👉గోరంత చేసి కొండత చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెల్లుతుంది. .వైఎస్ షర్మిల… 👉ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.. 👉కూతురు చాటింగ్ చూసి కాల్చి చంపిన తండ్రి..👉 కంభం ప్రభుత్వ వైద్యశాలలో కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు – ఎంఎల్ఏ కు ఫిర్యాదు .. *స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*… *డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా..👉ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 2లో సంతోష్ కుమార్ విజయం*..

👉 గోరంత చేసి కొండత చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెల్లుతుంది. .వైఎస్ షర్మిలా రెడ్డి..APCC చీఫ్.. ⁠కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలపై మోపిన ట్రూ అప్ భారం రూ.15,780 కోట్లు.. ⁠ఇప్పుడు ట్రూ డౌన్ తో తగ్గిన భారం కేవలం రూ.923 కోట్లు.. ⁠2024- 25 వార్షిక సంవత్సరానికి సర్దుబాటు పేరుతో అదనంగా దోచిన రూ.923 కోట్లను .. తిరిగి చెల్లించండని ERC మొట్టికాయలు వేస్తే,అదేదో కూటమి ప్రభుత్వం ఛార్జీలు తగ్గించిందని,వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చామని,  సమర్ధత, అనుభవం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. -ఎన్నికల్లో ఛార్జీల తగ్గింపు హామీని నిలబెట్టుకున్నామని ప్రకటించుకోవడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్. – ⁠నిజంగా చంద్రబాబు గారికి విద్యుత్ చార్జీలపై చిత్తశుద్ధి ఉంటే .. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి.. అమలవుతున్న ఛార్జీల్లో 30 శాతం మేర ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి. – ⁠అదనంగా విధించిన రూ.15వేల కోట్ల సర్దుబాటు ఛార్జీల భారాన్ని తక్షణం ఉపసంహరించుకోండి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

👉 ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.. ఒంగోలు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 105 ఫిర్యాదులు.. బాధితుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు, సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను సవివరంగా తెలుసుకున్నారు. ఫిర్యాదులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో చర్చించి, వెంటనే విచారణ ప్రారంభించి, వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం అందించాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులో తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.బాధితులు మన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మనం ఆ సమస్యను పరిష్కరించినప్పుడు వారికి కలిగే సంతోషం చెప్పలేనిదని ఆయన పేర్కొన్నారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, చీటింగ్/ఉద్యోగ మోసాలు మరియు ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, ఒంగోలు రూరల్ సీఐ యన్.శ్రీకాంత్ బాబు, పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండేపి సీఐ సోమశేఖర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

👉శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి…జిల్లా ఎస్పీ వకుల్ జిందల్..*గుంటూరు జిల్లా..

జిల్లా పోలీస్ కార్యాలయంలోఎస్పీ వకుల్ జిందాల్ ని మర్యాద పూర్వకంగా కలసిన, జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ ఎస్సైలు.

ఈ సందర్భంగా వారు ప్రొబేషనరీ అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు.*క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి. ప్రజలతో, సహోద్యోగులతో, క్రింది స్థాయి సిబ్బందితో గౌరవప్రదంగా ప్రవర్తించాలని కోరారు.

👉గుంటూరు కొత్తపేట రావుస్ ఆసుపత్రిలో జరిగిన దారుణం పెద్ద* చర్చనీయాంశమైంది. భుజం నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు,మెడ సర్జరీ తర్వాత ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి తల్లి పద్మ వాతి ఆరోపిస్తున్నారు. వైద్య నిర్లక్ష్యమే కారణమని తన కుమారుడు బ్రహ్మానందరెడ్డి వయసు 35 సంవత్సరాలు తన కుమారుడి మృతికి డాక్టర్ రావు మోహన్ కారణమని పద్మావతి కన్నీటి పర్యంతమయారు. గుంటూరు కొత్తపేట రావుస్ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది.డాక్టర్ మోహన్ రావు చేసిన సర్జరీ వల్లే తన కుమారుడు మృతి చెందాడని బాధితురాలు పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

👉 భుజం నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లగా,డాక్టర్ మెడకు సర్జరీ చేశాడని ఆమె ఆరోపించారు.

👉 సర్జరీ పేరుతో ముందుగానే 6 లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు.

👉 మొత్తం 35 లక్షలు ఖర్చు చేశామన్నా,చివరికి తన కుమారుడి ప్రాణాలు పోయాయని కన్నీటి గాధ విన్నవించారు.సర్జరీని 12 గంటలపాటు చేసి విజయవంతమైందని డాక్టర్ చెప్పారని,కానీ ఆ తర్వాత తీవ్రమైన వాంతులు – విరేచనాలు వచ్చినా పట్టించుకోలేదని పద్మావతి వాపోయారు.

👉 “హైదరాబాద్‌కి తీసుకెళ్తామన్నా డాక్టర్ అనుమతించలేదు.. చివరికి మా బిడ్డ చనిపోయాడు” అని కన్నీరు మున్నీరవుతున్నారు..డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ను కలిసిన బాధితురాలు పద్మావతి,కలెక్టర్ – ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.డాక్టర్ మోహన్ రావు పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

👉 “డాక్టర్ మోహన్ రావు నా జీవితంలో కడుపుకోత మిగిల్చారు.మా బిడ్డ ఆత్మశాంతి కోసం చివరిదాకా పోరాడతా.. మెడికల్ కౌన్సిల్ అధికారులను కలుస్తా” అని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ ను కూడా కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామని పద్మావతి స్పష్టం చేశారు.

👉ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 2లో సంతోష్ కుమార్ విజయం*

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన సంతోష్ కుమార్, ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎక్సైజ్ SI గా ఉద్యోగం పొందారు. గతంలో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ కానిస్టేబుల్, కలెక్టరేట్లో ట్రెజరీ అకౌంటెంట్గా పనిచేసిన సంతోష్, తన పట్టుదలతో విజయం సాధించారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

👉 హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని కిటికీకి తలకిందులుగా వేలాడదీసి డ్రైవర్‌తో కొట్టించిన ప్రిన్సిపాల్*

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.కొట్టిన వీడియోను కొద్దిరోజులకు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చిన విషయం. హర్యానా – చండీగఢ్‌లోని పానిపట్ పట్టణంలో శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడుని శారీరక వేధింపులకు గురిచేసిన స్కూల్ బస్సు డ్రైవర్ .. బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి, అతన్ని కొట్టిన డ్రైవర్ ..పాఠశాల ప్రిన్సిపాల్ మరియు డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు..ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. నేను కేవలం మందలించమన్నానని కానీ కొట్టిన విషయం నాకు తెలియదని తెలిపిన ప్రిన్సిపాల్~£

👉కూతురు చాటింగ్ చూసి కాల్చి చంపిన తండ్రి

ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

17 ఏళ్ల కుమార్తె ముస్కాన్ ఫోన్ చాటింగ్ను చూసిన తండ్రి, ఆమెను మేడపైకి తీసుకెళ్లి పిస్టల్తో కాల్చి చంపాడు. ఈ హత్యలో ముస్కాన్ 15 ఏళ్ల తమ్ముడు కూడా పాలుపంచుకున్నాడు. ముస్కాన్ ఒక అబ్బాయితో చాటింగ్ చేసి కుటుంబ పరువు తీస్తోందని అందుకే చంపేశామని నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

👉 కంభం ప్రభుత్వ వైద్యశాలలో కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు – ఎంఎల్ఏ కు ఫిర్యాదు చేసిన రోగులు, డాక్టర్లు* ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్నటువంటి వైద్యం గురించి ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్.శిరీష ప్రియదర్శిని (చిన్న పిల్లల స్పెషలిస్ట్) తో చర్చిస్తున్నటువంటి సందర్భంలో కరెంటు కోతల సమస్యలు ఉన్నాయని ఆయన కు వివరించారు.రోగులకు రక్త పరీక్షలు, అత్యవసర పరిస్థితుల్లో కరెంటు కోతల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.వెంటనే స్పందించిన ఎంఎల్ఏ సెల్ ఫోన్లో విద్యుత్ ఉన్నతాధికారితో ఇకనుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు సమస్య లేకుండా చూడాలని, రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆదేశించారు.

👉మార్కాపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి అన్నా రాంబాబు*

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడే కష్టాలను బాధలను ఈ డిజిటల్ బుక్ లో పొందుపరచవచ్చు.కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నాయకులు, అధికారులు పెట్టే ఇబ్బందులను ఈ డిజిటల్ బుక్ లో పొందుపరిస్తే రేపు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్ఫర్ లేదా రిటైర్డ్ అయిన సరే వదిలే ప్రసక్తి లేకుండా న్యాయపరంగా శిక్షించే విధంగా జగన్ మోహన్ రెడ్డి  చర్యలు తీసుకోవటానికి ఈ డిజిటల్ బుక్ ఎంతగానో దోహదపడుతుందని అన్నా రాంబాబు అన్నారు.*

*ప్రజలకోసం పోరాడుతూ కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం.ఎవరికి ఏ కష్టం వచ్చినా డిజిటల్ బుక్ లో నమోదు చేయండి.. మీ తరఫున పార్టీ నిలబడుతుంది.. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు.*

👉ఆరోగ్యకరమైన మాతృత్వం ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం*

*స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*…ఆరోగ్యకరమైన మాతృత్వం ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం సాధ్యమని గిద్దలూరు ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి  పేర్కొన్నారు.. మహిళలు నాణ్యమైన ఆహారం తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం వేదికగా ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని,  కంభం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యశాల ప్రాంగణంలో ICDS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ పోషణ మాసం స్టాల్స్ ను పరిశీలించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజ ఆరోగ్య సాధనలో భాగంగా మహిళలు, కుటుంబాల సంక్షేమం కోసం తీసుకువస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం అందరికీ మేలు చేకూర్చుతుంది అని మహిళా సంక్షేమం ద్వారానే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తద్వారా సమాజ శ్రేయస్సు సాధ్యమన్నారు..*ఈ కార్యక్రమంలో కంభం పట్టణ నాయకులు, వైద్యశాల సిబ్బంది, ICDS సిబ్బంది తదితరులు పాల్గోన్నారు..*

👉కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యే ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు*

*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  సమక్షంలో గిద్దలూరు మండలం, తంబళ్లపల్లె గ్రామానికి చెందిన శీలం సాయి రామమోహన్ రెడ్డి మరియు వారి అనుచరులైన 40 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పరుగులు పెడుతుందని, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు.. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డీయ్, వైజా కృష్ణారెడ్డి, కటారు శ్రీను, కృష్ణ, గుండ్రేడ్డి రమణయ్య, జయరామిరెడ్డి, శీలం శివారెడ్డి తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా