతున్నానని సూటిగా ప్రశ్నించారు.
👉డ్రగ్స్ తో పట్టుబడిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ చెన్నై విమానాశ్రయంలో DRI అధికారులకు డ్రగ్స్ పట్టుబడ్డారు. రూ.40cr విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో ఇతను నైజీరియా గ్యాంగ్తో చేతులు కలిపినట్లు సమాచారం. విశాల్ 2వారాల కిందట ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లారని, తిరిగి సింగపూర్ మీదుగా చెన్నైకి చేరుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి రైలు మార్గంలో ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేసి
👉వృద్ధురాలిపై కానిస్టేబుల్ ఫ్యామిలీ దాడి
హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం వెలుగు చూసింది. తమ ఇంటి ముందు కుక్కకు మూత్ర విసర్జన చేయిస్తున్నాడని ఓ 60ఏళ్ల వృద్ధురాలు కానిస్టేబుల్ను ప్రశ్నించింది. అలా చేయొద్దని వారించినందుకు కానిస్టేబుల్ భార్య, అక్క వచ్చి వృద్ధురాలిని తిడుతూ కర్రలతో దాడి చేశారు. ఆ పెద్దావిడపై వాళ్లు పిడి గుద్దులు కురిపించడం CCTVలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉తండ్రి మాదిగ – తల్లి బ్రాహ్మణ. విజయ్▪️!!
పూర్వీకులది చిత్తూరు జిల్లా . మద్రాసు ప్రెసిడెన్సీ టైం కార్మికుడిగా తన తాత కన్యాకుమారికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు .
▪️ తదనంతరం తండ్రి చంద్రశేఖర్ చైన్నై లో చదువుకుంటూ సినిమాలపై మక్కువతో స్క్రిప్ట్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ,
▪️డైరెక్టర్ గా ఉన్నా కుల భావంతో చంద్రశేఖర్ ని తొక్కేసి ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేసి చివరికి అప్పులు పాలు అయ్యేలా చేశారు . మళ్లీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వెనక్కి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చి ఆర్థికంగా కొంత నిలదొక్కున్నా తర్వాత కొన్ని సినిమాలకు డైరెక్షన్, నిర్మాత గా వ్యవహరిస్తాడు . విజయ్ ని సినిమాల్లోకి తీసుకొచ్చిన తర్వాత విజయ్ ని చూసి నవ్వారు . వీడు హీరో ఏంట్రా అని అవమానించారు . ▪️విజయ్ మొదట్లో పట్టించుకోకపోయినా నిదానంగా విజయ్ సినిమాలు ఆడటంతో చిన్నగా విజయ్ ఫోకస్ అయ్యాడు . అలా 20 ఏళ్లకు సినిమాల్లో రజినికాంత్ తో పోటీ పడే స్థాయికి ఎదిగాడు . ఈరోజు తమిళనాడు కే ఒక పెరియార్, కరుణానిధి, జయలలిత గారికా మించి అత్యంత జనాదరణ పొందిన ఒక శక్తిగా విజయ్ ఎదిగాడు . ముఖ్యమంత్రి అయిన అవ్వకపోయినా విజయ్ ఫాలోయింగ్ ముందు దేశమే వణుకుతుంది .
👉పాక్ బలగాల కాల్పులు.. పీవోకేలో 8 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనకారులపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల ఘటనలో 8 మంది మృతి చెందారు. PoKలో ప్రజలు తమ హక్కుల కోసం, స్థానిక వనరుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులపై కాల్పులు జరపడం వలన అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
👉పిడుగురాళ్ల: వంద రూపాయల కోసం కత్తితో దాడి*
పిడుగురాళ్లలోని ఓ చికెన్ షాప్లో వంద రూపాయల విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. కోపంతో రియాజ్ అనే వ్యక్తి జానీ భాషను కత్తితో పొడవడంతో అతనికి తీవ్ర గాయాలై పేగులు బయటికి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి బాధితుడిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి గల గల కారణాలు తెలియాల్సి ఉంది.
👉బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వారిపై ఆకస్మిక దాడులు.. ప్రకాశం జిల్లా
కంభం .. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వారిపై కంభం పోలీసు శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కే మల్లికార్జున రావు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . కార్యక్రమంలో ఆయన వెంట తంభం ఎస్సై బి నరసింహారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.

